pledge
-
తడబడ్డ కమలాహారిస్..వీడియో వైరల్
వాషింగ్టన్:అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ తడబడ్డారు. అమెరికా 119వ కాంగ్రెస్ ప్రారంభం సందర్భంగా సెనేట్‌లో చేసిన ప్రతిజ్ఞలో జెండా అనే పదాన్ని వదిలేసి చదివారు. హారిస్ తడబడ్డ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆమెను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అమెరికాలో 119వ కాంగ్రెస్ తాజాగా సమావేశమైంది. ఈ సందర్భంగా చేసే ప్రతిజ్ఞలో ‘నేను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జెండాకు విధేయత చూపుతాను’ అని చదవాలి అయితే హారిస్ ‘జెండా’ పదాన్ని వదిలేసి చదివారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందించారు.హారిస్ విధేయత ప్రతిజ్ఞను సలాడ్ చేసేశారని ఒకరు కామెంట్ చేయగా సెనెట్‌లో ప్రతిజ్ఞను తప్పుగా పలికి హారిస్ దేశాన్ని అవమానించారని మరొకరు విమర్శించారు. చరిత్రలో అతి తక్కువ ఐక్యూ కలిగిన అధ్యక్ష అభ్యర్థి కమలాహారిస్ అని మరో నెటిజన్ విమర్శించారు. FLAG FLUB: Vice President Kamala Harris appears to flub the Pledge of Allegiance during the opening moments of the 119th Congress. pic.twitter.com/NlyMB6iUoz— Fox News (@FoxNews) January 3, 2025 మరో వీడియోలో హారిస్ కొత్తగా ఎన్నికైన సెనేటర్లతో ప్రతిజ్ఞ చేయిస్తుండగా అక్కడే ఉన్న అమెరికాకు కాబోయే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇతర సభ్యులతో కలిసి నవ్వుతూ కనిపించారు. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థిగా పోటీచేసిన కమలాహారిస్ ట్రంప్ చేతిలో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే.JD Vance laughing as Kamala Harris swears in new U.S. Senators 🤣pic.twitter.com/LRot5mia2Z— Benny Johnson (@bennyjohnson) January 3, 2025 ఇదీ చదవండి: ప్రధానిపై విమర్శలు..మస్క్‌కు బ్రిటన్ కౌంటర్ -
పుతిన్‌పై పోరాటమే..
మాస్కో: రష్యా ప్రభుత్వం, అధ్యక్షుడు పుతిన్‌పై పోరాటం కొనసాగిస్తానని ఇటీవల మృతి చెందిన ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్నీ భార్య యూలియా నవాల్నయా ప్రతిజ్ఞ చేశారు. సోమవారం బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో పలువురు ఈయూ నేతలను కలిశారు. ఈ సందర్భంగా ఆమె మీడియా ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు. భర్త నవాల్నీ అడుగుజాడల్లోనే నడుస్తానన్నారు. ఆయన్ను సుదూర ప్రాంతంలో ఉండే జైలుకు పంపి పొట్టన పెట్టుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పుతిన్‌ను, ఈ పాపంలో పాలు పంచుకున్న వారందరినీ శిక్షించేదాకా పోరాటం కొనసాగిస్తానన్నారు. నవాల్నీ మృతదేహాన్ని ఆయన తల్లికి అప్పగించేందుకు కూడా అధికారులు నిరాకరిస్తున్నారని, సాక్ష్యాలు దొరక్కుండా చేయడమే వారి ఉద్దేశమని ఆరోపించారు. -
ప్రధాని మోదీ ‘రామ ప్రతిజ్ఞ’ నెరవేరింది!
మూడు దశాబ్దాల కిత్రం అయోధ్యను సందర్శించిన ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ నాడు.. అక్కడి పరిస్థితులను చూసి, తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తూ, రామాలయ నిర్మాణం జరిగే వరకూ అయోధ్యకు రానంటూ ప్రతిజ్ఞ చేశారు. అది.. 1991, డిసెంబర్ 11.. కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు సాగిన ఐక్యతా యాత్రలో పాల్గొన్న ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ.. 1992, జనవరి 14న అయోధ్యను సందర్శించారు. రామ్‌లల్లాను దర్శించుకున్నాక, రామాలయ నిర్మాణం జరిగిన తర్వాతనే తాను అయోధ్యకు వస్తారని ప్రతిజ్ఞ చేశారు. నాడు అయోధ్యకు వచ్చినప్పుడు మోదీ ఒక సాధారణ కార్యకర్త. నాటి మోదీ కల నేడు సాకరమయ్యింది. ప్రధాని మోదీ తన మొదటి అయోధ్య పర్యటనలో జానకీ మహల్ ట్రస్ట్‌లో బసచేశారు. ఇది రామజన్మభూమికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంది. ట్రస్ట్ నిర్వాహకులు రామ్‌కుమార్ శర్మ మీడియాతో మాట్లాడుతూ, నరేంద్ర మోదీ తొలిసారి ఇక్కడికి వచ్చినప్పుడు రూమ్ నంబర్ 107లో బస చేశారని తెలిపారు. ఆ సమయంలో బీజీపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి 108 నంబర్ రూమ్‌లో బస చేశారని పేర్కొన్నారు. జానకీ మహల్‌లోనేవారు భోజనం చేశారని, అప్పుడు తన వయసు 35 ఏళ్లు అని, మోదీకి కూడా అదే వయసు ఉండవచ్చన్నారు. నేడు ఆ గది శిథిలావస్థకు చేరుకుందని, దీంతో ఆ గదికి తాళం వేశామన్నారు. నాడు కఠిన ప్రతిజ్ఞ చేసిన మోదీ 28 సంవత్సరాల వరకూ అయోధ్య ముఖం చూడనే లేదు. 1992, జనవరి 14 వరకూ, అంటే 28 ఏళ్ల పాటు మోదీ అయోధ్యకు రాలేదు. 2019, నవంబర్ 9న రామమందిరానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. 2022లో ప్రధాని మోదీ అయోధ్యకు వచ్చి, దీపోత్సవంలో పాల్గొన్నారు. 2023 డిసెంబర్ 30న అయోధ్యలో రోడ్ షో నిర్వహించారు. ఇప్పుడు 22న రామమందిరాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య వస్తున్నారు. ఈ నేపధ్యంలో నాటి మోదీ ప్రతిజ్ఞ చర్చల్లో నిలిచింది. ఇది కూడా చదవండి: ఆ రెండు విగ్రహాలను ఏం చేయనున్నారు? -
పెళ్లంటే.. రక్తదానం..అవయవదానం..ఇదో వెరైటీ మ్యారేజ్..!
ఛత్తీస్‌గఢ్: ఎవరైనా పెళ్లంటే..బంధుమిత్రులతో ఘణంగా చేసుకోవాలని భావిస్తారు. పసందైన విందుతో అందరి మన్ననలను పొందాలని భావిస్తారు. కానీ ఛత్తీస్‌గఢ్‌లో ధమ్తారీ జిల్లాలో జరిగిన ఓ పెళ్లి మాత్రం కాస్త విభిన్నంగా జరిగింది. సమాజానికి ఉపయోగపడేలా వివాహాన్ని కొత్తగా జరుపుకోవాలనుకున్నారు వధూవరులు.ఇంతకూ వారు ఏం చేశారంటే.. జిల్లాలోని కాండెల్ గ్రామంలో ముకేష్, నేహాల వివాహాం అందరికీ స్ఫూర్తిని కలిగిస్తోంది. పెళ్లిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు వధూవరులు. వారి పెళ్లికార్డులపై కూడా రక్తదాన ప్రాముఖ్యతను పేర్కొన్నారు. వారిరువురు పెళ్లిలో రక్తదానం చేయడమే గాక అవయవదానం చేస్తామని కూడా ప్రమాణం చేశారు. బంధుమిత్రుల చేత కూడా ఈ ప్రమాణాన్ని చేపించారు. రక్తదానం చేయడానికి గ్రామవాసులందరు ముందుకు వచ్చారు. ఈ విభిన్నమైన కార్యక్రమంతో వీరి పెళ్లి ఆదర్శవంతంగా జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ధమ్తారీ జిల్లా స్వాతంత్య్రోద్యమంలోనే ప్రముఖంగా నిలిచింది. 1920లోనే గాంధీజీ సత్యాగ్రహాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు. ఇదీ చదవండి:పీనాసి ప్రియుడు: అరటి పండు తొక్కతీసి... -
హిండెన్‌బర్గ్ వివాదం: అదానీ గ్రూపు ప్రమోటర్స్ సంచలన నిర్ణయం
సాక్షి,ముంబై: అదానీ గ్రూప్- హిండెన్‌బర్గ్ వివాదం తరువాత మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సెప్టెంబర్ 2024నాటికి చెల్లించాల్సిన ప్లెడ్జ్ షేర్ల రిలీజ్ కోసం భారీ మొత్తాన్ని ముందుగానే చెల్లించనుంది. 1.1 బిలియన్ డాలర్లను చెల్లించనుంది. ఈమేరకు కంపెనీ ఒక ప్రకటన జారీ చేసింది. (ఇదీ చదవండి: అదానీ-హిండెన్‌బర్గ్: అదానీకి మరోషాక్! ఆ ప్రమాదం ఎక్కువే?) ఇటీవలి మార్కెట్ అస్థిరత దృష్ట్యా, అదానీ లిస్టెడ్ కంపెనీల షేర్ల మద్దతుతో మొత్తం ప్రమోటర్ పరపతిని తగ్గించడానికి ప్రమోటర్ల నిబద్ధత కొనసాగింపులో, మెచ్యూరిటీ కంటే ముందే 1,114 మిలియన డాలర్ల ప్రీ-పే మొత్తాలను చెల్లించనున్నామని ప్రకటించింది. ముందస్తు చెల్లింపులో భాగంగా ప్రమోటర్ హోల్డింగ్‌లో 12 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ల 168.27 మిలియన్ షేర్లు విడుదల చేయనుంది. అదానీ గ్రీన్ విషయానికొస్తే, ప్రమోటర్ హోల్డింగ్‌లో 3 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 27.56 మిలియన్ షేర్లను రిలీజ్ చేయనుంది. అలాగే, ప్రమోటర్ హోల్డింగ్‌లో 1.4 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అదానీ ట్రాన్స్‌మిషన్‌లోని 11.77 మిలియన్ షేర్లను రిలీజ్ చేయనుంది. కాగా అదానీ గ్రీన్ స్క్రిప్ వరుగా నాలుగో సెషన్లోనూ సోమవారం నాడు 5శాతం పడి లోయర్ సర్క్యూట్ అయింది. గత నెలతో పోలిస్తే సగానికి పైగా కోల్పోయింది. అదానీ గ్రూపు గత కొన్ని దశాబ్దాలుగా స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసాలు పాల్పడిందనే ఆరోపణలతో ఆమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్టు మార్కెట్లో ప్రకంపనలు రేపింది. దాదాపు 10 లిస్టెడ్ అదానీ గ్రూప్ కంపెనీలు భారీ నష్టాన్ని చవిచూశాయి. అయితే అదానీ గ్రూప్ హిండెన్‌బర్గ్ వాదనలను నిరాధారమైనదని కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. (ఇదీ చదవండి: Tech layoffs మరో టాప్ కంపెనీ నుంచి 6650 ఉద్యోగులు ఔట్!) -
కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు భారీ ఊరట!
న్యూఢిల్లీ: ఆర్కాడియా షేర్, స్టాక్ బ్రోకర్లకు సంబంధించిన షేర్ తనఖా కేసులో కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్)లో ఊరట లభించింది. ఈ వ్యవహారంలో స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ఈ డిపాజిటరీ సీడీఎస్ఎల్ (సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ లిమిటెడ్–ఇండియా) జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేసింది. నాన్-ట్రేడింగ్ సభ్యునికి ఆదేశాలు జారీ చేసే అధికారాలు ఎన్ఎస్ఈ, సీడీఎస్ఎల్కు ఉండబోవని అప్పీలేట్ అథారిటీ స్పష్టం చేసింది. (ఢిల్లీ టూ సిమ్లా: విమాన టికెట్ ధర కేవలం రూ. 2480) కేసు వివరాలు ఇవీ... మార్చి 2008లో, ఆర్కాడియా తన షేర్ల తాకట్టు ఆధారంగా కోటక్ మహీంద్రా బ్యాంక్ నుంచి రుణాన్ని పొందింది. తనఖా షేర్ల చట్టపరమైన, ప్రయోజనం పొందిన యజమాని ఆర్కాడియా మాత్రమేనని, సెక్యూరిటీ స్వాధీన చర్యలను బ్యాంక్ చేపట్టకూడదని ఈ మేరకు జరిగిన ఒప్పందం పేర్కొంది. అయితే డిసెంబర్ 2020 నాటికి, ఆర్కాడియా తన రీపేమెంట్ బాధ్యతల విషయంలో విఫలం అవడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తాకట్టు పెట్టిన సెక్యూరిటీలను తమ స్వాధీనంలోకి తీసుకునే ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ఆర్కాడియాకు బ్యాంక్ 2021 ఫిబ్రవరి 15వ తేదీన తెలియ జేసింది. దీనితో ఆర్కాడియా ఈ వ్యవహారంపై ఎన్ఎస్ఈ న్యాయ విభాగాన్ని ఆశ్రయించింది. తనఖా పెట్టిన ఆర్కాడియా అనుమతి లేకుండా షేర్ల స్వాధీనం కుదరదని ఎన్ఎస్ఈ బ్యాంక్‌కు స్పష్టం చేసింది. ఎన్ఎస్ఈ ఆదేశాల నేపథ్యంలో ఆర్కాడియా డీమ్యాట్ అకౌంట్‌ను సీడీఎస్ఎల్ స్తంభింపజేసింది. దీనితో ఆర్కాడియా తనఖా పెట్టిన షేర్లను బ్యాంక్ తన స్వాధీనంలోకి తీసుకోలేకపోయింది. ఈ వివాదంపై అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను కోటక్ బ్యాంక్ ఆశ్రయించింది. (Vivo Y35: స్లిమ్ ఫోన్ ‘వై35’ ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?) రూలింగ్ ఇలా... స్టాక్ ఎక్స్చేంజ్గా ప్రతివాది (ఎన్ఎస్ఈ) దాని ట్రేడింగ్ సభ్యులపై మాత్రమే అధికార పరిధిని కలిగి ఉంటుందని శాట్ స్పష్టం చేసింది. ట్రేడింగ్ సభ్యుడు కాని అప్పీలుదారు (కోటక్ మహీంద్రా బ్యాంక్)తో సహా మరే ఇతర సంస్థకు ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేమని పేర్కొంది. అదేవిధంగా, డిపాజిటరీ కూడా తన అధికార పరిధిలో లేని ఏ ఇతర సంస్థకు వ్యతిరేకంగా ఎలాంటి ఆదేశాలను జారీ చేయలేదని, లేదా అప్పీలుదారుకు అనుకూలంగా తాకట్టు పెట్టిన సెక్యూరిటీలను స్తంభింపజేయ జాలదని స్పష్టం చేసింది.ఆర్కాడియా తనఖా షేర్లపై -
‘ప్రతిజ్ఞ’కు అరవై ఏళ్లు
చైనాతో 1962లో భారత్ యుద్ధం జరుగుతోంది. దేశ విభజన గాయాల నుంచి దేశం కోలుకుంటున్న ఆ తరుణంలోనే కొందరు స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని మరచిపోతున్నారు. ఇటువంటి పరిస్థితులు పైడిమర్రి వెంకట సుబ్బారావును తీవ్రంగా కలచి వేశాయి. పౌరులలో దేశభక్తిని పెంచడానికి తనవంతుగా ఏదో ఒకటి చేయాలని ఆయన బలంగా అనుకున్నారు. అప్పటికే చైనాలో విద్యార్థులలో దేశభక్తిని పెంచడానికి దేశభక్తి గీతాలు ఉన్నట్లు తెలిసి వెంటనే ఆయన తొమ్మిది వాక్యాల ‘ప్రతిజ్ఞ’ రాశారు. పైడిమర్రి 1962లో విశాఖపట్నంలో జిల్లా ‘ఖజానా’ అధికారిగా పనిచేస్తున్న రోజులవి. సెప్టెంబర్ 17న ఆయన ‘ప్రతిజ్ఞ’ రచన చేశారు. ఆయన మిత్రుడు తెన్నేటి విశ్వనాథం ప్రతిజ్ఞ ప్రతిని చూసి నాటి విద్యా శాఖ మంత్రి పీవీజీ రాజుకు చూపించడంతో ప్రతిజ్ఞ పదాలు విద్యార్థులలో దేశభక్తినీ, సోదరభావాన్నీ పెంచుతాయని భావించి... పాఠ్యపుస్తకాలలో చేర్చారు. 1964 నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాఠ్యపుస్తకాలలో ప్రతిజ్ఞ ముద్రితమవుతున్నది. అదే ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రతిజ్ఞను మిగతా భారతీయ భాషల్లోకి అనువాదం చేయించింది. 1965 జనవరి 26 నుండి దేశవ్యాప్తంగా విద్యాలయాల్లో ప్రతిజ్ఞను ఆలపిస్తున్నారు. కానీ రచయిత పేరును మాత్రం ముద్రించలేదు. 2011లో ఎలికట్టె శంకరరావు ‘ప్రతిజ్ఞ సృష్టికర్త పైడిమర్రి’ పేరుతో ఓ వ్యాసం రాశారు. రాష్ట్ర విభజన తరువాత 2015లో పైడిమర్రి పేరుని వివిధ వర్గాల వారి విజ్ఞప్తి మేరకు రెండు తెలుగు రాష్ట్రాల పాఠ్య పుస్తకాలలో ‘ప్రతిజ్ఞ’ ఎగువన ముద్రిస్తున్నారు. 1916 జూన్ 10న నల్లగొండ జిల్లాలోని అన్నేపర్తి గ్రామంలో పైడిమర్రి జన్మించారు. కవిగా, రచయితగా, నీతి నిజాయితీగల ప్రభుత్వ ఉద్యోగిగా, బహుభాషా కోవిదుడిగా ఆయన పేరు పొందారు. 1988 ఆగస్ట్ 13న పైడిమర్రి తుదిశ్వాస విడిచారు. ఇప్పటికి ‘ప్రతిజ్ఞ’ రాసి 60 ఏళ్లు అవుతోంది. – మందడపు రాంప్రదీప్, తిరువూరు (ఇది ‘ప్రతిజ్ఞ’ వజ్రోత్సవాల సంవత్సరం) -
తుదిశ్వాస వరకు ..ఇదే నా ఆన! సోనూ ప్రతిజ్ఞ: వైరల్
సాక్షి, ముంబై: నటుడు, కరోనా కాలంలో రియల్ హీరోగా అవతరించిన సోనూ సూద్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఇంటిముందు అభిమానుల సందడి నెలకొంది. సోనూకు బర్త్‌డే విషెస్ అందించేందుకు దేశం నలుమూలల నుంచి అభిమానులు తరలి వచ్చారు. చిన్నా పెద్దా అంతా సోనూ నివాసం ముందు క్యూ కట్టారు. బాణా సంచా, పాటలు, కేకులతో హంగామా చేశారు. ఈ సందర్భంగా తనను కలవడానికి వచ్చిన అభిమానులతో సోనూ సందడిగా గడిపారు. దీనికి సంబంధించిన వీడియోను సోనూ శనివారం ట్విటర్లో షేర్ చేశారు. కాగా పుట్టిన రోజు సందర్బంగా కేవలం సాయం పొందినవారు, బాధితులు మాత్రమే కాదు, పలు రంగాలకు చెందిన సెలబ్రిటీలు, ముఖ్యమంత్రులు, రాజకీయ నేతలు, ఇంకా పలువురి ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ కురిసింది. దీంతో హ్యాపీ బర్త్ డే సోనూ సూద్ హ్యాష్‌ట్యాగ్, ట్విటర్లో ట్రెండింగ్‌లో నిలిచింది. అయితే తనకు విషెస్ చెప్పిన అందరికీ పేరు పేరునా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ విశేషంగా నిలిచింది. ‘నా తుది శ్వాస వరకు నా శక్తిమేరకు పేదవారికి సేవ చేస్తానని పుట్టినరోజు సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నానంటూ’ ట్వీట్ చేశారు. దీంతో సోనూ ఔదార్యానికి, పెద్ద మనసుకు అభిమానులు ఫిదా అయిపోతున్నారు. హృదయపూర్వంగా ధన్యవాదాలు తెలిపారు. కాగా కరోనా మహమ్మారి, లాక్డౌన్ సమయంలో వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లేందుకు సాయపడటం మొదలు, ఇటీవలి కరోనా సెకండ్ వేవ్ సంక్షోభంలో బాధితులకు ఆక్సిజన్ సిలిండర్లను అందించడమే కాదు, ఏకంగా ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అందుకే బాధితులంతా తమ గుండెల్లో గుడి కట్టుకుని మరీ సోనూని ఆరాధిస్తున్నారు. On my birthday I pledge to serve the needy to the best of my abilities till my last breath. — sonu sood (@SonuSood) July 30, 2021 Thank you so much everyone who came all the way from different parts of the country to wish me on my birthday. Really grateful for all the love and blessings ❣️🙏 pic.twitter.com/xmmtGvN3qx — sonu sood (@SonuSood) July 31, 2021 -
నేను ప్రేమించను, ప్రేమ పెళ్లి చేసుకోను’
‘నేను నా దేశమును ప్రేమించుచున్నాను..’ అని రోజూ ప్రతిజ్ఞ చేయించే ఆ కాలేజీ.. వాలెంటైన్స్ డే రోజు తమ విద్యార్థినుల చేత.. ‘నేను ప్రేమ పెళ్లి చేసుకోను’ అనే ప్రతిజ్ఞ కూడా చేయించింది! మహారాష్ట్ర, అమరావతి ప్రాంతంలోని ‘మహిళా కళ వనిజ మహా విద్యాలయ’ అనే కళాశాలలో శుక్రవారం ఉదయం ఈ భీషణ ప్రతిజ్ఞ ప్రతిధ్వనించింది. ‘బలమైన, ఆరోగ్యవంతమైన భారతదేశం కోసం నేను పాటు పడతాను..’ అంటూ విద్యార్థినుల చేత ప్రతిన పూనిస్తున్న టీచర్లు... ఊహించని విధంగా.. ‘నేను ప్రేమ పెళ్లి చేసుకోను’ అనే మాటను కూడా అనిపించేశారు! అక్కడితో ఆగకుండా.. ‘నా తల్లిదండ్రులపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. కాబట్టి నేను ప్రేమించను, ప్రేమ పెళ్లి చేసుకోను’ అని కూడా వల్లె వేయించారు. బలవంతపు పెళ్లి చెయ్యడం ఎంత తప్పో.. ప్రేమ పెళ్లి చేసుకోను అని చెప్పించడం అంటే తప్పు అని.. ఈ సంగతి తెలిసిన వారు ఆ కాలేజీ టీచర్లను విమర్శిస్తున్నారు. (మదిదోచే జలపాతాలు.. ఒక్కసారైనా వెళ్లాల్సిందే) -
ప్రతిఙ్ఞ : ‘అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించం’
న్యూఢిల్లీ : మహిళలు, చిన్నారులు, పాఠశాల విద్యార్థినులపై వేధింపులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ‘అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించం’అని విద్యార్థులతో ప్రతిఙ్ఞ చేయించనున్నట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. తమ ప్రభుత్వ చర్యల ఫలితంగా ప్రభుత్వ పాఠశాల్లో బాలికల సంఖ్య పెరిగిందని గుర్తు చేశారు. అయితే, వారు వేధింపులు ఎదుర్కొనే సందర్భంలో ‘మేము చదువుకోవడం సరైంది కాదేమో’అని భావిస్తారని సీఎం పేర్కొన్నారు. మహిళలు, చిన్నారులు, తోటి విద్యార్థుల పట్ల మర్యాదగా నడుచుకునే విధంగా విద్యార్థుల్లో నైతిక విలువల్ని పెంపొందిస్తామని సీఎం తెలిపారు. తమ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ వినూత్న నిర్ణయంతో.. బాలికలు తోటి విద్యార్థుల కళ్లలో తమ అన్నలను, తమ్ముళ్లను చూసుకుంటారని ఆకాక్షించారు. ప్రైవేటు స్కూళ్లలో లేని ఎన్నో సౌకర్యాలను ప్రభుత్వ బడుల్లో కల్పించామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలిపారు. తోటి విద్యార్థినులు, అమ్మాయిల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే ఇంట్లోకి రానివ్వమని ప్రతి తల్లి తన పిల్లలకు చెప్పాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇక ఢిల్లీ ప్రభుత్వ చర్యల ఫలితంగా రాజధాని ప్రాంతంలోని ప్రభుత్వ బడులు మెరుగైన ప్రగతి సాధించాయి. ఎడ్యుకేషన్ వరల్డ్ అనే వెబ్సైట్ నివేదికలో దేశంలోని టాప్ 10 పాఠశాల్లో ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న రాజ్కీయ ప్రతిభా వికాస్ విద్యాలయ (ఆర్పీవీవీ) మొదటి స్థానంలో నిలిచింది. దీనితో పాటు ఢిల్లీలోని మరో రెండు ప్రభుత్వ పాఠశాలలు టాప్ 10 స్థానం సంపాదించాయి. -
బయటివారిని పెళ్లి చేసుకోమని విద్యార్థుల ప్రతిజ్ఞ
ఐజ్వాల్ : ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో గిరిజన జనాభా అధికమనే విషయం తెలిసిందే. అయితే అక్కడి గిరినులు తమ ఉనికిపై బయటివారి ప్రభావం పడకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. మిజో గిరిజన తెగకు చెందినవారు బయటి వ్యక్తులను(గిరిజనేతరులను) పెళ్లి చేసుకోవద్దనే ప్రచారాన్ని విస్తృతం చేశారు. మిజోరంలో అత్యంత ప్రాబల్యం ఉన్న విద్యార్థి సంఘం మిజో జిర్లాయి పాల్(ఎంజెడ్‌పీ) ఇందుకోసం నడుం బిగించింది. అందులో భాగంగా రాష్ట్రంలోని పలు పాఠశాలలోని విద్యార్థులతో సోమవారం ఈ మేరకు ప్రతిజ్ఞ చేయించారు. బయటి వ్యక్తుల ప్రభావం నుంచి తమ గిరిజన సంస్కృతిని రక్షించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎంజెడ్‌పీ సభ్యులు తెలిపారు. ఎంజెడ్‌పీ సీనియర్ నాయకుడు ఒకరు మాట్లాడుతూ.. ‘2015 నుంచి ప్రతి సెప్టెంబర్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మిజోరం వెలుపలి వ్యక్తులను పెళ్లి చేసుకోవద్దని విద్యార్థులను కోరుతున్నాం. మాది చాలా చిన్న సంఘం.. బయటివారితో మేము సులువుగా కలిసిపోలేం. ఒకవేళ ఇక్కడివారు బయటివారిని పెళ్లి చేసుకుంటే మా సంఖ్య మరింతగా తగ్గుంతుంది. ఎంజెడ్‌పీ నాయకులు సోమవారం రాష్ట్రంలోని చాలా పాఠశాలల్లో పర్యటించారు. బయటి వ్యక్తులను వివాహం చేసుకోవద్దని ఈ సందర్భంగా విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించాం. కానీ వారితో ఎటువంటి లిఖిత పూర్వక పత్రాలు రాయించుకోలేదు. మేము ఎవరిని బలవంతం చేయడం లేదు. కేవలం విద్యార్థులకు సూచన మాత్రమే చేస్తున్నామ’ని తెలిపారు. కాగా, మిజో మహిళలు గిరిజనేతరులను పెళ్లి చేసుకుంటే వారు తాము అనుభవిస్తున్న ఎస్టీ హోదాను కోల్పోయేలా చట్టం తీసుకురావాలని యంగ్ మిజో అసోసియేషన్ డిమాండ్ చేసింది. -
ప్రేమికుల రోజున.. వెరైటీ పెళ్లి ప్రమాణం
గాంధీనగర్ : గురువారం ప్రేమికుల రోజు. ప్రేమించిన వారికి మనసులో మాట చెప్పడానికి ఉవ్విళ్లూరే వారు ఓ పక్క.. జంటగా కనిపిస్తే చాలు పెళ్లి చేస్తామని బెదిరించే గుంపులు మరోపక్క. ప్రేమికుల రోజున సర్వసాధరణంగా కనిపించే దృశ్యాలు ఇవి. కానీ వీటన్నింటికి భిన్నమైన ప్రదర్శన ఒకటి సూరత్‌లో జరగనుంది. దాదాపు 10 వేల మంది విద్యార్థుల చేత ‘పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకోము’ అని ప్రమాణం చేయించే కార్యక్రమం ఒకటి జరగనుంది. హస్యమేవ జయతే అనే స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. సంస్థ సభ్యుడొకరు దీని గురించి మాట్లాడుతూ.. ‘ప్రేమించడం, పెద్దలను ఎదిరించడం, పారిపోయి పెళ్లి చేసుకోవడం ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయాయి. పెళ్లి చేసుకున్న వారు సంతోషంగా ఉంటే ఏ సమస్య లేదు. కానీ కొందరు పెళ్లైన ఆర్నెల్లలోపే విడాకుల తీసుకుంటున్నారు. లేదంటే ఎదిరించి చేసుకున్నందుకు పెద్దలే వారి మీద దాడి చేయడం వంటి సంఘటనలను నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సమస్యలు తలెత్తకూడదనే ఉద్దేశంతోనే విద్యార్థుల చేత ‘తల్లిదండ్రుల అనుమతి లేకుండా ప్రేమ వివాహం చేసుకోమ’ని ప్రతిజ్ఞ చేయిస్తున్నాం. 12 పాఠశాలల నుంచి దాదాపు 10 వేలకు పైగా విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు’ అని తెలిపారు. -
కేసీఆర్ సభకు వెళ్లొద్దని ప్రతిజ్ఞ
కమ్మర్పల్లి(బాల్కొండ): నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం జరగ నున్న సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభకు వెళ్లవద్దని కమ్మర్పల్లి మండలం హాసాకొత్తూర్ గ్రామస్తులు తీర్మానం చేశారు. మంగళవారం గ్రామ శివారులోని జగదాంబ క్షేత్రంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులు సమావేశమై ఈ మేరకు తీర్మానం చేశారు. తమ గ్రామానికి అధికారికంగా మంజూరైన చౌట్పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకం గేట్‌వాల్వ్ బిగించడంలో పాలకులు, సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఎత్తిపోతల పథకం ద్వారా నీరు విడుదల చేస్తున్నప్పటికీ, చౌట్పల్లి గ్రామంతో వివాదం కారణంగా తమ గ్రామ చెరువులోకి నీరు రావడం లేదని వాపోయారు. దీంతో సాగు, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామన్నారు. అధికారికంగా మంజూరైన గేట్‌వాల్వ్‌ను ఏర్పాటు చేయకపోవడంతో రెండు గ్రామాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులమంతా ఏకమై అధికార పార్టీకి మద్దతు ఇవ్వకూడదని, ప్రజాప్రతినిధులు గ్రామానికి వస్తే వారికి కూడా మద్దతుగా నిలవకూడదని నిర్ణయించుకున్నామన్నారు. బుధవారం జరిగే సీఎం సభకు గ్రామంలో ఎవరు కూడా వెళ్లకూడదని తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల నాటికి గేట్ వాల్వ్ బిగించకపోతే ఎన్నికలను సైతం బహిష్కరిస్తామని హెచ్చరించారు. రాస్తారోకో సందర్భంగా గ్రామస్తులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని తీర్మానించారు. అనంతరం గ్రామస్తులంతా అధికార పార్టీకి మద్దతు తెలపకూడదని, సీఎం సభకు వెళ్లకూడదని ప్రతిజ్ఞ చేశారు. -
మగపిల్లల చేత ప్రతిజ్ఞ
‘అమ్మాయిల్ని గౌరవిస్తాం, మంచి పనికి మేము ఎప్పుడూ ముందుంటాం, అమ్మాయిల స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా నడుచుకుంటాం’ అని మగపిల్లల చేత నైరోబీ ప్రతిజ్ఞ చేయించడం నాలుగేళ్ల క్రితమే మొదలైంది. కెన్యా.. ఆఫ్రికా ఖండంలో ఓ దేశం. నైరోబీ.. కెన్యా దేశానికి రాజధాని నగరం. ఇప్పుడీ నగరం ప్రపంచదేశాలకు ఓ మార్గాన్ని నిర్దేశిస్తోంది. ఇప్పటి వరకు మహిళల వైపు ప్రపంచం మొత్తం వేలెత్తి చూపిన పరిస్థితులను సమూలంగా నిర్మూలించే ప్రయత్నం చేస్తోంది. నైరోబీలో ప్రతి నలుగురు ఆడపిల్లల్లో ఒకరు అత్యాచారానికి గురైన వాళ్లేనని ఒక సర్వే నిర్ధారించింది. ఇది జరిగి నాలుగేళ్లవుతోంది. అప్పుడు ప్రపంచం నివ్వెరపోయింది. అక్కడి మహిళల హక్కుల ఉద్యమకారులు ఉవ్వెత్తున లేచారు. తమ దేహం మీద హక్కు తమదేనంటూ నినదించారు. వాటన్నింటి ఫలితంగా నైరోబీలోని కొన్ని స్కూళ్లలో మగపిల్లల్లో మార్పు తెచ్చే పాఠాలు మొదలయ్యాయి. వాటికి సమాంతరంగా ఆడపిల్లలకు ఆత్మరక్షణ తరగతులు కూడా. రేపటి సమాజం నైతికవిలువలతో జీవించాలంటే అందుకు అనుగుణంగా ఈ తరం పిల్లల మెదళ్లను మలుచుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రాథమిక స్కూళ్లలో మహిళలను గౌరవించాలనే పాఠాలను బోధిస్తున్నారు. ‘మహిళలను గౌరవిస్తాం, మంచి పనికి మేము ఎప్పుడూ ముందుంటాం, మహిళల స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా నడుచుకుంటాం’ అని మగపిల్లల చేత ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. అమ్మాయిలకూ.. తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి పోరాడటం ఎలాగో నేర్పిస్తున్నారు. కరాటే వంటి ఆత్మరక్షణ విద్యలలో శిక్షణనిస్తున్నారు. ‘నన్ను తాక వద్దు, నన్ను నేను కాపాడుకోగలను’ అని వారి చేత ఒకటికి పదిసార్లు వల్లె వేయిస్తున్నారు. ఇదంతా అమ్మాయిలను, అబ్బాయిలను వేరు చేసి నేర్పించడం లేదు. ఒకరి ప్రతిజ్ఞలను, నినాదాలను మరొకరు వినేలా ఒకే తరగతి గదిలో చేయిస్తున్నారు. ఈ నాలుగేళ్ల తర్వాత ఫలితం ఏంటంటే.. నైరోబీలో అత్యాచారాలు సగానికి సగం తగ్గడం! ఇంట్లోనూ వల్లెవేస్తున్నారు! నైతిక విలువలను నేర్పించే తరగతులు మంచి ఫలితాలనిస్తున్నాయని అక్కడి సామాజిక కార్యకర్తలు అంటున్నారు. ఈ క్లాసుల వల్ల నేరుగా చైతన్యవంతమయ్యేది పిల్లలే, అయినా పెద్దవారిలో కూడా ఆలోచన రేకెత్తించగలిగారు. పిల్లలు స్కూలు నుంచి ఇంటికి వెళ్లి ఊరుకోరు కదా! అమ్మాయిలైతే ‘హూ... హా’ అని కరాటే ఫీట్లు చేస్తూ మనతో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే ఇలా పంచ్ ఇవ్వాలని... స్కూల్లో నేర్చుకున్న కొత్త విద్యను అమ్మానాన్నల ముందు ప్రదర్శిస్తారు. ‘మహిళ వస్త్రధారణను కామెంట్ చేయకూడదు. ఒంటరిగా వెళ్తుంటే ఆమెకు దారి ఇచ్చి మనం పక్కకు తప్పుకోవాలి తప్ప ఆమెను ఇబ్బంది పెట్టకూడదు. ఆమె చాయిస్‌ని గౌరవించాలి’ అనే చిలుక పలుకులను మగపిల్లలు వల్లిస్తున్నారు. దాంతో సమాజంలో మార్పు మొదలైందని, ఇది ఇక విస్తరించాల్సి ఉందని నైరోబీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మన దేశంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్టు ప్రకారం 2012లో 24,923, 2013లో (‘నిర్భయ’ చట్టం వచ్చిన ఏడాది) 33,707, 2014లో 36,735, 2015లో 34,210, 2016లో 38,947 అత్యాచార కేసులు నమోదయ్యాయి. అంటే రోజుకు సరాసరిన వందకు పైగానే! చట్టాలెన్ని ఉన్నా, మహిళల మీద అఘాయిత్యాలు ఆగాలంటే మగవాళ్ల మనస్తత్వం మారాలి. -
రామ మందిరం కోసం పోలీస్ ప్రతిజ్ఞ
లక్నో: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి బహిరంగంగా మద్ధతు పలికిన డీజీపీ స్థాయి అధికారి కొత్త వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. మూడు రోజుల క్రితం రామ మందిర నిర్మాణంపై లక్నో యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో హోంగార్డ్స్ డీజీ సుర్యకుమార్ శుక్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ మందిర నిర్మాణం సత్వరమే చేపట్టాలంటూ ఆయన చేసిన ప్రమాణం శుక్రవారం సామాజిక మాధ్యమాలు, టీవీల్లో ప్రసారమైంది. ‘రామ భక్తులమైన మనం ఈ కార్యక్రమంలో భాగంగా రామ మందిర నిర్మాణానికి పూనుకుందాం. జై శ్రీరాం!’ అని శుక్లా అన్నట్లు వీడియోలో కనిపించింది. -
బీజేపీకి ఓటేయం : విద్యార్థులతో ప్రమాణం చేయించిన టీచర్లు
సాక్షి, భోపాల్ : బీజేపీకి ఓటు వేయబోమని విద్యార్థులచే ఉపాధ్యాయులు ప్రమాణం చేయించిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇటార్సీలోని విజయలక్ష్మి ఇండస్ర్టియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన ఉపాధ్యాయులు ఆన్లైన్ పరీక్షలను నిలిపివేసే వరకూ రానున్న లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయబోమని విద్యార్ధులచే ప్రమాణం చేయించారు.దీనికి సంబంధించిన వీడియో రాష్ట్రంలో పెను దుమారం రేపింది. బీజేపీ కార్యకర్తలు, వాలంటీర్లకు ఏ రకంగానూ సహకరించబోమని, రానున్న 24 గంటల్లో ప్రతి ఒక్కరూ మరో ముగ్గురతో ఇలాంటి ప్రతిజ్ఞ చేయించాలని ఈ వీడియోలో విద్యార్థులు ప్రతినబూనుతూ కనిపించడం గమనార్హం. ఈనెల 26 రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న క్రమంలో ఈ వీడియో బహిర్గతమైంది. -
4న రాష్ట్ర వడ్డెర ఫెడరేషన్ ప్రమాణ స్వీకారం
కొరిటెపాడు (గుంటూరు): రాష్ట్ర వడ్డెర ఫెడరేషన్ ప్రమాణ స్వీకారం ఈ నెల 4వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఉదయం 10 గంటలకు జరుగుతుందని వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తన్నీరు ఆంజనేయులు చెప్పారు. స్థానిక బ్రాడీపేటలోని ఓ హోటల్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వడ్డెర ఫెడరేషన్ చైర్మన్‌గా అనంతపురం జిల్లాకు చెందిన దేవళ్ల మురళిని నియమించడం అభినందనీయమన్నారు. ప్రమాణ స్వీకార మహోత్సవంలో 13 జిల్లాల నుంచి వడ్డెర సంఘీయులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. హస్తకళలు, మైనింగ్ కార్పోరేషన్, భవన నిర్మాణ సంక్షేమం చైర్మన్ పదవులలో రెండు కోస్తా జిల్లాల వడ్డెరలకు కేటాయించాలని కోరారు. స్మార్ట్ పల్స్ సర్వే చేసే అధికారులకు బి.సి. జాబితాలను అందజేసి అవకతవకలు జరగకుండా చూడాలని సూచించారు. గుంటూరు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ పదవిని టీడీపీ సీనియర్ నాయకుడు చంద్రగిరి ఏడుకొండలుకు కేటాయించాలన్నారు. ఈ మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేను కూడా కలసి విన్నవించడం జరిగిందని, ఎమ్మెల్యే కూడా సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. సమావేశంలో వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రగిరి ఏడుకొండలు, గౌరవాధ్యక్షుడు వల్లెపు ముసలయ్య, కర్ణాటక రాష్ట్ర వడ్డెర సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు వేముల ఆంజనేయులు, సంఘం నాయకులు బత్తుల కూర్మయ్య, వల్లెపు బాబు, బత్తుల సాంబశివరావు, ఓర్సు కొండలు, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. -
మద్యం అమ్మం.. తాగం
దత్తత గ్రామ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించిన ఎస్సై దౌల్తాబాద్: తాగుడు వల్ల ఆరోగ్యం పాడవడమే కాకుండా ఆర్థికంగా నష్టపోతామని పేర్కొంటూ దౌల్తాబాద్ ఎస్సై పరశురాం తన దత్తత గ్రామం తిమ్మక్కపల్లిలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక మద్యం విక్రేతలు, ప్రజలు సమావేశంలో పాల్గొన్నారు. మద్యం తాగమని, అమ్మమని ఈమేరకు గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. అంతేకాకుండా అమ్మినవారికి రూ.10 వేలు, తాగినవారికి రూ.5 వేలు జరిమానా విధిస్తామని గ్రామస్థులు తీర్మానం చేశారు. అనంతరం ఇంకుడుగుంతలపై అవగాహన కల్పించారు.కార్యక్రమంలో సర్పంచ్ రమేశ్, రైతు రక్షణ వే దిక మండల అధ్యక్షుడు ఇప్ప దయాకర్ ఉన్నారు. -
గెలిచాకే వెళదాం... అప్పటిదాకా ‘నో’
ఎంపీ లేదా ఎమ్మెల్యే అయ్యే వరకూ చట్టసభల ప్రాంగణంలోకి అడుగుపెట్టను అని భీషణ ప్రతిజ్ఞచేశారు ఓ టీడీపీ నేత. జన్మతహా గుంటూరు జిల్లాకు చెందిన ఈ నేత పోలీస్ అధికారిగా కృష్ణా జిల్లాలో బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరువాత స్వచ్ఛంద పదవీ విరమణ చేసి టీడీపీలో చేరారు. ఆ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా, ఆ తరువాత ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నపుడు చివరి నిమిషంలో చంద్రబాబు తన సొంత జిల్లా చిత్తూరులోని తిరుపతి లోక్‌సభ సీటు కేటాయించారు. ఓడిపోయారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఆయనకు కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం నుంచి పోటీచేసేందుకు అవకాశం కల్పించారు. అక్కడ కూడా ఆయన ఓడిపోయారు. ఎంతోకాలం నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న ఆయన్ను పార్టీ అధినేత చంద్రబాబు కొద్ది రోజుల క్రితం ఏపీ గృహనిర్మాణ సంస్థ చైర్మన్‌గా నియమించారు. బుగ్గ కారు కేటాయించారు. దీంతో ఆయన అనుచరులు సార్ మనం కూడా అసెంబ్లీకి వెళదాం, మిగిలిన కార్పొరేషన్ల చైర్మన్లు ఎమ్మెల్యేలు కాకపోయినా అసెంబ్లీకి వెళుతున్నారు కాబట్టి మనం కూడా అలా వెళ్లొద్దామని అడిగితే ససేమిరా అనటంతో పాటు ఎంపీ లేదా ఎమ్మెల్యే అయ్యే వరకూ అటు పార్లమెంటు లేదా ఇటు అసెంబ్లీలో అడుగుపెట్టేది లేదు అని కరాఖండిగా చెప్పి అసెంబ్లీ చూడాలన్న అనుచరుల ఆశపై నీళ్లు చల్లుతున్నారట. -
మన కాలపు హీరోలదే రిపబ్లిక్ డే
‘భారత దేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమించుచున్నాను’ అంటూ మొదలుపెట్టి ‘నా దేశంపట్ల, ప్రజల పట్ల సేవానిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయోభివృద్ధులే నా ఆనం దానికి మూలం’ అంటూ ముగించే ఆ ప్రతిజ్ఞ ప్రతి రోజూ స్కూల్లో, చదువుకునే రోజుల్లో మనందరం నేర్చుకున్నదే! ఔను... ప్రతిజ్ఞలైనా, వాగ్దానాలైనా చేయడం తేలిక. నిలబెట్టుకోవడమే కష్టం. ప్రస్తుతం మనం 67వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఒక్కసారి ఈ ప్రతిజ్ఞ చేసిన మన భారతీయ సహోదరులు ఏం చేస్తున్నారో చూద్దాం. ఒకడు సిగ్నల్ లైట్స్ దగ్గర అడుక్కు తింటుంటే మరొకరు సైబర్ క్రైమ్ చేసి దొరికి పోతున్నాడు. ఇంకో సోదరుడు మాతృదేవతను వీలుంటే చంపేసో, వృద్ధాశ్రమంలో వదిలేసో.. భూమిని మాత్రమే ప్రేమిస్తున్నాడు. ఇంకో సోదరుడు కనబడిన ప్రతి గుడినీ, గోపురాన్ని దర్శించుకుంటూ చేసిన పాపాల్ని ప్రక్షాళన చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు. ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే చాలు.. మరికొందరు సోదరులు టీమ్‌వర్క్‌తో సామూహిక అత్యాచారాలు చేసుకుంటూ పోతు న్నారు. గాంధీ పుట్టిన దేశంలో గజానికో గాంధారి కొడుకు పుడుతూనే ఉన్నాడు. కానీ ఇది కేవలం ఒక భాగం మాత్రమే. కళ్లెదుట ముసురుకున్న ఈ కటిక చీకట్లను ఛేదించుకుంటూ కొత్త కాంతుల్ని ప్రసరింప చెయ్యడానికి ఈ దేశం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. ఈ విజయ ప్రస్థానానికి మూలం వర్తమానం లో లేదు. ఎందరో మహాత్ములు వాళ్ల స్వేదంతో, రక్తంతో ఈ మట్టిని పునీతం చేశారు. భగత్‌సింగ్, అల్లూరి, టంగుటూరి, జతీంద్రనాధ్ దాస్, ఖుదీ రామ్ బోస్, మేడం భికాజీ, బేగం హజ్రత్, ఝాన్సీ లక్ష్మీబాయ్, దుర్గావతీ దేవి, అష్పాఖుల్లా ఖాన్, బాలగంగాధర తిలక్, లాలాలజపతిరాయ్, రాజ్‌గురు, నేతాజీ, కొమురం భీం వంటి వారు మన మట్టిని సుసంపన్నం చేసిన త్యాగధనులు. ఇది గతం. కానీ వర్తమానంలో జరుగుతున్న అకృత్యాలకు చరమగీతం పాడటానికి కూడా ఎక్కడో ఒక చోట, ప్రతిరోజూ ఎవరిదో ఒక స్వరం బలహీనంగా అయినా వినపడుతూనే ఉంది. మైనస్ 60 డిగ్రీల చలిలో, సియాచిన్ లాంటి చోట నిరంతరం పహారా కాస్తూ, తమ కుటుంబానికి దూరంగా ఉంటూనే, కోట్లాదిమంది కుటుంబాలకు రక్షణగా నిలుస్తున్న మనుషులు సాధారణ జవాన్లు కారు. అలాగే ఆకలికి అల్లల్లాడుతున్న వృద్ధులను చూసి చలించిపోయి విదేశాల్లో ఉన్నతోద్యోగాలనే వదిలేసి అక్షయ్ ట్రస్టుతో అన్నార్తులకు కడుపునిండా అన్నం పెడుతున్న నారాయణన్, హైదరాబాద్‌లోని అజహర్ మక్సూసి, ముంబైలోని సందీప్ మనోహర్ దేశాయ్ లాంటి వాళ్లు మానవతకు నిజమైన అర్థంగా నిలుస్తున్నారు. వీళ్లే మనకాలపు హీరోలు. మనం మహాత్ములం కాలేకపోవచ్చు. కానీ గతకాలపు మహాత్ముల వీర చరిత్రల్ని, మన మధ్యే ఉంటూ మానవత్వపు విలువల్ని గగనపు అంచుకు చేరుస్తున్న రియల్ హీరోల కృషినీ, మన పిల్లలకు కథలుగా చెబుదాం. వాటినుంచి ఏ ఒక్కరు స్ఫూర్తిని పొందినా మరో మహాత్ముడు అవతరించినట్లే. అందుకే ముందుగా మనం, మన కుటుంబం మంచి గా, నీతిగా, నిజాయితీగా ఉండడానికి ప్రయత్నిస్తే చాలు.. ఈ దేశపు ప్రక్షాళన మొదలైనట్లే. అప్పుడు మాత్రమే మన 67 ఏళ్ల గణతంత్ర భారత్ వెయ్యేళ్లు వర్థిల్లగలుగుతుంది. శాంతి మంత్రం జపించకపోయినా పర్లేదు/ అశాంతి జ్వాల రగిలించకుండా ఉంటే చాలు.. నువ్వు బుద్ధుడివే!/ పక్కవాణ్ణి ప్రేమించకపోయినా పర్లేదు/ద్వేషించకుండా ఉంటే చాలు.. నువ్వు దేవుడివే!! (నేడు 67వ గణతంత్ర దినోత్సవం) వైవి రమణ, ఏపీ గ్రామీణ బ్యాంకు అధికారి, సికింద్రాబాద్ మొబైల్: 9440496187 -
కళ్లు తెరిచారు.. కల్లు మానేశారు!
కోహీర్: కల్తీకల్లును పారదోలేందుకు మనియార్‌పల్లి గ్రామస్తులు సిద్ధమయ్యారు. ఇకపై కల్లు విక్రయాలు జరగనివ్వమని గాంధీ విగ్రహం ఎదుట ప్రతిజ్ఞ కూడా చేశారు. ఈ మేరకు శుక్రవారం గ్రామంలోకి వచ్చిన కల్లు లారీని తరిమికొట్టారు. ఇటీవల కల్లు రేటు విషయమై చెలరేగిన వివాదం నిషేధానికి దారితీసింది. ఇదివరకు మనియార్‌పల్లి గ్రామంలో రూ.8కు కల్లు సీసా అమ్మేవారు. గిట్టుబాటు లేక కాంట్రాక్టర్ సీసా రేటు రూ.10కి పెంచాడు. దీంతో మద్యంప్రియులు, కాంట్రాక్టరు మధ్య వివాదం చెలరేగడంతో పంచాయితీ గ్రామపెద్దల వద్దకు చేరింది. శుక్రవారం ఉదయం వారంతా సమావేశ మై.. కల్తీకల్లు వల్ల జరిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. దీంతో కల్లును నిషేధించాలన్న ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ విషయాన్ని కోహీర్ పోలీసులకు తెలిపారు. ఏఎస్ఐ రాములు గ్రామానికి చేరుకొని కల్లును నిషేధంపై ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. సంపూర్ణ మద్య నిషేధం కోసం వచ్చే ఆదివారం తిరిగి సమావేశ మవుతామని గ్రామపెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఖదీర్, ఉపసర్పంచ్ ఎం.రాములు, గ్రామపెద్దలు సాయిరెడ్డి, నవాజ్ పటేల్, ఇస్మాయిల్, పాండునాయక్, నర్సిములు, అంజయ్య, మల్లప్ప, పోచయ్య, కిష్టయ్య, ఆశయ్య, గోపాల్, అనంత్రామ్, సత్యమ్మ, పోచమ్మ, నర్సమ్మ తదితరులున్నారు. గాంధీ విగ్రహం ఎదుట ప్రజల ప్రతిజ్ఞ -
మద్యనిషేధానికి గ్రామస్తుల ప్రతిజ్ఞ
భైంసా రూరల్: సంపూర్ణ మద్య నిషేధానికి ఓ గ్రామస్తులు ముందుకొచ్చారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం కుంసరా గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలోని యువకులు, కులసంఘాలు, పెద్దలు, రైతులు, మహిళలు, వృద్ధులు, విద్యావంతులు స్థానిక హనుమాన్ ఆలయం వద్ద సమావేశం ఏర్పాటు చేసి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో మద్యంతో ఇబ్బందులు వస్తున్నాయని.. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అందరూ సమిష్టిగా ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇకపై గ్రామంలో ఎవరూ మద్యం ముట్టుకోరాదని ప్రతిజ్ఞ చేశారు. మద్యానికి దూరంగా ఉంటూ గ్రామంలో మద్యం విక్రయాలు సైతం చేపట్టకుండా ఉండాలని అంతా నిర్ణయానికి వచ్చారు. -
ప్రకృతిని కాపాడుకుందాం: ఆప్
న్యూఢిల్లీ: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడుతామంటూ ప్రతిజ్ఞ చేసింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు ప్రమాణం చేసింది. మన రోజువారీ జీవితంలో భాగంగా ప్రకృతిని కాపాడుతామని ప్రతిన బూనాల్సిన అవసరం ఉందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఢిల్లీ సెక్రటేరియట్ ఆవరణలో మొక్కలు నాటారు. ఇతర మంత్రులు, చీఫ్ సెక్రటరీ కెకె శర్మ, సీనియర్ ప్రభుత్వ అధికారులు, వివిధ శాఖలు ముఖ్యఅధికారులు కూడా మొక్కలు నాటిన వారిలో ఉన్నారు. -
మా ఊళ్లో మద్యం వద్దు
అమ్మనియ్యం.. తాగనియ్యం మల్కపేటలో మహిళల తీర్మానం కోనరావుపేట: కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట గ్రామస్తులు మద్యం మహమ్మారిని ఊరి నుంచి తరిమికొట్టాలని నిర్ణయించుకున్నారు. గ్రామంలో ‘మద్యం అమ్మనియ్యం.. ఎవరినీ తాగనియ్యం’ అంటూ సోమవారం ప్రతిజ్ఞ చేశారు. మద్యం కారణంగా జరుగుతున్న అనర్థాలను అరికట్టాలని భావించిన గ్రామ మహిళలు తమ నిర్ణయాన్ని సర్పంచ్ ఒగ్గు లావణ్యకు తెలిపారు. సోమవారం గ్రామంలోని పోశమ్మ ఆలయ ఆవరణలో మహిళలందరూ సమావేశమై ఊరిలో బెల్ట్‌షాపులు ఉండొద్దని, విక్రయాలను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని, దీనిని కాదని ఎవరైనా విక్రయిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తమ తీర్మానం ప్రతిని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎస్సై రాయుడుకు సమర్పించారు. మహిళలు సమష్టిగా తీసుకున్న ఈ నిర్ణయానికి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల నాయకులు ఏల్పుల సరిత, ఆరె రేణుక, ఎక్కల్దేవి రజిత, ఎర్రోల్ల దేవవ్వ, జవ్వాజి శ్రీలత, ఇప్ప రాజవ్వ, సీఏ జవ్వాజి కవిత, మహిళలు పాల్గొన్నారు. -
నూతన గరిష్టస్థాయికి సెన్సెక్స్!
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు సోమవారం ట్రేడింగ్ లో నూతన జీవితకాలపు గరిష్ట స్థాయిని నమోదు చేసుకున్నాయి. ప్రధాన సూచీలలో సెన్సెక్స్ 288 పాయింట్ల లాభపడి 26390 వద్ద, నిఫ్టీ 82 పాయింట్ల వృద్దితో 7874 వద్ద ముగిసాయి. గ్లోబల్ మార్కెట్లలో సానుకూలత, స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీ ప్రసంగంలోని ఇన్ ఫ్రా, మానుఫ్యాక్చరింగ్ రంగాల అభివృద్ధి అంశాలు మార్కెట్ కు ఊపునిచ్చాయి. దాంతో అన్ని రంగాల కంపెనీ షేర్లలో కొనుగోళ్లు భారీగా జరిగాయి. బీపీసీఎల్, ఓఎన్ జీసీ, సిప్లాలు 5 శాతానికి పైగా, యాక్సీస్ బ్యాంక్, భెల్ 4 శాతానికి పైగా లాభపడ్డాయి. ఐటీసీ, ఇన్ఫోసిస్, హెచ్ డీఎఫ్ సీ, హెచ్ సీఎల్ టెక్, టీసీఎస్ కంపెనీలు స్వల్పంగా నష్టపోయాయి.