washed away
-
గుంటూరు: వాగులో కొట్టుకుపోయిన కారు.. ముగ్గురు మృతి
సాక్షి, గుంటూరు: ఉప్పలపాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వరద ఉధృతికి కారు మురుగు వాగులో కొట్టుకుపోయింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతిచెందారు. టీచర్ సహా ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. మృతులను రాఘవేంద్ర, సాత్విక్, మాన్విక్‌గా గుర్తించారు.విజయవాడలో నిన్నటి నుండి ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందారు. మేఘన, బోలెం లక్ష్మీ, లాలూ, అన్నపూర్ణ చెందారు, నగరంలో రహదారులన్నీ జలమయంగా మారాయి.ఎన్టీఆర్ సర్కిల్ నుండి కానూరువరకు రహదారి నీటమునిగింది. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతం జలదిగ్భంధంలో చిక్కుకుంది. దుర్గగుడిపైనా భారీ వర్షాల ప్రభావం పడింది. దుర్గగుడి ఘాట్ రోడ్ మూసివేశారు. దుర్గగుడి కొండపై ఘాట్ రోడ్లో కొండ చరియలు విరిగిపడుతున్నారు. విజయవాడ వన్ టౌన్ ప్రాంతంలో కాలనీలు నీటమునిగాయి. నిన్న రాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. -
నీళ్లలో కొట్టుకుపోయిన బైక్
-
హిమాచల్ ప్రదేశ్‌లో జల ప్రళయం.. 29 మంది మృతి..
సిమ్లా: ఎడతెరిపిలేని వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ వణికిపోతోంది. గతకొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు కూడా విరిగిపడుతున్నాయి. తాజాగా సోలాన్ జిల్లాలోని మామిసిఘ్ గ్రామంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. గత 24 గంటల్లో వివిధ ఘటనల్లో వర్షాల కారణంగా 29 మంది మరణించారని అధికారులు తెలిపారు. ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడి గ్రామంపైకి దూసుకొచ్చాయి. ఈ ఘటనలో రెండు ఇళ్లు, పశువుల పాకలు కూలిపోయాయి. ఏడుగురు మృతి చెందారు, మరో ఆరుగుర్ని రక్షించామని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖూ సంతాపం తెలిపారు. ఘటనస్థలంలో సహాయక చర్యలు చెపట్టాలని అధికారులను ఆదేశించారు. 16 Killed, Many Feared Trapped As Monsoon Fury Returns To Himachal Read here: https://t.co/5bjrcB342e pic.twitter.com/k3QM3rfryM — NDTV (@ndtv) August 14, 2023 తీవ్రంగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఆగష్టు 14న నిర్వహించనున్న పీజీ, బీఈడీ పరీక్షలను రద్దు చేశారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే వర్షాలతో రాష్ట్రంలో 257 మంది మృతి చెందారు. రూ.7,020 కోట్ల నష్టం జరిగిందని వెల్లడించారు. కాగా.. 32 మంది తప్పిపోయారు. 290 మంది గాయపడ్డారు. శివ మందిర్ కూలి.. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో సిమ్లాలో శివ మందిర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. శ్రావణమాసం సందర్భంగా ప్రార్థనల కోసం భక్తులు గుమికూడారని సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖూ తెలిపారు. ఈ క్రమంలో మందిరం కూలిపోగా.. భక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేస్తోంది. శిథిలాలను తొలగిస్తున్నారు. Rescue Operations Underway As Temple Collapses Due To Landslide In Shimla pic.twitter.com/WJYBNXVchQ — NDTV (@ndtv) August 14, 2023 ఉత్తరాఖండ్‌లోనూ.. ఉత్తరాఖండ్‌లోనూ వర్షాలు ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి. దీంతో పలు నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. బాదల్ నది ప్రవాహాంలో డెహ్రాడూన్‌లోని మాల్దేవత ప్రాంతంలో ఉన్న డిఫెన్స్ కాలేజ్ కూలిపోయింది. ఈ దృశ్యాలు భీతికొల్పుతున్నాయి. కాగా.. రాష్ట్రంలో ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాలతో ఇప్పటివరకు 60 మంది మరణించారు. 17 మంది తప్పిపోయారు. #WATCH | A college building collapsed due to incessant rainfall in Dehradun, Uttarakhand. (Source: Dehradun Police) https://t.co/i4dpSQs2MH pic.twitter.com/1XhTLTafCi — ANI UP/Uttarakhand (@ANINewsUP) August 14, 2023 వర్షాలతో తెహ్రీ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. రిషికేష్- చంభా జాతీయ రహదారిలో రాకపోకలు నిలిపివేశారు. రిషికేష్- దేవప్రయాగ జాతీయ రహదారిలో వాహనాలు ఎక్కడిక్కడే నిలిపివేశారు. 1,169 ఇళ్లు నేలమట్టమయ్యాయి. పంటపొలాలు ధ్వంసమయ్యాయి. ఇదీ చదవండి: Dwarka Expressway: ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే వ్యయంపై కాగ్ సంచలన వ్యాఖ్యలు -
తప్పించుకుందామనుకున్నారు.. తనువులు చాలించారు!
వరద ముంపు నుంచి తప్పించుకునేందుకు మరోచోటికి బయలుదేరారు. వారిలో భార్యాభర్తలు, తండ్రీ కొడుకులు, బంధువులు ఉన్నారు. మధ్యలో వాగు పొంగుతుండటంతో.. ఒకరి చేతులు పట్టుకుని మరొకరుగా 15 మంది నడుచుకుంటూ వెళ్తున్నారు. కానీ ప్రవాహం ధాటికి అంతా కొట్టుకుపోయారు. ఇందులో ఎనిమిది మంది మృతదేహాలు శుక్రవారం లభ్యమయ్యాయి. మిగతావారి ఆచూకీ కూడా ఇంకా దొరకలేదు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలో జరిగిన విషాదం ఇది. కల్వర్టు ఉందనుకుని వెళ్తే.. భారీ వర్షాలతో గురువారం జంపన్నవాగు ఉప్పొంగి కొండాయి గ్రామాన్ని వరద చుట్టుముట్టింది. దీనితో 15 మంది పక్కనే ఉన్న మల్యాలలో తలదాచుకునేందుకు బయలుదేరారు. ఆ రహదారిలో ఉన్న వాగుపై ఇటీవలే పైపులు వేసి కల్వర్టు నిర్మించారు. వరద తాకిడికి పైపులు, కల్వర్టు కొట్టుకుపోయాయి. అక్కడ వరద నిండుగా ప్రవహిస్తోంది. కానీ కల్వర్టు ఉందన్న ఉద్దేశంతో ఈ 15 మంది ఒకరినొకరు చేతులు పట్టుకుని దాటడం మొదలుపెట్టారు. కొంతదూరం రాగానే వాగులో పడి కొట్టుకుపోయారు. వీరిలో శుక్రవారం కొండాయి గ్రామానికి చెందిన గిరిజన మహిళా దబ్బగట్ల సమ్మక్క(60), భార్యాభర్తలు ఎండీ రషీద్ (55), కరీమా(45), తండ్రీకొడుకులు ఎండీ షరీఫ్ (60), అజహర్ (25), భార్యాభర్తలు మజీద్‌ఖాన్ (65), లాల్‌బీ (60), మరో వ్యక్తి ఎస్కే మహబూబ్‌ఖాన్ (58) ఉన్నారు. వీరిలో సమ్మక్క మినహా మిగతా ఏడుగురు సమీప బంధువులే. గల్లంతైన మిగతా వారి కోసం బంధువులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. -
రోడ్లు.. వానపాలు
సాక్షి నెట్వర్క్: భారీ వర్షాలు రాష్ట్రంలోని పలు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షం భీభత్సం సృష్టించింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ నగర్, రామ్‌నగర్ కాలనీలు నీట మునగడంతో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. నిర్మల్ జిల్లాలో 30 వేల ఎకరాల్లో పంట నీట మునిగిందని అంచనా వేశారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పలుచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. నిజామాబాద్ జిల్లాలో 24,035 మంది రైతులకు చెందిన 33,429 ఎకరాల్లో వరి, సోయా, మొక్కజొన్న, పసుపు పంటలు దెబ్బతిన్నాయి.7 మండలాల్లోని 16 చెరువుల కట్టలు తెగిపోయాయి. బోధన్ మండలం సాలూర శివారులోని మంజీర నది పాత వంతెన పైనుంచి ప్రవహించడంతో తెలంగాణ – మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచి పోయాయి. ఖమ్మం జిల్లా కేంద్రాన్ని గురువారం అతలాకుతలం చేసిన మున్నేరు వరద శుక్రవారం ఉదయం నుంచి తగ్గుతూ వస్తోంది. గురువారం రాత్రి 10గంటలకు 30 అడుగులుగా ఉన్న నీటి మట్టం శుక్రవారం రాత్రి ఏడు గంటలకు 18.30 అడుగులకు పడిపోయింది. దీంతో పునరావాస కేంద్రాల నుంచి ప్రజలు ఇళ్లకు చేరుకుంటున్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మున్నేరును పరిశీలించి సహాయక చర్యలపై అధికారులకు సూచ నలు చేశారు. ఖమ్మంలో మున్నేటి వరద, ముంపు ప్రాంతాలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ప్రచార కమిటీ కోచైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించి బాధితులతో మాట్లాడారు. -
ఉప్పొంగిన బియాస్.. జాతీయ రహదారిపై చొచ్చుకువచ్చి.. వీడియో వైరల్
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరద నీటితో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. బియాస్ నదిలో ప్రవాహం ప్రమాద స్థాయిని మించి పారుతోంది. దీని కారణంగా బియాస్ నది పక్కనే ఉన్న జాతీయ రహదారి కొట్టుకుపోయింది. రోడ్డుపైనే ప్రవాహం ఉద్ధృతంగా పారుతోంది. మరోవైపు ఎడతెరిపిలేని వర్షాలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో మండీ, కులు మధ్య రహదారిపైనే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. #WATCH | Portion of National Highway 3 washed away by overflowing Beas river in Kullu, Himachal Pradesh pic.twitter.com/c8gRsvSkt5 — ANI (@ANI) July 9, 2023 వర్షాల కారణంగా రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీటితో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. అటు బియాస్ నది ప్రవాహం కారణంగా జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడే నిలబడ్డాయి. వర్ష ప్రభావం అధికంగా ఉన్న ఏడు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. సిమ్లా, సిర్మౌర్, లాహుల్, స్పితి, ఛంబా, సోల్ జిల్లాల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. #WATCH | River Beas flows furiously in Himachal Pradesh's Mandi as the state continues to receive heavy rainfall pic.twitter.com/Wau6ZwLLue — ANI (@ANI) July 9, 2023 రాష్ట్రంలో బియాస్ నదితో పాటు పలు నదుల్లో వరద నీరు ప్రమాద స్థాయిల్లో ప్రవహిస్తోంది. దీని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 133 మార్గాల్లో రాకపోకలను నిలిపివేశారు. జులై 11 వరకు శ్రీఖండ్ మహాదేవ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు కులు జిల్లా యంత్రాంగం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే రూ.322 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదీ చదవండి: Heavy Rains: హిమాచల్ ప్రదేశ్‌కు రెడ్ అలర్ట్.. -
వారెవ్వా..వరదలో ప్రాణాలకు తెగించి సాయం చేసారు
-
ఫ్లోరిడాలో హరికేన్ విలయం.. వరదలో కొట్టుకుపోయిన రూ. 8 కోట్ల కారు
ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడాలో ఇయన్ హరికేన్ ప్రళయం సృష్టిస్తోంది. హరికేన్ ప్రతాపానికి ఫ్లోరిడా రాష్ట్రంలోని తీర ప్రాంత ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. భయానక గాలులు, కుండపోత వర్షాలతో ఇళ్లన్నీ నీటమునిగాయి ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. రోడ్లన్నీ మునిగిపోయాయి. ఇంటి ముందు పార్క్చేసిన వాహనాలన్నీ నీటిలో కొట్టుకుపోయాయి. 20 మంది వలసకారులతో కూడిన పడవ మునిగిపోవడంతో కొంతమంది అదృశ్యమైనట్లు యూఎస్ బార్డర్ పెట్రోలింగ్ అధికారులు తెలిపారు. హరికేన్ పరిస్థితిని లైవ్‌లో ని వివరిస్తన్న రిపోర్టర్లు కొట్టుకొని పోయినంతపనైంది. వీధుల్లోకి షార్క్‌లు కొట్టుకొని వచ్చిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇయన్ హరికేన్ కారణంగా ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి ఇంటి గ్యారేజ్‌లో పార్క్ చేసిన ఓ ఖరీదైన కారు కొట్టుకుపోయింది. వరద ధాటికి కారు కొట్టుకుపోతున్న దృశ్యాలను స్వయంగా యాజమాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. మెక్లారెన్ కంపెనీకి చెందిన పీ1 సూపర్ కారు ఖరీదు అక్షరాలా 1 మిలియన్ డాలర్లు. ‘అంటే ఇండియాన్ కరెన్సీలో దాదాపు 8 కోట్లు). ఇంత ఖరీదైన లగ్జరీ నేపుల్స్ ప్రాంతంలో కారు వరద నీటిలో కట్టుకుపోయింది.ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇప్పటి వరకు వేలల్లో లైకులు వచ్చి చేరాయి. చాలా మంది నెటిజన్లు కొట్టుకుపోవడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు. ‘నన్ను క్షమించండి, ఇది చాలా బాధాకరం. ఇలా జరిగినందుకు చాలా చింతిస్తున్నాను. మీరు జాగ్రత్తగా ఉండాలి.. కారు పోతే మళ్లీ కొనుక్కోవచ్చు’ అంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ ఐఏఎస్ అధికారికి మూడేళ్లు జైలు -
వైరల్ వీడియో: వరద ఉధృతికి కొట్టుకుపోయిన కారు..
-
Viral Video: వరద ఉధృతికి కొట్టుకుపోయిన కారు..
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత అయిదు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తాజాగా ములుగు జిల్లాల్లో ఓ కారు వరద నీటిలో కారు చిక్కుకుంది. మహమ్మద్ గౌస్‌పల్లి సమీపంలోని లోలేవల్ కల్వర్టు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. నల్లబెల్లికి చెందిన శంకర్ తన కొడుకుతో వరంగల్ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా కల్వర్టు వద్ద వరద ప్రవాహం తక్కువగా ఉందని కారును ముందుకు పోనిచ్చారు. అయితే ప్రమాదవశాత్తు నీటి ఉధృతి ఎక్కువ అవ్వడంతో ప్రవాహంలో కారు పక్కకు కొట్టుకుపోయింది. వెంటనే స్థానికులు చూసి కారులో ఉన్న ఇద్దరిని కాపాడారు. దీంతో కారులో ఉన్న కారులోని తండ్రి కొడుకులకు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
భారీ వర్షాలు.. నదిలో కొట్టుకుపోయిన కారు.. 9 మంది మృతి
రాంచీ: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నైనిటాల్ జిల్లాలోని రామ్ నగర్ ప్రాంతం వద్ద ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ధేలా నదిలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. ఇద్దరు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను రామ్‌నగర్‌లోని ఆసుపత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది కూడా చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాద సమయంలో కారులో 11 మంది ప్రయాణిస్తుండగా వారిలో ఓ బాలిక కూడా ఉంది. బాధితులంతా పంజాబ్‌కు చెందిన వారుగా పోలీసులు తెలిపారు. కాగా గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్ అంతటా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ధేలా నది ఉప్పొంగుతోంది. శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ నీటి ప్రవాహం కారణంగా ఈ ఘటన చోటుచేసుకుందని కుమావోన్ రేంజ్ డీఐజీ ఆనంద్ భరన్ తెలిపారు. ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఎర్టిగా కారు శుక్రవారం ఉదయం 5 గంటలకు కార్బెట్ వైపు వెళుతోంది. వేగంగా వెళ్తున్న కారును ఆపేందుకు ప్రయత్నించినా ఆగలేదు. ధేలా గ్రామంలోని నది వంతెనపై వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కారు నీటిలో కొట్టుకుపోయింది’ అని తెలిపారు. ఇదిలా ఉండగా నదిపై వంతెన నిర్మాణం లేకపోవడంతో గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. చదవండి: రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగుల మృతి -
హిమబిందు మృతదేహం లభ్యం
-
దోసలవాగులో గల్లంతైన హిమబిందు మృతదేహం లభ్యం
సాక్షి, యాదాద్రి భువనగిరి: జిల్లాలోని రాజపేట మండలం, కుర్రారం గ్రామం దోసలవాగులో గల్లంతైన హిమబిందు మృతదేహం లభ్యమైంది. పారుపల్లి సమీపంలో మృతదేహం లభించింది. సింధూజ మృతదేహం లభించిన ప్రాంతానికి చేరువలోనే హిమబిందు మృతదేహం ఇసుకలో కూరుకుపోయి కనిపించింది. గల్లంతైన మూడు రోజులకు మృతదేహాలు లభ్యమవ్వడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా సోమవారం మధ్యాహ్నం వాగులో ఇద్దరు యువతులు సింధూజ, హిమబింధు కొట్టుకుపోయిన విషయం విదితమే ఇటుకలపల్లి వెళ్లి తిరిగి కుర్రారం గ్రామానికి వెళ్తుండగా వాగులో నీటి ప్రవాహనికి గల్లంతు అయ్యారు. వాగు దాటుతుండగా మధ్యలో స్కూటీ ఆగిపోవడంతో వాగు ఉదృతికి కొట్టుకుపోయారు. -
Telangana: తడిచె.. మొలకెత్తే..
