half marathon
-
సిద్దిపేటలో ఉత్సాహంగా హాఫ్ మారథాన్
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేటలో రంగనాయకసాగర్ వేదికగా ఆదివారం జరిగిన హాఫ్ మారథాన్‌లో దేశం నలుమూలల నుంచి వచ్చిన రన్నర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడు తూ ‘సిద్దిపేట అన్నింటిలో మేటి.. నేడు హాఫ్ మారథాన్లోనూ బెస్ట్‌గా నిలిచింది’అని అన్నారు. అనంతరం విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. కాగా, దేశంలోనే తొలిసారిగా ప్లాస్టిక్ రహిత హాఫ్ మారథాన్‌ను సిద్దిపేటలో నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళా విభాగంలో సూర్యాపేటకు చెందిన ఉమ, పురుషుల విభాగంలో నాగర్‌కర్నూల్‌కు చెందిన రమేశ్ చంద్ర ప్రథమ బహుమతులు గెలుచుకున్నారు. 10కే రన్ మహిళా విభాగంలో ప్రథమ బహుమతి నాగర్‌కర్నూల్‌కు చెందిన స్వప్న, పురుషుల విభాగంలో మహారాష్ట్రకు చెందిన సునీల్‌కుమార్ సాధించారు. కాగా, హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్లు రన్ చేసుకుంటూ వచ్చిన శ్రీకాంత్‌ను, అలాగే హైదరాబాద్ నుంచి సైక్లింగ్ చేసుకుంటూ వచ్చిన నేచర్‌క్యూర్ ఆస్పత్రి డాక్టర్ నాగలక్ష్మిలను మంత్రి సత్కరించారు. 10 కిలోమీటర్ల పరుగులో వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి పాల్గొని 1.06 గంటల్లో పూర్తి చేశారు. హాఫ్ మారథాన్ (21.1కిలోమీటర్లు)లో 400 మంది, పది కిలోమీటర్ల రన్లో 550, 5 కిలోమీటర్ల రన్లో 4వేల మంది పాలుపంచుకున్నారు. సిద్దిపేట సీపీ శ్వేత, జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ పాల్గొన్నారు. -
రన్ రాజా రన్ ! హాఫ్ మారథాన్ !!
మెదక్: ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యంగా సిద్దిపేట ముందుకు సాగుతోంది. మనిషి జీవన ప్రమాణాలతోపాటు ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు వస్తున్నాయి. బిజీ ప్రపంచంలో శారీరక శ్రమలేక ఎన్నో అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికోసం సిద్దిపేట వేదిక అవుతోంది. సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్, జిల్లా పోలీస్ శాఖ సమన్వయంతో ఆగస్టు 6న హాఫ్ మారథాన్ నిర్వహిస్తున్నారు. అందులో 5, 10, 21 కిలో మీటర్ల విభాగాలు ఏర్పాటు చేశారు. అందుకోసం ఇప్పటికే ఆసక్తి ఉన్న వారి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. హాఫ్ మారథాన్ అంటే.. మారథాన్ అంటే 42.195 కిలో మీటర్లు(26.385 మైళ్లు), హాఫ్ మారథాన్ అంటే 21.0975 కిలో మీటర్లు(13.192 మైళ్లు) అంటారు. ఇలాంటి రన్లను అరుదుగా నిర్వహిస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా సంవత్సరంలో సుమారుగా 800 పైగా జరుగుతున్నాయి. 2021 సంవత్సరంలో ఉగాండాకు చెందిన జాకబ్ కిప్లిమో హాఫ్ మారథాన్‌ను 57.31నిమిషాల్లో పూర్తి చేసి ప్రపంచ రికార్డు సాధించగా, మహిళల విభాగంలో 1.02గంటలో హాఫ్ మారథాన్‌ను ఇథియోపియాకు చెందిన లెటెన్బెట్ పూర్తి చేసి ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారు. రంగనాయకసాగర్ వేదికగా.. హాఫ్ మారథాన్‌కు సిద్దిపేటలోని రంగనాయకసాగర్ వేదిక కాబోతుంది. ఆగస్టు 6(ఆదివారం)న ఉదయం 5.30గంటలకు హాఫ్ మారథాన్(21.0975 కిలో మీటర్లు) సిద్దిపేట పట్టణం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుంచి ప్రారంభమై రంగనాయక సాగర్ రిజర్వాయర్ కట్ట పైన రన్ సాగనుంది. అదే రోజు ఉదయం 5:30 గంటలకు 5, 10 కిలో మీటర్ల పరుగు పందెం రంగనాయక సాగర్ రిజర్వాయర్ కట్ట పై జరగనుంది. ఈ రన్లో ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, సినీ నటులు, ప్రముఖ క్రీడాకారులు పాల్గొననున్నారు. గెలుపొందిన వారికి నగదు పురస్కారాలు హాఫ్ మారథాన్‌లో గెలుపొందిన విజేతలకు నగదు పురస్కారాలు అందించనున్నారు. పురుషులు, మహిళలకు వేరువేరు విభాగాలుగా విభజించి అందించనున్నారు. హాఫ్ మారథాన్ విజేతలకు ప్రథమ బహుమతి రూ.50వేలు, ద్వితీయ రూ.25వేలు, తృతీయ రూ.10వేల నగదును, పది కిలోమీటర్ల పందెంలో ప్రథమ రూ.25వేలు, ద్వితీయ రూ.15వేలు, తృతీయ బహుమతి రూ.10వేలు, 5కిలోమీటర్లలో ప్రథమ రూ.15వేలు, ద్వితీయ రూ.10వేలు, తృతీయ రూ.5వేల నగదు పురస్కారంతో పాటు జ్ఞాపికను అందించనున్నారు. ఇలా మొత్తంగా నగదు పురస్కారాలు రూ3.30లక్షలను అందించనున్నారు. ఈ నెల 25తో ముగియనున్న ఎంట్రీలు హాఫ్ మారథాన్ రన్లో పాల్గొనే వారు ఈ నెల 25వ తేదీ సాయంత్రం 6గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే 5కిలోమీటర్ల రన్‌కు సంబంధించిన ఎంట్రీ గడువు ముగిసింది. జ్ట్టి ఞట://టజిఝ23.జ్ఞీ301.ఛిౌఝ లింక్‌ను ఓపెన్ చేసి వివరాలను నమోదు చేయాలి. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు హాఫ్ మారథాన్, 10 కిలో మీటర్ల రన్‌కు 14 సంవత్సరాలు నిండిన వారు అర్హులు, 5కిలో మీటర్ల రన్లో 10 సంవత్సరాలు నిండిన వారు పాల్గొనేందుకు అర్హులు. పోస్టర్ ఆవిష్కరణ చిన్నకోడూరు(సిద్దిపేట): చిన్నకోడూరు ఎంపీడీఓ కార్యాలయంలో హాఫ్ మారథాన్ పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను శనివారం సిద్దిపేట ఏసీపీ సురేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోటీల్లో పాల్గొనే వారు రిజిస్ట్రేషన్ చార్జీలు 5కే రన్‌కు రూ.200, 10కే రన్‌కు రూ.300, 21కే రన్‌కు రూ.500 చెల్లించి ఆన్లైన్లో పేరు నమోదు చేయించుకోవాలన్నారు. -
హాఫ్ మారథాన్‌లో పెరెస్ ప్రపంచ రికార్డు
గిడినియా (పోలాండ్): ప్రపంచ అథ్లెటిక్స్ హాఫ్ మారథాన్ చాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో కెన్యా అథ్లెట్ పెరెస్ జెప్చిర్చిర్ కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. శనివారం జరిగిన రేసులో 27 ఏళ్ల పెరెస్ 21.0975 కిలోమీటర్ల దూరాన్ని గంటా 5 నిమిషాల 16 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 5న ప్రేగ్లో గంటా 5 నిమిషాల 34 సెకన్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును పెరెస్ తిరగరాసింది. కెజెటా (జర్మనీ–1గం:05ని.18 సెకన్లు), యాలెమ్జెర్ఫ్ యెహుఅలావ్ (ఇథియోపియా–1గం:05ని.19 సెకన్లు) రజత, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. పురుషుల విభాగంలో జేకబ్ కిప్లిమో (ఉగాండా) 58 నిమిషాల 49 సెకన్లలో గమ్యానికి చేరి చాంపియన్‌గా నిలిచాడు. ప్రపంచ హాఫ్ మారథాన్‌లో టైటిల్ నెగ్గిన తొలి ఉగాండా రన్నర్‌గా కిప్లిమో గుర్తింపు పొందాడు. -
హాఫ్ మారథాన్‌కు ఢిల్లీ హైకోర్టు ఓకే
సాక్షి,న్యూఢిల్లీ: కాలుష్య కోరల్లో విలవిలలాడుతున్న ఢిల్లీలో హాఫ్ మారథాన్‌కు ఢిల్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాలుష్యం ప్రమాదకరంగా పెరిగిపోయిన క్రమంలో పరుగు నుంచి తప్పుకునే రన్నర్లకు తాము రిఫండ్ పాలసీని ప్రవేశపెట్టామని నిర్వాహకులు కోర్టుకు తెలిపారు. అత్యవసర వైద్య పరిస్థితి తలెత్తితే ఎదుర్కొనేందుకు అన్ని చర్యలూ చేపడతామని కోర్టుకు హామీ ఇచ్చారు. గత వారం రోజులుగా ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)లో కాలుష్య స్థాయిలు ఆందోళనకరంగా పెరిగిన విషయం తెలిసిందే. ప్రమాదకరంగా కాలుష్యం పెరగడంతో ఢిల్లీ,ఎన్సీఆర్ పరిధిలో హెల్త్ ఎమర్జెనీని ప్రకటించారు. స్కూళ్లను కొద్దిరోజులు మూసివేసిన అనంతరం ఇటీవలే అవి తిరిగితెరుచుకున్నాయి. కాలుష్యం నుంచి తప్పించుకునేందుకు చిన్నారులు మాస్క్‌లు ధరించి పాఠశాలలకు హాజరవుతున్నారు. -
ఏ జట్టుకైనా నా మద్దతు ఉంటుంది: క్రికెటర్
ముంబాయి: టీమిండియాకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నారు. టీం సరైనా ప్రదర్శన చేసినా.. లేక ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయిన తన మద్దతు మాత్రం ఉంటుందని ఆయన తెలిపారు. ఐడీబీఐ లైఫ్ ఇన్సురెన్స్ ఆధ్వర్యంలో ఆదివారం ఇక్కడ హాఫ్ మారథాన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సచిన్ జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..‘ భారత జట్టుకు నా మద్దతూ ఎల్లప్పుడు ఉంటుంది. అది పురుషుల జట్టైనా, మహిళల జట్టైనా అందులో ఎలాంటి మార్పు ఉండదు. మా శుభాకాంక్షలు ఎల్లవేళల మీ వెంట ఉంటాయి. కొన్నిసార్లు జట్టు అంచనాలను అందుకోలేకపోయినా మా వైఖరీలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. నేను ఎల్లప్పుడు మీతోనే ఉన్నానని భావిస్తూ ఉంటానని ఆయన స్పష్టం చేశారు’.. శ్రీలంకలో పర్యటనలో ఉన్న కోహ్లీ సేన మూడు టెస్టుల సిరీస్‌ను 3-0తో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా దంబుల్లాలో ఈ రోజు తొలి వన్డే జరగనుంది. -
హాఫ్ మారథాన్‌లో అపశృతి
ముంబై: మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ఆదివారం ఉదయం ముంబైలో హాఫ్ మారథాన్‌ను ప్రారంభించారు. సీఎస్టీలో ఉత్సాహంగా ప్రారంభమైన ఈ కార్యక్రమంలో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. మారథాన్‌లో పాల్గొన్న ఓ యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అక్కడ కలకలం రేగింది. స్పృహ కోల్పోయిన యువకుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితిపై సమాచారం తెలియాల్సి ఉంది. -
హకీంపేటలో హాఫ్ మారధాన్
భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన సురక్ష హాఫ్ మారధాన్‌ను నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ ప్రారంభించారు. జాతీయ పారిశ్రామిక భద్రతా అకాడమి సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హకీంపేటలోని నిషా స్టేడియం నుంచి శనివారం ఉదయం ప్రారంభమైన ఈ పరుగులో 3వేల మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. మారధాన్‌లో భాగంగా 5కే, 10కే, 21కే రన్లను నిర్వహించారు. -
15న విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు
విశాఖపట్నం: ఈ నెల 15న విశాఖ బీచ్ రోడ్డులో నిర్వహించనున్న ఆఫ్ మారథాన్ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు రిషికొండ నుంచి కోస్టల్ బ్యాటరీ వరకు ఆఫ్ మారథాన్ నిర్వహిస్తున్నారు. దీంతో ఆ సమయంలో ఇక్కడ వాహనాల రాకపోకలను అనుమతించబోమని వారు వెల్లడించారు. త్రిపుర జంక్షన్, సీఆర్‌రెడ్డి జంక్షన్, ఏయూ ఇన్ గేట్ నుంచి హైస్కూలు రోడ్డులో ఖాళీ ప్రాంతంలో వాహనాలు పార్కింగ్ చేసుకునే వీలు కల్పించనున్నట్లు సమాచారం. -
Run for Her
హాఫ్ మారథాన్, పింకథాన్.. పేరేదైనా నగరవాసులు రన్ రాజా రన్ అంటున్నారు. ఈ వరుసలో కొత్తగా చేరింది ఉమెన్‌థాన్. ఆడవాళ్లను గౌరవించాలన్న ఆలోచన నుంచి పుట్టిందే ఈ ‘రన్ ఫర్ హర్’. అమ్మ కోసం కొడుకు... కూతురును ప్రేమించే తండ్రి... అక్క గురించి తమ్ముడు... భార్యను గౌరవించే భర్త... గర్ల్ ఫ్రెండ్ కోసం ప్రేమికుడు... రొటీన్ గిఫ్ట్‌కి భిన్నంగా, వారిపై ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు ఇదో వేదిక . మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా భారత్‌లో తొలిసారిగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఏకకాలంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది ‘క్వాంటా జీ ఈవెంట్స్’. కూకట్పల్లి సుజనామాల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో హీరో రాజశేఖర్, జీవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ విభిన్నమైన ఈవెంట్ గురించి... మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలకు చరమగీతం పాడాలన్న లక్ష్యంతో ఈ ఈవెంట్‌ను కండక్ట్ చేస్తోంది ‘క్వాంటా జీ ఈవెంట్స్’. ఈ సంస్థ ముగ్గురు డెరైక్టర్స్‌లో ఒకరైన దినేశ్ రాజ్ నెల్లూరువాసి. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండేవాడు. చెన్నై హిందూ కాలేజీలో బీకామ్ చేసిన దినేశ్ తమ బంధువులను కలిసేందుకు తరచూ సిటీకి వస్తుండేవాడు. అలా తెలియకుండానే హైదరాబాద్‌తో మంచి అనుబంధం ఏర్పడింది. బీకామ్ అయ్యాక ఓ బ్యాంక్‌లో పనిచేస్తూ సొంతూరులో ఫ్రెండ్స్‌తో కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండేవాడు. ఆ అనుభవంతో చెన్నైకి చెందిన నిత్యశ్రీ, కేరళకు చెందిన గణపతి సుభన్తో కలిసి క్వాంటా జీ ఈవెంట్‌ను స్థాపించారు. సమాజం కోసం ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో దినేశ్.. సహచరులతో కలిసి గతేడాది డిసెంబర్లో చెన్నైలో ‘మై ఫ్లాగ్ మై ఇండియా’ ఈవెంట్ చేసి గిన్నిస్ రికార్డుల్లోకెక్కారు. జాగృతే లక్ష్యంగా... మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఏదైనా చేయాలన్న తన ఆలోచనను తోటి డెరైక్టర్లతో చర్చించారు దినేశ్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మహిళలను గౌరవించాలనే థీమ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఫలితం... ఉమెన్‌థాన్... బై మెన్. వెంటనే కార్యరూపమిచ్చారు. ఇప్పుడు హైదరాబాద్, చెన్నై, బెంగళూరులలో ఈ ఈవెంట్‌ను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ‘అడవాళ్లను గౌరవించేలా చేయడమే మా లక్ష్యం. ఈ పరుగు వల్ల నలుగురు మారినా మేం సక్సెస్ అయినట్టే. ఈ ఈవెంట్లో 12 వేలమంది పాల్గొంటారని అంచనా. వచ్చే ఏడాది ముంబై, కోల్‌కతా నగరాలో కూడా నిర్వహించాలనుకుంటున్నాం. తద్వారా మొత్తం 65 వేల మంది ఈ ఈవెంట్లో పాల్గొనేలా చూడాలనుకుంటున్నాం’ అంటున్నారు దినేశ్. ప్రేమను పొందవచ్చు... మూడు, ఐదు, పది కిలోమీటర్లు... మూడు కేటగిరీల్లో పరుగు నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు మార్చి 7 లోపు బీబ్ కలెక్ట్ చేసుకోవచ్చు. పాల్గొనేవారికి మెడల్స్‌తో పాటు టీ షర్ట్లు, బీబ్, ఫ్లవర్స్, బొకేలు కూడా ఇస్తారు. వీటిని రన్లో పాల్గొన్న మెన్ తీసుకెళ్లి తమ కుటుంబంలోని మహిళలకు ఇచ్చుకోవచ్చు. దీంతో ఆడవాళ్లను గౌరవిస్తున్నారనే నమ్మకంతోపాటు వారి మనసును, ప్రేమను గెలుచుకోవచ్చు. ఎవరెవరు..! పురుషులు సింగిల్‌గా పాల్గొనవచ్చు. మహిళలైతే భర్త, తండ్రి, సోదరుల్లో ఎవర్నైనా తమ వెంట తెచ్చుకోవాలి. ఎంట్రీ ఫీజు రూ.600. ఆసక్తి ఉన్నవారు ఠీౌఝ్చ్చ్టజిౌ.ఛిౌఝ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వాంకె శ్రీనివాస్ -
వ్యక్తిగత ఆరోగ్యంతోనే స్వచ్ఛ భారత్: సచిన్
న్యూఢిల్లీ: ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా మారడం ద్వారా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేయాలని ప్రముఖ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కోరారు. బహిరంగ క్రీడలు తప్పనిసరన్నారు. పరిశుభ్ర భారత్‌ను ఆవిష్కరించేందుకు ప్రధాని మనకు స్వచ్ఛ భారత్ పిలుపునిచ్చారని... అందరూ ఆరోగ్యంగా ఉండాలని తాను కోరుతున్నట్లు సచిన్ పేర్కొన్నారు. ఆదివారం ఢిల్లీలో సీఆర్పీఎఫ్ చేపట్టిన ‘హాఫ్ మారథాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సచిన్ మాట్లాడారు. పరిశుభ్రమైన పరిసరాలు, ఆరోగ్యకరమైన దేహం జాతిని పటిష్టంగా ఉంచుతుందన్నారు. -
ఉత్సాహంగా.. ఉల్లాసంగా
-
నేడే ఢిల్లీ హాఫ్ మారథాన్
న్యూఢిల్లీ: ఢిల్లీ హాఫ్ మారథాన్‌కు సర్వం సిద్ధమైంది. నగరంలో ఆదివారం జరగనున్న ఈ మారథాన్‌లో ఢిల్లీవాసులతో పాటు ప్రపంచంలోని ప్రముఖ అథ్లెట్లు పాల్గొనేందుకు రెడీ అయ్యారు. డిఫెండింగ్ చాంపియన్ ఎడ్విన్ కిప్యేగో, వరల్డ్ ఫాస్టెస్ట్ మన్ జియోఫ్రీ కిప్సంగ్ పరుగెత్తనుండటం ఈ పోటీకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 2005 నుంచి ప్రతి ఏటా జరుగుతున్న ఈ మారథాన్‌లో ప్రముఖ అథ్లెట్లు పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు. కెన్యా రన్నర్లు కిప్యేగో, కిప్సంగ్ వ్యక్తిగతంగా మెరుగైన రికార్డు నమోదుచేసేందుకు ఉవ్విళూరుతున్నారని చెప్పారు. ఫిలడెల్ఫియా హాఫ్ మారథాన్‌లో 60.04 సెకన్లతో వ్యక్తిగత రికార్డు నమోదుచేసిన కిప్యేగో మాట్లాడుతూ తన కెరీర్లో పరుగెత్తిన వాటిలో ఈ మారథాన్ చాలెంజ్‌తో కూడుకున్నదని అన్నాడు. ‘ఈ నగర వీధుల్లో పరుగెత్తడం చాలా కష్టం. తాను పాల్గొన్నవాటిలో ఇది కఠినమైనది. కానీ ఇప్పటికే కఠోర సాధన చేశారు. వ్యక్తిగతంగా మెరుగైన రికార్డు నమోదుచేసేందుకు ప్రయత్నిస్తున్నాన’ని ఆయన తెలిపాడు. ఇతనికి పోటీగా 100 మీటర్ల వరల్డ్ రికార్డు మాజీ హోల్డర్ కిప్సంగ్, ఒలింపిక్ చాంపియన్ దొనొవన్ బైలీ (కెనడా) ఉన్నారు. ఈ ఏడాది జరిగిన రాస్ ఏ వన్ ఖైమా హాఫ్ మారథాన్‌లో 58.54 సెకన్లతో మెరుగైన వ్యక్తిగత రికార్డు సాధించి ఐఏఏఎఫ్ టాప్ లిస్ట్‌లో ప్రథమస్థానంలో నిలిచిన కిప్సంగ్ మాట్లాడుతూ ఆదివారం జరిగే మారథాన్ కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నానని అన్నాడు. 2011లో ఇక్కడ పరుగెత్తినప్పుడు రెండో స్థానంలో నిలిచానని, అయితే ఈసారి మెరుగ్గా రాణించడంపైనే దృష్టి కేంద్రీకరించానని తెలిపాడు. వీరేగాక పురుషుల విభాగంలో సమ్మీ కిత్వర, డెన్నీస్ కిమెట్లో, విల్సన్ కిప్రోప్, లియోనార్డ్ లంగట్, డానియల్ చెబ్బీ, గిర్మానీ గిబ్రసిలస్సీ, నికోలస్ కెంబోయ్లు పోటీపడుతున్నారు. మహిళల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ వుడే అయల్వే, 2012 వరల్డ్ చాంపియన్ మెసిరెట్ హైల్, రాక్ హాఫ్ మారథాన్ విజేత లూసీ కబూ పోటీపడుతున్నారు. 2011లో ఎయిర్టెల్ హాఫ్ మారథాన్‌ను నెగ్గిన కబూ ఈసారి కూడా అదే పంథాను కొనసాగిస్తానని కెన్యా అథ్లెట్ కబూ ధీమాను వ్యక్తం చేసింది. ఆనారోగ్యం నుంచి ఇప్పుడే కోలుకున్నానని, పూర్తిస్థాయి ఆటతీరును ప్రదర్శిస్తానని తెలిపింది. ‘మలేరియా బారి నుంచి కోలుకున్నా. ఇప్పటికీ పరిస్థితి సంతృప్తికరంగా లేదు. అయితే నా కుమార్తె ఈ పోటీలో పాల్గొనమని ప్రోత్సహించింది. ఆమె గురించి ఇక్కడా పరుగెత్తబోతున్నాన’ని తెలిపింది. ఢిల్లీలోని చల్లటి వాతావరణం అథ్లెట్లకు కలిసొచ్చే అవకాశముందని వెల్లడించింది. భారత్ తరపున గతేడాది విజేతలు రాహుల్ కుమార్ పాల్, సుధా సింగ్ పురుషులు, మహిళల విభాగాల్లో పరుగెత్తనున్నారు. ఈసారి కూడా మెరుగైన ప్రదర్శనతో టైటిళ్లు నిలబెట్టుకుంటామని వీరు ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా మెరుగైనా రికార్డును నమోదు చేస్తామన్న విశ్వాసం వ్యక్తం చేశారు. విదేశీ అథ్లెట్ల నుంచి తీవ్ర పోటీ ఉన్న విజయం సాధించేందుకు ప్రయత్నిస్తామని వారు తెలిపారు. ప్రపంచం నలుమూలాల నుంచి వచ్చిన ప్రముఖ అథ్లెట్లతో పోటీపడటం మంచి అనుభవన్నిస్తుందన్నారు. హాఫ్ మారథాన్‌తో ట్రాఫిక్ మళ్లింపు సాక్షి, న్యూఢిల్లీ: నగరంలో ఆదివారం నిర్వహించనున్న హాఫ్ మారథాన్‌తో పలు రూట్లలో ట్రాఫిక్ మళ్లింపు చేపడుతున్నట్టు ట్రాఫిక్ పోలీసులు తెలి పారు. మొత్తం ఆరు వరుసల్లో కొనసాగనున్న ఎయిర్టెల్ హాఫ్ మారథాన్ ఆదివారం ఉదయం 7.20 గంటల నుంచి జవహర్లాల్ నెహ్రూ స్టేషన్ నుంచి ప్రారంభం కానుంది. మారథాన్ కారణంగా కొన్ని రూట్లలో ట్రాఫిక్ మళ్లించడంతోపాటు అవసరమైన రోడ్లలో పూర్తి స్థాయిలో రాకపోకలను నిలిపివేయనున్నారు. వీటిలో భీష్మ పితామహ్ మార్గ్, లోధీ రోడ్,మథురా రోడ్, సుబ్రహ్మణ్య భారతీ మార్గ్, డా.జాకీర్ హుస్సేన్ మార్గ్, ఇండియా గేట్ మార్గ్, రాజ్‌పథ్, నఫీకివాదయీ మార్గ్, రోడ్‌క్రాస్ స్ట్రీట్, పార్లమెంట్ స్ట్రీట్, అశోకా రోడ్డు,లాలాలజపత్‌రాయ్ మార్గ్, జన్‌పథ్, వింస్డర్ప్లేస్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. దారిమళ్లింపు ఇలా: భీష్మపితామహ మార్గ్ నుంచి కోట్లారెడ్ సిగ్నల్ వరకు, లోధీరోడ్ నుంచి అర బిందోమార్గ్ తిరాహా, లోధీరోడ్ నుంచి మథురారోడ్, లోధీరోడ్ నుంచి లాలాలజపతిరాయ్ మార్గ్ వరకు, మూల్‌చంద్ క్రాసింగ్, మథురా