
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరద నీటితో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. బియాస్ నదిలో ప‍్రవాహం ప్రమాద స్థాయిని మించి పారుతోంది. దీని కారణంగా బియాస్ నది పక్కనే ఉన్న జాతీయ రహదారి కొట్టుకుపోయింది. రోడ్డుపైనే ప్రవాహం ఉద్ధృతంగా పారుతోంది. మరోవైపు ఎడతెరిపిలేని వర్షాలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో మండీ, కులు మధ్య రహదారిపైనే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
#WATCH | Portion of National Highway 3 washed away by overflowing Beas river in Kullu, Himachal Pradesh pic.twitter.com/c8gRsvSkt5
— ANI (@ANI) July 9, 2023
వర్షాల కారణంగా రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీటితో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. అటు బియాస్ నది ప్రవాహం కారణంగా జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడే నిలబడ్డాయి. వర్ష ప్రభావం అధికంగా ఉన్న ఏడు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. సిమ్లా, సిర్మౌర్, లాహుల్, స్పితి, ఛంబా, సోల్ జిల్లాల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
#WATCH | River Beas flows furiously in Himachal Pradesh's Mandi as the state continues to receive heavy rainfall pic.twitter.com/Wau6ZwLLue
— ANI (@ANI) July 9, 2023
రాష్ట్రంలో బియాస్ నదితో పాటు పలు నదుల్లో వరద నీరు ప్రమాద స్థాయిల్లో ప్రవహిస్తోంది. దీని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 133 మార్గాల్లో రాకపోకలను నిలిపివేశారు. జులై 11 వరకు శ్రీఖండ్ మహాదేవ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు కులు జిల్లా యంత్రాంగం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే రూ.322 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: Heavy Rains: హిమాచల్ ప్రదేశ్‌కు రెడ్ అలర్ట్..
Comments
Please login to add a commentAdd a comment