రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల సలహాదారు ఆర్.విద్యాసాగరరావు ఆరోగ్యం విషమంగా ఉంది.
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల సలహాదారు ఆర్.విద్యాసాగరరావు ఆరోగ్య పరిస్థితిపై కాంటినెంటల్ ఆస్పత్రి శుక్రవారం సాయంత్రం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఆయన ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని ఆస్పత్రి ఫౌండర్ చైర్మన్ డాక్టర్ గురు ఎన్.రెడ్డి తెలిపారు. ఎక్స్టెన్సివ్ మెటస్టాటిక్ బ్లాడర్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన వెంటిలేటర్ సాయంతో శ్వాస తీసుకుంటున్నారని వివరించారు.