రోడ్ నుంచి శేర్షారోడ్ వరకు, నీలా గుబంద్ మథురారోడ్, జాకీర్ హుస్సేన్ మార్గ్, సుబ్రహ్మణ్య భారతీమార్గ్ క్రాసింగ్, సీ హెక్సాగన్ నుంచి శేర్షామార్గ్, అక్బర్ రోడ్డు నుంచి మాన్సింగ్ రోడ్ వరకు, మౌలానా ఆజాద్ రోడ్ నుంచి జనపథ్మార్గ్, సున్హరీమజీద్, విజయ్‌చౌక్, పార్లమెంట్ స్ట్రీట్ నుంచి ఇత్మియాజ్ఖాన్ మార్గ్, అశోకా రోడ్ నుంచి జయ్సింగ్మార్గ్, సంసద్‌మార్గ్ నుంచి జంతర్‌మంతర్ రోడ్, అశోకారోడ్ నుం చి బూటాసింగ్ మార్గ్, కేజీమార్గ్ నుంచి ఫిరోజ్‌షా వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. -
మెరీనా తీరంలో మారథాన్
ఆదివారం వేకువజామున 5 గంట లకు చెన్నైలోని మెరీనా తీరానికి సుమారు 10వేల మందికి పైగా చేరుకున్నారు. చలి వణికిస్తున్నా, వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా 42 కిలోమీటర్ల దూరం పరుగు తీశారు. దేశవిదేశాలకు చెందిన యువకులు ఈ మారథాన్‌లో పాల్గొంటే ఉగాండాకు చెందిన యువకుడు రెండో సారి విజేతగా నిలిచాడు. కొరుక్కుపేట, న్యూస్‌లైన్:విప్రో-చెన్నై మారథాన్ - 2013కు అనూహ్య స్పందన లభించింది. విప్రో సంస్థ, చెన్నై రన్నర్స్ సంయుక్త ఆధ్వర్యంలో రెండో సీజన్ మారథాన్‌ను ఆదివారం నిర్వహించారు. చెన్నై మెరీనా తీరాన ఉదయం 5 గంటలకు ప్రారంభమైన మారథాన్‌లో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి వచ్చిన యువకులు కూడా పాల్గొన్నారు. దాదాపు 10వేల మంది ఈ రన్లో పాల్గొని వర్షం వచ్చినా, లెక్కచేయకుండా మారథాన్‌ను విజయవంతంగా నిర్వహించారు. పుల్ మారథాన్, హాఫ్ మారథాన్, 10 కిలోమీటర్ల రన్‌ను నిర్వహించారు. ఫుల్మారథాన్ను చెన్నై రన్నర్ మారథాన్ అయిన బాస్కో ప్రారంభించగా, హాఫ్ మారథాన్‌ను చెన్నై రన్నర్ ఫౌండర్ రామ్ విశ్వనాథన్, 10 కిలోమీటర్ల రన్‌ను టీఎన్ఏఏ సెక్రటరీ, ఏడీజీపీ రాజేంద్రన్ జెండా ఊపి ప్రారంభించారు. ఫుల్ మారథాన్‌లో 42.2 కిలోమీటర్ల దూరం రెండు గంటల 32 నిమిషాల 21 సెకన్లలో పరుగు తీసి ఉగాండా దేశానికి చెందిన ఇస్మాయిల్ పురుషుల విభాగంలో మొదటి స్థానం పొందారు. మహిళల విభాగంలో ఫుల్ మారథాన్‌లో సుధామణి ప్రథమ బహుమతి గెలుచుకున్నారు. మొదటి సీజన్లో ఫుల్ మారథాన్ విజేత ఇస్మాయిల్ రెండో సీజన్లోనూ మొదటి బహుమతి గెలుచుకోవటం గమనార్హం. విజేతలుగా నిలిచిన వారికి ఫుల్ మారథాన్‌లో రూ.35,000 ప్రథమ, రూ.25,000 ద్వితీయ, 15,000 తృతీయ బహుమతులుగా అందచేశారు. హాఫ్ మారథాన్‌లో రూ.25,000, రూ.15,000, రూ.10,000 చొప్పున అందచేశారు కల నిజమైంది : రెండో సీజన్లోనూ విజేతగా నిలవాలన్న నా కల నిజమైంది. పోటీ ఎక్కువగా ఉన్నా, వర్షం అడ్డు వచ్చినా గెలవాలన్న తపన నన్ను విజేతగా నిలిపింది. చెన్నై మారథాన్‌లో పాల్గొనడం ఆనందంగా ఉంది - ఇస్మాయిల్, ఉగాండా