విద్యా వలంటీర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్
- నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖ
- జిల్లాలో 1,344 ఖాళీల భర్తీ
- నేటినుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సర్కారు బడుల్లో ఖాళీలను తాత్కాలికంగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలవారీగా అవసరాల్ని గుర్తించిన తర్వాత.. వాటిని భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింంది. జిల్లా వ్యాప్తంగా 1.344 ఖాళీలను విద్యావలంటీర్లతో నింపనుంది. వీరి సేవలను ప్రస్తుత విద్యాసంవత్సరానికి మాత్రమే వినియోగించుకోనుంది. ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించనుంది.
సర్తికొత్తగా..
విద్యావలంటీర్ల నియామకాలకు సంబంధించి ప్రభుత్వం ఈసారి సరికొత్త పద్ధతికి తెరలేపింది. అభ్యర్థుల నుంచి నేరుగా కాకు ండా ఆన్‌లైన్ పద్ధతిలోనే దరఖాస్తులు స్వీకరించనుంది. ఎస్‌ఎస్‌ఏ.టీజీ.ఎస్‌ఐసీ.ఇన్ వెబ్‌సైట్లో దరఖాస్తు ఫారాన్ని తెరిచిన అ నంతరం వివరాలు నమోదు చేసి సమర్పిం చాలి. ఆన్‌లైన్ పద్ధతిన మాత్రమే ఈ ప్ర క్రియ పూర్తి చేయాలి. ఆఫ్‌లైన్ దరఖాస్తులు అనుమతించబోమని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ ‘సాక్షి’తో పేర్కొన్నారు.
రోస్టర్ పద్ధతిలోనే భర్తీ..
గతంలో అర్హతను బట్టి విద్యావలంటీర్లను భర్తీ చేయగా.. ప్రస్తుతం ప్రభుత్వం నిబంధనలు విధించింది. వీవీల నియామకానికి సైతం రోస్టర్ పద్ధతిని అనుసరించాలని సూచిస్తూ.. ఈమేరకు ఖాళీల వివరాలను జిల్లా విద్యాశాఖ వెబ్‌సైట్లో, మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అందుబాటులో ఉంచింది. రోస్టర్ పద్ధతి ద్వారా అన్ని సామాజికవర్గాలకు న్యాయం కలిగించేందుకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.