అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఉద్యోగాలు, విద్యార్హతపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అద్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత దేశంలో కొన్ని ఫెడరల్ ఉద్యోగాలకు డిగ్రీ అర్హతను తొలగిస్తానని పేర్కొన్నారు. ఓ వ్యక్తి నైపుణ్యాలను ప్రదర్శించేందుకు డిగ్రీ తప్పనిసరి కాదని తెలిపారు.
ఈ మేరకు పెన్సిల్వేనియాలోని విల్కేస్-బారేలో ప్రసంగిస్తూ.. ‘నేను అధ్యక్షురాలిగా ఎన్నికైతే.. ఫెడరల్ ఉద్యోగాల కోసం అవసరంలేని డిగ్రీ అర్హతను తొలగిస్తాను. ఇది నాలుగు సంవత్సరాల డిగ్రీ లేని వారికి ఉద్యోగాల అవకాశాలు పెంచడానికి దోహదపడుతుంది. ’ అని తెలిపారు.
కళాశాల డిగ్రీ కంటే అప్రెంటిస్‌షిప్, సాంకేంతిక కార్యక్రమాలు వంటివి విజయానికి గల మార్గాల విలువను అమెరికా గుర్తించాలని అన్నారు. వ్యక్తి నైపుణ్యాలను సూచించేందుకు డిగ్రీ తప్పనిసరి కాదని తెలిపారు. అదే విధంగా ప్రైవేట్ రంగం కూడా ఇదే విధాన్ని పాటించేలా చూస్తానని భరోసా ఇచ్చారు.
అయితే కమలా హారిస్ ప్రసంగానికి. నిరసనకారుల ఆందోళన వల్ల అంతరాయం ఏర్పడింది. గాజాలో 10 వేల మంది మరణానికి కారణమైన ఇజ్రాయెల్ యుద్ధానికి యూఎస్ మద్దత తెలపడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్‌కు ఆయుధాల రవాణాపై ఆంక్షలు విధించాలని, యుద్ధాన్ని ముగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. ఈ క్రమంలో హారిస్ మాట్లాడుతూ..తమ ఆందోళనలను గౌరవిస్తానని చెప్పారు. కాల్పుల విరమణ, బందీల రక్షణ ఒప్పందానికి తన మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.
చదవండి: పుతిన్‌పై ప్రశ్న.. రిపోర్టర్‌పై బైడెన్ ఆగ్రహం
ఇదిలా ఉండగా హారిస్ ఇజ్రాయెల్‌కు మద్దతిస్తున్నారు. గత అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్‌లకు అత్యధికంగా ఓటు వేసిన కార్యకర్తలు, ముస్లింలు, అరబ్బులతో సహా పాలస్తీనా అనుకూల అమెరికన్లు ఉన్నారు. వీరు ఈసారి తమ ఆలోచనను మార్చుకుంటే.. అది హారిస్ విజయావకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని పరిశీలకులు అంటున్నారు.
అయితే 2023లో యూఎస్ సెన్సస్ బ్యూరో విడుదల చేసిన డేటా ప్రకారం.. 25 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న అమెరికన్ యువతలో 62% కంటే ఎక్కువ మంది బ్యాచిలర్ డిగ్రీని కూడా కలిగి లేరు. 2020లో ఐదుగురు ఓటర్లలో ముగ్గురు కళాశాల డిగ్రీ కూడా చేయలేదు. ఇందుకు కారణం విద్యకు అధిక ఖర్చు అవ్వడమేనని తేలింది.
కాగా అమెరికాలో నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ పోరులో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ పడబోతున్నారు. వీరిరువురు ఇటీవల ఓ టీవీ చర్చలో పాల్గొన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment