తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీలో సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో అధికారం ఎవరికి దక్కుతుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గవర్నర్ విద్యాసాగర్ రావు ఎవరికి అవకాశం ఇస్తారనే దానిపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పవర్ కోసం పోటీ పడుతుండగా గవర్నర్ ఎవరివైపు మొగ్గు చూపుతారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో గవర్నర్ ముందు నాలుగు మార్గాలున్నాయని నిపుణులు అంటున్నారు.