criticise
-
మూసీ నిద్రకు ఆలౌట్లు,మస్కిటో కాయిల్స్ అవసరమా?: మంత్రి శ్రీధర్‌బాబు
సాక్షి,హైదరాబాద్:పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుని బీజేపీ నాయకులు మూసీ నిద్ర కార్యక్రమం చేశారని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. ఈ మేరకు ఆదివారం(నవంబర్17) మీడియాతో మాట్లాడారు.‘నిర్వాసితుల సమస్యలు నిజంగా తెలుసుకోవాలనుకుంటే ఆలౌట్లు,మస్కిటో కాయిల్స్ అవసరమా..? కిషన్‌రెడ్డి నిజాయితీగా నిద్రకు వెళితే మూసీ రివర్‌బెడ్‌లో నివసించే వారి కష్టాలు తెలిసేవి.కలుషితమైన నీరు,గాలి మధ్య వారంతా దుర్భర జీవితం గడుపుతున్నారు. మూసీ నిర్వాసితుల కష్టాలు తెలవాలంటే అక్కడికి వెళ్లి ఉండాలని సీఎం అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై నిందలు వేస్తే మహారాష్ట్రలో ఓట్లు వస్తాయని మూసీ నిద్ర ఎంచుకున్నారు.మంచి నీరు,మంచి వాతావరణం కల్పించాలని ప్రభుత్వం చూస్తోంది.ఓట్లు వేసి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే ప్రక్షాళన అడ్డుపడుతున్నారు.గోడలు కడితే సరిపోతుంది అంటూ బీజేపీ నాయకులు అంటున్నారు.డీపీఆర్ వచ్చాక గోడలు కట్టాలో ఇంకేమైనా చెయ్యాలా అనేదానిపై సలహాలు ఇవ్వండి’అని శ్రీధర్‌బాబు సూచించారు. -
నిర్మలాసీతారామన్‌పై స్టాలిన్ మండిపాటు
చెన్నై: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌పై తమిళనాడు సీఎం స్టాలిన్ మండిపడ్డారు. ఆమెది అహంకారమని,ఆమె తీరు సరిగా లేదని విమర్శించారు. ఇటీవల కోయంబత్తూరులో జీఎస్టీపై జరిగిన సమావేశంలో ఓ రెస్టారెంట్ చైన్ యజమాని శ్రీనివాసన్ నిర్మలాసీతారామన్‌ను ప్రశ్నించారు.జీఎస్టీలోని లోపాలను ఎత్తి చూపేందుకు బన్, క్రీమ్, క్రీమ్ బన్‌లపై విధిస్తున్న జీఎస్టీ పన్నును సోదాహరణంగా వివరించారు.ఇది అక్కడ సమావేశంలో ఉన్నవారికి నవ్వు తెప్పించింది. దీంతో అక్కడున్నవారంతా విరగబడి నవ్వారు. ఏమైందో తెలియదు కానీ ఆ తర్వాత జరిగిన ప్రైవేట్ భేటీలో శ్రీనివాసన్ నిర్మలకు క్షమాపణ చెబుతున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. దీనిపై ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీతో సహా దేశవ్యాప్తంగా పలువురు విపక్ష నేతలు నిర్మలపై విమర్శలు గుప్పించారు.ఇదీ చదవండి.. ఆకాశవీధిలో రోజు 4.3లక్షల మంది -
‘నితీష్- మమత.. నింగి-నేల’ ఆప్ నేత ఎందుకన్నారు?
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొంది, బయటకు వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ బీజేపీపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆయన తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నితీష్- మమతలను నింగి-నేలతో పోల్చారు. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ఆప్ సాగిస్తున్న ప్రచారం గురించి కూడా సంజయ్ సింగ్ మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ 23 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోందని, కార్యకర్తలంతా పూర్తి అంకితభావంతో పనిచేస్తున్నారన్నారు. ఇండియా కూటమిని వీడి ఎన్డీఏలో చేరిన బీహార్ సీఎం నితీష్ కుమార్‌పై సంజయ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. నితీష్ కుమార్ నిష్క్రమణ అనూహ్యమని, విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఆయన హఠాత్తుగా ఎన్డీఏలో చేరారన్నారు. ఈ విధంగా పార్టీలు మారితే స్వల్పకాలంలో అధికారాన్ని, ప్రయోజనాన్ని పొందవచ్చని, తరచూ పార్టీలు మారితే చరిత్ర హీనులవుతారని ఆరోపించారు. ఒకప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడి, ఇప్పుడు దానికి నితీష్ తలొగ్గుతారని తాను భావించలేదన్నారు. ఇక మమతా బెనర్జీ విషయాని కొస్తే ఆమె బీజేపీకి వ్యతిరేకంగా నిరంతర పోరాటం కొనసాగిస్తున్నారని సంజయ్ సింగ్ అన్నారు. అందుకే మమతకు నితీష్ కుమార్‌కు మధ్య నింగికి నేలకు ఉన్నంత తేడా ఉన్నదన్నారు. మమతా బెనర్జీ బీజేపీ వ్యతిరేకంగా పోరాడుతుండగా, నితీష్ కుమార్ బీజేపీకి సాగిలపడ్డారని ఆరోపించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్లో ఇండియా కూటమికి మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
లోక్‌సభలో అలజడి ఘటన: ప్రతిపక్షాలపై కేంద్ర మంత్రి ఫైర్
ఢిల్లీ: పార్లమెంట్ అలజడి ఘటనపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తప్పుబట్టారు. మహ్మద్ అలీ జిన్నా భావజాలంతో ఓవైసీ ప్రభావితమయ్యారని విమర్శించారు. జిన్నా ఆత్మ ఓవైసీలోకి చొరబడిందని వ్యగ్యాస్త్రాలు సంధించారు. అందుకే ఆయన ఓ వర్గం కోసమే పనిచేస్తారని అన్నారు. నేరస్థుల్లో కూడా మతకోణం చూడటానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. లోక్‌సభలో భద్రతా వైఫల్యం కేసుపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని గిరిరాజ్ సింగ్ మండిపడ్డారు. ఉగ్రవాదుల మతం, కులం, విశ్వాసాలతో పట్టింపులేదని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మతపరమైన అంశాలను పరిగణలోకి తీసుకోకుండానే ఉగ్రవాదులను ఉగ్రవాదులుగానే గుర్తించామని తెలిపారు. పార్లమెంట్లో అలజడి కేసులో నిందితులు ముస్లింలు అయితే పరిస్థితి ఏంటని ప్రతిపక్షాలు అడగడంపై ఆయన ఆక్షేపించారు. ఉగ్రవాద అంశంలో ప్రతిపక్షాలు మత కోణాన్ని చూస్తున్నారు.. ఈ అంశంపై హోమంత్రి అమిత్ షా స్పందించాలని పట్టుబడుతున్నారు.. ఇలాంటి విషయాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పారిపోయేవారు కాదు అని గిరిరాజ్ సింగ్ స్పష్టం చేశారు. దృఢ సంకల్పంతో ప్రతిస్పందించే వ్యక్తి అని తెలిపారు. పార్లమెంటు చొరబాటుదారులు ముస్లింలైతే పరిస్థితి మరోలా ఉండేదని జేడీయూ, ఏఐఎంఐఎం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ఇదీ చదవండి: అరాచకం సృష్టించడానికి కుట్ర.. వెలుగులోకి కీలక విషయాలు -
కాంగ్రెస్ వల్లే 'ఇండియా' పురోగతి తగ్గింది: నితీష్ కుమార్
పాట్నా: కాంగ్రెస్ వల్లే ఇండియా కూటమిలో పెద్దగా పురోగతి లేదని బిహార్ సీఎం నితీష్ కుమార్ ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపైనే కాంగ్రెస్ దృష్టి పెట్టిందని విమర్శించారు. అందుకే కూటమిలో దూకుడు తగ్గిందని చెప్పారు. బీజేపీ హటావో.. దేశ్ బచావో పేరుతో పాట్నాలో కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇండియా కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహించడానికి అందరం అంగీకరించామని తెలిపిన నితీష్ కుమార్.. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి అయిన తర్వాతనే ఇండియా కూటమి మరో భేటీ జరిగేలా కనిపిస్తోందని వెల్లడించారు. ఇండియా కూటమి కాంగ్రెస్ వల్లే దెబ్బతింటోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే లోక్ సభ ఎన్నికలపై సన్నద్ధత ఆలస్యం జరుగుతోందని చెప్పారు. కాగా.. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. మొదటి సమావేశం బిహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో పాట్నాలో జరిగింది. రెండో సమావేశం బెంగళూరు వేదికగా నిర్వహించారు. ఇక మూడోసారి ముంబయిలో ఆగష్టు 31న భేటీ అయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో సీట్ షేరింగ్ ప్రక్రియను పూర్తి చేయడానికి ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే.. సీట్ల షేరింగ్‌లో పార్టీల మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నవంబర్‌లో దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరాంలలో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు వస్తున్న ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల ప్రచారంపైనే దృష్టి కేంద్రీకరించింది. ఇదీ చదవండి: కేంద్రానికి రాజస్థాన్ సర్కార్ షాక్!.. ఇద్దరు ఈడీ అధికారుల అరెస్టు -
కేసీఆర్‌కు నిర్మలా సీతారామన్ కౌంటర్
సాక్షి, ఢిల్లీ: కేంద్రం తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. మునుపెన్నడూ లేని విధంగా మోదీ సర్కార్‌లో రూపాయి దారుణంగా పతనమైందని, అప్పులు.. ధరలు పెరిగిపోయాయని విమర్శించారు. ఈ క్రమంలో.. సీఎం కేసీఆర్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కౌంటర్ ఇచ్చారు. లాభాల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేసిన ఘనత కేసీఆర్‌దేనని ఆమె ఎద్దేవా చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణను కేసీఆర్ అప్పుల్లోకి నెట్టేశారు. ఆ రాష్ట్రంలో ప్రతీ శిశువుపై రూ. 1.25 లక్షల అప్పు ఉంది. తెలంగాణలో అప్పుడే పుట్టిన బిడ్డ కూడా లక్ష రూపాయల అప్పు కట్టాల్సిన పరిస్థితి. ఎఫ్ఆర్బీఎం పరిధికి మించి తెలంగాణ అప్పులు చేసింది. కేంద్రం నిధులిచ్చినా కేసీఆర్ బద్నాం చేస్తున్నారు. ప్రజలను భయపెట్టడానికే ఇలా మాట్లాడుతున్నారు. పైగా నేనే ప్రధాని అంటూ కేసీఆర్ దేశమంతా తిరుగుతున్నారు. ఉపాధీ హామీ పథకం కోసం కేంద్రం రూ.20 వేల కోట్లు ఇచ్చింది. ఉపాధి హామీ పథకం సర్వే కోసం అధికారులు వచ్చారు. మేం పంపిన డబ్బులు ఖర్చు చేయకపోతే అధికారులు విచారణ చేస్తారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కేంద్ర ప్రభుత్వ పథకం ప్రతీ ఒక్కటి అమల్లోకి రావాలి. అప్పుల గురించి అడిగే అధికారం కేంద్రానికి ఉంది అంటూ ఆమె కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి సీతారామన్ కౌంటర్ ఇచ్చారు. ఇదీ చదవండి: రాజాసింగ్‌ను బీజేపీ పూర్తిగా వదిలేసిందా? -
'బ్రహ్మాస్త్ర'కు నిరసన సెగ.. బాయ్‌కాట్ పేరిట ట్రెండింగ్.. ఎందుకంటే ?
బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం `బ్రహ్మాస్త్ర`. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘బ్రహ్మస్త్రం’ పేరుతో విడుదల చేయబోతున్నారు. రణ్‌బీర్ కపూర్, అలియాభట్ జంటగా నటిస్తున్నఈ చిత్రంలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ పలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరితోపాటు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ అతిథి పాత్రలో మెరవనున్నాడని సమాచారం. ఈ చిత్రం నుంచి ఇటీవల ట్రైలర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. రిలీజైన అతి కొద్ది సమయంలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ మూవీ మంచి స్పందనతోపాటు విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. '#BycottBrahmastra' అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది. అందుకు కారణం ఆ మూవీ ట్రైలర్లో చూపించిన ఒక సన్నివేశమే. ఈ ట్రైలర్లో రణ్‌బీర్ కపూర్ గుడిలోకి వెళ్తూ గంటలు కొడతాడు. కానీ ఆ సమయంలో రణ్‌బీర్ షూ ధరించి ఉంటాడు. ఇదే ఈ విమర్శలకు కారణంగా మారింది. ఇది చూసిన నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. '#BycottBrahmastra' ట్యాగ్‌తో బాలీవుడ్‌ను ఏకిపారేస్తున్నారు. 'అరే వా.. బాలీవుడ్ షూలతో గుడిలోకి వెళ్లింది. ఈ మూవీని బాయ్‌కాట్ చేయండి', 'ఎందుకు అతను షూలతో టెంపుల్‌లోకి వెళ్లాడు' అంటూ తదితర ట్వీట్లతో 'బ్రహ్మాస్త్ర' మూవీకి నిరసన సెగ తగిలింది. చదవండి: 13 ఏళ్ల పిల్లల నుంచి అత్యాచార బెదిరింపులు, తట్టుకోలేకపోయాను: నటి ముసలిదానివైపోతున్నావ్.. అంటూ అనసూయపై కామెంట్లు Waah re bollywood entering temple with shoes on. Boycott this movie!!! Let them feel our power!!! Aakhir kab tak urduwood bane rahoge#BoycottBrahmastra pic.twitter.com/uwdvwzD3lE — ईशा 🕉️ (@iishapradhan_) June 15, 2022 No matter how many religious films you make, these Bollywood people always build mistakes, that's why I don't trust Bollywood. #jagohindu #BoycottBollywood #BoycottBrahmastra #BoycottBrahmastraMovie #WeWantHinduRashtra pic.twitter.com/z79rA2Etac — Ankit Ranjan Singh (@AnkitSingh13_) June 16, 2022 Why he Is entering Temple with shoes #BoycottBrahmastra pic.twitter.com/YJGyauTD1z — Shashikanth Reddy (@Shashi26214076) June 15, 2022 #RanbirKapoor is Shown Wearing Shoes and Ringing a Bell in Temple #Brahmastra #Bollywood Will Never Stop Insulting Hinduism.#BoycottBollywood ❌#BoycottBrahmastra ❌#BrahmastraTrailer ❌ #KaranJohar ❌ But Rabel Star #Prabhas Worships God Blockbuster #Adipurush.☑️ #RRRMovie pic.twitter.com/IXMIu9Wroo — ℝ𝕒𝕞 𝕔𝕙𝕒𝕣𝕒𝕟 📿🚩🚩 (@Boss42265174) June 15, 2022 I Am Ready to #BoycottBrahmastra What about you? #BoycottBollywood CBI Do Justice To Sushant pic.twitter.com/YEoACI4zRj — KumardeepRoy(DETECTIVE BYOMKESH) (@I_Am_Roy18) June 16, 2022 Entering Temple with shoes, this is what we can expect from Urduwood. Bollywood never misses a chance to hurt our sentiments towards Sanatana Dharma.#BoycottBollywood #BoycottBrahmastra pic.twitter.com/Pa5hmX99Ag — 🚩 (@Chand_Bardai) June 15, 2022 -
అంతకన్నా పాక్ మీద అణుబాంబులు వేయండి: ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ను దొంగల చేతిలో పెట్టడం కంటే.. అణు బాంబులు వేసి పాకిస్థాన్‌ను నాశనం చేయడం మంచిదని వ్యాఖ్యానించారు. శుక్రవారం బనిగల నివాసంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. షెహ్బాజ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ.. దొంగలు పాక్‌ను పాలించడం ఆశ్చర్యం కలిగించే విషయమని, అంతకంటే దేశాన్ని ఒక అణు బాంబు వేసి పాక్‌ను నాశనం చేయడం ఉత్తమం అని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన కొందరు.. గతంలో ప్రతీ వ్యవస్థను నాశనం చేసి అవినీతికి పాల్పడ్డారని, ఇప్పుడు వాళ్లను ఎవరు విచారిస్తారని అన్నారు. ఇతరులపై ఆరోపణలు చేయడం మాని.. ముందు ప్రభుత్వ పని తీరును చక్కబర్చాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని ఉద్దేశించి హితవు పలికారు. పాక్ నిజమైన స్వాతంత్ర్యం కోసం ఈ నెల 20వ తేదీన 20 లక్షల మందితో లాంగ్ మార్చ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారాయన. దీనిని ఏ శక్తీ అడ్డుకోలేదని తెలిపారు. ఇదిలా ఉండగా.. ప్రజల్లో తన ప్రసంగాల ద్వారా విషం నింపుతున్నారంటూ ప్రధాని షెహబాజ్, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ పై మండిపడుతున్నారు. -
'ఆర్ఆర్ఆర్'పై కెఆర్కె రివ్యూ.. జక్కన్నపై షాకింగ్ కామెంట్స్
Kamaal R Khan Review RRR: అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బిగ్గెస్ట్ మల్లీస్టారర్ చిత్రం రౌద్రం.. రణం.. రుధిరం.. (ఆర్ఆర్ఆర్). పాన్ ఇండియాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శక ధీరుడు రాజమౌలి డైరెక్ట్ చేశారు. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఈ మూవీ ఎట్టకేలకు మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో థియేటర్లలో అభిమానుల సందడి విపరీతంగా ఉంది. సినిమా సూపర్ హిట్ అంటూ అభిమానులు, ప్రేక్షుకులు, సినీ తారలు సైతం ప్రశంసిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రతీ ఒక్కరూ పొగడ్తలతో ముంచెత్తుతుంటే ఒక క్రిటిక్ మాత్రం విమర్శించాడు. బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ (కెఆర్కె) జక్కన కళాఖండ ఆర్ఆర్ఆర్పై తీవ్ర విమర్శలు గుప్పించాడు. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత చెత్త సినిమా తీసినందుకు డైరెక్టర్ రాజమౌళిని జైలులో పెట్టాలని కెఆర్కె విమర్శించాడు. ఆర్ఆర్ఆర్ను తలాతోక లేని సౌత్ మసాలా చిత్రంగా ఆయన అభివర్ణించాడు. ఈ మూవీ చూడంటంతో తన నాలెడ్జ్ జీరో అయిందన్నాడు. 'తప్పు చెప్పలేను.. కానీ దేశ వీరులను చెత్త సినిమాతో పోల్చడం నేరం. రూ. 600 కోట్ల బడ్జెట్‌తో చెత్త సినిమా తీసిన రాజమౌళిని 6 నెలలు జైలులో పెట్టాలి.' అని కమల్ ఆర్ ఖాన్ పేర్కొన్నాడు. I can’t call it mistake but I will call it biggest crime. Director #Rajamouli should be jailed for minimum 6 months for making this crap film #RRR with ₹600Cr budget. — KRK (@kamaalrkhan) March 24, 2022 Sir @ssrajamouli you are killing my all senses. My all knowledge has become Zero today. Kaise Kar lete ho sir? Maza Hi Aa Gaya sir. Every director makes his Aag and #RRR is your AAG. — KRK (@kamaalrkhan) March 24, 2022 Film #RRR is that shit film, which has never made before in the history of Indian cinema. This film destroys the brain cells of a human being to make him alive dead. It is the worst film ever made In India. Thugs of Hindustan is Mughal E Azam compare to this crap. 0* from me. — KRK (@kamaalrkhan) March 24, 2022 Film #RRR is full time south Masala film without head and feet. — KRK (@kamaalrkhan) March 24, 2022 -
తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ కేటీఆర్
బీజేపీపై, ఆ పార్టీ కీలక నేతలపైనా తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతో పాటు పలు కార్యక్రమాల్లో చేశారు. ఈ కార్యక్రమాల వేదికగా ఆయన బీజేపీ నేతలపైనా ఆగ్రహం వెల్లగక్కారు. తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తున్న బీజేపీని బొంద పెడదాం అంటూ కార్యకర్తలకు పిలుపు ఇచ్చారాయన. తెలంగాణ వస్తే కరెంట్, నీళ్లు ఉండవని అన్నారు. పాలన చేతనైతుందా? అని సమైక్యవాదులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇవాళ దేశంలోనే ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఒక ఆదర్శ రాష్ట్రంగా నిలిచింది. అలాంటిది తెలంగాణపై ఎందుకు అంత అక్కసు అంటూ బీజేపీని నిలదీశారు మంత్రి కేటీఆర్. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లు కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారని, వారికి వ్యక్తిగతంగానే సమాధానం చెప్పాలని కేటీఆర్ శ్రేణులకు పిలుపు నిచ్చారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు బంటు అని తెలుసు. బండి సంజయ్ ఎవరి బంటో తెలియదు. కిషన్‌రెడ్డి ఏం నాయకుడో అర్థం కాదు. కేసీఆర్‌ను ఏమైనా అంటే చుక్కలు చూపిద్దాం. మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొడదాం అంటూ కార్యకర్తల్లో జోష్ నింపాడాయన. రాజ్యసభలో రాష్ట్ర విభజనపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇలాంటి వ్యాఖ్యలను చేసిన మోదీని తెలంగాణ సమాజం క్షమించదని మంత్రి కేటీఆర్ తెలిపారు. బీజేపీని బట్టలిప్పి నగ్నంగా కొడదామని మంత్రి కేటీఆర్ అన్నారు. మిషన్ భగీరథకు, మిషన్ కాకతీయకు వేల కోట్ల నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. కానీ, మోదీ కనీసం చిల్లర పైసలు కూడా ఇవ్వలేదు. పైగా మిషన్ భగీరథను కాపీ కొట్టి.. హర్, ఘర్, జల్ అంటూ డ్రామాలాడుతున్నారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్, వన్ రేషన్, వన్ రిజిస్ట్రేషన్ అంటారు. కానీ, దేశంలో జరిగిన ఒకే ఒక తప్పు.. 2014లో మోదీని నమ్మి గెలిపించడమే. నమో అంటే.. నమో నమ్మించి మోసం చేసేవాడు. నరేంద్ర మోదీ కాదు. నమోని నమ్మి ఎనిమిదేళ్లు మోసపోయాం. జీవితాలు మార్చమంటే.. జీవిత బీమా సంస్థకు కూడా అమ్మేస్తున్నారు అంటూ ప్రధాని మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు కేటీఆర్. బీహార్‌లో ఓ వ్యక్తి అకౌంట్లో రూ. 10 లక్షలు జమ అయ్యాయి. మోదీ పంపిండు అని ఆ పైసలతో ఇల్లు కట్టుకుండు. మోదీ పంపలేదు. అదంతా అబద్దం.. పైసలు కట్టు అని బ్యాంకు అధికారి నిలదీస్తే ఆ వ్యక్తి దీక్ష చేసిండు. జన్ ధన్ ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తానని మోదీ మాట మరిచారు. 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తానని చెప్పి మోసం చేశారు. ఉద్యోగాల గురించి మీడియా ప్రశ్నిస్తే.. మోదీ తెలివిగా సమాధానం చెప్పాడు. మీ సిరిసిల్ల హాస్పిటల్ ముందట పకోడి వేసుకోవడం ఉద్యోగం కదా? అని మోదీ అంటున్నాడని కేటీఆర్ మండిపడ్డారు. మేడారం జాతరకు అంతేనా? మేడారం జాతరను మినీ కుంభమేళా అని అంటారు కిషన్ రెడ్డి. ఐదారు రాష్ట్రాల నుంచి లక్షల మంది భక్తులు వస్తుంటారు. అట్లాంటి జాతరకు కేంద్రం ఇచ్చేది రూ. రెండున్నర కోట్లు మాత్రమేనా?. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన కుంభమేళాకు రూ. 375 కోట్లు ఇచ్చారు. మనకేమో ముష్టి వేసినట్టు రూ. రెండున్నర కోట్లు ఇచ్చారు. దీనికే కిషన్ రెడ్డి సిగ్గులేకుండా.. ఇది మినీ కుంభమేళా అంటారు.. కానీ నిధులు మాత్రం తీసుకురారు. కరీంనగర్‌కు ఒక ట్రిపుల్ ఐటీ కావాలని అడిగితే ఇవ్వలేదు. ఈ ఎనిమిదేండ్లలో తెలంగాణకు ఎన్ని విద్యాసంస్థలు ఇచ్చారు? అని కిషన్ రెడ్డిని కేటీఆర్ నిలదీశారు. కేసీఆర్‌లాగా గర్జించాలి.. గల్లీ టు ఢిల్లీ మనమే ఉన్నాం. అవులాగాడు, బేకూఫ్‌గాడు మాట్లాడితే బెదరొద్దు. ఏ నాయకుడు చేయని పని కేసీఆర్ చేసి తెలంగాణను అభివృద్ధి చేశారు. కేసీఆర్‌ను ఎవరైనా ఒక మాట అంటే ఊరుకునేది లేదు. జనగామ, ఆర్మూర్‌లో బీజేపీ నాయకులను పొట్టుపొట్టు తన్నారు. హద్దులు దాటితే తప్పకుండా బుద్ధి చెప్తాం అని బీజేపీ నేతలను ఉద్దేశించి కేటీఆర్ హెచ్చరించారు. సిరిసిల్ల గడ్డ మీద చైతన్యం చూపిస్తాం. ఇక నుంచి ఊకోం అని తేల్చిచెప్పారు. కేసీఆర్ తెలంగాణకు ఏం తక్కువ చేసిండు అని బీజేపీ నాయకులను నిలదీయాలని మంత్రి కేటీఆర్, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీ అంటే.. బీజేపీ అంటే బక్వాస్ ఝూఠా పార్టీ.. లొల్లి ఎక్కువ, చేసేది తక్కువ. అందుకే ఈ కొత్త పేరు పెట్టాం. బీజేపీ బట్టలిప్పి నగ్నంగా నిలబెట్టాలి. చండాలమైన బీజేపీ పద్ధతులను ఎండగట్టాలని కేటీఆర్ కార్యకర్తలకు సూచించారు. పనిలో పనిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పైనా కేటీఆర్ నిప్పులు చెరిగారు. దమ్ముంటే మోదీ దగ్గరకు వెళ్లి.. వెయ్యి కోట్ల రూపాయల ప్యాకేజీ తీసుకురావాలని సవాల్ విసిరారు. బండి సంజయ్ ఎంపీగా గెలిచి మూడేళ్లు అవుతోంది. ఈ కాలంలో మూడు పైసలు కూడా తేలేదు. వేములవాడకు పైసా తీసుకురాని బండి సంజయ్ నువ్వు ఎంపీగా ఎందుకున్నావ్? మీ మోదీ పెద్ద పోటుగాడు కదా.. వేములవాడ రాజన్నకు పైసలు తీసుకురా. అయోధ్యకు ఇచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు ఇవ్వరు. సిరిసిల్ల నేతన్నలకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వరు. కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తరు. మనం అరిచినా, గీ పెట్టినా కూడా మనకు జాతీయ హోదా ఇవ్వరు. మోదీ కేవలం ఉత్తర భారతానికే ప్రధాన మంత్రా? తెలంగాణ ప్రజల మీద ఎందుకింత వివక్ష? అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణకు సాయం చేయకుండా అడ్డగోలు మాటలు మాట్లాడుతారు అని బీజేపీ నాయకులపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. -
చైనాకు కొంచెమైనా సిగ్గు ఉందా?
ఒకవైపు కరోనా కేసులు దాచి పెడుతూ.. ఎలాగైనా వింటర్ ఒలింపిక్స్ వేడుకల్ని నిర్వహించాలని చైనా తాపత్రయపడుతోంది. ఈ క్రమంలో సరిహద్దు అంశాన్ని కెలికి మరీ విమర్శలు ఎదుర్కొంటోంది. చైనా తాజాగా చేసిన పనిని అగ్రరాజ్యం తీవ్రంగా ఖండించింది. బుధవారం వింటర్ ఒలింపిక్ టార్చ్ రిలేను నిర్వహించిన ఆతిథ్య చైనా.. టార్చ్‌బేరర్‌గా క్వీ ఫబోవోను ఎంచుకుంది. ఇతను గల్వాన్ లోయ ఘర్షణల్లో తీవ్రంగా గాయపడిన సీపీఏల్ఏ కమాండర్. ఈ విషయాన్ని డ్రాగన్ అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన షిన్జియాంగ్ మిలటరీ కమాండర్, గల్వాన్ లోయ వీరుడు క్వీ ఫబోవో.. బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు వాంగ్ మింగ్‌తో కలిసి ఒలింపిక్ జ్యోతిని పట్టుకుని రిలేను ప్రారంభించారని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. కాగా, ఈ చర్యను అమెరికా తీవ్రంగా ఖండించింది. ‘‘ఇది సిగ్గుమాలిన పని. గల్వాన్ లోయ దాడిలో పాల్గొన్న వ్యక్తిని.. అదీ ఉయిగర్ల ఊచకోతకు కారణమైన వ్యక్తి టార్చ్ బేరర్‌గా ఎంచుకోవడం వెనుక ప్రపంచానికి ఎలాంటి సంకేతాలు పంపింది. భారత సార్వభౌమత్వానికి, ఉయిగర్ల స్వేచ్ఛకు అమెరికా ఎప్పుడూ మద్ధతు ఇస్తూనే ఉంటుంది’’ అని యూఎస్ సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ ర్యాంకింగ్ మెంబర్ ఈ ఉదయం ఒక ట్వీట్ చేశారు. ఇక, శీతాకాల ఒలింపిక్స్‌ను భారత్ బహిష్కరించనప్పటికీ.. ప్రారంభ వేడుకలు సహా ఒలింపిక్ కార్యక్రమానికి మన దేశం నుంచి ఎవ్వర్నీ పంపడంలేదు. It's shameful that #Beijing chose a torchbearer for the #Olympics2022 who's part of the military command that attacked #India in 2020 and is implementing #genocide against the #Uyghurs. The U.S. will cont. to support #Uyghur freedoms & the sovereignty of India. — Senate Foreign Relations Committee Ranking Member (@SenateForeign) February 3, 2022 నష్టం ఎక్కువే! భారత్ సైన్యంతో గల్వాన్ లోయలో 2020 జూన్ 15న జరిగిన ఘర్షణల్లో 40 మందికిపైగా సీపీఎల్ఏ జవాన్లు చనిపోయినా.. పరువు పోతుందనే భయంతో నలుగురు మాత్రమే మరణించారని డ్రాగన్ తక్కువచేసి చెప్పింది. నలుగురు సైనికులకు మరణానంతరం గత సంవత్సరం గౌరవ బిరుదులు, ఫస్ట్-క్లాస్ మెరిట్ పతకాలను అందజేసింది. గతంలో రష్యా ఏజెన్సీలు చైనా నష్టంపై ఒక ప్రకటన చేయగా.. తాజాగా ఆస్ట్రేలియా పేపర్ ఒకటి ఏడాది విచారణ తర్వాత ఆ మరణాల సంఖ్య ఎక్కువేనని ప్రకటించింది. చీకట్లో శీతల వరద ప్రవాహాంలో పడి చాలామంది సైనికులు కొట్టుకు పోయి ఉంటారని, కానీ, చైనా ఆ విషయాన్ని దాస్తోందని ఆ వార్తా పత్రిక.. ఈ మేరకు చైనా నుంచే పలు ఆధారాలను సేకరించినట్లు మరీ వెల్లడించింది. ఇక గల్వాన్ ఘర్షణల్లో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు అమరులయ్యారైన సంగతి తెలిసిందే. చదవండి: షిన్జియాంగ్ కాదు మొత్తం చైనాకే ముడిపెట్టిన బైడెన్ -
గప్పాలొద్దు, దోచుకుంది చాలదా?.. ఎలన్ మస్క్‌కు చురకలు
టాప్ బిలియనీర్ హోదా, స్పేస్ఎక్స్ ప్రయోగాలు, క్రిప్టో కరెన్సీ ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా సెన్సేషన్, టైమ్ పర్సన్ 2021 ఇయర్ ఘనత .. వెరసి నిత్యం వార్తల్లో నిలిచే సెలబ్రిటీగా పోయిన ఏడాది మొత్తాన్ని ఏలేశాడు ఎలన్ మస్క్. అఫ్కోర్స్.. అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. అయితే కిందటి ఏడాది చివర్లో ఆయన చేసిన ఓ ట్వీట్ రాజకీయ విమర్శలకు కారణమైంది. డిసెంబర్ 20వ తేదీన ఎలన్ మస్క్ తన ట్విటర్లో ఓ ట్వీట్ చేశాడు. ఏడాదిగానూ ఏకంగా 11 బిలియన్ డాలర్ల పన్ను చెల్లించబోతున్నట్లు ప్రకటించుకున్నాడు. దీంతో ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన వ్యక్తి చెల్లించే పన్ను గురించి ఆసక్తికర చర్చ నడించింది. అయితే ఈ ట్వీట్‌పై ఎలన్ మస్క్‌ను తిట్టిపోస్తున్నారు అమెరికా చట్టప్రతినిధులు. ఎలన్ మస్క్ సహా ధనవంతులెవరూ సరైన పన్నులు చెల్లించడం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. For those wondering, I will pay over $11 billion in taxes this year — Elon Musk (@elonmusk) December 20, 2021 ఈ విమర్శలు చేసేవాళ్లలో ఇండో-అమెరికన్ కాంగ్రెస్ఉమెన్ ప్రమీలా జయపాల్ కూడా ఉన్నారు. ప్రమీలా యూఎస్ హౌజ్‌లో తొలి ఇండో-అమెరికన్ కాంగ్రెస్ ఉమెన్ కూడా. పన్నుల చెల్లింపుపై గొప్పలకు పోతున్నారా? అంటూ ఆమె ఎలన్ మస్క్‌ను నిలదీశారు. ‘పన్ను చెల్లింపు విషయంలో గప్పాలు కొట్టుకోవద్దు.. ఆ చెల్లించేది సరైన పన్నులు కావనేది అందరికీ తెలుసు’ అని ఆమె పేర్కొన్నారు. ఎలన్ మస్క్ ఒక్కరోజు సంపాదనే 36 బిలియన్ డాలర్లు. కానీ, 11 బిలియన్ డాలర్లు ట్యాక్స్ చెల్లిస్తున్నట్లు గొప్పగా చెప్పుకుంటున్నారు. కేవలం కరోనా టైంలోనే 270 బిలియన్ డాలర్లు వెనకేసుకున్నాడు. ధనికులు తమ న్యాయమైన వాటాను చెల్లించే సమయం వచ్చేసింది’ అంటూ వ్యాఖ్యానించారామె. మరోవైపు రిపబ్లికన్ సెనేటర్ టెడ్ క్రూజ్ కూడా ‘ఎలన్ మస్క్ దోపిడీ’ మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా చట్టప్రతినిధులకు, అమెరికాలోని బిలియనీర్లకు మధ్య ట్యాక్స్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. సక్రమంగా పన్నులు చెల్లించని బిలియనీర్ల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేసేందుకు ప్రత్యేక చట్టాల్ని రూపొందించింది బైడెన్ ప్రభుత్వం. దీని నుంచి తప్పించుకునేందుకు ఎలన్ మస్క్ సహా పలువురు టెక్ మేధావులు ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషిస్తున్నారు. ఇక 40.8 శాతం అత్యధిక పన్ను రేటుతో, 280 బిలియన్ డాలర్ల నికర విలువ సంపదన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన మస్క్, టెస్లా షేర్ల ద్వారా దాదాపు 10.7 బిలియన్ డాలర్ల ఫెడరల్ పన్ను బిల్లును చెల్లించాల్సి ఉంటుందని ప్రోపబ్లికా నివేదిక పేర్కొంది. అయితే మస్క్ సహా ఇతర బిలియనీర్లు 2018లో ఫెడరల్ ఆదాయపు పన్నులు చెల్లించలేదని ప్రోపబ్లికా దర్యాప్తు ఒక నివేదిక విడుదల చేసింది. 2014 మరియు 2018 మధ్య కాలంలో, మస్క్ తన సంపద $13.9 బిలియన్లు పెరిగినప్పటికీ, 1.52 బిలియన్ డాలర్ల ఆదాయంపై కేవలం 455 మిలియన్ల డాలర్ల పన్నులు చెల్లించాడు. చదవండి: పాపం ఎలన్ మస్క్..! తినడానికి తిండి లేని రోజుల్లో ఏం చేసేవాడో తెలుసా? -
ట్రంప్ నిజంగా మూర్ఖుడు, అబద్దాల కోరు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిజంగా మూర్ఖుడు, అబద్దాల కోరు అంటూ ట్రంప్ సోదరి మరియన్నే ట్రంప్ బారీ ఆరోపించారు. అతను ఎవరిని అంత త్వరగా నమ్మడని.. తన సిద్దాంతాల కోసం ఎంతదూరమైనా వెళ్తాడంటూ ఆమె పేర్కొన్నారు. మరియన్నే చేసిన వ్యాఖ్యలు సీక్రెట్‌గా రికార్డ్ చేయబడ్డాయి.. ఇవన్నీ ట్రంప్ మేనకోడలు మేరీ ట్రంప్ రాసిన టాక్సిక్ ఫ్యామిలీలో ప్రచురించబడ్డాయి. ఇమ్మిగ్రేషన్ విధానంపై ట్రంప్ వైఖరిని తప్పుబడుతూ.. తల్లిదండ్రుల నుంచి పిల్లలను వేరు చేసి డిటెన్షన్ సెంటర్‌కు తరలించడాన్నిమరియన్నే ట్రంప్ బారీ ఎండగట్టారు. (అవసరమైతే చైనాతో అన్నీ బంద్: ట్రంప్) తన సిద్దాంతాల కోసం ఎవరిని లెక్కచేయడని.. అతను మాట్లాడే ప్రతి వ్యాఖ్యం అబద్ధమేనని.. ట్వీట్లు కూడా అదే విధంగా ఉంటాయన్నారు. అదే విధంగా ట్రంప్ వైఖరిని ప్రశ్నిస్తూ.. ట్రంప్ మేనకోడలు మేరీ ట్రంప్ రాసిన టాక్సిక్ ఫ్యామిలీ పబ్లికేషన్‌ను కూడా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గత వారం మరణించిన అధ్యక్షుడి తమ్ముడు రాబర్ట్ ట్రంప్ మేరీ రాసిన పుస్తక ప్రచురణను అడ్డుకునేందుకు కోర్టుకు వెళ్లారు. మేరీ తన తాత ఎస్టేట్‌లో స్థిరపడిన తరువాత 2001లో సంతకం చేసిన బహిర్గతం కాని ఒప్పందాన్ని ఆమె ఉల్లంఘిస్తున్నారని వాదించారు. కానీ రాబర్ట్ చేసిన వ్యాఖ్యలు కోర్టులో నిరూపితం కాలేదన్నారు. అంతేకాదు.. ఇప్పటివరకు 9లక్షల 50వేల కాఫీలు అమ్ముడయ్యాయని.. కానీ వైట్ హౌస్ మాత్రం అది ఒక అబద్దాల పుస్తకం అంటూ తప్పడు ప్రచారం చేశారన్నారు. ఇది ట్రంప్ మూర్కత్వాన్ని చూపిస్తుందని.. తనకు అడ్డు వస్తే ఎంతదూరమైన వెళ్లడానికి వెనుకాడడని మేరీకి తాను చెప్పినట్లు బారీ వివరించారు. ట్రంప్ యునివర్సీటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ప్రవేశం పొందడానికి వేరొకరితో పరీక్ష రాయించాడని.. ఇంకా ఆ వ్యక్తి పేరు నాకు గుర్తుంది అంటూ తెలిపారు. అయితే ట్రంప్ సోదరి వ్యాఖ్యలపై వైట్‌హౌస్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అయితే రిపబ్లికన్ పార్టీ స్పందిస్తూ.. రానున్న ఎన్నికల్లో ట్రంప్‌ను ఓడించాలనే ప్రయత్నంలోనే ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని పేర్కొంది. -
'అలాంటి వారిని గ్రామాల్లోకి రానివ్వం'
సాక్షి, తాడేపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టనున్న ఇంగ్లీష్ మీడియం విధానంపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతున్నట్లు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలకు చెందిన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివితే టీడీపీకి నష్టమేంటో తనకు అర్థం కావడం లేదని తెలిపారు. కార్పొరేట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం చెప్తే తప్పు లేదు కాని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడితే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవకుండా టీడీపీ కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలను ఉన్నత విద్యకు దూరం చేసి మళ్లీ అంటరానితనంలోకి నెట్టాలని టీడీపీ నేతలు భావిస్తున్నారని మండిపడ్డారు. ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తున్న వారిని గ్రామాల్లోకి రానివ్వకుండా అడ్డుకుంటామని సుధాకర్‌బాబు హెచ్చరించారు. -
నాశనం చేయడం సులభం; సీజేఐ మిశ్రా
న్యూఢిల్లీ: ‘ఓ వ్యవస్థను విమర్శించడం, దానిపై దాడులు చేయడం, నాశనం చేయడం చాలా సులభం. కానీ ఆ వ్యవస్థ పనిచేసేలా మార్చ డం సవాళ్లతో కూడుకున్న కష్టమైన పని’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రా వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో పతాకాన్ని ఎగురవేసిన అనంతరం జస్టిస్ మిశ్రా మాట్లాడారు. వ్యవస్థలోని వ్యక్తులు తమ వ్యక్తిగత కోర్కెలు, లక్ష్యాలను అధిగమించి సానుకూల దృక్పథంతో, హేతుబద్ధతతో, పరిణతి, బాధ్యతలతో నిర్మాణాత్మక చర్యలు చేపట్టినప్పుడే వ్యవస్థ మరింత ఉన్నత స్థానానికి చేరుతుందని అన్నారు. ‘న్యాయవ్యవస్థను బలహీన పరిచేందుకు కొన్ని శక్తులు పనిచేస్తుండొచ్చు. మనమంతా కలసి వాటిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడాలి’ అని పేర్కొన్నారు. న్యాయ దేవత చేతిలోని త్రాసు సమన్యాయాన్ని సూచిస్తుందనీ, ఆ సమానత్వానికి భంగం కలిగించే ఎవరైనా ఆ దేవతను బాధ పెట్టినట్లేనని జస్టిస్ మిశ్రా అన్నారు. న్యాయ దేవత కన్నీరు కార్చేందుకు తాము ఒప్పుకోమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజాహిత వ్యాజ్యాల (పిల్) విస్తృతి దెబ్బతినకుండా ఉండాలంటే కొంత పరిశీలన తప్పనిసరన్నారు. తక్కువ విస్తృతి కలిగిన అంశాలపై పిల్ వేసేందుకు చెల్లించాల్సిన రుసుమును సుప్రీంకోర్టు ఇటీవల భారీగా పెంచడాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్ తదితర గొప్పవాళ్ల గుర్తుగా ఉన్న ప్రదేశాలను సందర్శించినప్పుడు వారిని పొగడాలని రవి శంకర్ కోరగా, జస్టిస్ మిశ్రా మాట్లాడుతూ ‘వారంతా దేశం కోసం పోరాడారు. మన పొగడ్తల కోసం కాదు’ అని అన్నారు. -
టీఆర్ఎస్.. ద్రోహులమయం
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : ఉద్యమ నేపథ్యంతో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు తెలంగాణ ద్రోహుల పార్టీగా మారిందని తెలంగాణ జన సమితి (టీజేఎస్) రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి గాదె ఇన్నయ్య అన్నారు. ఉద్యమాన్ని అడుగడుగునా అడ్డుకుని గూండాల్ల వ్యవహరించిన వాళ్లంతా టీఆర్ఎస్లో మంత్రులుగా కొనసాగుతున్నారని, చీమలపుట్టలో పాములు చేరిన చందంగా ఉందని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీర్చడం కోసం తెలంగాణ జన సమితి ఆవిర్భవించిందని పేర్కొన్నారు. కరీంనగర్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గాదె ఇన్నయ్య మాట్లాడారు. ‘‘అంకుల్ తెలంగాణ వచ్చేది కాదు సచ్చేదికాదు మా నాన్నను డిస్టర్బ్ చేయకండి.. ఇంకెవరినన్న చూసుకోండి’ అంటూ 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో ప్రస్తుత మంత్రి కేటీఆర్ తనకు ఫోను చేసి వేడుకున్నాడని, అలాంటి వ్యక్తి ఇప్పుడు మంత్రిగా కొనసాగుతున్నాడని అన్నారు. టీఆర్ఎస్ మొత్తం కుటుంబపాలన, తెలంగాణ ద్రోహుల మయమైందన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అవహేళన చేసిన వాళ్లే ఎక్కువగా ఆ పార్టీలో ఉన్నారని గుర్తుచేశారు. టీఆర్ఎస్ పెట్టినప్పుడు కేసీఆర్ ’నాకెవరున్నారు.. నేను నా భార్యే.. నా పిల్లలు రాజకీయాల్లోకి రారు’ అన్నారని, ఇప్పుడు మొత్తం కుటుంబపాలనే అయ్యిందన్నారు. ఉద్యమ ఆకాంక్ష పూర్తిచేసేందుకే టీజేఎస్ పుట్టిందని, అసమానతలు లేని, పరిపాలన మార్పు, మెజార్టీ ప్రజల అభివృద్ధి అనే మూడు లక్ష్యాలను సాధించేందుకు పాటుపడుతుందని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచే తమ విజయ ప్రస్థానం మొదలవుతుందని జోస్యం చెప్పారు. తెలం గాణ జన సమితి తరఫున వార్డు అనుబంధ సభ్యులను ప్రకటిస్తామని, ఉద్యమంలో భాగస్వాములైన వారు, సామాజిక సేవ నేపథ్యం ఉన్నవారికి మాత్రమే అవకాశమిస్తామన్నారు. దివ్యాంగులకు, అనాథ యువతకు పంచాయతీ ఎన్నికల్లో ప్రాధాన్యం ఇస్తామన్నారు. సమావేశంలో టీజేఎస్ కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల ఇన్చార్జిలు, నాయకులు ముక్కెర రాజు, జేవీ రాజు, జనగామ నర్సింగ్, కనకం కుమారస్వామి, స్రవంతి, ఎస్.గంగారెడ్డి, గడ్డం రవిందర్ రెడ్డి, డొంకెన రవిలతో పాటు పలువురు పాల్గొన్నారు. -
మెడికల్ హెల్త్ కేర్..అదో పెద్ద జిమ్మిక్కు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం ఆర్థిక బడ్జెట్‌పై విమర్శలు గుప్పించారు. బడ్జెట్ ప్రతిపాదనలు ఇంకా మెరుగ్గా ఉండాల్సిందని చిదంబరం అభిప్రాయపడ్డారు. ప్రయివేటు రంగానికి వత్తాసు తప్ప సామాన్యుడికి ఒరిగేదీ లేదని మండిపడ్డారు. ప్రధానంగా ఆర్థిక ద్రవ్యలోటు బాగా నిరాశ పర్చిందన్నారు. 3.5 శాతంగా అంచనా వేసిన ద్రవ్యలోటు 3.2శాతానికి తగ్గడం దురదృష్టకరమన్నారు. 2018-19 బడ్జెట్లో ఆర్థిక ఏకీకరణ పరీక్షలో ఆర్థిక మంత్రి విఫలమయ్యారని ఆరోపించారు. ఇది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని వ్యాఖ్యానించారు. బడ్జెట్లో వ్యవసాయం రంగం కేటాయింపులు, రైతులకు ప్రయోజనాలపై స్పందించిన చిదంబరం వ్యవసాయం రంగంపై ఒత్తిడి కొనసాగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్లో తక్షణమే రైతులకు లభించే వాస్తవ ఆదాయమేదీ తనకు కనిపించలేదన్నారు. దిగుమతులపై పరిమితి విధించేందుకు అదనపు కస్టమ్ సుంకాన్ని విధించడంపై అభ్యంతరం వ్యక్తంచేసిన చిదంబరం ఎగుమతులను పెంచడానికి ఎలాంటి విధానాలను ప్రకటించదు.. అసలు ప్రభుత్వానికి ఆలోచనే లేదని దుయ్యబట్టారు. అతి పెద్ద మెడికల్ హెల్త్ కేర్ ఒక పెద్ద బూటకం. ఇది ఒక ఎలక్షన్ ఎత్తుడగ అని వ్యాఖ్యానించారు. ఇది కేవలం బీమా పథకం. అయితే ప్రీమియం సంగతి ఏంటి.. ఆ లెక్కలెక్కడా తనకు కనిపించలేదని చిదంబరం పేర్కొన్నారు. దీని వలన ప్రయివేటు రంగానికి భారీ ప్రయోజనాలు ఒనగూరనున్నాయన్నారు. అలాగే సగటు పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ఊరట లభించలేదని ఆరోపించారు. కాగా దేశంలోని పది కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరేలా నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్‌ను కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్లో ప్రవేశపెట్టారు. దీని వల్ల ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల వరకు మెడికల్ రీఎంబర్స్మెంట్ ఇవ్వనున్నా మన్నారు. తద్వారా 10కోట్ల కుటుంబాలకు, సుమారు 50 కోట్ల మంది పేదలకు లబ్ది చేకూరనుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
గిరిజనులకు దేవుడే దిక్కా?
మలేరియా మందులు అందుబాటులో లేవు పేదల వైద్యం పట్టని ప్రభుత్వం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం మారేడుమిల్లి : ఏజెన్సీలో మలేరియా తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మలేరియా మందులు లేకపోవడం చూస్తే ఈ ప్రభుత్వం పేదల ఆరోగ్యాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదని అర్ధమవుతోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రెండురోజుల ఏజెన్సీ పర్యటనలో భాగంగా బుధవారం రాత్రి మారేడుమిల్లి వనవిహారిలో బస చేసిన జగన్ గురువారం ఉదయం స్థానిక పీహెచ్‌సీని సందర్శించి రోగులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బందితో మాట్లాడుతూ పూర్తిస్థాయిలో సిబ్బంది ఉన్నారా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ప్రశ్నించారు. ముగ్గురు వైద్యా ధికారులకు ఒక్కరు మాత్రమే ఉన్నారని, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు అవసరం కాగా ఒకరే ఉన్నారని వారు తెలిపారు. పీహెచ్‌సీలోని సౌకర్యాలను పరిశీలించారు. రోగులకు వసతులు, మందులు అందుబాటులో ఉన్నాయా అని సిబ్బందిని ప్రశ్నించగా మలేరియా మందులకు కొరత ఉందని ఇండెంట్ పెట్టినా సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి సరఫరా కాలేదని తెలిపారు. మలేరియా తీవ్రంగా ఉన్న ప్రాంతంలో కూడా అత్యవసరమైన మందులు లేకపోవడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల ఆరోగ్యంపై చంద్రబాబుకు చిత్తశుద్ధిలేదన్నారు. సిబ్బందికి నాలుగు నెలల జీతాలు లేవని జగన్‌కు వివరించారు. జీతాలు లేకపోయినా క్షేత్రస్థాయిలో ఎలా సేవలు అందిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనంతరం పీహెచ్సీ ఆవరణలో నూతనంగా నిర్మాణం తలపెట్టి మధ్యలో నిలిచిపోయి భవనాన్ని పరిశీలించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మారేడుమిల్లి పీహెచ్‌సీని సందర్శించి ఏడాది గడుస్తున్నా భవన నిర్మాణంలో కదలిక లేకపోవడం వెనుక ప్రభుత్వ పనితీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ (బాబు), రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, మాజీ మంత్రులు పినిపే విశ్వరూప్, పిల్లి సుభాష్‌చంద్రబోస్, నాయకులు కర్రి పాపారాయుడు, జిల్లా కార్యదర్శి గొర్లె బాలాజీబాబు, జెడ్పీటీసీ సభ్యుడు సత్తిసత్యనారాయణరెడ్డి,ఎంపీపీ కుండ్ల సీతామహలక్షి్మ, ఎంపీటీసీ సభ్యుడు అనిల్‌ప్రసాద్ పలువురు నాయకులు పాల్గొన్నారు. -
'ఆ జీవోల రద్దుతో అవినీతికి గేట్లు తెరిచినట్లే'
కదిరి: దేవాలయ వ్యవస్థను పటిష్టం చేసేందుకు 2007లో అప్పటి ప్రభుత్వం విడుదల చేసిన ఆరు జీఓలను ప్రస్తుత చంద్రబాబునాయుడు సర్కారు ఎందుకు రద్దు చేసిందని హిందూ దేవాలయ ప్రతిష్టాన పీఠం పీఠాధిపతి శ్రీ కమలానంద భారతి స్వామిజీ ప్రశ్నించారు. స్వామిజీ క్రిష్టమందిరంలో మంగళ వారం స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ జీఓలను విడుదల చేశారని, వాటిని రద్దు చేయాల్సిందే అన్న మూర్ఖపు ఆలోచనలు చేస్తే దేవాలయాలు మరుగున పడిపోవడం ఖాయమని ఆయన హెచ్చరించారు. దేవాదాయ శాఖలో పనిచేసే కొందరు అవినీతి ఉద్యోగుల ప్రోద్భలంతోనే ఆరు జీఓలు రద్దు చేశారని తెలుస్తోందని, అది మంచిది కాదని హితవు పలికారు. ఆలయ ఉద్యోగుల నియామకం, పదోన్నతులు, కామన్‌గుడ్ ఫండ్, టెండర్లు తదితర వాటికి సంబంధించిన జీఓలు( జీఓ నెం 337, 927, 419, 420, 424, 426) రద్దు చేయడం అవినీతికి గేట్లు తెరవడమేనన్నారు. రద్దు చేసిన జీఓలపై ప్రభుత్వం తక్షణం పునరాలోచించకపోతే ఉద్యమ బాట తప్పదని స్వామీజీ హెచ్చరించారు. -
'చంద్రబాబు అంటే వారికి భయం తగ్గింది'
-
చంద్రబాబు అంటే వారికి భయం తగ్గింది: జేసీ
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ప్రతిష్ట తగ్గిందని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు అంటే అధికారులకు అస్సలు భయం లేకుండా పోయిందని, ఆయన కొరడా ఝుళిపించాలని అన్నారు. లేదంటే రాష్ట్రం ఇబ్బందుల్లో పడుద్దని హెచ్చరించారు. టీడీపీ ఎంపీ అయిన జేసీ తనలో ఇంకా కాంగ్రెస్ రక్తమే ప్రవహిస్తుందని అన్నారు. అసెంబ్లీలో బిల్లులు పాస్ చేయించుకోవడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుందని జేసీ అన్నారు. అటు పార్లమెంటులో.. ఇటు అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చకు రావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్షం సమన్వయంతో వ్యవహరించి ప్రజా సమస్యలు సభలో చర్చకు వచ్చేలా చూసుకోవాలని అన్నారు. గతంతో పోలిస్తే రాజకీయాలు స్వచ్ఛందంగా లేవని, కలుషితమయ్యాయని చెప్పారు. ప్రభుత్వాలు సహకరించకపోతే తెలివిగా వ్యవహరించాలని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్షాలు జనాలకు చెప్పలేకపోతున్నాయని వివరించారు. కాల్ మనీ అనేది అనాదిగా ఉందని, అధిక వడ్డీలు లేకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం కూడా చెప్పిందని, మనమే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలని అన్నారు. రాయలసీమకు మూడు నామాలు తప్ప.. అభివృద్ధి లేదని అర్థమైందని చెప్పారు. -
'బాబు పాలనకు చరమగీతం పాడాలి'
గుంటూరు: జన్మభూమి కమిటీల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్థానిక సంస్థల హక్కులను నిర్వీర్యం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడాలని సూచించారు. మతం పేరుతో జనాన్ని విడగొట్టే చర్యలను ఖండించాలని ఆయన అన్నారు. -
'ఆ మూడు మోదీని గద్దె దించుతాయి'
వడోదర: ప్రధాని నరేంద్రమోదీపై ఒకప్పటి నటుడు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నేత రాజ్ బబ్బార్ విరుచుకుపడ్డారు. సామాన్యుడిని ప్రధాని నరేంద్ర మోదీ నిలువునా మోసం చేశారని అన్నారు. ఆయన చేసిన నిర్లక్ష్యంతో అధికారాన్ని కోల్పోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే ఎన్డీయే ప్రభుత్వం మరిచిపోయిందన్నారు. హర్యానాలో దళిత చిన్నారుల హత్యలు, దాద్రి ఘటనలు, ఆకాశాన్నంటిన పప్పుల ధరలను ఉద్దేశిస్తూ 'దాల్, దళిత్, దాద్రి' ఘటనలు మోదీని త్వరలోనే గద్దెను దించుతాయని చెప్పారు. త్వరలో వడోదరలో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇక్కడికి పార్టీ తరుపున ప్రచారానికి వచ్చిన బబ్బార్ పై విధంగా వ్యాఖ్యలు చేశారు. దీంతోపాటు మొన్న ఢిల్లీలో నిన్న బిహార్ ఎన్నికల్లో ఏ విధంగానైనా విజయం సాధించాలనే ఉద్దేశంతో వీలయినన్ని జిమ్మిక్కులు ఎన్డీయే ప్రభుత్వం చేసిందని, ప్రధాని మోదీ అయితే ఏకంగా 31 ర్యాలీల్లో పాల్గొని ప్రసంగించారని చెప్పారు. కానీ, ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి చూస్తేనే ప్రధాని మోదీ ప్రజలను దారుణంగా మోసం చేశారనే విషయం అర్థమైపోతుందని అన్నారు. నవంబర్ 22 నుంచి 29 వరకు ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ రెండు ప్రాంతాల్లో దెబ్బతిన్న మోదీ పటాలానికి ఇక మిగిలింది 2017లో ఉన్న గుజరాత్ ఎన్నికలే చివరి పరీక్ష అని వాటితో రానున్న రోజుల్లో ఎన్డీయే భవితవ్యమేమిటో తేలిపోతుందన్నారు. -
'మాట తప్పడం మీకు వెన్నతో పెట్టిన విద్య'
సాక్షి, హైదరాబాద్: ఆచరణ సాధ్యంకాని హామీలు ఇవ్వడం, ఇచ్చిన మాటతప్పడం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. వరంగల్ ఉప ఎన్నికకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారానికి వెళ్తున్న సందర్భంగా సోమవారం కిషన్‌రెడ్డి 32 ప్రశ్నలతో కూడిన బహిరంగలేఖను రాశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు, చెప్పిన మాటలకు ఆచరణలో భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉందని విమర్శించారు. లక్ష రూపాయల పంటరుణాలను మాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారని, ప్రశ్నించిన ప్రతిపక్షాలను అసెంబ్లీ నుంచి గెంటేశారని, అడుగుతున్న రైతులపై కేసులు పెట్టి జైళ్లలో ఉంచుతున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఇచ్చిన హామీల అమలుపై వరంగల్‌లో జరిగే ప్రచార సభలో సమాధానం చెప్పాలన్నారు. పంటరుణాల మాఫీ, దళిత ముఖ్యమంత్రి, ఇంటికో ఉద్యోగం, కాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్ధీకరణ, కేజీ టు పీజీ విద్య, ప్రతీ మండలానికో 30 పడకల ఆసుపత్రి, స్కాలర్షిప్లు, దళిత కుటుంబానికి మూడెకరాల భూమి వంటి హామీలపై కిషన్ రెడ్డి ప్రశ్నలు సంధించారు. వరంగల్ చుట్టూ ఔటర్ రింగురోడ్డు, గుడిసెల స్థానంలో ఇళ్లు, వరంగల్‌లో విమానాశ్రయం, ఐటీ కంపెనీల తరలింపు, కాటన్ ఇండస్ట్రీ, మహిళా విశ్వవిద్యాలయం, గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడం వంటి హామీలు అమలు చేయకుండా ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించారు. -
మహిళలు లేరని ఐక్యరాజ్య సమితిలో గొడవ
న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి మహిళల ఉన్నత విభాగంలో విమర్శల గొడవలు మొదలయ్యాయి. దాదాపు పదిహేనేళ్ల తర్వాత తొలిసారి అంతర్జాతీయ శాంతి గురించి ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టే బృహత్తర కార్యక్రమానికి ఆ విభాగం నుంచి కనీస సంఖ్యలో కూడా మహిళలు పాలుపంచుకోవడంపట్ల ఐక్యరాజ్యసమితి ఇతర ఉన్నత విభాగ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మహిళా విభాగాన్ని తీవ్రంగా విమర్శించారు. ప్రపంచశాంతి నిర్మాణంలో భాగంగా ఒక తీర్మానం తీసుకురావాలని అందులో మహిళలకు కూడా భాగస్వామ్యం కల్పించడంతోపాటు, ఆ తీర్మానంలో మహిళలకు సంబంధించి పలు అంశాలు చేర్చినా వాటిని పట్టించుకోకుండా వారు హాజరుకాకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తిని కలిగించిందని అన్నారు. ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఈ తీర్మానం విషయంలో మంగళవారం ప్రత్యేక భేటీ నిర్వహించామని, ఈ సమావేశానికి తక్కువ సంఖ్యలో హాజరయ్యారని, కొన్ని దేశాలకు ప్రాతినిథ్యం వహించే మహిళలు పాల్గొనకపోవడం కొంత విస్మయాన్ని కలిగించిందని భద్రతా మండలి సభ్యురాలు హుమిజిల్ లాంబో యంగ్కుఖా అన్నారు. -
అన్సారీపై ఆర్ఎస్ఎస్ ధ్వజం
అత్యున్నత పదవిలో ఉంటూ లౌకిక ధర్మాన్ని పాటించాల్సింది పోయి ఫక్తు మత నాయకుడిలా మాట్లాడారంటూ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీపై ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) ధ్వజమెత్తింది. ఇటీవల ఆలిండియా ముస్లిమ్ మజ్లిస్-ఏ-ముషావరత్ స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రసంగించిన అన్సారీ భారత్‌లో ముస్లింలు అణిచివేతకు గురవుతున్నారని వ్యాఖ్యానించడం తెలిసిందే. అన్సారీ అభిప్రాయంతో పూర్తిగా విభేదిస్తూ.. ముస్లింలు ఎదుర్కొంటున్న పరిస్థితులకు వారి అతివాద ధోరణే కారణమని తెలియజెప్పడంలో అన్సారీ విఫలమయ్యారని ఆర్ఎస్ఎస్ తన అధికారిక పత్రిక 'పాంచజన్య'లో పేర్కొంది. గుర్తింపు, భధ్రత, విద్యావకాశాలు, అభివృద్ధి తదితర విషయాల్లో ముస్లింలు సవాళ్లను ఎదుర్కొంటున్నారంటూ అన్సారీ ఓ మత నాయకుడి మాదిరిగా మాట్లాడారని, అందరి సంక్షేమం గురించి ఆలోచించాల్సిన ఆయన స్థాయికి తగ్గట్లు వ్యవహరించలేదని 'పాంచజన్య' విమర్శించింది. 'ఇస్లాం, నవీన విధానం (మోడర్నిటీ) రైలు పట్టాల్లా ఎప్పటికీ కలవవని ఐఎస్ఐఎస్, తాలిబన్, బొకోహరాం లాంటి ముస్లిం తీవ్రవాద సంస్థలు అంటున్నాయి. ఇస్లాం, మోడర్నిటీలు వేరువేరనే నిజాన్ని అన్సారీ లాంటివాళ్లు చెప్పరు. శతాబ్దాల కిందట ఏర్పరుచుకున్న నియమాలు నూతన విధానాలెలా అవుతాయో ఆయన ఆత్మావలోకనం చేసుకోవాలి' అని ఆర్ఎస్ఎస్ అభిప్రాయపడింది. ముస్లిం పర్సనల్ లా బోర్డు, ఇతర ముస్లిం సంస్థలు భారత్ అనుసరిస్తున్న లౌకిక విధానానికి ఎలా తూట్లు పొడుస్తున్నాయో అన్సారీ గుర్తెరగాలని, రిజర్వేషన్లు, అభివృద్ధి ఫలాలు మతం ఆధారంగా లభించవనే విషయం అర్థం చేసుకుంటే మంచిదని పేర్కొంది. ముస్లింలకు మదర్సాల ఏర్పాటుకు అనుమతులు, హజ్ యాత్రలకు ఆర్థిక సహాయం అందించడాన్ని ఆర్ఎస్ఎస్ ప్రశ్నించింది. -
కిరికిరి మనిషి అంటాడా?
(సాక్షి వెబ్ ప్రత్యేకం) అదేంటి గురువా అలా అయిపోయావు. పొరుగు రాష్ట్రం ఆయన ఏదో మాట తూలితే ఇలా డల్ గా అయిపోవడం ఏం బాలేదు. నిన్నెవరైనా ఒక్క మాటంటే వాళ్లపై వంద మాటలతో దాడి చేయడానికి మేమంతా లేమా. అయినా పాలిటిక్స్ లో క్రిటిసైజ్ చేసుకోవడం కామన్ అని నీకు చెప్పేంత వాడిని కాదనుకో. అదికాదురా నాతో కలిసి పనిచేసిన సహచరుడే నన్ను కిరికిరి మనిషి అని లక్షలమంది ముందు నోరు పారేసుకోవడం ఆవేదన కలిగింది శిష్యా. సాటి తెలుగు రాష్ట్రానికి సీఎంగా ఉన్నానన్న గౌరవం కూడా లేకుండా నోటికొచ్చినట్టు తిట్టడం తట్టుకోలేకపోయా. పదేళ్లు పవర్ లేనప్పుడు కూడా ఇంత బాధ కలగలేదంటే నమ్ము. ఏదో విమర్శించాలని అలా అని ఉంటాలే. దానికి ఇంత ఇదైపోతే ఎలా గురువా. రాజకీయాలన్నాక ఇలాంటివి మామూలే. ఆ మాటకొస్తే పవర్ పాలిటిక్స్ లో తిట్టు తినకుండా నెగ్గుకొచ్చిన నాయకుడు నేటి జమానాలోఒక్కడైనా ఉన్నాడా చెప్పు. ఎన్ని తిట్లు తిని మనమీ స్థాయికి వచ్చాం. పిల్లనిచ్చిన సొంత మామ పదో గ్రహం అని పదేపదే తిట్టినా పట్టించుకోనోడివి కొత్త రాష్ట్రం నేత నిన్ను కిరికిరి మనిషివి అన్నాడని ఆవేదన చెందడం అబ్బెబ్బే అస్సలు కరెక్టు కాదు. అదలా ఉంచరా అంతా కలిసునప్పుడు అభివృద్ధి కోసరం ఎంత కష్టపడ్డాను. పేరుకే సీఎంనే అయినా సీఈవోగా పనిచేసి భాగ్యనగరాన్ని 'హై'టెక్కులో నిలిపింది నేను కాదా. అప్పటి అగ్రరాజ్యాధినేతను హైదరాబాద్ కు తీసుకొచ్చి ప్రపంచ దేశాలన్నీ మనవైపు చూసేలా చేసింది నేనన్న సంగతి మర్చిపోయారు. ప్రతిదానికి అడ్డుపడుతున్నాంటూ ఇప్పుడు నాపై గయ్యిమనడం గులాబీ నేతకు తగునా? బాధపడకు గురువా పడ్డవాడేవడూ చెడ్డవాడు కాదు. అసలు నీ ప్రమేయమే లేకపోతే ఉద్యమ నేత తన రాష్ట్రానికి సీఎం అయ్యేవాడేనా. ఉమ్మడి రాష్ట్రాన్ని విడదీయమని ముందు చెప్పిందే ననేనంటూ నువ్వెన్నిసార్లు మీడియా ముఖంగా చెప్పినా ఆయనగారి చెవికెక్కలేదమో. అందుకే నిన్ను అంతలా ఆడి పోసుకుంటున్నాడు. మనం తయారు చేసుకున్న నాయక తమ్ముళ్లను నిమ్మళంగా లాక్కుపోయినా గమ్మునున్నా కానీ కారు పార్టీ నేతను ఒక్క కానిమాటైనా అన్నానా శిష్యా. ఒకరు పోతే వంద మంది నాయకులను తయారు చేసుకుంటామన్నాం కానీ పల్లెత్తు మాట తూలలేదు. అప్పుడెప్పుడో పార్టీని కాపాడేందుకు 'వెస్రాయ్ వ్యూహం' పన్నానేగాని ఆయనలా గంపగుత్తగా 'ఆకర్షణ' పథకం పెట్టలేదె. ఇదంతా కాదు నేనెంటే భయపడే పదేపదే నన్ను తిడుతున్నాడు. -పి. నాగశ్రీనివాసరావు -
'కేసీఆర్ ఓ మాయలోడు'
సరూర్‌నగర్ (హైదరాబాద్): తెలంగాణ రాగానే మొదటి సీఎంగా దళితుడిని చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తానే సీఎం కుర్చీలో కూర్చున్న మాయలోడని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ హోంమంత్రి సబితారెడ్డి ఘాటుగా విమర్శించారు. గురువారం బాలాపూర్ చౌరస్తాలోని చిగురింత కృష్ణారెడ్డి గార్డెన్లో కాంగ్రెస్ బలపరిచిన ఎంఎల్సీ అభ్యర్థి ఆగీరు రవికుమార్ గుప్తా ప్రచార సమావేశం నిర్వహించారు. సబితతోపాటు మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సబిత మాట్లాడుతూ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తెలంగాణ ఏర్పాటుకోసం పోరాడిన వారు చాలా మంది ఉండగా, వారిని కాదని స్వార్థంతో స్థానికేతరుడైన దేవి ప్రసాద్‌ను అభ్యర్థిగా బరిలోకి దింపటం విడ్డూరమన్నారు. కేసీఆర్ అచ్చమైన దొరలపాలన సాగిస్తున్నారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆగీరు రవికుమార్ గుప్తాను గెలిపించాలని సబిత పార్టీ శ్రేణులకు సూచించారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ సామ నర్సింహగౌడ్, వైస్‌చైర్మన్ చిగురింత నర్సింహారెడ్డి, మాజీ జెడ్పీటీసీ చల్లా నర్సింహారెడ్డి, పెంటారెడ్డి, పార్టీ నగర పంచాయతీ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సామ నర్సింహారెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు మర్రి హన్మంత్‌రెడ్డి, మాజీ ఎంపీపీ లావణ్య బీరప్ప, బడంగ్‌పేట నగర పంచాయతీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
'కేసీఆర్ రోజుకో సినిమా చూపిస్తున్నడు'
పరిగి: సీఎం కేసీఆర్ చేసే పనులతో రాష్ట్ర ప్రజలకు రోజుకో సినిమా చూపిస్తున్నారని మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. రాజధానిలో ఆయన కన్నుపడిన ఏ భూమిని కేసీఆర్ వదలకుండా అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా పరిగిలో ఆదివారం జరిగిన నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లా పట్టభద్రుల స్థానం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రవికుమార్ గుప్తాను గెలిపించాలని ఆమె కోరారు. టీఆర్ఎస్, బీజేపీలు స్థానికులకు కాకుండా స్థానికేతరులకు ఎమ్మెల్సీ టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గెలుస్తామన్న అహంకారంతోనే ఇలా చేశారని, వారి అహంకారాన్ని అణచాలని కోరారు. ఎన్నికల ముందు ఆంధ్రావాళ్లను కించపరిచి ఇప్పుడు హైదరాబాద్ ఎన్నికల కోసం మాటమార్చారని ఆమె మండిపడ్డారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని, కనీసం వారి కుటుంబాలను పరామర్శించట్లేదని ఆమె దుయ్యబట్టారు. మరోవైపు తనను గెలిపిస్తే ఎల్లవేళలా అండగా ఉండి సేవ చేస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి రవికుమార్ పేర్కొన్నారు. -
'మోదీ హయాంలో భారత్‌కు గడ్డుకాలం'
ప్రధానిగా నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి భారత్ లో జాతి వైరాలు ఎక్కువవుతున్నాయని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నేస్టీ ఇంటర్నేషనల్ ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న భూసేకరణ చట్టం సవరణ బిల్లు ద్వారా దేశంలో చాలామంది భారతీయులు గడ్డు పరిస్థితిని ఎదుర్కోనున్నారని ఆ సంస్థ పేర్కొంది. మే 2014లో జరిగిన సాధరణ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు జరిగిన పలు హింసాత్మక ఘటనలు పరిశీలనలోకి తీసుకున్న ఆమ్నేస్టీ.. జరిగిన ఘర్షణలన్నీ కూడా కార్పోరేట్ ప్రాజెక్టుల నేపథ్యంలో జరిగినవేనని పేర్కొంది. ఆ ప్రాజెక్టు నిర్మించే క్రమంలో అక్కడి వారిని సంప్రదించకుండా ఉండటం వల్ల వర్గాలుగా ఏర్పడి ఘర్షణలు తలెత్తుతున్నాయంది. ప్రజలకు సుస్థిరమైన, సురక్షితమైన పాలనను అందిస్తానని, మెరుగైన వసతులు కల్పిస్తానని అధికారంలోకి వచ్చిన మోదీ అనంతరం ఎవ్వరినీ సంప్రదించకుండానే ప్రాజెక్టులు పూర్తి చేసేలా, కార్పొరేట్ సంస్థలకు తలొగ్గేలా పనిచేస్తున్నారని విమర్శించింది. మరోపక్క ఉగ్రవాద చర్యల పట్ల ప్రపంచ దేశాలన్నీ కూడా సాధా సీదాగా వ్యవహరిస్తున్నాయని ఇది సిగ్గుపడాల్సిన విషయమని పేర్కొంది. ప్రపంచ దేశాలు ఆయుధాల దిగమతి నిలిపివేసి, ఉగ్రవాదాన్ని, హింసను, దాడులను నియంత్రించే చర్యలపై దృష్టి పెట్టాలని ఈ క్రమంలో ఎవరి హక్కులకు భంగం కలగరాదని పేర్కొంది. -
'వరంగల్ పర్యటనకు బాబు విదేశీయుడిలా వస్తున్నారా...?'
హైదరాబాద్: హైదరాబాద్‌ను విదేశంతో పోల్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరంగల్ పర్యటనకు ఓ విదేశీయుడిలా వస్తున్నారా..? ఆర్ధిక లావాదేవీల కోసం వస్తున్నారా..? అని టీఆర్ఎస్ నాయకుడు, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ప్రశ్నించారు. వరంగల్ జిల్లాలోని ఖనిజ సంపదను దోచుకునేందుకు బాబు పర్యటన పెట్టుకున్నారని కర్నె ప్రభాకర్ ఆరోపించారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో కర్నె ప్రభాకర్ విలేకరులతో బుధవారం మాట్లాడుతూ... రాజ్యాంగ బద్దంగా సీఎంగా ఎన్నికైన బాబు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను 9ఏళ్లు పాలించాడని, ఆయన తెలంగాణకు రావొచ్చు, పోవొచ్చు, కానీ, విదేశీయుడిలానే వస్తున్నారా అని సందేహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వరంగల్‌లో దేనిపై సమీక్ష పెడుతున్నారని, ఏం దోచుకోవాలని ప్రణాళిక వేస్తున్నారని నిలదీశారు. రాష్ట్రం విడిపోయాక చంద్రబాబు తెలంగాణ హక్కులను కాల రాస్తున్నాడని, పోలవరంతో ఉన్న ముంపు విషయంలో ఏమాత్రం ఆలోచించకుండా ఎత్తు తగ్గించేందుకు ససేమిరా అంటున్నాడని ప్రభాకర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సర్కారుకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న తెలంగాణ టీడీపీ నేతలు ఒక విషయంలో ఆలోచించుకోవాలని, గతంలో ఎన్ని ఆటలు ఆడినా చెల్లుబాటు అయ్యాయని.. కానీ, ఇప్పుడు అలాంటివి కుదరదని, ఫణికర మల్లయ్య మాదిరిగా ప్రశ్నిస్తారని ఎమ్మెల్సీ కర్నె తెలిపారు. వరంగల్ ప్రజలు ఆత్మగౌరవం చాటుకుంటారు తస్మాత్ జాగ్రత్త అని బాబును హెచ్చరించారు. తెలంగాణ పర్యటనకు వచ్చే ఎవరినీ అడ్డుకోమని, గతంలోనూ తెలంగాణ వ్యతిరేకులను కూడా అడ్డుకోలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ సందర్భంగా కర్నె ప్రభాకర్ చెప్పారు. -
కాంగ్రెస్ లాగే బీజేపీ కూడా అన్యాయం చేసింది
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రైల్వే బడ్జెట్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణకు ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా ఇవ్వలేదని విమర్శించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ మంగళవారం పార్లమెంట్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అనంతరం కేసీఆర్ స్పందిస్తూ.. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులివ్వలేదని చెప్పారు. ఎంఎంటీఎస్ రెండో దశకు 20 కోట్ల రూపాయిలు కేటాయిస్తా సరిపోతాయా అంటూ ప్రశ్నించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం మాదిరే ఎన్డీయే ప్రభుత్వం కూడా తెలంగాణకు అన్యాయం చేసిందని కేసీఆర్ విమర్శించారు.