టాప్ బిలియనీర్ హోదా, స్పేస్‌ఎక్స్ ప్రయోగాలు, క్రిప్టో కరెన్సీ ఇన్‌ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా సెన్సేషన్, టైమ్ పర్సన్ 2021 ఇయర్ ఘనత .. వెరసి నిత్యం వార్తల్లో నిలిచే సెలబ్రిటీగా పోయిన ఏడాది మొత్తాన్ని ఏలేశాడు ఎలన్ మస్క్. అఫ్‌కోర్స్.. అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. అయితే కిందటి ఏడాది చివర్లో ఆయన చేసిన ఓ ట్వీట్ రాజకీయ విమర్శలకు కారణమైంది.
డిసెంబర్ 20వ తేదీన ఎలన్ మస్క్ తన ట్విటర్‌లో ఓ ట్వీట్ చేశాడు. ఏడాదిగానూ ఏకంగా 11 బిలియన్ డాలర్ల పన్ను చెల్లించబోతున్నట్లు ప్రకటించుకున్నాడు. దీంతో ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన వ్యక్తి చెల్లించే పన్ను గురించి ఆసక్తికర చర్చ నడించింది. అయితే ఈ ట్వీట్‌పై ఎలన్ మస్క్‌ను తిట్టిపోస్తున్నారు అమెరికా చట్టప్రతినిధులు. ఎలన్ మస్క్ సహా ధనవంతులెవరూ సరైన పన్నులు చెల్లించడం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
For those wondering, I will pay over $11 billion in taxes this year
— Elon Musk (@elonmusk) December 20, 2021
ఈ విమర్శలు చేసేవాళ్లలో ఇండో-అమెరికన్ కాంగ్రెస్‌ఉమెన్ ప్రమీలా జయపాల్ కూడా ఉన్నారు. ప్రమీలా యూఎస్ హౌజ్‌లో తొలి ఇండో-అమెరికన్ కాంగ్రెస్ ఉమెన్ కూడా. పన్నుల చెల్లింపుపై గొప్పలకు పోతున్నారా? అంటూ ఆమె ఎలన్ మస్క్‌ను నిలదీశారు. ‘పన్ను చెల్లింపు విషయంలో గప్పాలు కొట్టుకోవద్దు.. ఆ చెల్లించేది సరైన పన్నులు కావనేది అందరికీ తెలుసు’ అని ఆమె పేర్కొన్నారు. ఎలన్ మస్క్ ఒక్కరోజు సంపాదనే 36 బిలియన్ డాలర్లు. కానీ, 11 బిలియన్ డాలర్లు ట్యాక్స్ చెల్లిస్తున్నట్లు గొప్పగా చెప్పుకుంటున్నారు. కేవలం కరోనా టైంలోనే 270 బిలియన్ డాలర్లు వెనకేసుకున్నాడు. ధనికులు తమ న్యాయమైన వాటాను చెల్లించే సమయం వచ్చేసింది’ అంటూ వ్యాఖ్యానించారామె.
మరోవైపు రిపబ్లికన్ సెనేటర్ టెడ్ క్రూజ్ కూడా ‘ఎలన్ మస్క్ దోపిడీ’ మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా చట్టప్రతినిధులకు, అమెరికాలోని బిలియనీర్లకు మధ్య ట్యాక్స్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. సక్రమంగా పన్నులు చెల్లించని బిలియనీర్ల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేసేందుకు ప్రత్యేక చట్టాల్ని రూపొందించింది బైడెన్ ప్రభుత్వం. దీని నుంచి తప్పించుకునేందుకు ఎలన్ మస్క్ సహా పలువురు టెక్ మేధావులు ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషిస్తున్నారు.
ఇక 40.8 శాతం అత్యధిక పన్ను రేటుతో, 280 బిలియన్ డాలర్ల నికర విలువ సంపదన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన మస్క్, టెస్లా షేర్ల ద్వారా దాదాపు 10.7 బిలియన్ డాలర్ల ఫెడరల్ పన్ను బిల్లును చెల్లించాల్సి ఉంటుందని ప్రోపబ్లికా నివేదిక పేర్కొంది. అయితే మస్క్ సహా ఇతర బిలియనీర్లు 2018లో ఫెడరల్ ఆదాయపు పన్నులు చెల్లించలేదని ప్రోపబ్లికా దర్యాప్తు ఒక నివేదిక విడుదల చేసింది. 2014 మరియు 2018 మధ్య కాలంలో, మస్క్ తన సంపద $13.9 బిలియన్లు పెరిగినప్పటికీ, 1.52 బిలియన్ డాలర్ల ఆదాయంపై కేవలం 455 మిలియన్ల డాలర్ల పన్నులు చెల్లించాడు.
చదవండి: పాపం ఎలన్ మస్క్..! తినడానికి తిండి లేని రోజుల్లో ఏం చేసేవాడో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment