valantines day
-
Valentines Day: వ్యాపార దిగ్గజాలు.. ఈ ప్రేమ పక్షులు
కులం, మతం, ప్రాంతం.. ఇలాంటి భేదాలు లేకుండా జరుపుకొనే వేడుక ఏదైనా ఉందంటే అది ఒక్క ‘వేలంటైన్స్ డే’నే అని చెప్పాలి. ప్రేమకు ఎలాంటి హద్దులు ఉండవు. ప్రేమ ధనిక, పేద తేడాను చూడదు. ఆపినా ఆగదు. అందుకే ఈ పదానికి ఎంతో విశిష్టత ఉంది. ఇక ప్రేమలో ఉన్న వారికి ప్రతిరోజూ ఓ పండగే అయినా ఏటా ఫిబ్రవరి 14న మాత్రం ‘ప్రేమికుల దినోత్సవాన్ని’ ప్రత్యేకంగా జరుపుకొంటారు. ప్రస్తుత రోజుల్లో చాలామంది ప్రేమికుల రోజును వ్యాపారంగా మలుచుకుంటున్నారు. కానీ నిత్యం వ్యాపారం చేస్తూ ప్రేమికులుగానే ఉండనున్నట్లు కొన్ని ప్రేమవివాహం చేసుకున్న జంటలు తెలుపుతున్నాయి. ఆ ప్రేమజంటలు చేస్తున్న వ్యాపారం విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. వినీతా సింగ్, కౌశిక్ ముఖర్జీ - షుగర్ కాస్మోటిక్స్ వినీతా సింగ్, కౌశిక్ ముఖర్జీ 2015లో షుగర్ కాస్మొటిక్స్‌ను స్థాపించారు. వీరు అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)లో కలిసి చదువుకున్నారు. బిపిన్ ప్రీత్ సింగ్, ఉపాసన టకు - మొబిక్విక్ ఉపాసన టకు, బిపిన్ ప్రీత్ సింగ్ 2009లో మొబిక్విక్ కంపెనీని ప్రారంభించారు. ఇది మొబైల్ ఫోన్ ఆధారిత చెల్లింపు వ్యవస్థలు, డిజిటల్ వాలెట్లతో సహా అనేక రకాల సేవలను అందించే కంపెనీ. ఆనంద్ సహానీ, మెహక్ సాగర్ - వెడ్మి గుడ్ ఆనంద్ సహానీ, మెహక్ సాగర్ హెల్త్ న్యూట్రిషన్ కంపెనీ అయిన గ్లాక్సో స్మిత్క్లైన్లో ఇంటర్న్‌షిప్ సమయంలో కలుసుకున్నారు. ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారు. తరువాత 2012లో వివాహం చేసుకున్నారు. అయితే వారి వివాహాన్ని ప్లాన్ చేస్తున్నప్పుడు ఈ జంటకు చాలా సమస్యలు ఎదురయ్యాయి. దాంతో బ్యాండ్-బాజా, క్యాటరింగ్ సేవలు, డెకరేషన్స్ వంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. దాంతో వారి పెళ్లి అనంతరం వారు ఎదుర్కొన్న సమస్యకు పరిష్కారం అందిస్తూ దాన్ని బిజినెస్‌గా మలుచుకున్నారు. తర్వాత 2014లో వెడ్మి గుడ్ కంపెనీను స్థాపించారు. శుభ్ర చద్దా, వివేక్ ప్రభాకర్-చుంబక్ శుభ్ర, వివేక్ 2005లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ముదురు రంగుల్లో ఉండే ‘కిట్చీ-చిక్’ ఉత్పత్తులను విక్రయించే వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. కాని అందుకు సరిపడా డబ్బు లేకపోవడంతో ఏకంగా తమ ఇంటిని అమ్మేందుకు సిద్ధపడ్డారు. 2009లో చుంబక్ కంపెనీను స్థాపించారు. ప్రత్యేకమైన గృహాలంకరణ వస్తువులు, ఫ్యాషన్ ఉపకరణాలను తయారుచేసి విక్రయిస్తున్నారు. గజల్ అలఘ్, వరుణ్ అలఘ్-మామా ఎర్త్ గజల్ అలఘ్ టాక్సిన్ ఫ్రీ బేబీ కేర్ ఉత్పత్తులను తయారుచేయాలని భావించి హోనాసా కన్స్యూమర్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మామాఎర్త్ను ఆగష్టు 2016లో తన భర్త వరుణ్ అలఘ్‌తో కలిసి స్థాపించారు. తల్లిదండ్రులు, పిల్లల కోసం సహజమైన ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు మామాఎర్త్ తెలిపింది. రోహన్, స్వాతి భార్గవ - క్యాష్‌కరో ఇదీ చదవండి: దేశంలోనే టాప్ కంపెనీలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇవి.. స్వాతి, రోహన్ భార్గవ క్యాష్‌కరో, క్యాష్‌బ్యాక్, కూపన్ వెబ్‌సైట్‌ను స్థాపించారు. ఏప్రిల్ 2011లో వీరు యూకేలో పోరింగ్ పౌండ్స్ పేరుతో క్యాష్‌బ్యాక్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. 2013లో లండన్ నుంచి గుర్గావ్కు తిరిగి వచ్చిన తర్వాత అదే బిజినెస్ మోడల్‌ను క్యాష్‌కరో పేరుతో భారత్‌లో ప్రారంభించారు. క్యాష్కరోలో టాటా, కలారీ క్యాపిటల్ పెట్టుబడులు పెట్టాయి. -
భేదాలు చూడని ప్రేమకు భరోసానిచ్చే బహుమతి
కులం, మతం, ప్రాంతం.. ఇలాంటి భేదాలు లేకుండా జరుపుకొనే వేడుక ఏదైనా ఉందంటే అది ఒక్క ‘వేలంటైన్స్ డే’నే అని చెప్పాలి. ప్రేమకు ఎలాంటి హద్దులు ఉండవు. ప్రేమ ధనిక, పేద తేడాను చూడదు. అందుకే ఈ పదానికి ఎంతో విశిష్టత ఉంది. ఇక ప్రేమలో ఉన్న వారికి ప్రతిరోజూ ఓ పండగే అయినా ఏటా ఫిబ్రవరి 14న మాత్రం ‘ప్రేమికుల దినోత్సవాన్ని’ ప్రత్యేకంగా జరుపుకొంటారు. తమ ప్రియమైన జీవిత భాగస్వామికి తన మనసులోని ప్రేమను చాటుతూ వారికి మంచి బహుమతి ఇవ్వాలని చాలామంది చూస్తుంటారు. ఈ విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో ఆలోచన. ఎవరి అభిరుచి, బడ్జెట్‌కి తగినట్లు బహుమతి ఎంచుకుంటూ ఉంటారు. పుష్పగుచ్చం, చాక్లెట్స్, బంగారం ఇలా అనేక బహుమతులు ఇస్తుంటారు. ఈసారి ఇందుకు భిన్నంగా వారి ఆర్థిక జీవితానికి, భవిష్యత్‌కు భరోసానిచ్చే ఈ బహుమతులు ఇచ్చి చూడండి. తప్పకుండా వారు సర్ప్రైజ్ అవుతారు. డిపాజిట్లు, పెట్టుబడుల రూపంలో.. పెట్టుబడులు మీ జీవిత భాగస్వామికి గొప్ప బహుమతి అవుతాయి. వారి భవిష్యత్ లక్ష్యాలు చేరుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లు, పీపీఎఫ్ ఇలా పెట్టుబడులకు అనేక మార్గాలు ఉన్నాయి. ఒకవేళ మీరు ఏదైనా విలువైన బహుమతి కొనాలనుకుని మీ వద్ద సరిపడా డబ్బు లేకపోతే.. ఎప్పుడు వారికి ఆ బహుమతి ఇస్తే వారికి ఉపయోగపడుతుందో చూడండి. ఒకటి రెండేళ్లు సమయం ఉంటే రికరింగ్ డిపాజిట్ ఖాతా తెరిచి, కాలపరిమితి ఏర్పాటు చేసుకుని, ప్రతి నెలా నిర్దిష్ట మొత్తాన్ని జమచేయండి. మొదటి నెల మొత్తాన్ని జమ చేసి దానికి సంబంధించిన వివరాలు వారికి తెలియజేసి బహుమతి ఇవ్వండి. దీర్ఘకాలం పాటు నెలవారీ సిప్ విధానం ద్వారా పెట్టుబడులు ప్రారంభించి బహుమతి ఇవ్వొచ్చు. లేదా మీ జీవిత భాగస్వామికి ఇష్టమైన సంస్థల షేర్లను కొనుగోలు చేసి బహుమతి ఇవ్వొచ్చు. జీవిత, ఆరోగ్య బీమాతో.. మీ జీవిత భాగస్వామి, పిల్లల భవిష్యత్‌కు బీమా భరోసా కల్పించొచ్చు. జీవిత (టర్మ్ ప్లాన్), ఆరోగ్య బీమాలో ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు. ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో అనుకోని సంఘటనలు జరిగితే ఈ పాలసీలు మీ జీవిత భాగస్వామికి అండగా ఉంటాయి. దీంతో భవిష్యత్‌కు భరోసానిచ్చే అతిపెద్ద బహుమతి వారికి ఇస్తున్నట్లే అవుతుంది. ఎమర్జెన్సీ కోసం క్రెడిట్ లైన్.. అన్ని అత్యవసర సమయాల్లోనూ మీరు మీ జీవిత భాగస్వామి పక్కన ఉండలేకపోవచ్చు. కానీ ఫ్లెక్సీపేతో వ్యక్తిగత క్రెడిట్ లైన్‌ను అందించవచ్చు. స్వల్పకాలిక, చిన్న చిన్న అత్యవసరాల కోసం ఇది వారికి ఉపయోగపడుతుంది. ప్రతిసారీ రుణం కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా అత్యవసరాలకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇది వారికి ఉపయోగపడే బహుమతి అవుతుంది. బంగారం పథకాలతో.. భారతీయులకు బంగారం పట్ల మమకారం ఎక్కువ. ఇందులో భావోద్వేగాలు నిండి ఉంటాయి. బంగారం బహమతి ఇస్తే మీ ప్రియమైన వారి ఆనందానికి అవధులు ఉండవు. అయితే, బంగారాన్ని ఆభరణాల రూపంలో కాకుండా సావరిన్ గోల్డ్ బాండ్ల రూపంలో గానీ, గోల్డ్ ఈటీఎఫ్ రూపంలో గానీ, డిజిటల్‌గా గానీ అందించడం వల్ల ఆర్థికంగా ఎక్కువ ప్రయోజనం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇదీ చదవండి: 'వాలెంటైన్స్ డే' రోజు షాకివ్వనున్న డ్రైవర్లు, డెలివరీ బాయ్స్! ఈ ప్రేమికుల రోజున మీకు ప్రియమైన భార్య, పిల్లల భవిష్యత్‌ను సురక్షితం చేసే బహుమతులు వారికి అందించండి. మీ కుటుంబ సభ్యులకు పొదుపు, పెట్టుబడులు, బ్యాంకులు అందించే సేవలు, క్రెడిట్ కార్డులు, బీమా ఇలా అన్ని ఆర్థిక విషయాల పట్ల అవగాహన కల్పించండి. పొదుపు చేయడం పిల్లలకు అలవాటు చేయండి. మీరు చేసే పొదుపు అలవాట్లు, ఆర్థిక విషయాల గురించి నేర్పించే పాఠాలే భవిష్యత్‌లో వారికి గొప్ప బహుమతులు అవుతాయి. -
'అదే నీతో ప్రేమలో పడేలా చేస్తుంది'.. రానా భార్య మిహికా క్యూట్ పోస్ట్
ఫిబ్రవరి 14.. ప్రేమికుల రోజు సందర్భంగా పలువరు సినీ ప్రముఖులు తమ వలెంటైన్స్తో కలిసి ఉన్న స్పెషల్ మూమెంట్స్‌ని షేర్ చేసుకుంటున్నారు. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి భార్య మిహికా బజాజ్ షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. భర్త రానాతో కలిసి దిగిన ఓ క్యూట్ ఫోటోను షేర్చేస్తూ.. ''నేను స్ట్రాంగ్, స్వీట్, వైల్డ్, ఇంకా వండర్ఫుల్. నా గురించి చెప్పుకుంటూ పోతే పదాలు సరిపోవడం లేదు. అందుకే నువ్వు నన్ను ఇంతలా ప్రేమించడంలో ఆశ్చర్యం లేదు..(ఫన్నీ ఎమోజీ). రోజంతా నువ్వు నన్ను విసిగించినా నీ నవ్వు మళ్లీ నీతో ప్రేమలో పడేలా చేస్తుంది. హ్యాపీ వాలైంటైన్స్ డే రానా'' అంటూ తన భర్తపై తనకున్న ప్రేమను వ్యక్తపరిచింది. ఈ పోస్ట్ చూసి వెంకటేశ్ కూతురు ఆశ్రిత సహా పలువురు నెటిజన్లు క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) -
కిస్ చేస్తే ఇది ‘మిస్’ కారు..
కిస్.. అంటే ముద్దు పెట్టుకోవడం అని సింపుల్‌గా తీసిపారేయడానికి లేదు. ముద్దువల్ల వ్యక్తులు పొందే అనుభూతి అనిర్వచనీయం. ఇది మనసుకు దగ్గరైన వారితో మాత్రమే పంచుకునే ఒక తియ్యని అనుభూతి. అందుకే వాలెంటైన్స్ వీక్‌లో లవర్స్ ఈరోజు (ఫిబ్రవరి 13)ను కిస్‌డే గా సెలబ్రెట్ చేసుకుంటారు. అయితే ఈ కిస్‌లో అనిర్వచనీయ భావాలతోపాటు, మనసును ఉత్సాహపరిచే రొమాంటిక్ ఫీలింగ్స్‌లు ఎన్నో ఉంటాయి. అవేంటో చదివేయండి... ప్రేమికులు తమ మనసులోని ప్రేమను, వారి లవర్‌కి కొంత రొమాంటిక్‌గా వ్యక్తపరచుకోవాలన్నప్పుడు కిస్ చేస్తారు. ఈ చర్యతో వారే తమ ప్రపంచమని మనసులో ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తారు. ఇలా చేయడం వలన ప్రేమించిన వారి పట్ల తమకున్న ప్రేమ, నమ్మకం, పెరుగుతాయని చాలా మంది నమ్ముతారు. ప్రేమికులు గాఢంగా చుంబించుకోవడం వలన కొన్ని రకాల రసాయనాలు విడుదలై ఒత్తిడి తగ్గి వారి మధ్య ఒక బాండింగ్ క్రియేట్ అవుతుందని కొన్ని పరిశోధనల్లో కూడా వెల్లడైంది. కిస్ చేస్తే.. తల్లిదండ్రులు తమ పిల్లలను దగ్గర తీసుకొని నుదుటి పైన కిస్ చేస్తారు. ఈ చర్యతో వారిని ఆశీర్వదిస్తారు. ఒక్కొసారి పిల్లలు తమ వారు కిస్‌చేయడం వలన తామున్నమనే భరోసా ఏర్పడుతుందని అనుకుంటారు. చుంబించుకోవడం అనే చర్య వలన మానసిక ఆనందం కలిగి మాములు కన్నా 5 ఏళ్ల ఆయుర్దాయం పెరుగుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. చదవండి: ప్రేమకు తాళం వేస్తున్న ప్రేమికులు ఎందరో! -
ప్రేమకు తాళం వేస్తున్న ప్రేమికులు ఎందరో!
ప్రేమ... కలకాలం కలిపి ఉంచే బంధం. అందంగా అల్లుకున్న ప్రేమబంధం...రోజు రోజుకీ మరింతగా బలపడాలి. ఎప్పటికీ దూరంకానంత దగ్గరగా ఉంచాలి. బంధించినంత దృఢంగానూ ఉండాలి. అవసరమైతే గుండె గదికి తాళం వేయాలి. ప్రేమకు తాళం వేస్తున్న ప్రేమికులు ఎందరో! ఒక దేశంలో చెట్టుకు తాళం వేస్తే..మరికొన్ని దేశాల్లో వంతెనలకు తాళం వేస్తున్నారు. ఎంతసేపూ మాట్లాడే పిల్లలను నోటికి తాళం వేయమని టీచర్లు గదిమేవాళ్లు. పిల్లలు చూపుడు వేలిని పెదవుల మీద ఆన్చి దొంగ చూపులు చూస్తూ ఉంటారు. టీచర్ దృష్టి తమ మీద నుంచి పక్కకు మళ్లగానే నోటి మీదున్న చూపుడు వేలిని అలాగే ఉంచి పక్కనున్న పిల్లలతో మెల్లగా గుసగుసలాడుతుంటారు గడుగ్గాయిలు. స్కూలు దశలో మొదలయ్యే ఈ అలవాటు పెద్దయినా పోయేటట్లు లేదు. నిబంధనల కళ్లుగప్పి ప్రేమతాళాలు వేస్తూనే ఉన్నారు ప్రపంచంలోని ప్రేమికులు. ప్రేమను పండించుకోవడానికి తాళాలు వేసే అలవాటు సరదాగా మొదలైంది. ఆ అలవాటును మాన్పించడానికి చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. ప్రపంచంలో ప్రేమికుల తాళాల అడ్డాలు చాలానే ఉన్నాయి. మనదేశానికీ పాకింది. కానీ వెర్రి తలలు వేయడం లేదు. ప్రేమబంధం కలకాలం ఫ్రాన్స్ దేశం, పారిస్ నగరంలో సీయెన్ నది మీద ఓ వంతెన. పేరు పాంట్ ద ఆర్ట్స్. ఈ వంతెన ప్రేమబంధాన్ని కలకాలం నిలబెడుతుందని ఓ నమ్మకం. వంతెన రెయిలింగ్‌కు ఉన్న తాళాలన్నీ ప్రేమికులు ప్రేమతో వేసినవే. ప్రేమికులు తాళం కప్ప మీద తమ పేర్లు రాసుకుని మరీ తాళం వేస్తారు. తాళం చెవిని నదిలోకి విసిరేస్తారు. అంతే... అలా చేస్తే తమ ప్రేమబంధానికి తాళం వేసినట్లేనని వారి నమ్మకం. ఇది సరదాగానే మొదలైంది. కానీ విపరీతంగా ప్రచారంలోకి రావడంతో స్థానికులే కాక పారిస్ పర్యటనకు వచ్చిన వాళ్లు కూడా తాళాలు వేయడం మొదలుపెట్టారు. ప్రపంచప్రేమికుల ప్రేమ బరువు మోయలేక వంతెన చేతులెత్తేసింది. ఇప్పుడు ఇక తాళాలు వేయవద్దు బాబోయ్ అంటూ వేడుకుంటున్నారు పారిస్ నగర నిర్వహకులు. అయినా వారి కళ్లుగప్పి తాళాలు పడుతూనే ఉన్నాయి. వేసేవాళ్లు వేస్తూనే ఉన్నారు. నగర పాలక సిబ్బంది వాటిని తొలగిస్తూనే ఉన్నారు. ‘ఐ వాంట్ యూ’ ప్రభావం ఫ్రాన్స్‌లో జరుగుతోంది కాబట్టి ఫ్రెంచ్ వాళ్ల నమ్మకం అనిపిస్తుంది. ఇటాలియన్ నవల ‘ఐ వాంట్ యూ’తో మొదలైంది. ఇందులో నాయికానాయకులైన రోమన్ ప్రేమికులు తమ ప్రేమను పండించుకోవడానికి వంతెనకు తాళం వేయడాన్ని వర్ణించాడు రచయిత. అంతే దశాబ్దంలోపే పారిస్ వంతెనకు ఏడు లక్షల తాళాలు పడ్డాయి. వెర్రితలలు వేస్తున్న ఈ అలవాటును మాన్పించడానికి ‘లవ్ విదవుట్ లాక్స్’ ప్రచారం మొదలైంది. ‘వంతెన మీద నిలబడి ఒక సెల్ఫీ తీసుకోండి. ప్రేమ ఎల్లప్పటికీ నిలిచి ఉంటుంది’ అనే ప్రచారం కూడా మొదలైంది. కానీ తాళం పడటం ఆగలేదు, తాళాలు వేస్తూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. స్కాట్లాండ్లో... ‘మార్క్ యువర్ స్పాట్’ ఇలాంటిదే. ఈ వంతెన మీద ఏటా ప్రేమికుల కోసం వేడుకలు జరుగుతాయి. వంతెనలకు తాళాలు వేయడాన్ని నిషేధిస్తున్నారు. అయితే ఈ నిషేధం తాళాలకే, ప్రేమకు కాదు. సౌత్ కొరియాలో... సౌత్ కొరియాలోని డియాగులో ఉన్న సుసెయాంగ్ సరస్సు కూడా ప్రేమికుల సెంటిమెంట్‌ను పండించే అడ్డానే. ఈ వంతెన మీద ఉండే రెయిలింగ్‌కు తాళాలు వేసి తాళం చెవిని నీటిలోకి విసిరేస్తారు. మాస్కో ప్రేమ మాస్కోలో వోడూట్డోట్నీ కెనాల్ మీద కట్టిన వంతెన ప్రేమికుల అడ్డా. ఈ వంతెన మీద ఇనుప చెట్లకు నిండా పూలు విరగబూసినట్లు తాళాలుంటాయి. అవన్నీ లవ్లాక్లే. -
నేను ప్రేమించను, ప్రేమ పెళ్లి చేసుకోను’
‘నేను నా దేశమును ప్రేమించుచున్నాను..’ అని రోజూ ప్రతిజ్ఞ చేయించే ఆ కాలేజీ.. వాలెంటైన్స్ డే రోజు తమ విద్యార్థినుల చేత.. ‘నేను ప్రేమ పెళ్లి చేసుకోను’ అనే ప్రతిజ్ఞ కూడా చేయించింది! మహారాష్ట్ర, అమరావతి ప్రాంతంలోని ‘మహిళా కళ వనిజ మహా విద్యాలయ’ అనే కళాశాలలో శుక్రవారం ఉదయం ఈ భీషణ ప్రతిజ్ఞ ప్రతిధ్వనించింది. ‘బలమైన, ఆరోగ్యవంతమైన భారతదేశం కోసం నేను పాటు పడతాను..’ అంటూ విద్యార్థినుల చేత ప్రతిన పూనిస్తున్న టీచర్లు... ఊహించని విధంగా.. ‘నేను ప్రేమ పెళ్లి చేసుకోను’ అనే మాటను కూడా అనిపించేశారు! అక్కడితో ఆగకుండా.. ‘నా తల్లిదండ్రులపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. కాబట్టి నేను ప్రేమించను, ప్రేమ పెళ్లి చేసుకోను’ అని కూడా వల్లె వేయించారు. బలవంతపు పెళ్లి చెయ్యడం ఎంత తప్పో.. ప్రేమ పెళ్లి చేసుకోను అని చెప్పించడం అంటే తప్పు అని.. ఈ సంగతి తెలిసిన వారు ఆ కాలేజీ టీచర్లను విమర్శిస్తున్నారు. (మదిదోచే జలపాతాలు.. ఒక్కసారైనా వెళ్లాల్సిందే) -
ప్రే‘మైకం’!.. సందట్లో పోలీసుల సడేమియా
‘రెండక్షరాల ప్రేమ.. రెండు క్షణాల ప్రేమ’ అన్నాడో సినీకవి. ఎందరో ప్రేమికులుఈ పాటలోని మాటలను నిజం చేస్తూ ‘ప్రేమ ఎంత మధురం..ప్రియురాలుఅంత కఠినం’ అంటూ విరహ గీతాలు పాడుకుంటున్నారు. అయితే కొందరు యువతీ యువకులు మాత్రం ‘ఎన్నెన్నో జన్మల బంధం నీది నాదీ’ ప్రేమగీతాన్ని ఆలపిస్తూ పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. ఇలా చేదు, తీపి అనుభవాల ప్రేమజంటలు శుక్రవారం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సందడి చేశాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రేమికుల కోసం పోరాడిన క్రైస్తవమత బోధకులు వాలెంటైన్‌కు స్మారకంగా ప్రతి ఏడాదీ ఫిబ్రవరి 14వ తేదీని ‘వాటెంటైన్ డే’గా జరుపుకుంటున్నారు. తల్లిపై ప్రేమ, తండ్రి, సోదరుడు, సోదరి, స్నేహితుడు, సహ విద్యార్థి ఇలా ప్రేమలో భిన్నమైన రకాలున్నా వాలెంటైన్ డే నాడు ఇలాంటి ప్రేమాభిమానులకు ఎంతమాత్రం తావులేకుండా పోయింది. పరస్పర ఆకర్షణతో కూడిన ప్రేమ జంటలకే వాలెంటైన్ డే పరిమితమైంది. ప్రేమను పెంచి పోషించేందుకు యువతీయువకులు ప్రతినిత్యం ఏదో ఒకచోట కలుసుకుంటున్నా ప్రేమికుల దినోత్సవం రోజున ఒకచోట చేరితే ఆ మజానే వేరు అన్నట్లు వ్యవహరిస్తారు. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని పర్యాటక, విహార ప్రాంతాలు ప్రేమజంటలతో కళకళలాడాయి. మోటార్ సైకిళ్లు, కార్లు బారులుతీరాయి. అంతర్జాతీయ పర్యాటక ప్రాంతమైన మహాబలిపురానికి ఉదయం 8 గంటల నుంచి పెద్ద సంఖ్యలో ప్రేమజంటలు చేరుకోవడం ప్రారంభమైంది. మహాబలిపురం, చెన్నై మెరీనాబీచ్, బిసెంట్‌నగర్ బీచ్, ప్రధానమైన పార్కులు ప్రేమజంటలకు నిలయాలుగా మారాయి. బీచ్‌లలో ఎండను సైతం లెక్కచేయకుండా ఇసుకపై గంటలతరబడి కూర్చుని కాలక్షేపం చేశారు. పుష్పాలు, బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. జేబులు నింపుకున్న పోలీస్ వివిధ వాహనాల్లో ఉత్సాహంగా వెళుతున్న ప్రేమజంటలను తనిఖీల పేరుతో బెదిరించి కొందరు పోలీసులు జేబులు నింపుకున్నారు. ఈసీఆర్‌లో వెళ్లే ప్రేమజంటలను అపి వాహన పత్రాల తనిఖీ, హెల్మెట్ వంటి వాటిని సాకుగా పెట్టుకుని జరిమానాలు విధించారు. కొద్దిపాటు డబ్బును తెచ్చుకున్న ప్రేమజంటలు సమీపంలోని దుకాణాల్లో తమ విలువైన వస్తువులను కుదువబెట్టి పోలీసులకు చెల్లించారు. కొడైక్కెనాల్ పార్టీపై నిషేధం కొడైక్కెనాల్లో గత వారం ఒక ప్రయివేటు తోటలో 276 మంది యువతీ యువకులు మద్యం, మాదక ద్రవ్యాలు సేవించి మత్తులో ఊగిపోయారు. వీరిలో ఆరుగురు యువతులు కూడా ఉన్నారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి కేసులు పెట్టాలని నిర్ణయించుకున్నారు. వారి భవిష్యత్తు నాశనం అవుతుందనే సానుభూతితో హెచ్చరించి విడిచిపెట్టారు. పార్టీకి సారధ్యం వహించిన ముగ్గురిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. పూంపారై సమీపంలోని ఒక ప్రయివేటు లగ్జరీ అతిథి గృహంలో పాశ్చాత్య సంగీతం, విందు వినోదాలకు కొందరు బుక్ చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 13 నుంచి 16వ తేదీ వరకు పార్టీలు చేసుకునేందుకు కొందరు ఏర్పాట్లు చేసుకున్నారు. ఒక్కోరికీ రూ.2500 చెల్లించి ఆన్లైన్ ద్వారా రిజిష్ట్రరు చేసుకోవాలని నిర్వాహకులు ప్రకటించి తమిళనాడుతోపాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో యువతీ యువకులను సమీకరించారు. ఇటీవల జరిగిన అనుభవంతో సదరు పార్టీపై స్టే విధించాలని పోలీసులు మధురై హై కోర్టులో పిటిషన్ వేయగా మంజూరైంది. ఈ సంగతి తెలియక యువతీ యువకులు గురువారం రాత్రి నుంచీ కొడైక్కెనాల్ అతిథిగృహం వద్దకు చేరుకోవడం, పరిసర ప్రాంతాల్లో చిన్నపాటి గుడారాలు వేసుకుని సేదతీరడం ప్రారంభించారు. శుక్రవారం ఉదయం పోలీసులు అక్కడికి చేరుకుని పార్టీపై కోర్టు నిషేధం విధించిన సంగతిని చెప్పి వెళ్లిపోవాలని కోరారు. కొందరు యువతీ యువకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మాదకద్రవ్యాలతో పార్టీ సాగుతుందనే అనుమానంతోనే స్టే తీసుకొచ్చినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. -
ఇలాంటి పెళ్లికి ఏ సర్టిఫికెట్ ఇవ్వాలో..!!
నిన్నటి వాలంటైన్స్ డే మణిగంధన్‌కి, సురేఖకు ప్రత్యేకమైనది. ఈ భార్యాభర్తలకు నిన్న మ్యారేజ్ సర్టిఫికెట్ వచ్చింది! కోయంబత్తూర్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కి వెళ్లి ఓ సంతకంపెట్టి, పనిలో పనిగా అక్కడి అధికారులకు ఓ దండం పెట్టి బయటికి వచ్చింది ఈ జంట. రెండేళ్లుగా మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం తిరుగుతున్నారు మణిగంధన్, సురేఖ. సరిగ్గా రెండేళ్ల క్రితం వాలంటైన్స్ రోజునే ఫిబ్రవరి 14న వాళ్ల పెళ్లి జరిగింది. చివరికి ఈ నెల మొదట్లో రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ‘మీకు సర్టిఫికెట్ ఇస్తున్నాం. ఎప్పుడొచ్చి తీసుకుంటారు?’’ అని. అచ్చం సినిమాల్లో చూపించినట్లే.. ఆనందంతో ఎగిరి గంతేశారు. వాలంటైన్స్ డే రోజు వచ్చి తీసుకుంటాం సార్ అని చెప్పారు. వెళ్లి తీసుకున్నారు. మణిగంధన్, సురేఖలకు మ్యారేజ్ సర్టిఫికెట్ రావడానికి ఇంత సమయం పట్టడం వెనుక పెద్ద కారణమే ఉంది. మణిగంధన్ అబ్బాయి. సురేఖ అమ్మాయి లాంటి అబ్బాయి. ట్రాన్స్ ఉమన్! ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి రెండు కుటుంబాలు ఒప్పుకున్నాయి.సమాజం కూడా ఒప్పుకుంది. రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్లకే ఒప్పుకోడానికి చట్టం అడ్డుపడింది. ఒక పురుషుడికి–స్త్రీకి మధ్య జరిగిన పెళ్లికైతే మ్యారేజ్ సర్టిఫికెట్ ఇవ్వగలం కానీ.. ఇలాంటి పెళ్లికి ఏ సెక్షన్ కింద వివాహ పత్రం ఇవ్వాలో తెలియడం లేదు అనేశారు. ‘‘లేదు, మాకు సర్టిఫికెట్ కావలసిందే’’ అని ఈ దంపతులు పట్టుపట్టారు. చట్టాన్ని కూకటి వేళ్లతో పెకిలించడానికి కూడా సిద్ధమైపోయారు. చెన్నై వెళ్లి ఇన్స్పెక్టర్ జనరల్ (రిజిస్ట్రేషన్) ని కలిశారు. ‘అవకాశం ఉందేమో చూస్తాను’ అని ఐజీ గారు వాళ్లు పంపించి, సిబ్బంది చేత చట్టాల పుస్తకాలు తెప్పించుకున్నారు. 2009 తమిళనాడు రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజస్ యాక్ట్‌లో సన్నటి దారం లాంటి ఆధారం దొరికింఇ. దాన్ని పట్టుకుని.. ఈ ఏడాది జనవరి 28న అన్ని జిల్లాల్లోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు నోటిఫికేషన్ పంపించారు. ట్రాన్స్‌జెండర్ పెళ్లిళ్లను చట్టబద్దం చేసే ఉత్తర్వు అది. ఆ ఉత్తర్వు కోయంబత్తూరు కూడా చేరింది. అక్కడి అధికారులు వెంటనే మిసెస్ అండ్ మిస్టర్ మణిగంధన్‌కి వర్తమానం పంపారు.. ‘వియ్ ఆర్ రెడీ టు గివ్ యు..’ అని. మొత్తానికి మ్యారేజ్ సర్టిఫికెట్ ఈ ఆలూమగల చేతికి వచ్చింది. అయినా సర్టిఫికెట్ కోసం ఎందుకు ఇంతగా వీళ్లు పోరాడారు? ‘‘బిడ్డను దత్తత తీసుకోవాలంటే మ్యారేజ్ సర్టిఫికెట్ ఉండాలన్నారు. ఇప్పుడు ఉంది. త్వరలో మేము అమ్మానాన్న కాబోతున్నాం’’ అన్నారు మణిగంధన్, సురేఖ.. చిరునవ్వులు చిందిస్తూ. -
పార్కులు వెలవెల
ముషీరాబాద్/వెంగళరావునగర్: పార్కులు వెలవెలపోయాయి. ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కొన్ని ప్రాంతాల్లో పార్కులను మూసివేశారు. మరికొన్ని పార్కుల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు సంవదర్శకులను సైతం అనుమతించలేదు, ‘తాము ప్రేమికులం కాద’ని చెప్పినప్పటికీ అనుమతించలేదని పలువురు సందర్శకులు విస్మయం వ్యక్తం చేశారు. వాలెంటైన్స్‌డే బహిష్కరించాలని భజరంగ్‌దళ్ తదితర సంస్థలు కొంత కాలంగా పిలుపునిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో ప్రతి రోజు సందర్శకులతో కిటకిటలాడే ఇందిరాపార్కు, సంజీవయ్య పార్కు, కృష్ణకాంత్‌పార్కు తదితర పార్కులు జన సంచారం లేక బోసిపోయాయి. ఇదిలా ఉండగా ఉదయం, సాయంత్రం వేళల్లో పార్కుకు వచ్చే వాకర్లు, ఇతర సందర్శకులు సైతం ఇబ్బందికి గురయ్యారు. జీహెచ్ఎంసి పార్కును మూసివేయాలంటే అటు పోలీసులు, లేదా అర్బన్ ఫారెస్ట్రీ అధికారులు గాని ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. అయితే అలాంటి ఉత్తర్వులు లేకపోయినా వెంగళరావునగర్, రహమత్‌నగర్, యూసుఫ్‌గూడకు చెందిన కొందరు యువకులు బుధవారం తెల్లవారుజామున కృష్ణకాంత్ పార్కుకు వచ్చి సెక్యూరిటీని బెదిరించి తాళాలు వేయాలని బెదిరించారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది భయపడి పార్కుకు తాళాలు వేయకుండా పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం అందించారు. అదే సమయంలో పార్కుకు వచ్చిన వాకర్స్, సీనియర్ సిటిజన్స్, మహిళలు పార్కుకు వచ్చినప్పటికీ వారిని లోపలికి అనుమతించలేదు. పోలీసుల అదుపులో కృష్ణకాంత్‌పార్కు... కొందరు వాకర్లు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫోన్ల ద్వారా సమాచారం అందించడంతో టాస్క్‌ఫోర్స్, ఇంటెలిజెన్స్ సిబ్బంది హుటాహుటిన పార్కు వద్దకు చేరుకుని గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల తర్వాత కేవలం మగవారిని మాత్రమే లోపలికి ప్రవేశించడానికి అటు పోలీసులు, ఇటు పార్కు అధికారులు అనుమతించారు. అంతేగాకుండా బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు స్వయంగా వచ్చి పరిస్థితిని సమీక్షించారు. మధ్యాహ్నం వరకు పార్కుకు వచ్చిన ప్రేమికులు, సందర్శకులను అనుమతించకపోవడంతో నిరుత్సాహంగా అక్కడి నుంచి వెనుదిరిగారు. దీంతో పార్కులో 50 టిక్కెట్లు కూడా (ప్రైవేటు స్కూల్ చిన్నారులు మినహా) విక్రయించలేదని సిబ్బంది తెలిపారు. నిత్యం పండగ వాతావరణాన్ని తలపించే పార్కుల బయట కూడా కళా విహీనంగా మారిపోయింది. -
మిస్ వైభ
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ కోసం నా పేరు ‘వైభ’ అని పరిచయం చేసుకుంటున్నారు పూజా హెగ్డే. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. ఇందులో వైభ అనే పాత్రలో నటిస్తున్నారు హీరోయిన్ పూజా హెగ్డే. శుక్రవారం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వైభ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ నేటి నుంచి ప్రారంభం కానుంది. దీంతో మేజర్ టాకీపార్టు పూర్తవుతుంది. అల్లు అరవింద్ సమర్పణలో వాసువర్మతో కలిసి ‘బన్నీ’వాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏప్రిల్‌లో విడుదల కానుంది. -
ఉప్పొంగే ప్రేమకథ
సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన బుచ్చిబాబు సన ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కృతి శెట్టి కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. ‘ఆసి, సంగీత’ పాత్రల్లో వైష్ణవ్, కృతి కనిపించనున్నారు. సినిమాలో హీరోహీరోయిన్ల లుక్స్‌ను వేలంటైన్స్ డే సందర్భంగా విడుదల చేశారు. విజయ్ సేతుపతి విలన్‌గా నటించిన ఈ సినిమాను ఏప్రిల్ 2న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవి శ్రీప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వై. అనిల్, బి.అశోక్, సీఈఓ: చెర్రీ. -
ప్రతి సినిమా నీతోనే...
‘‘కరీనా... వీలుంటే ప్రతీ సినిమాలో నీతో రొమాన్స్ చేయాలనుంది. నీతో యాక్ట్ చేస్తుంటే రొమాన్స్ చాలా సులువుగా వస్తుంది’’ అంటున్నారు ఆమిర్ ఖాన్. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న హిందీ చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’. హాలీవుడ్ హిట్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’కి ఇది హిందీ రీమేక్. కరీనా కపూర్ కథానాయిక. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కరీనా కపూర్ లుక్‌ను వేలంటైన్స్ డే సందర్భంగా విడుదల చేశారు. ఈ ఏడాది క్రిస్మస్కి ‘లాల్ సింగ్ చద్దా’ విడుదల కానుంది. -
మనసు పలికే మధుర భావన
ప్రేమ అనేది ఓ మధుర భావన. యువత ఆ ధ్యాసలో పడి.. పరిణతి చెందకుండానే తొందర పడి.. జీవితాలను కోల్పోవద్దని, స్థిరపడ్డాక తల్లిండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని.. అప్పుడే దాంపత్యం అన్యోన్యంగా సాగుతుందని పలువురు చెబుతున్నారు. నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా(ఫిబ్రవరి 14) ఒకరిద్దరి అభిప్రాయాలు... మధిర: ప్రేమించడం తప్పుకాదు కానీ జీవితంలో ఉన్నత స్థానానికి చేరిన తరాత్వ ప్రేమించినవారిని పెళ్లి చేసుకోవాలని అంటున్నారు హై కేర్ ఆస్పత్రి వైద్యులు మురళీకృష్ణారెడ్డి, మేఘనా చౌదరి దంపతులు. మురళీకృష్ణారెడ్డి, మేఘనా చౌదరిలకు 2008లో కామన్ ఫ్రెండ్స్ వల్ల పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. అప్పుడు అతను ఎంబీబీఎస్ చేస్తుండగా, ఆమె బీటెక్ చదువుతోంది. జీవితంలో స్థిరపడ్డాక వివాహం చేసుకోవాలన్నారు. అతను ఎంఎస్, ఆమె ఎంబీఏ పూర్తి చేశారు. 2016లో ఇరువైపులా కుటుంబ సభ్యులను ఒప్పించి, అందరి మన్ననలతో వివాహం చేసుకున్నారు. వారి అనురాగ బంధానికి ప్రతీకగా కుమార్తె రాగ, కుమారుడు అర్జున్ జన్మించారు. ఇద్దరు పిల్లలతో అన్యోన్య దాంపత్యం కొనసాగిస్తున్నారు. ప్రేమికుల రోజూ సందర్భంగా వారు మాట్లాడుతూ..‘ ప్రేమించినా తొందరపడి, జీవితంలో స్థిరపడకుండా, పరిణతి చెందకుండా వివాహం చేసుకుంటే అనేక కష్టాలు ఎదురవుతాయి. బంధువులు, స్నేహితులు కూడా దూరమవుతారు. అలా కాకుండా జీవితంలో నిలదొక్కుకుని ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లిచేసుకుంటే సంతోషంగా ఉంటుంది. ప్రతి ప్రయాణం మొదలయ్యేది స్నేహంతోనే. మాది అలాగే మొదలై ఎన్నో ఒడిదుడుకులతో పెళ్లి అనే గమ్యానికిచేరడానికి 10 సంవత్సరాలు పట్టింది.’ అని పేర్కొన్నారు. పిల్లలతో శ్రీనివాసరావు, ప్రశాంతి దంపతులు జీవితం నష్టపోవద్దు ఎర్రుపాలెం: ఎర్రుపాలెం మండలం రామాపురం గ్రామానికి చెందిన కొమ్మూరి శ్రీనివాసరావు మధిరలో డిగ్రీ చదువుతున్నాడు. ఏపీ రాష్ట్రం కృష్ణా జిల్లా రాయనపాడు గ్రామానికి చెందిన తాతినేని ప్రశాంతి విజయవాడలో బీఎస్సీ చదువుతోంది. శ్రీనివాసరావుకు తన స్నేహితుడి ద్వారా ప్రశాంతితో పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో శ్రీనివాసరావు ఎమ్మెస్సీ బీఈడీ పూర్తి చేశాడు. 2008 జూన్ నెలలో వివాహం చేసుకున్నారు. అయితే తల్లిదండ్రులు ఒప్పుకొలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించగా.. వారు ఇరువైపులా పెద్దలకు నచ్చజెప్పి, పిల్లల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. క్రమంగా రెండు కుటుంబాల్లో సంబంధాలు మెరుగుపడ్డాయి. దంపతుల అన్యోన్య దాంపత్యానికి ఇద్దరు కుమారులు జన్మించారు.శ్రీనివాసరావు ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆర్టీవో కార్యాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తుండగా , ప్రశాంతి మాత్రం గృహిణిగా ఉంటోంది. ప్రేమికుల రోజు సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉన్నత చదువులు అభ్యసించాక, జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవాలని, ప్రేమ పేరుతో తొందరపడి జీవితాలను నష్టపోవద్దని చెబుతున్నారు. -
షార్ట్ లవ్... హిట్ ఫార్ములా
వాళ్లిద్దరూ చిన్ననాటి స్నేహితులు, ప్రేమికులు... ఆ తర్వాత విడిపోయి దశాబ్దాల తర్వాత కలుస్తారు. అప్పటికీ బ్రహ్మచారిగానే ఉన్నప్రేమికుడు, పెళ్లి చేసుకుని సెటిలైన అతని ప్రేమికురాలి మధ్య ఒక రోజున్నర పాటు చోటు చేసుకునే భావోద్వేగాలు...తాజాగా వచ్చి మంచిటాక్ తెచ్చుకున్న ఓ తెలుగు సినిమా ఇది. విలన్లు, డ్యూయట్లు వగైరాలేవీ లేకుండా సింపుల్‌గా సాగే ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీస్ ఇప్పుడిప్పుడేవెండితెరపై సందడి చేస్తున్నాయేమోగానీ ఎప్పటినుంచో షార్ట్‌ఫిలిం రూపంలో పొట్టి తెరపై హల్చల్ చేస్తూనే ఉన్నాయి. – సాక్షి, సిటీబ్యూరో:లవ్ స్టోరీస్ విషయంలో మెయిన్ స్ట్రీమ్ సినిమా రూట్ మార్చిన వాటిల్లో ఇవి కూడా ఉన్నాయి. అంతేకాదు...ప్రేమనే సోపానం చేసుకుని వైవిధ్యభరితమైన కథాంశాలతో షార్ట్తెరపై హిట్ కొట్టిన సిటీ దర్శకులు, నటీనటులు ఆ తర్వాత వెండితెరపైనా చోటు దక్కించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోషల్‌లో హల్చల్ చేసిన కొన్ని షార్ట్ ఫిలింస్ గురించి... మధురం :ఆధునిక ప్రేమలకు సనాతన ధర్మాలు, పురాణాలకూలింకేమిటి? ప్రేమలో ఉన్న ఏడు దశలను వివరిస్తూ,కాఫీషాప్‌నకు వచ్చిన అమ్మాయి మనసు దోచుకుంటాడో కుర్రాడు. ప్రేమ, పురాణాలను టచ్ చేస్తూయానిమేషన్ను కూడా ఉపయోగించుకుంటూ సాగుతుందీ షార్ట్ ఫిలిమ్. మంచి హిట్టయిన ఈ సినిమా దర్శకుడు తర్వాత మను అనే సినిమా అవకాశం కూడాదక్కించుకున్నాడు. ఇందులో నటించిన చాందినిచౌదరి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఆమె మెయిన్‌స్ట్రీమ్ హీరోయిన్గా ఎదగడానికి దోహదం చేసింది. 15 డేస్ ఆఫ్ లవ్ సెలవులకు హైదరాబాద్‌కి వస్తుందో అమ్మాయి. 15 రోజులు మాత్రమే నగరంలో ఉన్న ఆమెను ఇక్కడే పరిచయం చేసుకున్న ఓ పోకిరీ అబ్బాయి ప్రేమవైపు ఎలా నడిపించగలిగాడు? జీవితం గురించిన గొప్ప దృక్పథం, మాటలు, ఆలోచనలతో ఆమె మనసులో ఎలా చోటు సంపాదించాడు? ఇక్కడ ఉన్నన్ని రోజులూ ఆమె నుంచి రాని గ్రీన్‌సిగ్నల్ వైజాగ్ వెళ్లాక ఎలా పొందగలిగాడు? వంటి వాటితో సూపర్‌హిట్టయిన ఈ షార్ట్ ఫిలిమ్‌కు జయకిషోర్ బండి దర్శకుడు, చక్కని, చిక్కని ఆలోచనలను, గాఢతను పొట్టి తెరకెక్కించిన జయకిషోర్...ఆ తర్వాత సినీ దర్శకుడిగా మారాడు. హ్యాపీ లైఫ్.. సాధారణంగా లవ్ ఫెయిల్యూర్ అబ్బాయిలను దేవదాసుల్ని చేస్తుంది అంటారు. అయితే తాగుబోతైన 20 ఏళ్ల యువకుడు లవ్ ఫెయిల్యూర్లో ఉండి, ప్రేమ పట్ల వ్యతిరేకత నింపుకున్న 27 ఏళ్ల అమ్మాయిని ఎలా కన్విన్స్ చేశాడు? సంతోషకరమైన సమాప్తం అనే అర్థం వచ్చే టైటిల్‌తో 2015లో వచ్చిన ఈ సినిమా చూపించేది ఇదే. ఒక గంట వ్యవధితో ఫీచర్ ఫిల్మ్‌ని తలపించే దీని దర్శకుడు జయశంకర్. ఇందులోని కొన్ని సన్నివేశాలు, సంభాషణలు ఆ తర్వత కొన్ని మెయిన్‌స్ట్రీమ్ మూవీస్‌లోనూ వాడుకోవడం విశేషం. మనోజ్ అనే హీరో క్యారెక్టర్‌కి అర్జున్ రెడ్డి హీరో క్యారెక్టర్ కి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. ఈ షార్ట్ ఫిలిం హిట్‌తో దీని డైరెక్టర్ పేపర్ బాయ్ అని ఒక మూవీ తీశాడు ..ఒక పెద్ద బ్యానర్లో సినిమాతో పాటు , కొన్ని వెబ్ సిరీస్‌కూ పనిచేస్తున్నాడు. డైలాగ్ ఇన్ ది డార్క్... ఓ ప్రేమకథని విజువల్స్ లేకుండా చూపించడం సాధ్యమా? ఈ పేరుతో సిటీలో ఒక రెస్టారెంట్ ఉందని, అది ప్రేమికులకు చిరునామా అని మనకు తెలుసు. అదే పేరుతో ఒక సినిమాని రూపొందించడం డైరెక్టర్ ప్రశాంత్‌వర్మ కు తెలుసు. కళ్లు లేని వారు కూడా హృదయంతో చూడవచ్చు అంటూ...వర్చువల్ టెక్నాలజీతో వచ్చిన మొదటి షార్ట్ ఫిల్మ్ ఇది. వీక్షకులను నేరుగా సన్నివేశాల్లోని భావోద్వేగాలతో అనుసంధానం చేస్తుంది. చివర్లో వచ్చే ట్విస్ట్ షాక్ ఇస్తుంది. చాలామంది సెలెబ్రిటీస్ కూడా ఈ షార్ట్ ఫిల్మ్‌ని షేర్ చేశారు. పొట్టి తెరది గట్టి పాత్ర సోషల్ మీడియా వినియోగంలో యువతదే పెద్ద వాటా కాబట్టి సహజంగానే ప్రేమ ఆధారిత షార్ట్ ఫిలింస్ బాగా వచ్చేవి. అలాంటి పొట్టి చిత్రాలు తీసిన మాలాంటి వారి పరిమితుల వల్ల హంగు ఆర్భాటాల కన్నా వైవిధ్య భరిత సబ్జెక్టులు, సంభాషణలు, భావోద్వేగాలపైనే ఎక్కువ ఫోకస్ చేస్తే మంచి సక్సెస్ సాధించాం. ఇప్పుడు ఆ ప్రభావం సినిమాలతో పాటు వెబ్‌సిరీస్ మీద కూడా పడింది.– జయశంకర్, సినీ దర్శకులు కృష్ణమూర్తిగారింట్లో (2016) హీరోకి నాన్న ఫోన్ చేసి అతని స్నేహితుడు కృష్ణమూర్తికి వంట్లో బాగాలేదు రాజమండ్రి దగ్గర ఒక విలేజ్ లో ఉన్నాడు అతడిని కలిసి రమ్మని చెబుతాడు. హీరోకి ఏమాత్రం ఇష్టం లేకున్నా నాన్న కోసం ఆ ఊరికి వెళతాడు. అక్కడికి వెళ్లిన తర్వాత కృష్ణమూర్తి కూతురితో ప్రేమలో పడతాడు. అయితే కృష్ణమూర్తి గతంలో హీరో తల్లిని ప్రేమించాడని తెలిసి హీరో ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. అక్కడి నుంచి సున్నితమైన సన్నివేశాలతో కథని నడిపిస్తారు డైరెక్టర్ లక్ష్మణ్.కె.కృష్ణ. -
వేధించే ‘ప్రేమ’లు!
సాక్షి, సిటీబ్యూరో: ఓ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న మహిళను షాద్‌నగర్ మండలం కామ్సన్పల్లి గ్రామానికి చెందిన బాలరాజు ప్రతిరోజూ ఫాలో అవుతున్నాడు. బస్టాప్, పాఠశాల ప్రాంగణంలో ప్రత్యక్షమవుతూ తనను ప్రేమించాలంటూ వేధించడం మొదలెట్టాడు. ఈ విషయం బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పడంలో బాలరాజును హెచ్చరించారు. అయినా బాలరాజు తన తీరును మార్చుకోకపోవడంతో ఒత్తిడికి గురైన బాధితురాలు షాద్‌నగర్ షీ బృంద సభ్యులను సంప్రదించారు. ఆ వెంటనే బాలరాజు బాధితురాలి వెంటపడుతున్న సమయంలో మఫ్టీలో ఉన్న షీ బృంద సభ్యులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని కేసు నమోదుచేయించి జైలుకు పంపించారు. ఇది గత నెలలో షీ బృందం దృష్టికి వచ్చిన ఓ కేసు మాత్రమే. ఇలాంటివి ప్రతి నెలా సైబరాబాద్, రాచకొండ షీ బృంద సభ్యులకు వచ్చే దాదాపు 500 ఫిర్యాదుల్లో 125 కేసులు ఎఫ్ఐఆర్లు నమోదుచేస్తున్నారు. ఈ కేసుల్లో సగానికి సగం ప్రేమించమంటూ చేసే వేధింపులే ఎక్కువగా ఉన్నాయని షీ బృంద గణాంకాలు చెబుతున్నాయి. అంటే 63 కేసులు ‘లవ్ వేధింపు’లే ఉన్నాయని ఆయా ఈవ్‌టీజర్లను కౌన్సెలింగ్ చేస్తున్న సభ్యులు చెబుతున్నారు. ప్రేమించకుంటే ఎందాకైనా.. పాఠశాలలో పరిచయం.. కళాశాలలో స్నేహం.. ఉద్యోగంలో చేసే ప్రాంతంలో పరిచయం, జర్నీ చేసే సమయంలో జరిగిన పరిచయం.. ఇలా ఏదో ఒక చోట జరిగిన పరిచయంతో విద్యార్థినుల నుంచి మొదలుకొని మహిళల వెంటపడుతున్న ఈవ్‌టీజర్లు పెరుగుతున్నారు. ఏదో రకంగా వారి సెల్‌ఫోన్ నంబర్లను దొరకబుచ్చుకుంటున్నారు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను...మీరు కూడా నన్ను ప్రేమించండి అంటూ ఫోన్‌కాల్స్ చేస్తున్నారు. వాట్సాప్ పోస్టులతో పాటు సామాజిక మాధ్యమాల్లో మెసేజ్‌లు పెడుతూ వేధిస్తున్నారు. లేకుంటే వారి సామాజిక మాధ్యమాల ఖాతాల నుంచి వారి వ్యక్తిగత చిత్రాలను డౌన్లోడ్ చేసుకొని మార్ఫింగ్ చేస్తున్నారు. ఈ ఫొటోలను మీ మిత్రులకు పంపిస్తామని, మీ కుటుంబ సభ్యులందరికీ వాట్సాప్ లేదంటే సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తామని బెదిరిస్తున్నారు. చివరకు ప్రేమ అవసరం లేదు. తమతో గడపాలనే స్థాయికి చేరుకుంటున్నారు. ఈ ఈవ్‌టీజర్లతో చాలామంది పెళ్లిళ్లు కూడా జరగకుండా నిలిచిపోయిన ఉదంతాలు ఉన్నాయి. ఇలా ఆకతాయిల వేధింపులు తారస్థాయికి చేరడంతో షీ బృంద సభ్యులను ఆశ్రయిస్తున్నారు. ఆ వెంటనే రంగంలోకి దిగుతున్న షీ బృందాలు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని జైలుకు పంపిస్తున్నాయి. ‘సామాజిక మాధ్యమాల్లో అపరిచితుల నుంచి ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ వస్తే యాక్సెప్ట్ చేయవద్దు. మీ ఫేస్బుక్ ఖాతాలకు ప్రైవేట్ సెట్టింగ్స్ పెట్టుకుంటే మంచిది. ఎక్కడో ఒక చోట జరిగిన పరిచయంతో ఆకతాయిలు వెంటపడుతూ వేధిస్తుంటే షీ బృంద సభ్యులను ఆశ్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామ’ని సైబరాబాద్ షీటీమ్ ఇన్చార్జ్ అనసూయ తెలిపారు. -
వాలెంటైన్స్ డే: ప్రేమికులకు గుడ్ న్యూస్...
సాక్షి, ముషీరాబాద్: ప్రేమికులకు గుడ్ న్యూస్... వాలెంటైన్స్ డే రోజున మీరు ఆనందంగా గడిపేందుకు, మీ లవ్‌ను ప్రపోజ్ చేసేందుకు, మీరు ప్రియుడు లేదా ప్రేయసికి సర్ప్రైజ్ గిఫ్ట్ లేదా పార్టీ ఇవ్వాలన్నా ఏమాత్రం కష్టపడనక్కర్లేదు. మీ కోసం ఆన్లైన్ సేవలు సిద్ధంగా ఉన్నాయి. లవర్స్ పాలిట ‘ఈవైబ్.కామ్’ వరంగా మారుతోంది. ఈ సైట్‌ను బిట్స్ పిలానిలో చదువుకున్న ఆంజనేయులు రెడ్డి, మెంఫిస్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో ఎంఎస్ చేసిన స్వాతి భావనకలు ప్రారంభించారు. ఆహ్లాదకర వాతావరణంలో డిన్నర్ ప్రేమికులిద్దరూ ప్రేమికుల రోజున కలసి డిన్నర్ చేసేందుకు ప్రత్యేకమైన ఆఫర్లను ఇస్తున్నారు వెబ్సైట్ నిర్వాహకులు. సిటీలోని టాప్ రెస్టారెంట్లు, హోటల్స్, రిసార్ట్స్‌లలో ఈ సేవలు అందిస్తున్నారు. ‘వాటర్‌ఫాల్ వ్యూ రొమాంటిక్ డిన్నర్, రొమాంటిక్ ఓపెన్ ఎయిర్ పూల్‌సైడ్ క్యాండిల్ లైట్, గ్రాండ్ క్యాండిల్ లైట్ డిన్నర్ అండర్ కబానా, బెస్ట్ క్యాండిల్ లైట్ డిన్నర్, ఎక్స్పీరియన్స్, కాజీ క్యాండిల్‌లైట్ డిన్నర్’లను మనకు నచ్చిన వ్యూ, డెకరేషన్స్లలో ప్లాన్ చేస్తూ సర్ప్రైజ్ చేస్తున్నారు నిర్వాహకులు. డెకరేషన్ అదుర్స్ లవర్ని సర్ప్రైజ్ చేసేందుకు డెకరేషన్ కూడా వీరు అదరహో అనేలా చేస్తున్నారు. కేక్ కటింగ్ ఫర్ కపుల్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్న కపుల్స్‌కి సర్ప్రైజింగ్ కేక్ కటింగ్‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇటువంటి కేక్ కటింగ్ సర్ప్రైజ్ని ఇంట్లో ప్లాన్ చేసుకుంటే బెటర్ అంటూ సజెస్ట్ చేస్తున్నారు. మనకు నచ్చే విధంగా డెకరేషన్ చేస్తారు. ప్రేమించుకునే రోజులను ఈ డెకరేషన్ ద్వారా గుర్తు చేస్తారు. చుట్టూరు డెకరేషన్ చేసి మధ్యలో మనకు నచ్చిన కేక్‌ని ఏర్పాటు చేస్తారు. ప్రియుడు లేదా ప్రేయసి ఆఫీస్ లేదా బయట నుంచి వచ్చే సరికి వారిని సర్ప్రైజ్ చేయడం విశేషం. కాగా వీటితోపాటు రొమాంటిక్ స్టేతో పాటు నచ్చిన ఫుడ్‌ని కూడా ఆఫర్ చేయడం విశేషం. లక్షకు పైగా ఈవెంట్లు వెబ్సైట్ ప్రారంభించిన 24 గంటల్లోనే పుట్టినరోజు పార్టీ నిర్వహించాలని ఆహ్వానం అందింది. 2014 ఫిబ్రవరిలో ప్రారంభించిన ఒకటిన్నర సంవత్సరం వరకు.. కేవలం ఇద్దరు ఉద్యోగులతో మాత్రమే నడిచిన మా సంస్థ నేడు దాదాపు 200 మంది పార్టీ ప్లానర్స్‌కు ఉపాధి కల్పిస్తుంది. ఈవెంట్ మేనేజర్లకు, డెకరేటర్స్, ఫోటోగ్రాఫర్లకు వేదికగా మారింది. ఇప్పటివరకు దాదాపు 400 ప్రదేశాలలో 150 రకాల ప్యాకేజీలతో లక్షకు పైగా ఈవెంట్లు నిర్వహించాం. ఈ వాలంటైన్స్ డేకి మరిన్ని ప్లాన్స్‌తో ముందుకొచ్చాం. – ఫౌండర్స్, స్వాతి భావనక,ఆంజనేయులురెడ్డి -
ప్రేమకథా చిత్రమ్.. @60+
సాక్షి, సిటీబ్యూరో: ఎంతో ఉద్వేగభరితంగా ఉంది. ఆ క్షణంలోసంభ్రమాశ్చర్యాలు. ఆ వెంటనే భయాందోళనలు. ఎవరో వెంటాడి తరుముతున్నట్లు...మరెవరో ఎదురొచ్చి చేరదీస్తున్నట్లు..ఇద్దరిదీ ఒకరకమైన మనస్థితి. ఇద్దరికీ కలిసి ఉండాలని ఉంది. కానీ ఆమె కుటుంబం అందుకు సిద్ధంగా లేదు. ఆ సంతోష సమయంలోనే, ఆ భయాందోళనలోనే ఒకరినొకరు తదేకంగా చూసుకున్నారు. మాట్లాడుకున్నారు. అలా చాలా రోజులే గడిచాయి. చివరకు ఒకరికొకరు ‘తోడు’ కోసం ఏకమయ్యారు. అప్పుడు ఆమె వయసు 56. ఆయన వయసు 62 ఏళ్లు. రాజగోపాల్ పరిమి.ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో సీనియర్ అధికారిగా పనిచేసి రిటైరయ్యారు, ఓ మధ్యతరగతి గృహిణి ఇందిర. వాళ్ల ప్రేమ పెళ్లికి వేదికైంది తార్నాక. ఇది 2016 నాటి ప్రేమ కథా చిత్రమ్. ‘చిన్నప్పుడెప్పుడో ఆమె ఆరో తరగతిలో పన్నెండేళ్ల వయస్సులో ఉన్నప్పుడు చూశాను. బంధువులమ్మాయే.ఆమెతోనే నా పెళ్లి జరగాల్సి ఉండింది.కానీ ఏవో కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. ఆ తరువాత ఆమెను ఎప్పుడూ చూడలేదు. తిరిగి యాభై ఆరేళ్ల వయస్సులో ఆమెను చూశాను.....’’ ఎంతో సంతోషంగా చెప్పారు రాజగోపాల్. కోల్పోయిన అపురూపమైన కానుకను తిరిగి పొందిన అనుభూతి ఆమెది. భర్తను పోగొట్టుకొని ఒంటరిగా ఉన్న ఇందిరను, కేన్సర్ కారణంగా భార్యను పోగొట్టుకున్న రాజగోపాల్‌ను ఒక్కటి చేసింది తోడు–నీడ. ఆ విశేషాలు వారి మాటల్లోనే.... ఒంటరి జీవితంలో కుంగిపోయాం... ఆర్పీఎఫ్లో పని చేస్తున్న రోజుల్లోనే నా మొదటి భార్య సరళకు కేన్సర్ జబ్బు వచ్చింది. ఆస్పత్రుల చుట్టూ తిరిగాం, ఆమెను కాపాడుకోలేకపోయాం. కొడుకులు ఇద్దరు అమెరికాలోనే స్థిరపడ్డారు. సరళ లేని ఒంటరి జీవితం తీవ్రమైన కుంగుబాటుకు గురి చేసింది. చాలా రోజులు డిప్రెషన్‌తో గడిపాను. ఇదంతా 2014 నాటి సంగతి. ఆ రోజుల్లోనే నెల్లూరు జిల్లా కావలి సమీపంలో ఉంటున్న ఇందిర భర్త కూడా చనిపోయాడు. ఆమె కొడుకు సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆమెదీ నా పరిస్థితే. ఆ రోజుల్లోనే ఉప్పల్‌లో, మణికొండలో ఉన్న బంధువుల ఇంటికి వచ్చిందామె. తరచుగా ఉప్పల్ నుంచి మణికొండకు వెళ్తూ ఉండేది. ఆ సమయంలోనే తిరిగి పరిచయం ఏర్పడింది. అయితే ఫోన్లో మాత్రమే. ఆమెతో మాట్లాడుతున్నప్పుడల్లా ఎంతో ఊరట లభించేది. బంధువులు, కుటుంబ సభ్యుల ఆంక్షల దృష్ట్యా కొద్దిగా ఇబ్బంది పడినా క్రమం తప్పకుండా నాకు ఫోన్ చేసేది. ఉద్యోగరీత్యా రిటైరయ్యాక బీపీ, షుగర్, గుండెజబ్బుల దాడి మొదలైంది. ఒకవైపు ఒంటరితనం, మరోవైపు జబ్బులు. యోగ ప్రాక్టీస్ చేశాను. జబ్బుల నుంచి విముక్తి లభించింది. ఆ సమయంలోనే ఇందిర పరిచయం గొప్ప శక్తినిచ్చింది. బహుశా ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ గడిపేస్తున్న ఇందిరకు సైతం నా పరిచయంతో ఒక భరోసా లభించింది. అలా కలిశాం... చివరకు ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకొన్నాను. తార్నాక రప్పించాను. తోడు–నీడ వ్యవస్థాపకురాలు రాజేశ్వరి సమక్షంలో కలిశాం. యాభై ఏళ్ల తరువాత ఒకరినొకరం చూసుకొని తీవ్ర ఉద్వేగానికి గురయ్యాం.పెళ్లి ప్రతిపాదనతో ఆమె తీవ్రంగా భయపడింది.చివరకు ఇంట్లో కుటుంబ సభ్యులతో పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. చివరకు 2016 జనవరిలో హబ్సీగూడలోని ఓ హోటల్లో పెళ్లి చేసుకున్నాం. నా యోగ టీచర్ నాగేశ్వర్రావు, తోడు–నీడ రాజేశ్వరి పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. ఇప్పటికీ ఇందిర కుటుంబం, బంధువుల నుంచి వేధింపులు ఉన్నాయి. కానీ మేము మాత్రం హాయిగా జీవిస్తున్నాం..’ అని చెప్పారు. -
ఇండిగో వాలెంటైన్స్ డే ఆఫర్
న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో).. రూ. 999కే దేశీ రూట్లలో టికెట్ అందిస్తోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా కంపెనీ ఈ ఆఫర్‌ను అందుబాటులో ఉంచింది. నాలుగు రోజులపాటు కొనసాగే ఈ చౌక చార్జీల ఆఫర్ మంగళవారం (11న) ప్రారంభమైంది. ఫిబ్రవరి 14 వరకు కొనసాగే ప్రేమికుల రోజు డిస్కౌంట్లో భాగంగా మొత్తం 10 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఏడాది మార్చి ఒకటి నుంచి సెప్టెంబర్ 30 వరకు జరిగే ప్రయాణాలపై తాజా డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ విలియం బౌల్టర్ వెల్లడించారు. -
ప్రేమ పరిమళం!
ప్రతి హృదయం ఈరోజు వాలెంటైన్‌ని ఫీల్ అవుతుంది. ఒక్క పువ్వుల్లోంచే కాదు.. విరిసే నవ్వుల్లోంచి, వినిపించే పాటల్లోంచి.. గాలిలోంచి, గగనంలోంచి, కృతుల్లోంచి, స్మృతుల్లోంచి.. ప్రేమ వచ్చి టచ్ చేస్తుంది. పూలకు పరిమళం కానీ, ప్రేమక్కూడానా? ప్రేమవల్లే కదా పూలకు పరిమళం! నిన్నా మీరు ఊగే పూలను చూసి ఉంటారు. ఇవాళా చూస్తూ ఉంటారు. ఆ పూలకు నిన్న లేని పరిమళమేదో ఇవాళ ఆ పూల నుంచి వీచి మిమ్మల్ని తాకే ఉంటుంది. వాలెంటైన్స్‌డే కదా. ప్రతి హృదయం ఈరోజు వాలెంటైన్‌ని ఫీల్ అవుతుంది. ఒక్క పువ్వుల్లోంచే కాదు.. విరిసే నవ్వుల్లోంచి, వినిపించే పాటల్లోంచి.. గాలి లోంచి, గగనంలోంచి, కృతుల్లోంచి, స్మృతుల్లోంచి.. ప్రేమ వచ్చి టచ్ చేస్తుంది. ఇదంతా.. లోలోపలి ప్రేమ. మరి చెట్టాపట్టాలేసుకుని తిరిగే ప్రేమ సంగతేంటి? ఒక అమ్మాయి, అబ్బాయి కలిసి మాట్లాడుకునే ప్రేమ! అది ఎలాగూ ఉంటుంది. అసలు వాళ్లిద్దరూ నవ్వుతూ, తుళ్లుతూ కనిపిస్తేనే కదా.. ప్రేమకు, ఈ సృష్టికీ అందం. అయితే ఈసారి అలాంటి ప్రేమపక్షులు.. వేరే జతను వెతుక్కుంటున్నాయి! బాయ్ఫ్రెండ్తోనో, గర్ల్ఫ్రెండ్తోనో బయటికి వచ్చి, ప్రేమద్వేషుల కళ్లలో పడి, అనవసరమైన చికాకులు తెచ్చుకోవడం ఎందుకని.. ఇవాళంతా తమ పెంపుడు జంతువులతోనే టైమ్ స్పెండ్ చేయాలని అమ్మాయిలు, అబ్బాయిలు అనుకుంటున్నారట! సురభీ రావత్‌నే చూడండి. ఢిల్లీలో ఉంటున్న ఈ ఫ్రీలాన్స్ రైటర్ ఇవాళ తన లాబ్రడార్ డాగ్ కు ‘స్పా’లో దాదాపు మూడు వేల రూపాయల ఖరీదైన స్నానాన్ని చేయించడానికి వాలెంటైన్స్‌డేకి వారం ముందే స్లాట్ బుక్ చేసుకున్నారు. అందుకోసం ఇవాళ ఢిల్లీకి సమీపంలోని ఛతార్పూర్కి తన లాబ్రడార్ని తీసుకెళుతున్నారు. స్పా స్నానానికి ముందు, దానికి గ్రూమింగ్ ఉంటుంది. అంటే.. గోళ్లు కట్ చేయడం, చెవులు శుభ్రం చేయడం, ఒంటికి మసాజ్ ఇవ్వడం.. ఇలాగన్నమాట! ఇక బెంగళూరు అమ్మాయి రిషీ సింఘాల్ అయితే.. ‘‘ఇవాళ మేమెంత కలిసి తిరిగినా మమ్మల్నీ ఏ ‘సేనా’ వేధించదు అని నవ్వులు చిందిస్తున్నారు. ఆమెకీ ఓ పెట్ ఉంది. రెండేళ్ల వయసుగల బీగిల్ జాతి పెట్ అది. ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై వంటి పెద్ద నగరాల్లో కూడా ఇదే ట్రెండ్ నడుస్తోంది. లవర్స్ తమ ప్రేమనంతా తమ పెంపుడు కుక్కల కోసమే రిజర్వ్ చేసిపెట్టారు. వాటికి గిఫ్టులు కొంటున్నారు. వాటికే ఐ లవ్యూ చెబుతున్నారు. ఇలా చేస్తున్నది ఎక్కువమంది అమ్మాయిలేనట! ఎందుకూ అంటే.. ‘‘ఇవి ప్రేమిస్తాయి తప్ప, ప్రతిఫలం కోరుకోవు. బాయ్స్ అలా కాదు కదా’’ అని వాళ్ల సమాధానం. -
రెండో ప్రపంచ ప్రేమ
ఎడిత్ స్టెయినర్ వయసు 92 ఏళ్లు. ఆమెది హంగేరి. జాన్ మ్యాకీ వయసు 96 ఏళ్లు. అతడిది స్కాట్లాండ్. మొన్న ఈ దంపతులు 71వ వాలెంటైన్స్ డేని జరుపుకున్నారు! వీళ్లదొక అపురూపమైన ప్రేమకథ. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీలు జర్మనీలోని ఔష్విట్జ్ క్యాంప్‌లో వందలమందిని నిర్బంధించారు. వారిలో ఎడిత్ కూడా ఒకరు. అప్పుడు ఆమె వయసు 20 ఏళ్లు. యుద్ధం అయ్యాక నిర్బంధ శిబిరాల్లో ఉన్నవాళ్లను విడిపించే క్రమంలో ఔష్విట్జ్ శిబిరానికి వెళ్లిన సైనికులలో జాన్ మ్యాకీ కూడా ఉన్నాడు. అప్పుడు అతడి వయసు 23. ఆ రోజు ఎడిత్, జాన్ ఒకర్నొకరు పరిశీలనగా చూసుకోలేదు. 'బతుకు జీవుడా' అని ఎడిత్ బయటికి వచ్చి ఊపిరి పీల్చుకుంది. జాన్ మ్యాకీ మిగతా శిబిరాల్లోని వారికి విముక్తి కల్పించే పనిలో పడిపోయాడు. తర్వాత కొన్నాళ్లకు ఇద్దరూ ఒక డాన్స్ హాల్లో కలుసుకున్నారు. 'ఆ రోజు థ్యాంక్స్ చెప్పలేకపోయాను' అంది ఎడిత్. 'ఇవాళ గానీ చెబుతారా ఏంటీ?' అని భయం నటించాడు జాన్. అమ్మాయి నవ్వింది. ఆ నవ్వు అబ్బాయికి నచ్చింది. ప్రేమ మొదలైంది. యుద్ధం ముగియగానే 1946లో పెళ్లయింది. వధువును స్లాట్లాండ్ తీసుకెళ్లాడు వరుడు. అప్పట్నుంచీ ఏటా వాలెంటైన్స్ డేని జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ఈ జంట డుండీ సిటీలోని కేర్ హోమ్‌లో ఉంటోంది. ఎడిత్, జాన్ మ్యాకీ