మూడు దశాబ్దాల కిత్రం అయోధ్యను సందర్శించిన ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ నాడు.. అక్కడి పరిస్థితులను చూసి, తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తూ, రామాలయ నిర్మాణం జరిగే వరకూ అయోధ్యకు రానంటూ ప్రతిజ్ఞ చేశారు.
అది.. 1991, డిసెంబర్ 11.. కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు సాగిన ఐక్యతా యాత్రలో పాల్గొన్న ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ.. 1992, జనవరి 14న అయోధ్యను సందర్శించారు. రామ్‌లల్లాను దర్శించుకున్నాక, రామాలయ నిర్మాణం జరిగిన తర్వాతనే తాను అయోధ్యకు వస్తారని ప్రతిజ్ఞ చేశారు. నాడు అయోధ్యకు వచ్చినప్పుడు మోదీ ఒక సాధారణ కార్యకర్త. నాటి మోదీ కల నేడు సాకరమయ్యింది. ప్రధాని మోదీ తన మొదటి అయోధ్య పర్యటనలో జానకీ మహల్ ట్రస్ట్‌లో బసచేశారు.
ఇది రామజన్మభూమికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంది. ట్రస్ట్ నిర్వాహకులు రామ్‌కుమార్ శర్మ మీడియాతో మాట్లాడుతూ, నరేంద్ర మోదీ తొలిసారి ఇక్కడికి వచ్చినప్పుడు రూమ్ నంబర్ 107లో బస చేశారని తెలిపారు. ఆ సమయంలో బీజీపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి 108 నంబర్ రూమ్‌లో బస చేశారని పేర్కొన్నారు. జానకీ మహల్‌లోనేవారు భోజనం చేశారని, అప్పుడు తన వయసు 35 ఏళ్లు అని, మోదీకి కూడా అదే వయసు ఉండవచ్చన్నారు.
నేడు ఆ గది శిథిలావస్థకు చేరుకుందని, దీంతో ఆ గదికి తాళం వేశామన్నారు. నాడు కఠిన ప్రతిజ్ఞ చేసిన మోదీ 28 సంవత్సరాల వరకూ అయోధ్య ముఖం చూడనే లేదు. 1992, జనవరి 14 వరకూ, అంటే 28 ఏళ్ల పాటు మోదీ అయోధ్యకు రాలేదు.
2019, నవంబర్ 9న రామమందిరానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. 2022లో ప్రధాని మోదీ అయోధ్యకు వచ్చి, దీపోత్సవంలో పాల్గొన్నారు. 2023 డిసెంబర్ 30న అయోధ్యలో రోడ్ షో నిర్వహించారు. ఇప్పుడు 22న రామమందిరాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య వస్తున్నారు. ఈ నేపధ్యంలో నాటి మోదీ ప్రతిజ్ఞ చర్చల్లో నిలిచింది.
ఇది కూడా చదవండి: ఆ రెండు విగ్రహాలను ఏం చేయనున్నారు?
Comments
Please login to add a commentAdd a comment