
సిబిఐ కేసులన్నీ ప్రశ్నార్ధకం: విద్యాసాగర్ రావు
నిజామాబాద్: సీబీఐ నిర్మాణమే చెల్లుబాటుకాదని గౌహతి హైకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో ఆ కేసులన్నీ ప్రశ్నార్థకం అవుతాయని బిజేపి నేత విద్యాసాగర్ రావు అన్నారు. ఇంత పెద్ద ప్రజాస్వామ్యదేశంలో అలాంటి చారిత్రక పొరబాట్లు లేకుండా చూడాలన్నారు.
ప్రత్యేక తెలంగాణను టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయముడు సమన్యాయం పేరుతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షనేతగా చంద్రబాబు అన్ని విషయాల్లో విఫలమయ్యారన్నారు. కేంద్రం అన్ని పార్టీలను ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.