‘ట్రంప్ ప్రమాణ స్వీకారానికి వెళ్లను’ | Indian-American Congresswoman to not attend Trump inauguration | Sakshi
Sakshi News home page

‘ట్రంప్ ప్రమాణ స్వీకారానికి వెళ్లను’

Published Mon, Jan 16 2017 8:34 PM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

‘ట్రంప్ ప్రమాణ స్వీకారానికి వెళ్లను’ - Sakshi

‘ట్రంప్ ప్రమాణ స్వీకారానికి వెళ్లను’

వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్‌ ప్రమాణ స్వీకారానికి హాజరుకాబోనని భారతీయ సంతతికి చెందిన మహిళ ప్రమీల జయపాల్ ప్రకటించారు. ట్రంప్ వాడిన పదజాలం, చర్యలు అమెరికా ప్రజాస్వామ్యాన్ని, చరిత్రను తక్కువ చేసేలా ఉన్నాయని సియాటెల్ నుంచి ప్రతినిధుల సభకు ఎంపికైన భారతీయ-అమెరికన్‌గా రికార్డు సృష్టించిన ప్రమీల పేర్కొన్నారు. అన్ని ఆలోచించి తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. దాదాపు 24 మంది చట్టసభల ప్రతినిధులు ట్రంప్ ప్రమాణ స్వీకారానికి హాజరుకాబోమని ప్రకటించారు.

‘అధ్యక్ష ఎన్నికలు ముగిసిన తర్వాత ట్రంప్ వైఖరిలో మార్పు వస్తుందని ఆశించాను. అందరినీ కలుపుకుపోతానని చెప్పిన మాటలు నీటిమూటలయ్యాయి. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోయే ముందు కూడా ఆయన తీరు మారలేదు. ట్రంప్ మాటలు, చర్యలు మన చరిత్ర, హీరోలను అప్రతిష్ఠపాల్జేసేలా ఉన్నాయి. మన ప్రజాస్వామ్యానికి నష్టం కలిగించేలా ఉన్నాయ’ని ప్రమీల జయపాల్ అన్నారు. ఈనెల 20 అమెరికా 45వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement