తడబడ్డ కమలాహారిస్‌..వీడియో వైరల్‌ | Kamala Harris Bungles Pledge In US Senate | Sakshi
Sakshi News home page

సెనేట్‌లో తడబడ్డ కమలాహారిస్‌..వీడియో వైరల్‌

Jan 4 2025 12:48 PM | Updated on Jan 4 2025 12:48 PM

Kamala Harris Bungles Pledge In US Senate

వాషింగ్టన్‌:అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌ తడబడ్డారు. అమెరికా 119వ కాంగ్రెస్‌ ప్రారంభం సందర్భంగా సెనేట్‌లో చేసిన ప్రతిజ్ఞలో జెండా అనే పదాన్ని వదిలేసి చదివారు. హారిస్‌ తడబడ్డ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆమెను నెటిజన్లు విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. 

అమెరికాలో 119వ కాంగ్రెస్‌ తాజాగా సమావేశమైంది. ఈ సందర్భంగా చేసే ప్రతిజ్ఞలో ‘నేను యునైటెడ్‌ స్టేట్స్ ఆఫ్‌ అమెరికా జెండాకు విధేయత చూపుతాను’ అని చదవాలి అయితే  హారిస్ ‘జెండా’ పదాన్ని వదిలేసి చదివారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందించారు.

హారిస్ విధేయత ప్రతిజ్ఞను సలాడ్‌ చేసేశారని ఒకరు కామెంట్‌ చేయగా సెనెట్‌లో ప్రతిజ్ఞను తప్పుగా పలికి హారిస్‌ దేశాన్ని అవమానించారని మరొకరు విమర్శించారు. చరిత్రలో అతి తక్కువ ఐక్యూ కలిగిన అధ్యక్ష అభ్యర్థి కమలాహారిస్‌ అని మరో నెటిజన్ విమర్శించారు. 

 మరో వీడియోలో హారిస్‌ కొత్తగా ఎన్నికైన సెనేటర్లతో ప్రతిజ్ఞ చేయిస్తుండగా అక్కడే ఉన్న అమెరికాకు కాబోయే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇతర సభ్యులతో కలిసి నవ్వుతూ కనిపించారు. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్‌ అభ్యర్థిగా పోటీచేసిన కమలాహారిస్‌ ట్రంప్‌ చేతిలో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే.

 ఇదీ చదవండి: ప్రధానిపై విమర్శలు..మస్క్‌కు బ్రిటన్‌ కౌంటర్‌ 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement