- యువతి సహా ఐదుగురు చిన్నారులు గల్లంతు
పిట్లం (నిజామాబాద్): వాగు దాటుతున్న కారు ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయిన ఘటనలో ఓ యువతి సహా ఐదుగురు చిన్నారులు గల్లంతయ్యారు. ఈ ప్రమాదం నుంచి కారు డ్రైవర్ తప్పించుకున్నాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా పిట్లం మండలం కారేగాం సమీపంలోని పిల్లివాగులో శనివారం చోటుచేసుకుంది. మెదక్ జిల్లాకు చెందిన వారు పిట్లం ఆస్పత్రికి వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. వరదలో కొట్టుకుపోతున్న కారులో నుంచి బయటపడిన డ్రైవర్ పక్కనే ఉన్న చెట్టును పట్టుకొని ప్రాణాలు కాపాడుకున్నాడు. ఇది గుర్తించిన గ్రామస్థులు తాడు సాయంతో అతన్ని రక్షించారు. కారులో ఉన్న ఐదుగురు చిన్నారులలో రెండేళ్ల కవలలు జ్ఞానహస్మిత, జ్ఞానసమిత, పది నెలల దీపాక్ష ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
వాగులో కొట్టుకుపోయిన కారు: ఆరుగురు గల్లంతు
Published Sat, Oct 1 2016 3:53 PM | Last Updated on Wed, Aug 1 2018 3:59 PM
Advertisement
Advertisement