భైంసా రూరల్: సంపూర్ణ మద్య నిషేధానికి ఓ గ్రామస్తులు ముందుకొచ్చారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం కుంసరా గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలోని యువకులు, కులసంఘాలు, పెద్దలు, రైతులు, మహిళలు, వృద్ధులు, విద్యావంతులు స్థానిక హనుమాన్ ఆలయం వద్ద సమావేశం ఏర్పాటు చేసి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
గ్రామంలో మద్యంతో ఇబ్బందులు వస్తున్నాయని.. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అందరూ సమిష్టిగా ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇకపై గ్రామంలో ఎవరూ మద్యం ముట్టుకోరాదని ప్రతిజ్ఞ చేశారు. మద్యానికి దూరంగా ఉంటూ గ్రామంలో మద్యం విక్రయాలు సైతం చేపట్టకుండా ఉండాలని అంతా నిర్ణయానికి వచ్చారు.