సాక్షి, చెన్నై: ఇన్‌ఛార్జి గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నమహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావుకు తమిళనాడు ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలికింది. ముఖ్యమంత్రి కె. పళనిస్వామి ఆధ్వర్యంలో గురువారం ఇక్కడి ఎయిర్‌పోర్టులో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం తదితరులు ఆయనను సన్మానించారు. అప్పటి గవర్నర్ కె. రోశయ్య పదవీ విరమణ చేసిన తర్వాత 2016 సెప్టెంబర్‌లో మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న విద్యాసాగర్‌రావు తమిళనాడు ఇన్‌చార్జి గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు.
తాజాగా కేంద్రం తమిళనాడు గవర్నర్‌గా బన్వరిలాల్ పురోహిత్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆయన శుక్రవారం ఉదయం 9.30 గంటలకు పదవీ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యాసాగర్‌రావుకు తమిళనాడు ప్రభుత్వం వీడ్కోలు పలికింది. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు ప్రత్యేక విమానంలో గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment