
గిడినియా (పోలాండ్): ప్రపంచ అథ్లెటిక్స్ హాఫ్ మారథాన్ చాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో కెన్యా అథ్లెట్ పెరెస్ జెప్‌చిర్చిర్ కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. శనివారం జరిగిన రేసులో 27 ఏళ్ల పెరెస్ 21.0975 కిలోమీటర్ల దూరాన్ని గంటా 5 నిమిషాల 16 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 5న ప్రేగ్‌లో గంటా 5 నిమిషాల 34 సెకన్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును పెరెస్ తిరగరాసింది. కెజెటా (జర్మనీ–1గం:05ని.18 సెకన్లు), యాలెమ్‌జెర్ఫ్ యెహుఅలావ్ (ఇథియోపియా–1గం:05ని.19 సెకన్లు) రజత, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. పురుషుల విభాగంలో జేకబ్ కిప్లిమో (ఉగాండా) 58 నిమిషాల 49 సెకన్లలో గమ్యానికి చేరి చాంపియన్‌గా నిలిచాడు. ప్రపంచ హాఫ్ మారథాన్‌లో టైటిల్ నెగ్గిన తొలి ఉగాండా రన్నర్‌గా కిప్లిమో గుర్తింపు పొందాడు.
Comments
Please login to add a commentAdd a comment