Cloudburst At Himachal Pradesh Solan Houses Washed Away - Sakshi
Sakshi News home page

హిమాచల్ ప్రదేశ్‌లో జల ప్రళయం.. 29 మంది మృతి..

Published Mon, Aug 14 2023 11:30 AM | Last Updated on Mon, Aug 14 2023 3:30 PM

Cloudburst At Himachal Pradesh Solan Houses Washed Away - Sakshi

సిమ్లా: ఎడతెరిపిలేని వర్షాలతో హిమాచల్ ప్రదేశ్‌ వణికిపోతోంది. గతకొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు కూడా విరిగిపడుతున్నాయి. తాజాగా సోలాన్ జిల్లాలోని మామిసిఘ్ గ్రామంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. గత 24 గంటల్లో వివిధ ఘటనల్లో వర్షాల కారణంగా 29 మంది మరణించారని అధికారులు తెలిపారు. 

ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడి గ్రామంపైకి దూసుకొచ్చాయి. ఈ ఘటనలో రెండు ఇళ్లు, పశువుల పాకలు కూలిపోయాయి. ఏడుగురు మృతి చెందారు, మరో ఆరుగుర‍్ని రక్షించామని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సీఎం సుఖ్‌విందర్ సింగ్ సుఖూ సంతాపం తెలిపారు. ఘటనస్థలంలో సహాయక చర్యలు చెపట్టాలని అధికారులను ఆదేశించారు. 

తీవ్రంగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఆగష్టు 14న నిర్వహించనున్న పీజీ, బీఈడీ పరీక్షలను రద్దు చేశారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే వర్షాలతో రాష్ట్రంలో 257 మంది మృతి చెందారు. రూ.7,020 కోట్ల నష్టం జరిగిందని వెల్లడించారు. కాగా.. 32 మంది తప్పిపోయారు. 290 మంది గాయపడ్డారు. 

శివ మందిర్ కూలి..
గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో సిమ్లాలో శివ మందిర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. శ్రావణమాసం సందర్భంగా ప్రార్థనల కోసం భక్తులు గుమికూడారని సీఎం సుఖ్‌విందర్ సింగ్ సుఖూ తెలిపారు. ఈ క్రమంలో మందిరం కూలిపోగా.. భక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేస్తోంది. శిథిలాలను తొలగిస్తున్నారు. 

ఉత్తరాఖండ్‌లోనూ..

ఉత్తరాఖండ్‌లోనూ వర్షాలు ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి. దీంతో పలు నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. బాదల్ నది ప్రవాహాంలో డెహ్రాడూన్‌లోని మాల్దేవత ప్రాంతంలో ఉన్న డిఫెన్స్ కాలేజ్ కూలిపోయింది. ఈ దృశ్యాలు భీతికొల్పుతున్నాయి. కాగా.. రాష్ట్రంలో ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాలతో ఇప్పటివరకు 60 మంది మరణించారు. 17 మంది తప్పిపోయారు. 

వర్షాలతో తెహ్రీ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. రిషికేష్- చంభా జాతీయ రహదారిలో రాకపోకలు నిలిపివేశారు. రిషికేష్- దేవప్రయాగ జాతీయ రహదారిలో వాహనాలు ఎక్కడిక్కడే నిలిపివేశారు. 1,169 ఇళ్లు నేలమట్టమయ్యాయి. పంటపొలాలు ధ్వంసమయ్యాయి.  

ఇదీ చదవండి: Dwarka Expressway: ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే వ్యయంపై కాగ్‌ సంచలన వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement