Telangana Rains: Car Washed Away in Floods At Warangal Video Goes Viral - Sakshi
Sakshi News home page

Warangal Viral Video: వరద ఉధృతికి కొట్టుకుపోయిన కారు..

Published Wed, Jul 13 2022 3:11 PM | Last Updated on Wed, Jul 13 2022 3:55 PM

Telangana Rains: Car Washed Away in Floods At Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత అయిదు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తాజాగా ములుగు జిల్లాల్లో ఓ కారు వరద నీటిలో కారు చిక్కుకుంది. మహమ్మద్ గౌస్‌పల్లి సమీపంలోని లోలేవల్ కల్వర్టు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. నల్లబెల్లికి చెందిన శంకర్ తన కొడుకుతో వరంగల్ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా కల్వర్టు వద్ద వరద ప్రవాహం తక్కువగా ఉందని కారును ముందుకు పోనిచ్చారు.

అయితే ప్రమాదవశాత్తు నీటి ఉధృతి ఎక్కువ అవ్వడంతో ప్రవాహంలో కారు పక్కకు కొట్టుకుపోయింది. వెంటనే స్థానికులు చూసి కారులో ఉన్న ఇద్దరిని కాపాడారు. దీంతో కారులో ఉన్న కారులోని తండ్రి కొడుకులకు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement