విద్యాసాగర్‌రావు అంత్యక్రియలు అంబర్‌పేటలోని స్మశానవాటికలో నిర్వహించారు
హైదరాబాద్: మూత్రాశయ కేన్సర్‌తో బాధపడుతూ శనివారం కన్నుమూసిన తెలంగాణ నీటి పారుదల రంగ నిపుణుడు ఆర్.విద్యాసాగర్‌రావు అంత్యక్రియలు ఆదివారం ఉదయం 10.30 గంటలకు అంబర్‌పేటలోని శ్మశానవాటికలో పూర్తయ్యాయి.
తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. మంత్రులు తలసాని శ్రీనివాసరావు, హరీశ్‌రావు, ఎంపీలు మల్లారెడ్డి, బూర నర్సయ్యగౌడ్, ప్రజా గాయకుడు గద్దర్, అల్లం నారాయణ, వరవరరావు తదితరులు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు.