వాషింగ్టన్ : అమెరికా సాధారణ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నలుగురు భారత సంతతి అమెరికన్లు ఘన విజయం సాధించారు. వీరిలో ఇద్దరు మహిళలున్నారు. అయితే మరో భారతీయుడి ఎన్నిక రీకౌంటింగ్‌కు వెళ్లటంతో ఈ ఫలితం తేలాల్సిఉంది.
కమలా హ్యారిస్
ఈ 51 ఏళ్ల భారత సంతతి మహిళ రెండు సార్లు కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు. తాజా ఎన్నికల్లో అమెరికా సెనేట్‌కు ఎంపికై ఈమె రికార్డు సృష్టించారు. కాలిఫోర్నియాలోని ఓక్‌లాండ్‌లో పుట్టిన హ్యారిస్ తల్లి చెన్నై నుంచి 1960లో అమెరికాకు వలస వెళ్లారు. ఈమె తండ్రి జమైకన్. అమెరికా అధ్యక్షుడు ఒబామా కమలా హ్యారిస్ అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. ‘ఈమెను సెనెట్‌కు పంపిస్తే.. మీ తరపున విరామం లేకుండా ఈమె పోరాటం చేస్తారు’ అని ఒబామా ప్రచారంలో అన్నారు.
ప్రమీల జయపాల్
హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌సకు ఎంపికై న తొలి భారతీయ-అమెరికన్‌గా ప్రమీల (51) రికార్డు నెలకొల్పారు. సియాటెల్ నుంచి ఈమె ప్రతినిధుల సభకు ఎంపికయ్యారు. తొలి ప్రయత్నంలోనే ఈమె కాంగ్రెస్‌కు ఎంపికయ్యారు. చెన్నైలో జన్మించిన ప్రమీల జయపాల్ కుటుంబం ఈమెకు ఐదేళ్ల వయసులోనే ఇండోనేసియా, సింగపూర్ అక్కడినుంచి అమెరికాకు వలసవెళ్లారు. ఈమెకు 25 ఏళ్ల వయసులో (1995లో) కొన్ని రోజుల కోసం భారత్‌కు వచ్చి గడిపిన సమయం తనలో చాలా మార్పు తీసుకొచ్చిందని ప్రమీల చాలా సందర్భాల్లో తెలిపారు. ఈమె రాసిన ‘పిలిగ్రిమేజ్ టు ఇండియా: ఎ ఉమెన్ రివిజిట్స్ హర్ హోమ్‌ల్యాండ్’ పుస్తకం 2000లో ప్రచురితమైంది. సెనేటర్ బెర్నీ శాండర్స్, మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ప్రమీల జయపాల్ అభ్యర్థిత్వాన్ని బలపరిచారు.
రాజా కృష్ణమూర్తి
రెండో ప్రయత్నంలోనే రాజా కృష్ణమూర్తి ఉన్నతమైన ప్రతినిధుల సభకు అర్హత సాధించారు. ఇల్లినారుుస్‌లోని 8వ డిస్ట్రిక్ట్ నుంచి పోటీ చేసిన కృష్ణమూర్తి (42) 2000, 2004ల్లో ఒబామా యూఎస్ సెనేట్ ప్రచారంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. చెన్నైలో పుట్టిన కృష్ణమూర్తికి చిన్నప్పుడే వీరి కుటుంబం అమెరికాకు వలసవెళ్లింది. ఈయన అమెరికాలో రెండు కంపెనీలను నెలకొల్పారు.
రోహిత్ ఖన్నా
డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి అయిన ఖన్నా (42) కాలిఫోర్నియాలోని 17వ డిస్ట్రిక్ట్ నుంచి హోండాపై ఓట్లతో విజయం సాధించారు. 2014లో హోండా చేతిలోనే స్వల్పతేడాతో ఓడిపోయారు. రోహిత్ తాత, అమర్‌నాథ్ విద్యాలంకార్ భారత స్వాతంత్ర సంగ్రామంలో గాంధీ, లాలా లజపతిరాయ్‌లతో కలిసి పోరాటం చేశారు. రోహిత్ పుట్టకముందే వీరి కుటుంబం అమెరికాకు వలసపోయింది.
అమీ బెరా
డెమొక్రటిక్ పార్టీ తరపున సాక్రమెంటో కౌంటీ నుంచి బరిలో దిగిన అమీ బెరా తొలి కౌంటింగ్‌లోనే విజయం సాధించారు. అయితే.. తేడా స్వల్పంగా ఉండటంతో ప్రత్యర్థి స్కాట్ జోన్‌స కోరిక మేరకు రీకౌంటింగ్‌కు ఆదేశించారు. కాగా, 2012, 2014 ఎన్నికల్లోనూ ఇలాగే స్వల్ప తేడాతో బెరా విజయం సాధించారు. ఈసారి గెలిస్తే.. గతంలో మూడుసార్లు కాంగ్రెస్‌కు ఎంపికై న భారతీయుడు దలీప్ సింగ్ సౌంద్ రికార్డును బెరా సమం చేస్తారు. జిందాల్ కూడా 2004, 2006లో రెండుసార్లు లూసియానా గవర్నర్‌గా ఎంపికయ్యారు. ఈయన అభ్యర్థిత్వాన్ని కూడా ఒబామాయే బలపరిచారు. వీరి కుటుంబం రాజ్‌కోట్ నుంచి అమెరికాకు వలసవెళ్లింది. కాగా, న్యూజెర్సీ, మిచిగాన్ నుంచి డెమొక్రాటిక్ పార్టీ తరపున పోటీ చేసిన మరో ఇద్దరు భారత సంతతి అభ్యర్థులు స్వల్పతేడాతో ఓడిపోయారు.
మెరిసిన భారతీయం
Published Thu, Nov 10 2016 3:27 AM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM
Advertisement
Advertisement