సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన సి.హెచ్.విద్యాసాగర్ రావును ఈనెల 9న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సత్కరించనుంది. రాష్ట్రానికి చెందిన విద్యాసాగర్‌రావుకు గౌరవ పూర్వకంగా జరిపే ఈ సత్కార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హాజరుకానున్నారు. జలవిహార్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు తెలంగాణలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ప్రభుత్వం ఆహ్వానిస్తున్నట్లు సీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది.
9న మహారాష్ట్ర గవర్నర్‌కు టీ సర్కార్ సత్కారం
Published Thu, Nov 6 2014 1:35 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM
Advertisement
Advertisement