Peres
-
హాఫ్ మారథాన్‌లో పెరెస్ ప్రపంచ రికార్డు
గిడినియా (పోలాండ్): ప్రపంచ అథ్లెటిక్స్ హాఫ్ మారథాన్ చాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో కెన్యా అథ్లెట్ పెరెస్ జెప్చిర్చిర్ కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. శనివారం జరిగిన రేసులో 27 ఏళ్ల పెరెస్ 21.0975 కిలోమీటర్ల దూరాన్ని గంటా 5 నిమిషాల 16 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 5న ప్రేగ్లో గంటా 5 నిమిషాల 34 సెకన్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును పెరెస్ తిరగరాసింది. కెజెటా (జర్మనీ–1గం:05ని.18 సెకన్లు), యాలెమ్జెర్ఫ్ యెహుఅలావ్ (ఇథియోపియా–1గం:05ని.19 సెకన్లు) రజత, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. పురుషుల విభాగంలో జేకబ్ కిప్లిమో (ఉగాండా) 58 నిమిషాల 49 సెకన్లలో గమ్యానికి చేరి చాంపియన్‌గా నిలిచాడు. ప్రపంచ హాఫ్ మారథాన్‌లో టైటిల్ నెగ్గిన తొలి ఉగాండా రన్నర్‌గా కిప్లిమో గుర్తింపు పొందాడు. -
ఈ - ముక్కు చెబితే తినొచ్చు!
వాషింగ్టన్: ఏదో హోటల్‌కో, రెస్టారెంట్‌కో వెళ్లారు.. మీకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేశారు.. కానీ, ఆ ఆహారం పాడైపోయిందేమోనని అనుమానం వచ్చింది.. రుచి బాగానే ఉన్నా, తిన్నాక ఏమైనా అయితే..!? ఇలాంటి సమయాల్లో బాగా తోడ్పడే ‘ఈ-ముక్కు (ఎలక్ట్రానిక్ ముక్కు)’ అందుబాటులోకి వచ్చేస్తోంది. ‘పెరెస్’ అని పేరుపెట్టిన ఈ పరికరాన్ని ఆహారానికి దగ్గరగా పెట్టగానే.. దాని నుంచి వెలువడే రసాయనాలు, అమ్మోనియా స్థాయిని గుర్తించి దానిని తినొచ్చో లేదో చెప్పేస్తుంది. అమెరికా శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ ‘పెరెస్’తో మాంసం, చేపలు వంటి ఆహార పదార్థాల తాజాదనాన్ని దీని సహాయంతో సులువుగా గుర్తించవచ్చు. ఈ పరికరంలోని నాలుగు సెన్సర్లు.. ఆహారం ఉష్ణోగ్రత, అందులోని తేమ, దాని నుంచి వెలువడే అమ్మోనియా, ఇతర ప్రమాదకర రసాయనాలను గుర్తించి.. బ్లూటూత్ సహాయంతో స్మార్ట్‌ఫోన్‌కు పంపుతాయి. ఫోన్లోని అప్లికేషన్ దీనిని విశ్లేషించి.. ఆ ఆహారాన్ని తినవచ్చో, లేదో చెబుతుంది.