సాక్షి,హైదరాబాద్: నల్గొండకు తాము వ్యతిరేకం కాదని, నల్గొండ రైతులకు బీజేపీ అండగా ఉంటుందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్‌రెడ్డి అన్నారు. మూసీ ప్రక్షాళనలో పేదల ఇళ్లు కూల్చడానికి వ్యతిరేకంగా శనివారం(నవంబర్ 16) అంబర్‌పేట తులసీరామ్‌నగర్‌లో మూసీ నిద్ర కార్యక్రమంలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ‘ పేదల ఇల్లు కూల్చితే మూసీ ప్రక్షాళన జరగదు. కంపెనీల కాలుష్యం రాకుండా అడ్డుకోవాలి. రివర్ బెడ్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. కాలుష్యం కాకుండా ఏం చేయాలో తెలియదు. కృష్ణా నీళ్ళు తెస్తారా ? గోదావరి నీళ్ళు తెస్తారా ? ఏ విషయంలోనూ సీఎంకు క్లారిటీ లేదు.మూసీ సుందరీకరణ చేయాలి. మూసీ రిటైనింగ్ వాల్ కట్టండి.లక్షా యాభై వేల కోట్లకు అదనంగా నా జీతం ఇస్తా.
అవసరం అయితే ఇంటింటికీ చందాలు వసూలు చేసి ఇస్తాం.నిజాంకు భయపడలేదు..నీకు భయపడతామా. బుల్డోజర్‌కు భయపడం.పేదలు సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్తానంటే అడ్డుకోము. ఇళ్లు కూలగొట్టే పద్ధతి మంచిది కాదు. ఒక కేంద్ర మంత్రిగా..ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చెబుతున్నా..ఇల్లు కూల్చే కార్యక్రమాన్ని విరమించుకోవాలని మనస్పూర్తిగా కోరుతున్నా. వారం రోజులు ఇళ్ళల్లో పనిచేస్తే ఎంత జీతం వస్తుందో అంత మొత్తం మూసీ ప్రక్షాళనకు పేదలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.
ముఖ్యమంత్రి మాట్లాడే భాష పద్ధతిగా లేదు.మూసీ పక్కన మట్టి పోస్తూ అక్రమిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి. వైఎస్సార్ ఉన్నప్పుడే ఇక్కడ రోడ్లు వేశాం.వైఎస్సార్ ఉన్నప్పుడే ఇక్కడ ఇంగ్లీష్ మీడియా స్కూల్ కట్టాం. వైఎస్సార్ ఉన్నప్పుడే అంబర్ పేటలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.పేద ప్రజలను రెచ్చగొట్టాలని లేదు.
ముఖ్యమంత్రిని విమర్శించాలని లేదు. రాజకీయంగా చూడవద్దు..ప్రజల తరఫున..ప్రజల కోసం..ప్రజలు చేస్తున్న ఉద్యమం ఇది.ప్రజలు చేస్తున్న కార్యక్రమంలో బీజేపీ పాల్గొన్నది.ఎంత మందిని జైల్లో వేస్తావో..ఎంత మందిని తొక్కిస్తావో చూద్దాం.ప్రతి అడ్డమైనవాడు విమర్శలు చేస్తున్నారు..ప్రజల కోసం భరిస్తాం’అని కిషన్‌రెడ్డి అన్నారు.
ఇదీ చదవండి: కిషన్‌రెడ్డి అసలు తెలంగాణ బిడ్డేనా: మంత్రి పొన్నం
Comments
Please login to add a commentAdd a comment