సాక్షి,న్యూఢిల్లీ: కాలుష్య కోరల్లో విలవిలలాడుతున్న ఢిల్లీలో హాఫ్ మారథాన్‌కు ఢిల్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాలుష్యం ప్రమాదకరంగా పెరిగిపోయిన క్రమంలో పరుగు నుంచి తప్పుకునే రన్నర్లకు తాము రిఫండ్ పాలసీని ప్రవేశపెట్టామని నిర్వాహకులు కోర్టుకు తెలిపారు. అత్యవసర వైద్య పరిస్థితి తలెత్తితే ఎదుర్కొనేందుకు అన్ని చర్యలూ చేపడతామని కోర్టుకు హామీ ఇచ్చారు. గత వారం రోజులుగా ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్)లో కాలుష్య స్థాయిలు ఆందోళనకరంగా పెరిగిన విషయం తెలిసిందే.
ప్రమాదకరంగా కాలుష్యం పెరగడంతో ఢిల్లీ,ఎన్‌సీఆర్ పరిధిలో హెల్త్ ఎమర్జెనీని ప్రకటించారు. స్కూళ్లను కొద్దిరోజులు మూసివేసిన అనంతరం ఇటీవలే అవి తిరిగితెరుచుకున్నాయి. కాలుష్యం నుంచి తప్పించుకునేందుకు చిన్నారులు మాస్క్‌లు ధరించి పాఠశాలలకు హాజరవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment