లతా మంగేష్కర్‌ ఆఖరి రామ శ్లోకాన్ని షేర్‌ చేసిన ప్రధాని మోదీ! | PM Modi Shares Lata Mangeshkar's Last Recorded Shree Ram Raksha Song - Sakshi
Sakshi News home page

Lata Mangeshkar: లతా మంగేష్కర్‌ ఆఖరి రామ శ్లోకాన్ని షేర్‌ చేసిన ప్రధాని మోదీ!

Published Wed, Jan 17 2024 11:59 AM | Last Updated on Wed, Jan 17 2024 12:23 PM

Lata Mangeshkar Last Recorded a Verse Related to Lord Rama - Sakshi

అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జనవరి 22న అభిజీత్ లగ్నంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ కార్యక్రమం పలువురు ‍ప్రముఖుల సమక్షంలో జరగనుంది. ప్రముఖ బాలీవుడ్ నటులు, గాయకులు, దర్శకులు, కళాకారులను ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ ఆహ్వానించారు. ప్రధాని మోదీ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో అయోధ్యకు సంబంధించిన అప్‌డేట్‌లను తరచూ షేర్‌ చేస్తున్నారు. 

తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రముఖ గాయని లతామంగేష్కర్‌కు సంబంధించిన ఒక వీడియోను ‘ఎక్స్‌’ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారంలో షేర్‌ చేశారు. అయోధ్యలో జరగబోయే శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో గాయని లతా మంగేష్కర్‌ను మిస్‌ కావడం విచారకరమని అన్నారు.  
 

లతా మంగేష్కర్‌ కీర్తనలలో ఒకదానిని ‘ఎక్స్‌’లో షేర్‌ చేసిన ప్రధాని.. ఇది లతా మంగేష్కర్ పాడగా, రికార్డ్ చేసిన చివరి శ్రీరాముని శ్లోకమని తెలిపారు. ఈ శ్లోకం పేరు ‘శ్రీ రామ్ అర్పణ్’. దీనిలో లతా మంగేష్కర్ మధురమైన గాత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంది.
ఇది కూడా చదవండి: నాలుగేళ్లలో పదింతల అభివృద్ధి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement