
సాక్షి, యాదాద్రి భువనగిరి: జిల్లాలోని రాజపేట మండలం, కుర్రారం గ్రామం దోసలవాగులో గల్లంతైన హిమబిందు మృతదేహం లభ్యమైంది. పారుపల్లి సమీపంలో మృతదేహం లభించింది. సింధూజ మృతదేహం లభించిన ప్రాంతానికి చేరువలోనే హిమబిందు మృతదేహం ఇసుకలో కూరుకుపోయి కనిపించింది. గల్లంతైన మూడు రోజులకు మృతదేహాలు లభ్యమవ్వడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
కాగా సోమవారం మధ్యాహ్నం వాగులో ఇద్దరు యువతులు సింధూజ, హిమబింధు కొట్టుకుపోయిన విషయం విదితమే ఇటుకలపల్లి వెళ్లి తిరిగి కుర్రారం గ్రామానికి వెళ్తుండగా వాగులో నీటి ప్రవాహనికి గల్లంతు అయ్యారు. వాగు దాటుతుండగా మధ్యలో స్కూటీ ఆగిపోవడంతో వాగు ఉదృతికి కొట్టుకుపోయారు.
Comments
Please login to add a commentAdd a comment