మద్యం అమ్మం.. తాగం
దత్తత గ్రామ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించిన ఎస్సై
దౌల్తాబాద్: తాగుడు వల్ల ఆరోగ్యం పాడవడమే కాకుండా ఆర్థికంగా నష్టపోతామని పేర్కొంటూ దౌల్తాబాద్ ఎస్సై పరశురాం తన దత్తత గ్రామం తిమ్మక్కపల్లిలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక మద్యం విక్రేతలు, ప్రజలు సమావేశంలో పాల్గొన్నారు. మద్యం తాగమని, అమ్మమని ఈమేరకు గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. అంతేకాకుండా అమ్మినవారికి రూ.10 వేలు, తాగినవారికి రూ.5 వేలు జరిమానా విధిస్తామని గ్రామస్థులు తీర్మానం చేశారు. అనంతరం ఇంకుడుగుంతలపై అవగాహన కల్పించారు.కార్యక్రమంలో సర్పంచ్ రమేశ్, రైతు రక్షణ వే దిక మండల అధ్యక్షుడు ఇప్ప దయాకర్ ఉన్నారు.