ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడాలో ఇయన్ హరికేన్ ప్రళయం సృష్టిస్తోంది. హరికేన్ ప్రతాపానికి ఫ్లోరిడా రాష్ట్రంలోని తీర ప్రాంత ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. భయానక గాలులు, కుండపోత వర్షాలతో ఇళ్లన్నీ నీటమునిగాయి ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. రోడ్లన్నీ మునిగిపోయాయి. ఇంటి ముందు పార్క్‌చేసిన వాహనాలన్నీ నీటిలో కొట్టుకుపోయాయి. 20 మంది వలసకారులతో కూడిన పడవ మునిగిపోవడంతో కొంతమంది అదృశ్యమైనట్లు యూఎస్ బార్డర్ పెట్రోలింగ్ అధికారులు తెలిపారు.
హరికేన్ పరిస్థితిని లైవ్‌లో ని వివరిస్తన్న రిపోర్టర్లు కొట్టుకొని పోయినంతపనైంది. వీధుల్లోకి షార్క్‌లు కొట్టుకొని వచ్చిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇయన్ హరికేన్ కారణంగా ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి ఇంటి గ్యారేజ్‌లో పార్క్ చేసిన ఓ ఖరీదైన కారు కొట్టుకుపోయింది. వరద ధాటికి కారు కొట్టుకుపోతున్న దృశ్యాలను స్వయంగా యాజమాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
మెక్‌లారెన్ కంపెనీకి చెందిన పీ1 సూపర్ కారు ఖరీదు అక్షరాలా 1 మిలియన్ డాలర్లు. ‘అంటే ఇండియాన్ కరెన్సీలో దాదాపు 8 కోట్లు). ఇంత ఖరీదైన లగ్జరీ నేపుల్స్ ప్రాంతంలో కారు వరద నీటిలో కట్టుకుపోయింది.ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇప్పటి వరకు వేలల్లో లైకులు వచ్చి చేరాయి. చాలా మంది నెటిజన్‌లు కొట్టుకుపోవడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు. ‘నన్ను క్షమించండి, ఇది చాలా బాధాకరం. ఇలా జరిగినందుకు చాలా చింతిస్తున్నాను. మీరు జాగ్రత్తగా ఉండాలి.. కారు పోతే మళ్లీ కొనుక్కోవచ్చు’ అంటూ కామెంట్ చేస్తున్నారు.
చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ ఐఏఎస్ అధికారికి మూడేళ్లు జైలు
Comments
Please login to add a commentAdd a comment