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: ఈ ఏడాది దిగుబడి బాగుందన్న రైతుల సంతోషాన్ని అకాల వర్షాలు, రవాణా కష్టాలు ఆవిరి చేస్తున్నా యి. నెల రోజులుగా తరచూ కురుస్తున్న వానలతో ఇబ్బందులు నెలకొన్నాయి. ధాన్యం తడిసి రంగు మారిందని, మొలకెత్తిందని, తేమ ఎక్కువ ఉందంటూ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు పెడ్తున్న కొర్రీలతో రైతులు కన్నీళ్లు పెట్టాల్సి వస్తోంది. మరోవైపు ధాన్యం తూకం వేసినా.. దానిని మిల్లులకు తరలించేందుకు లారీలు లేక మరో సమస్య ఎదురవుతోంది. కొనుగోళ్లు లేక, కొన్నా మిల్లులకు తరలించలేక.. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోతుండటంతో రైతులకు కంటి మీద కునుకు ఉండటం లేదు. కాంటాలు వేసిన తర్వాత కూడా బస్తాలు మిల్లుకు చేరితేనే రైతులు ధాన్యం అమ్మినట్టు రశీదులిస్తున్నారు. అప్పటిదాకా రైతులదే బాధ్యత అని స్పష్టం చేస్తున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాల వద్దే రైతులు పడిగాపులు పడుతున్నారు. 20 లక్షల టన్నులు ఆరుబయటే.. రాష్ట్రంలో ఈ ఏడాది వరిసాగు ఎక్కువగా జరిగింది. సుమారు కోటీ 30 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి రావొచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. అందులో 80 లక్షల టన్నుల మేర సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఇప్పటికే 76 లక్షల టన్నుల మేర ధాన్యం సేకరణ పూర్తయిందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇంకా కొనుగోళ్లు సాగుతున్నాయని, అంచనా వేసుకున్న 80 లక్షల టన్నులకన్నా మరో 5లక్షల టన్నులు అధికంగా రావొచ్చని ఇటీవల పౌర సరఫరాల సంస్థ అంచనా వేసింది. కానీ జిల్లాల నుంచి వస్తున్న సమాచారం మేరకు.. ఇంకా 20 లక్షల టన్నులకుపైగా ధాన్యం కల్లాల్లో, సేకరణ కేంద్రాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వరి సాగు ఆలస్యంగా మొదలైన ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, ఆసిఫాబాద్, గద్వాల, వికారాబాద్, వనపర్తి తదితర జిల్లాల్లో ధాన్యం భారీగా ఉంది. నెల రోజుల నుంచి పడిగాపులే.. ఎకరం వరి వేశాను. 30 క్వింటాళ్ల వడ్లు వచ్చాయి. ఎండలో బాగా ఆరబెట్టి నెల రోజుల కింద కొనుగోలు కేంద్రానికి తెచి్చన. వానలకు నాలుగుసార్లు తడిసిపోయాయి. ప్రతిసారీ ఆరబెట్టుకుంటూ వచ్చిన, వారం కింద ధాన్యాన్ని కాంటా వేశారు. ఇంకా మిల్లుకు పంపలేదు. అధికారులను అడిగితే లారీలు రావట్లేదని చెప్తున్నారు. ధాన్యం మిల్లుకు చేరేదాకా మా బాధ్యతే అంటున్నారు. కొద్దిరోజులుగా వానలు పడుతుండటంతో కొనుగోలు కేంద్రం వద్దే ఉంటూ చూసుకోవాల్సి వస్తోంది. – కాలసాని వెంకటరెడ్డి, రైతు, కురవి, మహబూబాబాద్ జిల్లా ఎక్కడ చూసినా అదే పరిస్థితి.. ►ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఐకేపీ, పీఏసీఎస్, వ్యవసాయ మార్కెట్లు కలిపి మొత్తం 306 కొనుగోలు కేంద్రాలను తెరిచారు. నాలుగున్నర లక్షల టన్నుల కొనుగోలు లక్ష్యం పెట్టుకున్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే కొనుగోళ్లు మొదలయ్యాయి. ఈ నెల 2 వరకు కూడా 3,17,520 టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. ఇంకా భారీగా ధాన్యం కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఉంది. పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి నెలన్నర రోజులు అవుతున్నా.. తూకం వేయక, వేసినా మిల్లులకు తరలించక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ►మహబూబాబాద్ జిల్లా కురవిలోని ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సహకార సం ఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రానికి ఈ నెల 2వ తేదీ నాటికి 42 వేల బస్తాల ధాన్యంరాగా.. 32,588 బస్తాలు కాంటా అయింది. ఇందులో 19,315 బస్తాలు మాత్రమే మిల్లులకు పంపగలిగారు. అంటే తూకం వేసిన ధాన్యమే 13,273 బస్తాలు ఉండగా.. తూకం వేయనిది మరో 9,500 బస్తాల వరకు ఉంటుం దని అధికారులే చెబుతున్నారు. చాలా కేంద్రాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు నామ శ్రీను. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం పజ్జూరు గ్రామం. మూడెకరాల్లో వరి వేస్తే 200 బస్తాల దిగుబడి వచ్చింది. ఏప్రిల్‌లోనే గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రానికి ధాన్యం తెచ్చాడు. ఇంతవరకు కొనుగోలు చేయలేదు. ధాన్యం రాశిపై పట్టా కప్పి పెట్టాడు. రెండు నెలలుగా ఎదురుచూస్తూనే ఉన్నాడు. ‘‘ఇప్పటికే పలుమార్లు ధాన్యం తడిసింది. కొంత మేర మొలకలు వచ్చింది. గురువారం మళ్లీ తడిసిపోయింది. ఇప్పుడీ ధాన్యాన్ని కొంటారా లేదా తెలియడం లేదు. వానాకాలం సీజన్ మొదలైంది. వ్యవసాయ పనులు చేసుకోవాలి. ధాన్యం అమ్మితే తప్ప పెట్టుబడికి డబ్బులు లేవు. త్వరగా ధాన్యం కొంటే మా కష్టాలు తీరు తాయి..’’ అని శ్రీను ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వానలకు తడవడంతో ధాన్యం బస్తాల నుంచి వచ్చిన మొలకలివి. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మైసిరెడ్డిపల్లికి చెందిన రైతు కాటం రమేశ్.. 45 రోజుల కింద మండల కేంద్రం లోని కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చాడు. 10 రోజుల కింద 150 బస్తాలు తూకం వేశారు. ఇంకా మిల్లుకు పంపలేదు. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వానలతో ధాన్యం తడిసి మొలకెత్తింది. కొనుగోలు కేంద్రంలో తూకం వేసినా మిల్లులకు తరలించేదాకా రైతులదే బాధ్యత అని చెప్పారు. మిల్లులు మొలకెత్తిన ధాన్యం తీసుకుంటారా లేదా అన్నది అనుమానమేనని.. ఎంత తరుగు తీస్తారో అర్థం కావడం లేదని రమేశ్ ఆందోళన చెందుతున్నారు. ఈ ఫొటోలోని రైతు బత్తుల బాలయ్య. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూలక్షి్మపురం. గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో 224 బస్తాల ధాన్యం తూకం వేసి నెలన్నర దాటింది. మిల్లుకు తరలించడానికి లారీలు రాకపోవడంతో రోజూ ధాన్యం వద్ద కాపలా ఉండాల్సి వస్తోంది. వానలకు ధాన్యం తడుస్తోంది. చీడపీడల నుంచి కాపాడుకున్న పంట చివరకు ఇలా ఆగమవుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నామని బాలయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వాన.. దెబ్బకొట్టింది వాన పడిన ప్రతిసారీ ధాన్యాన్ని ఆరబెట్టాల్సి వస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో, కల్లాల్లో నీళ్లు నిలుస్తుండటంతో.. ధాన్యం రాశుల అడుగున మొలకలు వస్తున్నాయి. ధాన్యం రంగు మారుతోంది. తేమ ఎక్కువగా ఉంటోంది. తేమ శాతం తగ్గేందుకు ధాన్యాన్ని ఆరబెడితే.. మళ్లీ వానలు కురిసి తడిసిపోతోంది. మార్కెట్.. కడుపుకొట్టింది రైతులు ధాన్యాన్ని తీసుకెళ్తే తేమ ఎక్కువగా ఉందని, రంగు మారిందని చెప్తూ కొనుగోలు చేయడం లేదు. దీంతో రోజులకు రోజులు అక్కడే ఎదురుచూడాల్సి వస్తోంది. ఒకవేళ తూకం వేసినా మిల్లులకు తరలించేందుకు లారీల కొరత వేధిస్తోంది. లారీ దొరికి ధాన్యాన్ని మిల్లులకు తీసుకెళ్లినా తేమ, రంగు, తాలు అంటూ కొర్రీలు పెట్టి తిప్పి పంపుతున్నారు. తీసుకుంటే.. బస్తాకు కిలో నుంచి మూడు కిలోల దాకా కోత పెడుతున్నారు. చివరికి.. మట్టి మిగిలింది వానలకు కొట్టుకుపోయి, ఆరబెట్టి ఎత్తినప్పుడల్లా కొంత ధాన్యం పోతోంది. కొనుగోలు కేంద్రాల్లో, మిల్లుల్లో ఏదో ఓ కారణం చెప్పి కోత పెడుతుండటంతో రైతులు మరింత నష్టపోతున్నారు. ఇంతా జరిగి సొమ్ము చేతికొచ్చేసరికి జాప్యం జరుగుతోంది. ఆలోగా పెట్టుబడికోసం చేసిన అప్పులపై మిత్తీలు పెరిగిపోతున్నాయి. చివరికి రైతుకు మట్టే మిగులుతోంది. ఇన్నితిప్పలు ఎప్పుడూ పడలే... నాలుగెకరాల్లో వరి వేసిన. కోతలు అయినంక నెలన్నర కిందనే ఊరిలోని కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచి్చన. 15 రోజుల కిందనే కాంటా వేశారు. లారీలు లేవని మిల్లుకు పంపడం లేదు. వానలతో ధాన్యం తడిచిపోతూనే ఉంది. బస్తాల్లో కింది నుంచి మొలకెత్తుతోంది. ధాన్యం మిల్లుకు చేరితేనే కొనుగోలు చేసినట్టు రసీదు ఇస్తున్నరు. ఇట్లా మిల్లుకు వెళ్తే ఒక్కో బస్తాకు ఎంత తరుగు తీస్తారో. ఇన్ని తిప్పలు ఎప్పుడూ పడలే.. – ఈర్ల కాటయ్య, ముత్యాలగూడెం, ఖమ్మం జిల్లా ఎన్నడూ లేనంతగా ధాన్యం కొన్నాం.. ఈసారి ధాన్యం కొనుగోలు లక్ష్యం 80 లక్షల టన్నులైతే.. ఇప్పటికే 76 లక్షల టన్నులు సేకరించాం. లక్ష్యానికి మించి 85 లక్షల టన్నుల వరకు సేకరించేందుకూ ఏర్పాట్లు చేశాం. ఇందుకోసం రూ. వెయ్యి కోట్ల రుణం కోసం బ్యాంకులతో మాట్లాడుతున్నాం. ఎన్నడూ లేనట్టు రికార్డు స్థాయిలో ధాన్యం కొన్నాం. – మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అన్నదాత కష్టాలు..తడిసి మోపెడు
ఈ ఫొటోలోని రైతు పేరు మట్టు యాదయ్య. ఈయనది నల్లగొండ జిల్లా జి.చెన్నారం గ్రామం. ఈ యాసంగిలో పండిన 10 ట్రాక్టర్ల ధాన్యాన్ని గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రానికి ఏప్రిల్ 10న అమ్మకానికి తీసుకువచ్చాడు. ధాన్యంపై కప్పేందుకు 20 పట్టాలు అద్దెకు తీసుకున్నాడు. ఒక్కో పట్టాకు రోజుకు రూ.20 అద్దె. ఇలా రోజుకు రూ.400 అద్దె కడుతున్నాడు. ఇప్పటికి 37 రోజుల వుతోంది. తేమ శాతం చూసి పెట్టారు. కానీ కొనడం లేదు. ఈయన కంటే ముందు 50 మంది రైతులు ఉన్నారు. వారం దరివీ కొన్న తరువాతనే కొంటామని చెప్పడంతో కేంద్రం వద్ద పడిగాపులు పడుతున్నాడు. పట్టాల అద్దె ఇప్పటివరకు రూ.14 వేలకు పైగా చెల్లించాడు. ‘ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకుందామంటే ఇన్ని కష్టాలా? ఏం చేయాలో పాలు పోవడం లేదు..’అంటూ యాదయ్య వాపోతున్నాడు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో ఎన్న డూ లేనంతగా జరిగిన యాసంగి పంటల సాగు సంబురం రైతుల కళ్లల్లో ఏమాత్రం కన్పించడం లేదు. ఆరుగాలం శ్రమించి సాగు చేయడం ఒక ఎల్తైతే, పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు కూడా అన్నదాతలు అష్ట కష్టాలూ పడుతున్నారు. ధాన్యం సేకరణలో జరుగుతున్న జాప్యం, సేకరించిన తర్వాత రవాణాకు వాహనాలు లభించక ధాన్యాన్ని తరలించలేని పరిస్థితులు, భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) విధించిన కఠిన నిబంధనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరోవైపు అకాల వర్షాలు, ఇవి చాలదన్నట్టుగా ముంచుకొచ్చిన తుపాను.. వెరసి రైతులకు కడగండ్లనే మిగులుస్తున్నాయి. మరో పదిహేను రోజుల్లో పూర్తి స్థాయి వానాకాలం మొదలుకానున్నా.. ఇంతవరకు యాభై శాతం ధాన్యం సేకరణ కూడా పూర్తి కాకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. లక్ష్యం చేరని సేకరణ ప్రభుత్వమే ధాన్యం కొనుగోళ్లు జరుపుతుందన్న ప్రకటనలో జరిగిన జాప్యం మొదలు.. ప్రస్తుతం ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు, అన్నీ కలిసి రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. రాష్ట్రంలో ధాన్యం సేకరణ చురుగ్గా ముందుకు కదలడం లేదు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 54 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. కనీసంగా 1.30 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు. ఇందులో 94.81 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు ప్రణాళిక వేశారు. ఇందుకోసం 7,204 కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించగా, 6,700 కేంద్రాలను తెరిచారు. వీటి ద్వారా సుమారు 2 లక్షలకు పైగా రైతుల నుంచి ఇప్పటివరకు సుమారు 40 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం సేకరించారు. మరో 54 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం సేకరించాల్సి ఉంది. ఇప్పటికి 40 రోజులుగా సాగుతున్న సేకరణలో రోజుకు లక్ష టన్నుల మేర సేకరణ జరుగుతోంది. ఈ లెక్కన మిగతా సేకరణకు మరో నెలన్నర రోజులు పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే అకాల వర్షాలతో రైతులు ఆగమాగం అవుతుండగా, జూన్‌లో మళ్లీ వర్షాలు మొదలైతే ధాన్యాన్ని అమ్ముకోవడం మరింత కష్టతరం కానుంది. పూర్తిస్థాయిలో వర్షాలు మొదలైతే పెట్టుబడి కూడా దక్కక తాము అప్పులపాలు కావాల్సిందేనని రైతులు అంటున్నారు. అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి జగిత్యాల జిల్లాలో 6.50 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు గాను ఇంతవరకు 2.50 లక్షల టన్నులు, నిజామాబాద్‌లో 8 లక్షల టన్నులకు గాను 5 లక్షల టన్నులు, ఖమ్మంలో 4.5 లక్షల టన్నులకు గాను 2 లక్షల టన్నులు, యాదాద్రిలో 4.7 లక్షల టన్నులకు గాను 1.9 లక్షల టన్నులు, సిద్దిపేటలో 5.46 లక్షల టన్నులకు గాను 1.6 లక్షల టన్నుల ధాన్యం సేకరణే జరిగింది. ఈ జిల్లాల్లో అకాల వర్షాల కారణంగా ధాన్యం సేకరణ ఆలస్యమవుతోంది. తరుగు పేరిట గొరిగేస్తున్నారు.. మరోవైపు ఎఫ్‌సీఐ నిబంధనలంటూ పౌర సరఫరాల శాఖ నాణ్యత విషయంలో వ్యవహరిస్తున్న కఠిన వైఖరి రైతులకు ఇక్కట్లు తెచ్చిపెడుతోంది. తేమ 17 శాతం మించకుండా చూసుకోవడంతో పాటు తాలు.. చెత్త ఒక శాతం, మట్టి పెడ్డలు, రాళ్లు ఒక శాతం, చెడిపోయిన, రంగు మారిన, మొలకెత్తిన ధాన్యం 5 శాతం, పూర్తిగా పరిపక్వత చెందని ధాన్యం 3 శాతానికి మించి ఉండకూడదన్న ఎఫ్‌సీఐ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశించింది. దీంతో నాణ్యత లేని ధాన్యాన్ని కేంద్రాల్లో తూకం వేయడం లేదు. ప్రస్తుతం అకాల వర్షాల నేపథ్యంలో తేమ 20 శాతానికి పైగానే ఉంటోంది. దీన్ని పగలంతా ఆరబెట్టి రాత్రికి కుప్పలు చేస్తే, మళ్లీ వర్షం పడటంతో తేమ శాతం మళ్లీ పెరుగుతోంది. చాలా చోట్ల టార్పాలిన్ల కొరత రైతుల్ని వేధిస్తోంది. రోజుకు రూ.20 చొప్పున నాలుగైదు టార్పాలిన్లు అద్దెకు తెచ్చి కుప్పలను కప్పుతున్నా తేమ శాతం తగ్గకపోవడం, ధాన్యం రంగుమారడం జరుగుతోంది. ఎలాగో ధాన్యాన్ని తూకం వేసినా క్వింటాల్‌కు కనీసంగా తరుగు పేరిట నాలుగు నుంచి 5 కిలోలు తీసేస్తున్నారు. మిల్లు వద్ద నాణ్యత పేరిట మరో రెండు కిలోలు తరుగు తీస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వేధిస్తున్న వాహనాల సమస్య కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని తరలించేందుకు అవసరమైన మేర లారీలు, డీసీఎంలు లేకపోవడం సమస్యగా మారుతోంది. ఒకేసారి పంట కోతకు రావడం, కుప్పలుగా ధాన్యం కేంద్రాలకు రావడంతో అక్కడి నుంచి కేంద్రానికి కేటాయించిన ఐదారు లారీల ద్వారా తరలింపు ఆలస్యమవుతోంది. బిహార్, యూపీలకు చెందిన హమాలీలు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవడం, కరోనా కారణంగా స్థానిక కూలీలెవరూ పనికి ముందుకు రాకపోవడంతో లోడింVŠ ప్రక్రియ జాప్యం అవుతోంది. ఇక మిల్లుల వద్ద అన్‌లోడింగ్‌లోనూ సమస్య ఎదురవుతోంది. దీంతో మిల్లుల వద్ద వాహనాలు బారులు కడుతున్నాయి. దీన్ని నివారించేందుకు స్థానికంగా ఏ వాహనం అందుబాటులో ఉంటే దాన్ని వాడుకోవాలని చెబుతున్నా, లాక్డౌన్ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 10 తర్వాత పెట్రోల్ బంకులు మూసి వేస్తుండటంతో వాహనాలు సమకూర్చేందుకు యజమానులు ముందుకు రావట్లేదు. లారీలు వస్తలేవంటున్నరు మూడు ఎకరాల్లో వరి సాగు చేసిన. కోత కోసి ఊరిలోనే కేంద్రానికి తీసుకొస్తే పది రోజులు అవుతున్నా కొంటలేరు. అడిగితే లారీలు వస్తలేవంటున్నరు. వానొస్తే ధాన్యం తడిచిపోతాది. టార్పాలిన్లు అడిగితే ఇస్తలేరు. నేనే బయట ఎక్కువ రేటు పెట్టి కొనుక్కొచ్చిన. తొందరగా కొనేటట్టు చూడాలె. – మల్లేశం, చాట్లపల్లి, సిద్దిపేట జిల్లా తాలు పేరుతో దోచుకుంటున్నారు.. రెండెకరాల్లో పండిన 40 క్వింటాళ్ల ధాన్యాన్ని మందపల్లి పీఏసీఎస్ కేంద్రానికి 10 రోజుల క్రితం తీసుకువచ్చాను. కుప్పలు పోసి ప్యాడీ క్లీనర్లు తూర్పారబట్టిన తర్వాత ఆరు రోజులకు గన్నీ సంచులు ఇచ్చారు. తర్వాత రెండ్రోజులకు కాంటా పెట్టిండ్రు. తూర్పారపట్టినా కూడా మిల్లు వాడు నలభై కిలోల బస్తాకు మూడు కిలోల ధాన్యాన్ని తీసుకున్నాడు. మొత్తం మీద నాకు క్వింటాకు 5 కిలోల తరుగు నష్టం జరిగింది. – అజ్మీర్ రాములు, రాజ్యాతండా, దుగ్గొండి మండలం, వరంగల్ రూరల్ జిల్లా 40 రోజులుగా పడిగాపులు నా పొలంలో 320 బస్తాల వడ్ల దిగుబడి వచ్చింది. అమ్ముదా మని కూసుమంచిలోని కొనుగోలు కేంద్రానికి 40 రోజుల కిందట తీసుకొచ్చిన. ఇప్పటివరకు 170 బస్తాలు కాంటా వేశారు. 150 బస్తాలు మిగిలే ఉన్నాయి. కాంటా వేసిన ధాన్యం ఎగుమతి కాలేదు. కొనుగోలు కేంద్రంలోనే పడిగాపులు కాస్తున్నా. వర్షాలు, గాలిదుమారాలు వస్తుంటే భయంగా ఉంది. ధాన్యం తడిస్తే రంగు మారిందని తరుగు తీస్తున్నారు. – వడ్త్యి నాగేశ్వరరావు, గంగ బండతండా, ఖమ్మం జిల్లా ఈ ఫొటోలోని రైతు.. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గౌరాయపల్లికి చెందిన నరెడ్ల అంజిరెడ్డి. 3 ఎకరాల్లో వరి సాగుచేస్తే దాదాపు 75 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. గ్రామంలోని కొనుగోలు కేంద్రానికి ఆరు ట్రాక్టర్లలో తరలించాడు. కానీ అక్కడ ధాన్యం ఆరబోయడానికి వసతులు లేవు. టార్పాలిన్ కవర్లు అందుబాటులో లేకపోవడంతో 10 టార్పాలిన్ కవర్లు అద్దెకు తీసుకువచ్చాడు. ఇంత చేసినా వర్షం కురవడంతో రంగు మారిపోయింది. రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అంటున్నాడు. ఈమె పేరు ఎల్లోబోయిన సమ్మక్క (జనగామ జిల్లా చీటకోడూరు గ్రామం). ఐదున్నర ఎకరాల్లో వరిసాగు చేశారు. 120 బస్తాల దిగుబడి వచ్చింది. జనగామలో ప్రభుత్వ కొనుగోలు సెంటర్‌కు 11 రోజుల కింద తీసుకొచ్చారు. అకాల వర్షాలకు రెండుసార్లు ధాన్యం తడిసిపోయింది. ధాన్యం ఆరబోసేందుకు రోజుకు రూ.వెయ్యి ఖర్చయ్యింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన రైతు నిమ్మల జయపాల్‌రెడ్డి రెండెకరాలు కౌలుకు తీసుకుని వరి సాగుచేశాడు. అకాల వర్షానికి తడిసి ధాన్యం రంగు మారింది. మిల్లర్ల వద్దకు చేరిస్తే క్వింటాకు 7.30 కేజీల చొప్పున తరుగు తీశారు. తరుగును రైతులు అంగీకరిస్తేనే కొనుగోలు జరుగుతోందని చెప్పాడు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన పెంటప్ప 15 ఎకరాల పొలంలో వరి సాగు చేశాడు. పంట కోశాక గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో విక్రయించేందుకు వెళ్లాడు. అయితే అక్కడ ధాన్యం నిల్వ చేసేందుకు వసతులు లేకపోవడంతో యాలాల మండలం లక్ష్మీ నారాయణపూర్ వద్ద రైస్ మిల్లులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి మొత్తం 900 ధాన్యం బస్తాలను తరలించాడు. కానీ అక్కడి నిర్వాహకులు ధాన్యంలో తాలు ఉందని, క్వింటాలుకు 10 కిలోల తరుగు తీసి వేస్తామని చెప్పడంతో ధాన్యం బస్తాలను తిరిగి గ్రామానికి తీసుకొని వెళ్లాడు. రైస్ మిల్లులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం అధికార పార్టీకి చెందిన మండల ప్రజా ప్రతినిధిది కావటం గమనార్హం. ఈయన మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం నాగారం గ్రామానికి చెందిన రైతు. పేరు వెంకట్రామిరెడ్డి. తనకున్న రెండున్నర ఎకరాల్లో వరి సాగు చేశాడు. 210 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రభుత్వం అందించే మద్దతు ధరకు అమ్ముకుందామనే ఉద్దేశంతో స్థానిక పీఏసీఎస్ సెంటర్‌కు తీసుకొచ్చి విక్రయించాడు. అయితే ధాన్యం సేకరించి రెండు మూడు రోజులు గడిచినా లారీల కొరతతో కేంద్రం సిబ్బంది ఆ ధాన్యాన్ని మిల్లుకు తరలించలేదు. వర్ష సూచన, ధాన్యంపై కప్పడానికి టార్పలిన్ కవర్లు అందుబాటులో లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బస్తాకు రూ.20 చెల్లించి ప్రైవేట్ వాహనాలలో మిల్లు వద్దకు తరలించారు. ఇంతా చేస్తే అక్కడ ధాన్యం దించడానికి వారం సమయం పట్టింది. వాహనాల యజమానులు వెయిటింగ్ చార్జీ కింద రోజుకు రూ.400 వసూలు చేశారు. నిబంధనల ప్రకారం 40 కిలోల బస్తాకు బస్తా బరువు కలుపుకొని 40.600 గ్రాములు తూకం వేయాలి. కానీ తరుగు, తేమ అంటూ మిల్లర్ల పేరిట కొనుగోలు సెంటర్లోనే బస్తాకు అదనంగా 600 గ్రాములు చొప్పున క్వింటాల్‌కు కిలోకు పైగానే ధాన్యం తరుగు తీశారు. తర్వాత లారీల కొరత, రైసుమిల్లులో ధాన్యం దించడానికి వెయిటింగ్ ఇలా వారం నుండి పది రోజులు çసమయం గడవడంతో గింజ బరువు తగ్గి తూకంలో తేడా వచ్చింది. దీంతో మిల్లర్లు మళ్ళీ కిలోకు పైగా ధాన్యం తరుగు తీశారు. ఇంత దోపిడీ జరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదని వెంకట్రామిరెడ్డి వాపోయాడు. రెండున్నర ఎకరాలు పంట సాగుకు దాదాపు రూ.80 వేలు, ధాన్యం రవాణా ఖర్చు రూ.6 వేలు అయ్యిందని, ధాన్యం అమ్మితే వచ్చే డబ్బులు పెట్టుబడికే సరిపోయి నట్టయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ధాన్యం రవాణాకు సరిపడినన్ని లారీలు, ఇతర వాహనాలు లేక రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యంతో వేచి చూడాల్సి వస్తోంది. వర్షాలతో తేమ 17 శాతం మించకుండా చూడటం కష్టమవుతోంది. ఈ తేమ తగ్గేందుకు ఆరబెడుతున్నా, మళ్లీ వర్షాలు వస్తుండటంతో మళ్లీ ఆరబెట్టాల్సి వస్తోంది. ఈ క్రమంలో ధాన్యం రంగుమారినా, ఆరబెట్టే క్రమంలో పెళ్లలు వచ్చినా క్వింటాల్‌కు 3–4 కిలోలు తరుగు పోతోంది. మిల్లుల్లోనూ కోత పెడుతున్నారు. వాస్తవానికి కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం వెళ్లాక రైతుకు సంబంధం ఉండొద్దు. కానీ అక్కడ నాణ్యతను సాకుగా చూపి మొత్తం తూకంలో మళ్లీ కోత వేస్తున్నారు. హమాలీల కొరతతో కేంద్రాల వద్ద లోడింగ్, మిల్లుల వద్ద అన్లోడింగ్ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. టార్పాలిన్లు, మిల్లుల వద్ద వెయిటింగ్ చార్జీలు తడిసి మోపెడవుతు న్నాయి. ఒక్క టార్పాలిన్కు రూ.20 వరకు అద్దె ఉంటోంది. ఒక రైతుకు కనీసం పది టార్పాలిన్లు అవసరం అవుతున్నాయి. -
విషాదం నింపిన వన భోజనం
నిజామాబాద్ : వన భోజన సంబురం ఒక కుటుంబంలో విషాదాన్ని నింపింది. భోజనాల అనంతరం పాత్రలు శుభ్రం చేస్తుండగా వాగులో కొట్టుకుపోయిన పాత్ర కోసం దిగిన కవల సోదరులిద్దరూ గల్లంతయ్యారు. మోర్తాడ్ మండలంలో గురువారం చోటుచేసుకున్న సంఘటన వివరాలిలా ఉన్నా యి. మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన పూల వ్యాపారి ఖుద్రత్ నలుగురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. కూతుళ్లు, అల్లుళ్లు, మనవలు, మనవరాళ్లు ఇంటికి రావడంతో వారితో సరదాగా గడిపేందుకు ఆయన గురువారం తన కుటుంబ సభ్యులను వనభోజనాల నిమిత్తం గాండ్లపేట్, దొన్కల్‌ల మధ్య ఉన్న పెద్ద వాగు పరిసరాలకు తీసుకువెళ్లాడు. భోజనాల అనంతరం కుటుంబ సభ్యులు పాత్రలను శుభ్రం చేసే క్రమంలో ఒక పా త్ర వాగులో పడిపోయింది. దానిని తీయడానికి కవల సోద రులు తాహెర్, తయ్యూబ్ ప్రయత్నించారు. ఈ క్రమంలో త య్యూబ్ వాగు ప్రవాహంలో కొట్టుకుపోయాడు. దీనిని గమ నించిన సోదరుడు తాహెర్ అతడిని కాపాడేందుకు యతి్నంచి, అతడూ గల్లంతయ్యాడు. వాగు ప్రవాహం ఎక్కువగా ఉండడంతో స్థానిక జాలరులు, గజ ఈతగాళ్లు ఎంత ప్ర యతి్నంచినా ఫలితం లేకపోయింది. గల్లంతైనవారి కోసం మూడు గంటలపాటు గాలించామని గాండ్లపేట్‌కు చెందిన గజ ఈతగాడు మనోజ్ తెలిపారు. ఇసుక, నాచు ఎక్కువగా ఉన్నాయని, వాటిలో ఇరుక్కుపోయి ఉంటారన్నారు. ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాసులు, ఏసీపీ రఘు, భీమ్‌గల్ సీఐ సైదయ్య, మోర్తాడ్ తహసీల్దార్ శ్రీధర్, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై సంపత్‌కుమార్‌లు గురువారం రాత్రి వరకు గాలింపు చర్యలను పర్యవేక్షించారు. గల్లంతైన వారి కోసం ప్రత్యేక బృందాన్ని రప్పిస్తున్నారు. వాగు ప్రవాహంలో కొట్టుకపోతే వారిని గుర్తించడానికి పాలెం, ధర్మోరాల మధ్య ఉన్న చెక్‌డ్యాం వద్ద వలను ఏర్పాటు చేశారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. -
కాలువలో 8 కిలోమీటర్లు కొట్టుకుపోయి..
కలువాయి (నెల్లూరు జిల్లా): తెలుగుగంగ కాలువలో 8 కి.మీ కొట్టుకుపోయిన బాలిక ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి సమీపంలో గురువారం జరిగింది. కలువాయి గిరిజన కాలనీలో తన అవ్వతాతలతో కలిసి ఉంటున్న కంభంపాటి మౌనిక (9) గురువారం కాలనీకి సమీపంలోని తెలుగుగంగ కాలువ వద్దకు తన సోదరితో వెళ్లింది. అక్కడ ఆడుకుంటూ ఉండగా కాలువలో జారి పడింది. కాలువకు 11 వేల క్యూసెక్కులు నీటిని వదలడంతో నీటి ఉధృతికి కొట్టుకుపోసాగింది. ఆమె సోదరి ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పింది. కుటుంబీకులు వచ్చి గాలించినా మౌనిక ఆచూకీ లభించలేదు. (చదవండి: అరచేతిలో పోలీస్ స్టేషన్!) సమాచారం అందుకున్న కలువాయి ఎస్ఐ ఎం.ఆంజనేయులు తన సిబ్బందితో కలిసి కాలువ వెంబడి గాలించారు. బాలిక 8 కిలోమీటర్లు కొట్టుకుపోయి బాలాజీరావుపేట గ్రామ సమీపంలో కాలువపై వెళ్తున్న కత్తి కృష్ణయ్య అనే వ్యక్తిని చూసి కాపాడాలని కేకలు వేసింది. కృష్ణయ్య గ్రామస్తులకు, పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు అక్కడికి చేరుకునే సరికి గ్రామస్తులు తాళ్లు తీసుకుని వచ్చారు. కొండపోగు ప్రసాద్, మరికొందరు యువకులు, పోలీసులు తాళ్లువేసి మౌనికను లాగి ఒడ్డుకు చేర్చారు. (చదవండి: నటి శ్రావణి ఆత్మహత్య కేసు: గంటకో మలుపు) -
ఉప్పొంగిన వాగు; జాలర్లు స్పందించడంతో..
సాక్షి, ఖమ్మం: గత రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలూ పొంగిపొర్లుతున్నాయి. ఈక్రమంలో బోనకల్లు మండలం పెద్దబీరవళ్లి వద్ద వాగు శుక్రవారం ఉప్పొంగింది. అయితే, అటువైపుగా వెళ్తున్న కారు వరద ఉధృతికి కొట్టుకుపోయింది. రోడ్డు నుంచి వాగులోపడి కొట్టుకుపోతున్న కారు కొంతదూరంలో చెట్ల పొదల వద్ద నెమ్మదించడం.. అంతలోనే స్థానిక జాలర్లు స్పందించడంతో ప్రమాదం తప్పింది. హుటాహుటిన జాలర్లు కారు వద్దకు చేరుకుని అందులో ఉన్న నలుగురినీ సురక్షితంగా బయటకు లాగారు. (వీడియో: బైక్‌పై వచ్చి మొబైల్ స్నాచింగ్) -
కాలువలో ఎమ్మెల్యే పీఏ గల్లంతు
జగిత్యాలక్రైం : కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు పీఏ గిరీశ్ (38) ఎస్సారెస్పీ కెనాల్లో గల్లంతయ్యారు. ఆదివారం ఆయన జగిత్యాలకు చెందిన నలుగురు స్నేహితులతో కలసి అంతర్గాం శివారులో విందు చేసుకున్నారు. అనంతరం ఎస్సారెస్పీ కాలువలో స్నానం చేసేందుకు వెళ్లారు. అయితే నీటి ప్రవాహ వేగానికి గిరీశ్ కొట్టుకుపోయారు. ఆయనను రక్షించేందుకు స్నేహితులు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. ఈ విషయం తెలుసుకున్న జగిత్యాల రూరల్ పోలీసులు, ప్రత్యేక పోలీసు బృందం ఎస్సారెస్పీ ప్రధాన కాలువ వెంట గాలింపు చర్యలు చేపట్టారు. -
రాకపోకలు బంద్
కొయ్యూరు(పాడేరు): యూ.చీడిపాలెం పంచా యతీ కేంద్రానికి 14 కిలోమీటర్ల దూరంలో యర్రగొండ ఉంది. యర్రగొండ దాటగానే కాలువ ఉంటుంది. దీనిపై ఎప్పుడో నిర్మాణం చేసిన వంతెన రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. ఈ కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. ఈ కాలువ దాటి అటు తీగలమెట్ట, గంగవరం, నీలవరం, పాలసముద్రం, మర్రిపాకలు, జెర్రిగొంధి వెళ్తారు. ఇప్పుడు ఈ ఆరు గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. గతంలో ద్విచక్ర వాహనాలు లేదా జీపుల ద్వారా మర్రిపాకల వరకు వెళ్లేందుకు వీలుండేది. ఇప్పుడు నడచి వెళ్లడమే కష్టంగా మారింది. ఇక పలకజీడి నుంచి నీలవరం, గంగవరం వెళ్లేందుకు మార్గం ఉన్నా కాలువను దాటాలి. ఇటీవల కాలువపై చెట్టు కర్రను అడ్డంగా పెట్టి ఉంచారు. దానిపై నుంచి రేషన్ బియ్యం తీసుకువస్తున్న ధర్మయ్య అనే యువకుడు కాలువలో పడిపోయాడు. బియ్యం బస్తాపై ఆయన పడడంతో ఎలాంటి గాయాలు కాలేదు. లేకుంటే ప్రమాదం జరిగి ఉండేది. ఇప్పుడు రేషన్ సరకులను కూడా తీసుకెళ్లే అవకాశం లేదు. వర్షాలు తగ్గితేనే తిరిగి రాకపోకలు పునరుద్ధరించే వీలుంది. ప్రధానంగా కాలువల ఉధృతి తగ్గాల్సి ఉంది. పాడేరు ఐటీడీఏ అధికారులు ఈ సమస్యపై వెంటనే స్పందించి పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని ఆరు గ్రామాల గిరిజనులు కోరుతున్నారు. -
నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద విషాదం
సాక్షి, నల్గొండ : నాగార్జుసాగర్ డ్యామ్ వద్ద సోమవారం విషాదం చోటు చేసుకుంది. సాగర్ పర్యటనకు వచ్చిన ఓ వ్యక్తి నీటిలో గల్లంతయ్యాడు. సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో జలకళ సంతరించుకోవడంతో అధికారులు ప్రాజెక్టు గెట్లు తెరిచి.. నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో ఆ దృశ్యాలను చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు సాగర్ బాట పట్టారు. అయితే సాగర్ దిగువన శివాలయం ఘాట్ వద్ద కొందరు వ్యక్తులు ఈతకు దిగారు. అందులో ఓ వ్యక్తి నీటి ప్రవాహంలో చిక్కుకుపోయాడు. చాలా సేపు ఒడ్డుకు చేరేందుకు తీవ్రంగా యత్నించాడు. అయితే పై నుంచి ప్రవాహం అధికంగా ఉండటంతో అతను నీటి ఉధృతికి కొట్టుకుపోయాడు. పక్కన ఉన్నవారు కూడా చేసేది ఏమీ లేక ఉండిపోయారు. గల్లంతైన వ్యక్తిని జహీరాబాద్‌కు చెందిన నరసింహం(41)గా గుర్తించారు. అయితే ప్రమాదం జరగక ముందు నరసింహం తన స్నేహితులతో సరదాగా కలిసి ప్రాజెక్టు పరిసరాల్లో ఫొటోలు దిగారు. -
ట్రెండింగ్ వీడియో.. వరదల్లో బస్సు
మనాలి: ప్రకృతి విపత్తుకు ఎంతటివారైనా తలవంచాల్సిందే. అందుకు తాజా రుజువు ఈ వీడియో. నది ఒడ్డున నిలిపివుంచిన ఓ ప్రైవేటు లగ్జరీ బస్సు వరద ప్రవాహం ఉధృతికి కాగితం పడవలా కొట్టుకుపోయింది. ఈ ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలిలో ఆదివారం చోటు చేసుకుంది. బియాస్ నది ఒడ్డున నిలిపివుంచిన బస్సు వరద ధాటికి నీటిలో కొట్టుకుపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రమాద సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడం ప్రాణనష్టం తప్పింది. వరద ముప్పు గురించి ముందే హెచ్చరించినా బస్సు సిబ్బంది పెడచెవిన పెట్టారని స్థానికులు వెల్లడించారు. కాగా, శనివారం నుంచి కురుస్తున్న వర్షాలతో హిమాచల్ వాసులు కష్టాలు పడుతున్నారు. బియాస్ నదికి భారీగా వరద పోటెత్తడంతో భారీ సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. వర్షాల తీవ్రత దృష్ట్యా మంగళవారం కూడా 9 జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. జమ్మూకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లోనూ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా రాష్ట్రాల పాలకులు సూచించారు. -
వరదల్లో కొట్టుకుపోయిన బస్సు
-
వాగులో కొట్టుకుపోయిన కారు: ఆరుగురు గల్లంతు
-
వాగులో కొట్టుకుపోయిన కారు: ఆరుగురు గల్లంతు
- యువతి సహా ఐదుగురు చిన్నారులు గల్లంతు పిట్లం (నిజామాబాద్): వాగు దాటుతున్న కారు ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయిన ఘటనలో ఓ యువతి సహా ఐదుగురు చిన్నారులు గల్లంతయ్యారు. ఈ ప్రమాదం నుంచి కారు డ్రైవర్ తప్పించుకున్నాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా పిట్లం మండలం కారేగాం సమీపంలోని పిల్లివాగులో శనివారం చోటుచేసుకుంది. మెదక్ జిల్లాకు చెందిన వారు పిట్లం ఆస్పత్రికి వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. వరదలో కొట్టుకుపోతున్న కారులో నుంచి బయటపడిన డ్రైవర్ పక్కనే ఉన్న చెట్టును పట్టుకొని ప్రాణాలు కాపాడుకున్నాడు. ఇది గుర్తించిన గ్రామస్థులు తాడు సాయంతో అతన్ని రక్షించారు. కారులో ఉన్న ఐదుగురు చిన్నారులలో రెండేళ్ల కవలలు జ్ఞానహస్మిత, జ్ఞానసమిత, పది నెలల దీపాక్ష ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
వాగులో కొట్టుకుపోయి వ్యక్తి మృతి
ధారూరు (రంగారెడ్డి జిల్లా) : ధారూరు మండల కేంద్రం- చింతకుంట గ్రామానికి మధ్య ఉన్న ఓ వాగు దాటుతుండగా ప్రమాదం జరిగింది. ప్రవాహం ఎక్కువకావడంతో వాగు దాటుతున్న వ్యక్తి కొట్టుకుపోయాడు. మృతుడు చింతకుంట గ్రామానికి చెందిన సమ్మని మల్లయ్య(40)గా గుర్తించారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఆయన మృతదేహం ఓ చెట్టుకు తగులుకుని ఆగిపోయింది. -
మూసీ వరదలో 350 గొర్రెలు గల్లంతు
మిర్యాలగూడ రూరల్: మూసీ వరద నీటిలో 350 గొర్రెలు గల్లంతయ్యాయి. నల్లగొండ జిల్లా కేతేపల్లికి చెందిన గొర్రెల కాపరులు వేసవిలో మేత కోసం మిర్యాలగూడ పరిసర ప్రాంతాలకు వెళ్లారు. ఆదివారం రాత్రి మిర్యాలగూడ మండలం ముల్కల కాలువ గ్రామ పంచాయతీ సమీపంలో నదిలో బండరాళ్లపై గొర్రెలను నిలిపారు. ఉదయం వంట చేసుకునేందుకు నది ఒడ్డుకు రాగానే మూసీ పరివాహక ప్రాంతం పై భాగాన కురిసిన వర్షాలకు వచ్చిన భారీ వరదలో 1500 గొర్రెలు చిక్కుకున్నాయి. స్థానికులు గమనించి మూగజీవాలను కాపాడే ప్రయత్నం చేశారు. అందులో 1150 గొర్రెలను కాపాడగా 350 గొర్రెలు వరద ఉధృతికి నదిలో కొట్టుకుపోయాయి. -
వంతెన కూలి.. 20 మంది గల్లంతు
-
వరద నీటికి కొట్టుకుపోయిన చిన్నారి
-
వరద నీటికి కొట్టుకుపోయిన చిన్నారి
సీతమ్మధార (విశాఖపట్నం) : విశాఖ నగరంలో గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి వరదనీటిలో పడి ఓ చిన్నారి కొట్టుకుపోయింది. నగరంలోని సీతమ్మధార ప్రాంతానికి చెందిన అతిథి(6) అనే చిన్నారి.. ట్యూషన్‌కు వెళ్లి వస్తుండగా వర్షం నీటి ఉధృతికి డ్రైనేజీలో పడి కొట్టుకుపోయింది. చిన్నారి తల్లిదండ్రులు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తుండటంతో బాధితురాలు విశాఖలోని అమ్మమ్మగారి ఇంటి వద్ద ఉంటుంది. చిన్నారి ఆచూకీ కోసం ఫైర్ సిబ్బంది గాలిస్తున్నారు. -
వరద నీటిలో కొట్టుకుపోయిన బాలుడు
చీపురుపల్లి (విజయనగరం) : వాన నీటిలో ఆడుకునేందుకు వెళ్లిన ఓ బాలుడు వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. విజయనగరం జిల్లా చీపురుపల్లి పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. పాతగవిడి వీధికి చెందిన మీసాల పెంటయ్య, కవిటమ్మ దంపతుల చిన్న కుమారుడు జయప్రకాశ్(3) వాన వెలసిన తర్వాత నీళ్లలో ఆడుకునేందుకు వీధిలోని మురుగు కాలువ వద్దకు వెళ్లాడు. అంతలోనే వరద ఒక్కసారిగా పెరిగిపోవడంతో ప్రమాదవశాత్తు జయప్రకాశ్ అందులో పడి కొట్టుకుపోయాడు. కుటుంబసభ్యులు, గ్రామస్తులు బాలుడి కోసం నీళ్లలో గాలిస్తున్నారు. -
అసోంను ముంచెత్తుతున్న వరదలు
-
అసోంను ముంచెత్తుతున్న వరదలు
గౌహతి : అసోంలో వరదలు పోటెత్తాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వరదల కారణంగా ఒకరు మరణించినట్లు తెలుస్తోంది. బ్రహ్మపుత్ర, జై భారాలి నదులు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. బార్పేట, నల్బరీ, గోల్ పారా, లక్ష్మీపూర్ తదితర తొమ్మిది జిల్లాలో పరిస్థితి తీవ్రంగా ఉంది. తీవ్రంగా పంట నష్టం వాటిల్లింది. సుమారు 300 హెక్టార్లలో పంటలు నీటమునిగాయి. లక్ష్మీపూర్ జిల్లాలో ఒకరు కొట్టుకుపోయారు. అసోం రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటి వరకు 9 జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో వరద ముంచెత్తింది. దాదాపు 60వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. దీనిపై అసోం డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ అప్రమత్తమైంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పరిస్థితిని అంచనా వేస్తున్నామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే పరిస్థితి అదుపులోనే ఉందని, వరద ఉధృతి నుంచి గట్టెక్కేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని సీనియర్ అధికారి తెలిపారు. సహాయక క్యాంపుల ద్వారా ఆహారం తదితర వస్తు సామగ్రిని అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశామని తెలిపారు. కాగా రాబోయే రెండు రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. -
షాక్ నుంచి కోలుకోని విద్యార్థులు