Pramila Jayapal
-
USA: బైడెన్ ప్రభుత్వంలో ఎన్నారైల పట్టు
వాషింగ్టన్: అమెరికా రాజకీయాల్లో ఇండియన్ అమెరికన్లకి ప్రాధాన్యత పెరుగుతోంది. కాంగ్రెస్ సభ్యులైన నలుగురు ఇండియన్ అమెరికన్లను అత్యంత ముఖ్యమైన హౌస్ పానెల్స్ సభ్యులుగా నియమించారు. ఇమిగ్రేషన్ శాఖలో అత్యంత శక్తిమంతమైన హౌస్ జుడీషియరీ కమిటీ ప్యానెల్ సభ్యురాలిగా కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీల జయపాల్ నియమితులయ్యారు. అమెరికాలో ఛిన్నాభిన్నంగా మారిన ఇమిగ్రేషన్ వ్యవస్థని గాడిలో పెట్టడానికి అవకాశం ఇచ్చినందుకు జయపాల్ హర్షం వ్యక్తం చేశారు. ఇక ఇంటెలిజెన్స్‌కు సంబంధించి వ్యవహారాలను నడిపే కమిటీ సభ్యుడిగా అమిబేరాని నియమించారు. అమెరికా జాతీయ భద్రత అంశంలో ఇంటెలిజెన్స్ కమిటీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాలిఫోర్నియా నుంచి ఆరు సార్లు కాంగ్రెస్‌కు ఎన్నికైన బేరా జాతి భద్రతకు సంబంధించిన కమిటీలో సభ్యుడు కావడం ఎంతో గర్వకారణమని వ్యాఖ్యానించారు. అమెరికా సహా ప్రపంచదేశాలకు ముప్పుగా మారిన చైనా వ్యవహారాలపై కొత్తగా ఏర్పాటైన కమిటీలో సభ్యుడిగా రాజా కృష్ణమూర్తిని నియమించారు. మరొక ఇండియన్ అమెరికన్ ప్రజాప్రతినిధి రో ఖన్నాకి అమెరికా, చైనా మధ్య వ్యూహాత్మక పోటీకి సంబంధించిన కమిటీలో సభ్యుడిగా చోటు కల్పించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఆర్థికంగా, భద్రతా పరంగా అమెరికా సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో వాటిని ఎదుర్కోవడానికి వ్యూహరచన చేయాల్సిన అవసరం ఉందని కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. -
స్త్రీ శక్తి: మడమ తిప్పలేదు... అడుగు ఆపలేదు
పౌరహక్కుల నుంచి పర్యావరణం వరకు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. జాత్యహంకార బెదిరింపులు ఎన్ని ఎదురైనా ధైర్యమే వజ్రాయుధంగా ముందుకు కదిలారు. కొత్త అడుగుతో చరిత్ర సృష్టించారు. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన మన వాళ్ల గురించి.. అరుణా మిల్లర్ మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా గెలిచిన అరుణా మిల్లర్ హైదరాబాద్‌లో పుట్టింది. భారత సంతతికి చెందిన వ్యక్తి లెఫ్టినెంట్ గవర్నర్ కావడం ఇదే మొదటిసారి. ఈ విషయంలో అరుణ చరిత్ర సృష్టించింది. మేరీలాండ్కు తొలి భారతీయ–అమెరికన్ డెలిగేట్‌గా తన ప్రత్యేకత చాటుకుంది. మిస్సోరీ యూనివర్శిటీలో సివిల్ ఇంజనీరింగ్ చేసిన అరుణ ట్రాన్స్‌పోర్టేషన్ ప్లానర్‌గా, ట్రాఫిక్ ఇంజనీర్‌గా వివిధ ప్రాంతాలలో పనిచేసింది. మిస్సోరీ ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన అరుణ ఆరోగ్య సంరక్షణ నుంచి పర్యావరణ పరిరక్షణ వరకు ఎన్నో కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించింది. పరిమళా జయపాల్ పరిమళా జయపాల్ యూఎస్ హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్(ప్రతినిధుల సభ)కు ఎంపికైన తొలి భారతీయ–అమెరికన్ మహిళ. తాజాగా 7వ డిస్ట్రిక్ట్(వాషింగ్టన్) నుంచి ప్రతినిధుల సభకు ఎంపికైంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి క్లిఫ్‌మూన్‌పై విజయం సాధించింది. చెన్నైలో పుట్టిన పరిమళా జయపాల్ ఇండోనేషియా, మలేసియాలో పెరిగింది. తల్లి రచయిత్రి. తండ్రి మార్కెటింగ్ రంగంలో పనిచేశారు. పదహారు సంవత్సరాల వయసులో అమెరికాకు వెళ్లింది పరిమళ. జార్జ్‌టౌన్ యూనివర్శిటీ నుంచి బీఏ, కెలాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పట్టాలు పుచ్చుకుంది. చదువు పూర్తయిన తరువాత ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో ఫైనాన్షియల్ ఎనలిస్ట్‌గా పనిచేసింది. రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి ముందు పౌరహక్కుల ఉద్యమాల్లో చురుగ్గా పనిచేసింది. ‘హేట్ ఫ్రీ జోన్’ అనే సంస్థను ప్రారంభించి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. పరిమళ మంచి రచయిత్రి కూడా. ‘పిల్గ్రిమేజ్: వన్ వుమెన్స్ రిటర్న్ టు ఏ ఛేంజింగ్ ఇండియా’ అనే పుస్తకం రాసింది. ‘నువ్వు మీ దేశానికి వెళ్లి పో’ అంటూ ఆమెకు ఎన్నోసార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయితే ఆమె వాటిని ఎప్పుడూ ఖాతరు చేయలేదు. వెనక్కి తగ్గలేదు. నబీలా సయ్యద్ అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికలలో ఇల్లినాయి జనరల్ అసెంబ్లీకి ఎన్నిక కావడం ద్వారా 23 ఏళ్ల ఇండియన్–అమెరికన్ నబీలా సయ్యద్ చరిత్ర సృష్టించింది. డెమోక్రటిక్ పార్టీకి చెందిన నబీలా 51వ డిస్ట్రిక్ట్‌లో రిపబ్లిక్ పార్టీకి చెందిన క్రిస్ బోస్పై ఘన విజయం సాధించింది. ఇల్లినాయి రాష్ట్రంలోని పాలై్టన్ విలేజ్‌లో పుట్దింది నబీలా. హైస్కూల్ రోజుల నుంచి ఉపన్యాస పోటీల్లో చురుగ్గా పాల్గొనేది. వాటి ద్వారా రకరకాల సామాజిక విషయాలను లోతుగా తెలుసుకునే అవకాశం వచ్చింది. కాలేజిలో ఎన్నో చర్చావేదికల్లో పాల్గొనేది. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి పొలిటికల్ సైన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లలో పట్టా పుచ్చుకుంది. స్త్రీ సాధికారత, హక్కులకు సంబంధించి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనే నబీలా ఉద్యోగం కంటే ఉద్యమాలకే ప్రాధాన్యత ఇచ్చేది. ఈ క్రమంలోనే రాజకీయాలకు దగ్గరైంది. ‘ఎమిలీస్ లిస్ట్’తో కలిసి పనిచేసింది. ఎమిలీస్ లిస్ట్ అనేది డెమోక్రటిక్ మహిళా అభ్యర్థులు చట్ట సభకు ఎన్నిక కావడానికి ఉపకరించే పొలిటికల్ యాక్షన్ కమిటీ.‘నా విజయానికి ప్రధాన కారణం తమ తరపున పోరాడే, బలంగా గొంతు వినిపించే వ్యక్తిని ప్రజలు తమ ప్రతినిధిగా చట్టసభకు పంపాలనుకోవడం. వారి నమ్మకాన్ని నిలబెడతాను’ అంటోంది నబీలా.ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటి తలుపు తట్టిన నబీలా తనను గెలిపించిన వారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి మళ్లీ ఇంటింటికీ వెళ్లనుంది. -
అమెరికా మధ్యంతరంలో ఐదుగురు భారతీయులు
వాషింగ్టన్: అమెరికా పార్లమెంట్ దిగువ సభకు జరుగుతున్న మధ్యంతర ఎన్నికల్లో ఐదుగురు భారతీయ అమెరికన్లు బరిలో దిగారు. కాలిఫోర్నియాలోని ఏడో కాంగ్రెషనల్ స్థానం నుంచి 57 ఏళ్ల అమీ బేరా ఆరోసారి రేసులో ఉన్నారు. 46 ఏళ్ల రో ఖన్నా కాలిఫోర్నియాలోని 17వ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. వాషింగ్టన్ రాష్ట్రంలోని ఏడో స్థానం నుంచి 57 ఏళ్ల జయపాల్ అదృష్టం పరీక్షించుకోనున్నారు. మిషిగన్‌లోని 13వ స్థానం నుంచి శ్రీ థనేదర్ పోటీకి సిద్ధమయ్యారు. రిపబ్లిక్ అభ్యర్థులతో పోలిస్తే బేరా, రాజా, ఖన్నా, ప్రమీలా బలంగా ఉన్నట్లు సమాచారం. ఇక 67 ఏళ్ల థనేదర్ అరంగేట్రం చేస్తున్నారు. ఐదుగురిలో ప్రమీలా జయపాల్ ఒక్కరే మహిళా అభ్యర్థి. హోరాహోరీ పోరు ఉండే స్థానాల్లో భారతీయ అమెరికన్ ఓటర్ల పాత్ర కీలకం కానుంది. ప్రతినిధుల సభలో 435 మంది సభ్యులుంటారు. 50 రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదికన స్థానాలను కేటాయిస్తారు. సెనేట్‌లో మాత్రం 100 మంది సెనేటర్లు ఉంటారు. ప్రతి రాష్ట్రానికి సమప్రాధాన్యత అంటే రెండు సీట్లు ఉంటాయి. మరోవైపు మేరీలాండ్ రాష్ట్రంలో డెమొక్రటిక్ మహిళా అభ్యర్థిగా లెఫ్టినెంట్ గవర్నర్ పదవి కోసం 57 ఏళ్ల అరుణా మిల్లర్ పోటీపడుతున్నారు. ఆమె గెలిస్తే ఈ పదవి చేపట్టే తొలి భారతీయ అమెరికన్‌గా చరిత్ర సృష్టిస్తారు. ప్రతినిధుల సభకు నవంబర్ ఎనిమిదో తేదీన పోలింగ్ జరగనుంది. -
ఇండియాకు వెళ్లిపో.. ప్రమీలా జయపాల్‌పై దూషణ పర్వం
సియాటెల్: ఇండో-అమెరికన్ కాంగ్రెస్ఉమెన్ ప్రమీలా జయపాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఫోన్ చేసి మరీ ఓ వ్యక్తి ఆమెను దూషించాడు. అంతేకాదు జాతివివక్ష, జాత్యాహంకారం ప్రదర్శిస్తూ.. ఆమెను ఇండియాకు వెళ్లిపోవాలంటూ బెదిరించాడు. ఇందుకు సంబంధించి ఐదు ఆడియో క్లిప్పులను అమెరికా చట్టసభ్యురాలైన ఆమె తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. మరీ అభ్యంతకరంగా, పరుష పదజాలంతో ప్రమీలా జయపాల్‌ను దూషించాడు ఆ వ్యక్తి. అంతేకాదు పుట్టిన దేశానికే వెళ్లిపోవాలంటూ ఆమెను బెదిరించాడు కూడా. ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో అమెరికాలో స్థిరపడిన భారతీయులపై జాత్యహంకారం ప్రదర్శిస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఘటనలపై చర్యలు చేపడుతున్నప్పటికీ.. పరిస్థితుల్లో మార్పు మాత్రం రావడం లేదు. Typically, political figures don't show their vulnerability. I chose to do so here because we cannot accept violence as our new norm. We also cannot accept the racism and sexism that underlies and propels so much of this violence. pic.twitter.com/DAuwwtWt7B — Rep. Pramila Jayapal (@RepJayapal) September 8, 2022 చెన్నైలో పుట్టిన ప్రమీలా(55).. సియాటెల్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అమెరికా ప్రతినిధుల సభ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి ఇండో-అమెరికన్(డెమొక్రటిక్ పార్టీ తరపున) కూడా ఈమెనే. అయితే ఆమెకు ఇలాంటి అనుభవం ఎదురు కావడం మొదటిసారేం కాదు. ఈ ఏడాది సమ్మర్లో.. సియాటెల్‌లోని ఆమె ఇంటి బయట గన్‌తో ఓ వ్యక్తి వీరంగం వేశాడు. ప్రమీలా కుటుంబ సభ్యుల్ని దూషిస్తూ.. బెదిరింపులకు దిగాడు. దుండగుడ్ని బ్రెట్ ఫోర్సెల్ (49)గా గుర్తించి.. పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదీ చదవండి: ఆ డాక్టర్ ఏకంగా హౌస్ కీపర్‌ని పెళ్లి చేసుకుంది! -
గప్పాలొద్దు, దోచుకుంది చాలదా?.. ఎలన్ మస్క్‌కు చురకలు
టాప్ బిలియనీర్ హోదా, స్పేస్ఎక్స్ ప్రయోగాలు, క్రిప్టో కరెన్సీ ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా సెన్సేషన్, టైమ్ పర్సన్ 2021 ఇయర్ ఘనత .. వెరసి నిత్యం వార్తల్లో నిలిచే సెలబ్రిటీగా పోయిన ఏడాది మొత్తాన్ని ఏలేశాడు ఎలన్ మస్క్. అఫ్కోర్స్.. అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. అయితే కిందటి ఏడాది చివర్లో ఆయన చేసిన ఓ ట్వీట్ రాజకీయ విమర్శలకు కారణమైంది. డిసెంబర్ 20వ తేదీన ఎలన్ మస్క్ తన ట్విటర్లో ఓ ట్వీట్ చేశాడు. ఏడాదిగానూ ఏకంగా 11 బిలియన్ డాలర్ల పన్ను చెల్లించబోతున్నట్లు ప్రకటించుకున్నాడు. దీంతో ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన వ్యక్తి చెల్లించే పన్ను గురించి ఆసక్తికర చర్చ నడించింది. అయితే ఈ ట్వీట్‌పై ఎలన్ మస్క్‌ను తిట్టిపోస్తున్నారు అమెరికా చట్టప్రతినిధులు. ఎలన్ మస్క్ సహా ధనవంతులెవరూ సరైన పన్నులు చెల్లించడం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. For those wondering, I will pay over $11 billion in taxes this year — Elon Musk (@elonmusk) December 20, 2021 ఈ విమర్శలు చేసేవాళ్లలో ఇండో-అమెరికన్ కాంగ్రెస్ఉమెన్ ప్రమీలా జయపాల్ కూడా ఉన్నారు. ప్రమీలా యూఎస్ హౌజ్‌లో తొలి ఇండో-అమెరికన్ కాంగ్రెస్ ఉమెన్ కూడా. పన్నుల చెల్లింపుపై గొప్పలకు పోతున్నారా? అంటూ ఆమె ఎలన్ మస్క్‌ను నిలదీశారు. ‘పన్ను చెల్లింపు విషయంలో గప్పాలు కొట్టుకోవద్దు.. ఆ చెల్లించేది సరైన పన్నులు కావనేది అందరికీ తెలుసు’ అని ఆమె పేర్కొన్నారు. ఎలన్ మస్క్ ఒక్కరోజు సంపాదనే 36 బిలియన్ డాలర్లు. కానీ, 11 బిలియన్ డాలర్లు ట్యాక్స్ చెల్లిస్తున్నట్లు గొప్పగా చెప్పుకుంటున్నారు. కేవలం కరోనా టైంలోనే 270 బిలియన్ డాలర్లు వెనకేసుకున్నాడు. ధనికులు తమ న్యాయమైన వాటాను చెల్లించే సమయం వచ్చేసింది’ అంటూ వ్యాఖ్యానించారామె. మరోవైపు రిపబ్లికన్ సెనేటర్ టెడ్ క్రూజ్ కూడా ‘ఎలన్ మస్క్ దోపిడీ’ మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా చట్టప్రతినిధులకు, అమెరికాలోని బిలియనీర్లకు మధ్య ట్యాక్స్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. సక్రమంగా పన్నులు చెల్లించని బిలియనీర్ల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేసేందుకు ప్రత్యేక చట్టాల్ని రూపొందించింది బైడెన్ ప్రభుత్వం. దీని నుంచి తప్పించుకునేందుకు ఎలన్ మస్క్ సహా పలువురు టెక్ మేధావులు ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషిస్తున్నారు. ఇక 40.8 శాతం అత్యధిక పన్ను రేటుతో, 280 బిలియన్ డాలర్ల నికర విలువ సంపదన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన మస్క్, టెస్లా షేర్ల ద్వారా దాదాపు 10.7 బిలియన్ డాలర్ల ఫెడరల్ పన్ను బిల్లును చెల్లించాల్సి ఉంటుందని ప్రోపబ్లికా నివేదిక పేర్కొంది. అయితే మస్క్ సహా ఇతర బిలియనీర్లు 2018లో ఫెడరల్ ఆదాయపు పన్నులు చెల్లించలేదని ప్రోపబ్లికా దర్యాప్తు ఒక నివేదిక విడుదల చేసింది. 2014 మరియు 2018 మధ్య కాలంలో, మస్క్ తన సంపద $13.9 బిలియన్లు పెరిగినప్పటికీ, 1.52 బిలియన్ డాలర్ల ఆదాయంపై కేవలం 455 మిలియన్ల డాలర్ల పన్నులు చెల్లించాడు. చదవండి: పాపం ఎలన్ మస్క్..! తినడానికి తిండి లేని రోజుల్లో ఏం చేసేవాడో తెలుసా? -
భారత సంతతి విజేతలు
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీకి చెందిన భారతీయ సంతతి అభ్యర్థులు నలుగురు మళ్లీ విజయం సాధించారు. డాక్టర్ అమీ బేరా, ప్రమీలా జయపాల్, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తిలు డెమొక్రటిక్ పార్టీ తరఫున హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు పోటీ పడిన విషయం తెలిసిందే. అమెరికా ఎన్నికల చరిత్రలో భారతీయ అమెరికన్ల ప్రభావం అత్యధికంగా కనిపించిన ఈ ఎన్నికలు చిరస్థాయిగా నిలిచిపోతాయని రాజకీయ నిపుణుల అభిప్రాయం. ఈ కారణం గానే అటు డెమొక్రాట్లు, ఇటు రిపబ్లికన్లు కూడా ఎన్నికల ప్రచార సమయంలో భారతీయ అమెరికన్లను తమవైపు తిప్పుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డారనడం అతిశయోక్తి కాదు. అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగల ప్లారిడా, జార్జియా, మిషిగన్, నార్త్ కారొలీనా, పెన్సిల్వేనియా,టెక్సాస్లతోపాటు అమెరికా మొత్తమ్మీద సుమారు 18 లక్షల మంది భారతీయ అమెరికన్లు ఉన్నట్లు అంచనా. భారతీయ అమెరికన్ ప్రజా ప్రతినిధుల సమూహానికి ‘సమోసా కాకస్’అని సెనేటర్ రాజా కృష్ణమూర్తి పేరుపెట్టగా ఈ సారి ఈ సమూహం బలం మరికొంత పెరిగే అవకాశం ఉంది. అరిజోనాలోని ఆరవ కాంగ్రెగేషనల్ డిస్ట్రిక్ట్‌లో రిపబ్లికన్ అభ్యర్థి, ప్రస్తుత సభ్యుడు డేవిడ్ ష్కెవెకెర్ట్పై భారతీయ సంతతి వైద్యురాలు డాక్టర్ హీరల్ టిపిమేని ఆధిక్యంలో ఉండటం ఇందుకు కారణం. టిపిమేని (52) ఎన్నికైతే ప్రమీలా జయపాల్ తరువాత హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు ఎన్నిౖకైన రెండవ భారతీయ సంతతి మహిళా ప్రతినిధి అవుతారు. సమోసా కాకస్‌లో ప్రస్తుతం ఐదుగురు సభ్యులు ఉండగా వీరిలో నలుగురు హౌస్ ఆప్ రిప్రజెంటేటివ్స్ ప్రతినిధు లు కాగా... మిగిలిన ఒక్కరు డెమొక్రాట్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సెనేటర్ కమలా హ్యారిస్. ఇల్లినాయిలోని ఎనిమిదవ కాంగ్రెగేషనల్ డిస్ట్రిక్ట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న 47 ఏళ్ల రాజా కృష్ణమూర్తి 1973లో న్యూఢిల్లీలో జన్మించారు. 2020 ఎన్నికల్లో లిబరిటేరియన్ పార్టీ అభ్యర్థి ప్రెస్టన్ నెల్సన్‌ను సులువుగా ఓటమిపాలు చేశారు. కడపటి వార్తలు అందే సమయానికి రాజా కృష్ణమూర్తి మొత్తం పోలైన ఓట్లలో 71 శాతం సాధించారు. రోహిత్ ఖన్నా లేదా సంక్షిప్తంగా రో ఖన్నా కాలిఫోర్నియాలోని 17వ కాంగ్రెగేషనల్ డిస్ట్రిక్ట్‌కు 2017 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అమెరికాలోని పెన్సిల్వేనియాలో 1976లో జన్మించిన రోహిత్ ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, భారతీయ సంతతికి చెందిన రితేశ్ టాండన్‌పై విజయం సాధించారు. సమోసా కాకస్‌లో సీనియర్ అయిన 55 ఏళ్ల డాక్టర్ అమిరేష్ బాబులాల్ బేరా కాలిఫోర్నియాలోని ఏడవ కాంగ్రెగేషనల్ డిస్ట్రిక్ట్ నుంచి వరుసగా ఐదుసార్లు గెలుస్తూ వస్తున్నారు. 2013, 2014, 2016, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన అమీ బేరా తాజాగా రిపబ్లికన్ అభ్యర్థి బజ్ పాటెర్సన్పై 25 శాతం కంటే ఎక్కువ ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. టెక్సాస్‌లోని ఇరవై రెండవ కాంగ్రెగేషనల్ డిస్ట్రిక్ట్ నుంచి పోటీ చేసిన శ్రీ ప్రెస్టన్ కుల్కర్ణి డెమొక్రాట్ల తరఫున పోటీ చేసి ఓడిపోయారు. రిపబ్లికన్ల అభ్యర్థి ట్రాయ్ నెల్స్ ఈ స్థానం నుంచి గెలుపొందారు. రిపబ్లికన్ల అభ్యర్థి భారతీయ సంతతికి చెందిన మంగ అనంతాత్ముల (వర్జీనియా) కూడా డెమొక్రటిక్ అభ్యర్థి గెర్రీ కానొలీ చేతుల్లో పరాజయం పాలయ్యారు. వీరే కాకుండా రిపబ్లికన్ల తరఫున పోటీ చేసిన మరో భారతీయ సంతతి అభ్యర్థి నిశా శర్మ కూడా కాంగ్రెస్ ఎన్నికల్లో ఓడిపోయారు. డెమొక్రటిక్ పార్టీ ప్రతినిధి మార్క్ డిసాల్నీర్ ఈ స్థానం నుంచి గెలుపొందారు. అమెరికా పార్లమెంటరీ వ్యవస్థలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అనేది దిగువ సభ కాగా.. సెనేట్ ఎగువ సభ అన్నది తెలిసిందే. -
ప్రమీలాతో మీటింగ్ వద్దు
వాషింగ్టన్: కశ్మీర్‌పై కాంగ్రెగేషనల్ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన భారతీయ అమెరికన్ పార్లమెంటు సభ్యురాలు ప్రమీలా జయపాల్‌తో సమావేశమయ్యేందుకు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ నిరాకరించారు. ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన ఈ తీర్మానం జమ్మూ కశ్మీర్‌లోని వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. చర్చలు జరపాలనుకున్న వారిని కలిసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరమూ లేదని, కాకపోతే ముందుగానే అభిప్రాయాలు ఏర్పరచుకున్న వారితో మాత్రం కాదని ఆయన స్పష్టం చేశారు. భిన్నాభిప్రాయాలు వినరా? తనతో భేటీని జైశంకర్ రద్దు చేసుకోవడంపై ప్రమీలా జయపాల్ ట్విటర్లో స్పందించారు. సమాదేశం రద్దు కావడం తనను తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని అన్నారు. భిన్నాభిప్రాయాలను వినడానికి భారత్ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా లేదన్న విషయం దీంతో రుజువైందని ట్వీట్ చేశారు. బీజేపీ మద్దతుదారులు ఆమెను విమర్శిస్తుండగా, కొంత మంది మేధావులు ఆమెకు అండగా నిలిచారు. సీనియర్ స్కాలరైన ప్రమీలా జయపాల్.. భారత్-అమెరికా సంబంధాల బలోపేతానికి కృషి చేస్తున్నారు. మత సహనమే భారత్ బలమని, దీన్ని కాపాడేందుకు న్యూఢిల్లీ సర్వదా ప్రయత్నించాలని గతంలో ఆమె వ్యాఖ్యానించారు. ప్రతిభను అడ్డుకోకండి: జైశంకర్ భారత్ నుంచి వస్తున్న ప్రతిభావంతులను అడ్డుకోరాదని జైశంకర్ అమెరికాకు సూచించారు. ఇరు దేశాల మధ్య వారి సేవలు వ్యూహాత్మక వారధిగా పనిచేస్తాయని, ఆర్థిక సహకారంలోనూ ఇది ముఖ్యమైన భాగమని గురువారం స్పష్టం చేశారు. ఐటీ ఉద్యోగులకు హెచ్–1బీ వీసాలు అత్యంత కీలకమైనవి. అమెరికన్ కంపెనీలు ఏటా భారత్, చైనాల నుంచి కొన్ని వేల మందిని హెచ్–1బీ వీసాల సాయంతో ప్రత్యేక రంగాల్లో ఉద్యోగులను నియమించుకుంటోంది. ‘భారత్ నుంచి వెల్లువెత్తే ప్రతిభ ప్రవాహానికి ఎలాంటి అడ్డంకి ఉండరాదని, అసంబద్ధమైన చట్ట నియంత్రణలూ ఉండరాదన్న విషయాన్ని స్పష్టం చేశాను’ అని ఆయన చెప్పారు. వైట్‌హౌస్‌లోనూ ఈ అంశం చర్చకు వచ్చినట్లు తెలిపారు. ట్రంప్‌తో రాజ్‌నాథ్, జైశంకర్‌లు భేటీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ అయ్యారు. అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్‌లో ఈ భేటీ జరిగింది. ఇందులో ప్రధానంగా ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిగినట్లు సమావేశానంతరం రాజ్‌నాథ్ తెలిపారు. మీటింగ్‌లో ట్రంప్ గత సెప్టెంబర్‌లో జరిగిన హౌడీ మోదీ సభ గురించి ప్రస్తావించినట్లు చెప్పారు. వాణిజ్యం గురించి కూడా కొద్దిగా చర్చ జరిగినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. భేటీపట్ల ట్రంప్ ఆసక్తి ప్రదర్శించినట్లు చెప్పారు. -
భారతీయ అమెరికన్లకు కీలక బాధ్యతలు
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతల్లో ఐదుగురు భారతీయ అమెరికన్లు నియమితులయ్యారు. సిలికాన్ వ్యాలీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా.. హౌస్ బడ్జెట్ కమిటీకి, సియాటెల్ నుంచి ఎన్నికైన ప్రమీలా జయపాల్ హౌస్ జుడీషియరీ కమిటీకి నామినేట్ అయ్యారు. షికాగో ఉత్తర, వాయవ్య ప్రాంతం నుంచి ఎన్నికైన కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి హౌస్ ఎడ్యుకేషన్, వర్క్‌ఫోర్స్ కమిటీకి నామినేట్ అయ్యారు. దీంతోపాటే హౌస్ డెమొక్రటిక్ పాలసీ, స్టీరింగ్ కమిటీ బాధ్యతలను కృష్ణమూర్తి చూసుకోన్నారు. అమిత్ బేరా విదేశీవ్యవహారాల కమిటీ, సైన్స్, స్పేస్, టెక్నాలజీ కమిటీకి తిరిగి నామినేట్ అయ్యారు. అమెరికా సెనేట్‌కు తొలిసారి ఎన్నికైన కమలా హారిస్..బడ్జెట్ కమిటీ, నిఘా సెలక్ట్ కమిటీ, పర్యావరణ, ప్రజాపనుల కమిటీ, భద్రత, ప్రభుత్వ వ్యవహారాల కమిటీ ఇలా నాలుగు కమిటీలకు నామినేట్ అయ్యారు. ఇంతమంది భారతీయ అమెరికన్లు కీలక కమిటీలకు ఎన్నికవడం అమెరికాకాంగ్రెస్ చరిత్రలోనే తొలిసారి. -
‘ట్రంప్ ప్రమాణ స్వీకారానికి వెళ్లను’
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి హాజరుకాబోనని భారతీయ సంతతికి చెందిన మహిళ ప్రమీల జయపాల్ ప్రకటించారు. ట్రంప్ వాడిన పదజాలం, చర్యలు అమెరికా ప్రజాస్వామ్యాన్ని, చరిత్రను తక్కువ చేసేలా ఉన్నాయని సియాటెల్ నుంచి ప్రతినిధుల సభకు ఎంపికైన భారతీయ-అమెరికన్‌గా రికార్డు సృష్టించిన ప్రమీల పేర్కొన్నారు. అన్ని ఆలోచించి తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. దాదాపు 24 మంది చట్టసభల ప్రతినిధులు ట్రంప్ ప్రమాణ స్వీకారానికి హాజరుకాబోమని ప్రకటించారు. ‘అధ్యక్ష ఎన్నికలు ముగిసిన తర్వాత ట్రంప్ వైఖరిలో మార్పు వస్తుందని ఆశించాను. అందరినీ కలుపుకుపోతానని చెప్పిన మాటలు నీటిమూటలయ్యాయి. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోయే ముందు కూడా ఆయన తీరు మారలేదు. ట్రంప్ మాటలు, చర్యలు మన చరిత్ర, హీరోలను అప్రతిష్ఠపాల్జేసేలా ఉన్నాయి. మన ప్రజాస్వామ్యానికి నష్టం కలిగించేలా ఉన్నాయ’ని ప్రమీల జయపాల్ అన్నారు. ఈనెల 20 అమెరికా 45వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
'భారత్‌లోనే పుట్టాను.. వీడలేని బంధం నాది'
వాషింగ్టన్: భారత్ తనకు చాలా ముఖ్యమైన దేశమని భారతీయ సంతతికి చెందిన మహిళ ప్రమీల జయపాల్ అన్నారు. ఇటీవల అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు ఆమె ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ హౌజ్‌కు ఎన్నికైన తొలి భారతీయ మహిళ కూడా ఆమెనె. ఈ సందర్భంగా ఆమె తొలిసారి భారత్‌తో అమెరికాకు ఉండబోయే సంబంధాల విషయంలో మాట్లాడారు. తాను మహాత్మా గాంధీ జన్మించిన నేలలో జన్మించానని, భారత్‌కు తనకు విడదీయరాని సంబంధం ఉందన్నారు. భారత్‌కు పేదరికం నుంచి క్లీన్ ఎనర్జీ వరకు అన్ని రకాలుగా అమెరికా మద్దతు ఉంటుందని అన్నారు. 'నేను భారత్ లోనే జన్మించాను. నాకు భారత్ కు చాలా గాఢ సంబంధం ఉంది. మా అమ్మనాన్నలు అక్కడే ఉన్నారు. బెంగళూరులో ఉంటారు. నా కుమారుడు అక్కడే జన్మించాడు. భారత్ కు అమెరికాకు మధ్య ఉంది కేవలం రాజకీయ సంబంధమే కాదు.. చాలా వ్యక్తిగత సంబంధం కూడా' అని ఆమె అన్నారు. చెన్నైలో జన్మించిన ప్రమీల ఐదేళ్లప్పుడే ఇండోనేషియాకు వెళ్లారు. అక్కడి నుంచి సింగపూర్ ఆ తర్వాత పదహారేళ్లకు అమెరికాకు వచ్చారు. ప్స్తుతం ఆమె వాషింగ్టన్ డీసీలో ఉంటున్నారు. -
మెరిసిన భారతీయం
వాషింగ్టన్ : అమెరికా సాధారణ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నలుగురు భారత సంతతి అమెరికన్లు ఘన విజయం సాధించారు. వీరిలో ఇద్దరు మహిళలున్నారు. అయితే మరో భారతీయుడి ఎన్నిక రీకౌంటింగ్‌కు వెళ్లటంతో ఈ ఫలితం తేలాల్సిఉంది. కమలా హ్యారిస్ ఈ 51 ఏళ్ల భారత సంతతి మహిళ రెండు సార్లు కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు. తాజా ఎన్నికల్లో అమెరికా సెనేట్‌కు ఎంపికై ఈమె రికార్డు సృష్టించారు. కాలిఫోర్నియాలోని ఓక్లాండ్లో పుట్టిన హ్యారిస్ తల్లి చెన్నై నుంచి 1960లో అమెరికాకు వలస వెళ్లారు. ఈమె తండ్రి జమైకన్. అమెరికా అధ్యక్షుడు ఒబామా కమలా హ్యారిస్ అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. ‘ఈమెను సెనెట్‌కు పంపిస్తే.. మీ తరపున విరామం లేకుండా ఈమె పోరాటం చేస్తారు’ అని ఒబామా ప్రచారంలో అన్నారు. ప్రమీల జయపాల్ హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్సకు ఎంపికై న తొలి భారతీయ-అమెరికన్‌గా ప్రమీల (51) రికార్డు నెలకొల్పారు. సియాటెల్ నుంచి ఈమె ప్రతినిధుల సభకు ఎంపికయ్యారు. తొలి ప్రయత్నంలోనే ఈమె కాంగ్రెస్‌కు ఎంపికయ్యారు. చెన్నైలో జన్మించిన ప్రమీల జయపాల్ కుటుంబం ఈమెకు ఐదేళ్ల వయసులోనే ఇండోనేసియా, సింగపూర్ అక్కడినుంచి అమెరికాకు వలసవెళ్లారు. ఈమెకు 25 ఏళ్ల వయసులో (1995లో) కొన్ని రోజుల కోసం భారత్‌కు వచ్చి గడిపిన సమయం తనలో చాలా మార్పు తీసుకొచ్చిందని ప్రమీల చాలా సందర్భాల్లో తెలిపారు. ఈమె రాసిన ‘పిలిగ్రిమేజ్ టు ఇండియా: ఎ ఉమెన్ రివిజిట్స్ హర్ హోమ్‌ల్యాండ్’ పుస్తకం 2000లో ప్రచురితమైంది. సెనేటర్ బెర్నీ శాండర్స్, మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ప్రమీల జయపాల్ అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. రాజా కృష్ణమూర్తి రెండో ప్రయత్నంలోనే రాజా కృష్ణమూర్తి ఉన్నతమైన ప్రతినిధుల సభకు అర్హత సాధించారు. ఇల్లినారుుస్లోని 8వ డిస్ట్రిక్ట్ నుంచి పోటీ చేసిన కృష్ణమూర్తి (42) 2000, 2004ల్లో ఒబామా యూఎస్ సెనేట్ ప్రచారంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. చెన్నైలో పుట్టిన కృష్ణమూర్తికి చిన్నప్పుడే వీరి కుటుంబం అమెరికాకు వలసవెళ్లింది. ఈయన అమెరికాలో రెండు కంపెనీలను నెలకొల్పారు. రోహిత్ ఖన్నా డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి అయిన ఖన్నా (42) కాలిఫోర్నియాలోని 17వ డిస్ట్రిక్ట్ నుంచి హోండాపై ఓట్లతో విజయం సాధించారు. 2014లో హోండా చేతిలోనే స్వల్పతేడాతో ఓడిపోయారు. రోహిత్ తాత, అమర్నాథ్ విద్యాలంకార్ భారత స్వాతంత్ర సంగ్రామంలో గాంధీ, లాలా లజపతిరాయ్లతో కలిసి పోరాటం చేశారు. రోహిత్ పుట్టకముందే వీరి కుటుంబం అమెరికాకు వలసపోయింది. అమీ బెరా డెమొక్రటిక్ పార్టీ తరపున సాక్రమెంటో కౌంటీ నుంచి బరిలో దిగిన అమీ బెరా తొలి కౌంటింగ్‌లోనే విజయం సాధించారు. అయితే.. తేడా స్వల్పంగా ఉండటంతో ప్రత్యర్థి స్కాట్ జోన్స కోరిక మేరకు రీకౌంటింగ్‌కు ఆదేశించారు. కాగా, 2012, 2014 ఎన్నికల్లోనూ ఇలాగే స్వల్ప తేడాతో బెరా విజయం సాధించారు. ఈసారి గెలిస్తే.. గతంలో మూడుసార్లు కాంగ్రెస్‌కు ఎంపికై న భారతీయుడు దలీప్ సింగ్ సౌంద్ రికార్డును బెరా సమం చేస్తారు. జిందాల్ కూడా 2004, 2006లో రెండుసార్లు లూసియానా గవర్నర్‌గా ఎంపికయ్యారు. ఈయన అభ్యర్థిత్వాన్ని కూడా ఒబామాయే బలపరిచారు. వీరి కుటుంబం రాజ్‌కోట్ నుంచి అమెరికాకు వలసవెళ్లింది. కాగా, న్యూజెర్సీ, మిచిగాన్ నుంచి డెమొక్రాటిక్ పార్టీ తరపున పోటీ చేసిన మరో ఇద్దరు భారత సంతతి అభ్యర్థులు స్వల్పతేడాతో ఓడిపోయారు. -
వాషింగ్టన్ ప్రైమరీ విజేతగా భారత అమెరికన్
వాషింగ్టన్: వాషింగ్టన్ ఓపెన్ కాంగ్రెషనల్ ప్రైమరీలో ఇండియన్ అమెరికన్ ప్రమీలా జయపాల్ విజయం సాధించారు. నవంబర్‌లో జరిగే సాధారణ ఎన్నికల్లోనూ గెలిస్తే ఆమె అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సభ్యురాలు అవుతారు. చెన్నైలో జన్మించిన ప్రమీల.. ఇండోనేసియా, సింగపూర్లలో పెరిగారు. 1982లో అమెరికాలో స్థిరపడ్డారు. ప్రమీల కాకుండా మరో ముగ్గురు భారత అమెరికన్లకు (అమీ బెరా, రాజ కృష్ణమూర్తి, ఖన్నా) హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు ఎంపికయ్యే అవకాశం ఉంది.