
సాక్షి,హైదరాబాద్:పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుని బీజేపీ నాయకులు మూసీ నిద్ర కార్యక్రమం చేశారని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. ఈ మేరకు ఆదివారం(నవంబర్17) మీడియాతో మాట్లాడారు.‘నిర్వాసితుల సమస్యలు నిజంగా తెలుసుకోవాలనుకుంటే ఆలౌట్లు,మస్కిటో కాయిల్స్ అవసరమా..? కిషన్‌రెడ్డి నిజాయితీగా నిద్రకు వెళితే మూసీ రివర్‌బెడ్‌లో నివసించే వారి కష్టాలు తెలిసేవి.
కలుషితమైన నీరు,గాలి మధ్య వారంతా దుర్భర జీవితం గడుపుతున్నారు. మూసీ నిర్వాసితుల కష్టాలు తెలవాలంటే అక్కడికి వెళ్లి ఉండాలని సీఎం అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై నిందలు వేస్తే మహారాష్ట్రలో ఓట్లు వస్తాయని మూసీ నిద్ర ఎంచుకున్నారు.మంచి నీరు,మంచి వాతావరణం కల్పించాలని ప్రభుత్వం చూస్తోంది.
ఓట్లు వేసి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే ప్రక్షాళన అడ్డుపడుతున్నారు.గోడలు కడితే సరిపోతుంది అంటూ బీజేపీ నాయకులు అంటున్నారు.డీపీఆర్ వచ్చాక గోడలు కట్టాలో ఇంకేమైనా చెయ్యాలా అనేదానిపై సలహాలు ఇవ్వండి’అని శ్రీధర్‌బాబు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment