రామ మందిరం కోసం పోలీస్‌ ప్రతిజ్ఞ | UP Police Officer Pledges To Build Ram Temple | Sakshi
Sakshi News home page

రామ మందిరం కోసం పోలీస్‌ ప్రతిజ్ఞ

Published Sat, Feb 3 2018 2:53 AM | Last Updated on Sat, Feb 3 2018 2:53 AM

UP Police Officer Pledges To Build Ram Temple  - Sakshi

హోంగార్డ్స్‌ డీజీ సుర్యకుమార్‌ శుక్లా

లక్నో: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి బహిరంగంగా మద్ధతు పలికిన డీజీపీ స్థాయి అధికారి కొత్త వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. మూడు రోజుల క్రితం రామ మందిర నిర్మాణంపై లక్నో యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో హోంగార్డ్స్‌ డీజీ సుర్యకుమార్‌ శుక్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ మందిర నిర్మాణం సత్వరమే చేపట్టాలంటూ ఆయన చేసిన ప్రమాణం శుక్రవారం సామాజిక మాధ్యమాలు, టీవీల్లో ప్రసారమైంది. ‘రామ భక్తులమైన మనం ఈ కార్యక్రమంలో భాగంగా రామ మందిర నిర్మాణానికి పూనుకుందాం. జై శ్రీరాం!’ అని శుక్లా అన్నట్లు వీడియోలో కనిపించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement