
జగిత్యాలక్రైం : కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు పీఏ గిరీశ్ (38) ఎస్సారెస్పీ కెనాల్‌లో గల్లంతయ్యారు. ఆదివారం ఆయన జగిత్యాలకు చెందిన నలుగురు స్నేహితులతో కలసి అంతర్గాం శివారులో విందు చేసుకున్నారు. అనంతరం ఎస్సారెస్పీ కాలువలో స్నానం చేసేందుకు వెళ్లారు. అయితే నీటి ప్రవాహ వేగానికి గిరీశ్ కొట్టుకుపోయారు. ఆయనను రక్షించేందుకు స్నేహితులు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. ఈ విషయం తెలుసుకున్న జగిత్యాల రూరల్ పోలీసులు, ప్రత్యేక పోలీసు బృందం ఎస్సారెస్పీ ప్రధాన కాలువ వెంట గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment