ప్రతిన పూనుతున్న కళాశాల విద్యార్థినులు
‘నేను నా దేశమును ప్రేమించుచున్నాను..’ అని రోజూ ప్రతిజ్ఞ చేయించే ఆ కాలేజీ.. వాలెంటైన్స్ డే రోజు తమ విద్యార్థినుల చేత.. ‘నేను ప్రేమ పెళ్లి చేసుకోను’ అనే ప్రతిజ్ఞ కూడా చేయించింది! మహారాష్ట్ర, అమరావతి ప్రాంతంలోని ‘మహిళా కళ వనిజ మహా విద్యాలయ’ అనే కళాశాలలో శుక్రవారం ఉదయం ఈ భీషణ ప్రతిజ్ఞ ప్రతిధ్వనించింది. ‘బలమైన, ఆరోగ్యవంతమైన భారతదేశం కోసం నేను పాటు పడతాను..’ అంటూ విద్యార్థినుల చేత ప్రతిన పూనిస్తున్న టీచర్లు... ఊహించని విధంగా.. ‘నేను ప్రేమ పెళ్లి చేసుకోను’ అనే మాటను కూడా అనిపించేశారు! అక్కడితో ఆగకుండా.. ‘నా తల్లిదండ్రులపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. కాబట్టి నేను ప్రేమించను, ప్రేమ పెళ్లి చేసుకోను’ అని కూడా వల్లె వేయించారు. బలవంతపు పెళ్లి చెయ్యడం ఎంత తప్పో.. ప్రేమ పెళ్లి చేసుకోను అని చెప్పించడం అంటే తప్పు అని.. ఈ సంగతి తెలిసిన వారు ఆ కాలేజీ టీచర్లను విమర్శిస్తున్నారు. (మదిదోచే జలపాతాలు.. ఒక్కసారైనా వెళ్లాల్సిందే)
Comments
Please login to add a commentAdd a comment