తమిళనాడులో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అందరిచూపు ఇంచార్జి గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావుపైనే ఉంది. ఆయన ఏం చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రతి కదలికను మీడియా ప్రముఖంగా చూపిస్తోంది. గురువారం మధ్యాహ్నం ముంబై నుంచి చెన్నైకు ఆయన వచ్చారు.