వచ్చే ఎన్నికల్లో అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో ఎన్డిఏ ప్రభుత్వం రానుందని మాజీ మంత్రి విద్యాసాగర్ రావు అన్నారు.
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో ఎన్డిఏ ప్రభుత్వం రానుందని మాజీ మంత్రి విద్యాసాగర్ రావు అన్నారు. ఎల్ బి స్టేడియంలో ఏర్పాటు చేసిన 'నవభారత యువభేరీ' బహిరంగ సభలో మోడీని నగర బిజెపి కమిటీ సత్కరించింది. ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు మాట్లాడుతూ రాష్ట్ర విడిపోయినప్పటికీ ఒక మోబైల్లో రెండు సిమ్ కార్డుల్లాగా తెలుగువారందరం కలసి ఉందామని చెప్పారు.
బిజెపి కార్యదర్శి మురళీధర రావు మాట్లాడుతూ పాక్ సైనికులు భారత సైనికులను హతమారుస్తున్నా ప్రధాని మన్మోహన్ సింగ్ మౌనంగా ఉన్నారని విమర్శించారు. మోడీ నాయకత్వంలో యువత మమేకమవుతోందని చెప్పారు.