హ్యాపీ వాలెంటైన్స్ డే: ఓ క్లబ్‌లో గురువారం మోడల్స్ సందడి
సాక్షి, ముషీరాబాద్: ప్రేమికులకు గుడ్ న్యూస్... వాలెంటైన్స్ డే రోజున మీరు ఆనందంగా గడిపేందుకు, మీ లవ్‌ను ప్రపోజ్ చేసేందుకు, మీరు ప్రియుడు లేదా ప్రేయసికి సర్‌ప్రైజ్ గిఫ్ట్ లేదా పార్టీ ఇవ్వాలన్నా ఏమాత్రం కష్టపడనక్కర్లేదు. మీ కోసం ఆన్‌లైన్ సేవలు సిద్ధంగా ఉన్నాయి. లవర్స్ పాలిట ‘ఈవైబ్.కామ్’ వరంగా మారుతోంది. ఈ సైట్‌ను బిట్స్ పిలానిలో చదువుకున్న ఆంజనేయులు రెడ్డి, మెంఫిస్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో ఎంఎస్ చేసిన స్వాతి భావనకలు ప్రారంభించారు.
ఆహ్లాదకర వాతావరణంలో డిన్నర్
ప్రేమికులిద్దరూ ప్రేమికుల రోజున కలసి డిన్నర్ చేసేందుకు ప్రత్యేకమైన ఆఫర్లను ఇస్తున్నారు వెబ్‌సైట్ నిర్వాహకులు. సిటీలోని టాప్ రెస్టారెంట్లు, హోటల్స్, రిసార్ట్స్‌లలో ఈ సేవలు అందిస్తున్నారు. ‘వాటర్‌ఫాల్ వ్యూ రొమాంటిక్ డిన్నర్, రొమాంటిక్ ఓపెన్ ఎయిర్ పూల్‌సైడ్ క్యాండిల్ లైట్, గ్రాండ్ క్యాండిల్ లైట్ డిన్నర్ అండర్ కబానా, బెస్ట్ క్యాండిల్ లైట్ డిన్నర్, ఎక్స్‌పీరియన్స్, కాజీ క్యాండిల్‌లైట్ డిన్నర్’లను మనకు నచ్చిన వ్యూ, డెకరేషన్స్‌లలో ప్లాన్ చేస్తూ సర్‌ప్రైజ్ చేస్తున్నారు నిర్వాహకులు.
డెకరేషన్ అదుర్స్
లవర్‌ని సర్‌ప్రైజ్ చేసేందుకు డెకరేషన్ కూడా వీరు అదరహో అనేలా చేస్తున్నారు.
కేక్ కటింగ్ ఫర్ కపుల్స్
ప్రేమించి పెళ్లి చేసుకున్న కపుల్స్‌కి సర్‌ప్రైజింగ్ కేక్ కటింగ్‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇటువంటి కేక్ కటింగ్ సర్‌ప్రైజ్‌ని ఇంట్లో ప్లాన్ చేసుకుంటే బెటర్ అంటూ సజెస్ట్ చేస్తున్నారు. మనకు నచ్చే విధంగా డెకరేషన్ చేస్తారు. ప్రేమించుకునే రోజులను ఈ డెకరేషన్ ద్వారా గుర్తు చేస్తారు. చుట్టూరు డెకరేషన్ చేసి మధ్యలో మనకు నచ్చిన కేక్‌ని ఏర్పాటు చేస్తారు. ప్రియుడు లేదా ప్రేయసి ఆఫీస్ లేదా బయట నుంచి వచ్చే సరికి వారిని సర్‌ప్రైజ్ చేయడం విశేషం. కాగా వీటితోపాటు రొమాంటిక్ స్టేతో పాటు నచ్చిన ఫుడ్‌ని కూడా ఆఫర్ చేయడం విశేషం.
లక్షకు పైగా ఈవెంట్లు
వెబ్‌సైట్ ప్రారంభించిన 24 గంటల్లోనే పుట్టినరోజు పార్టీ నిర్వహించాలని ఆహ్వానం అందింది. 2014 ఫిబ్రవరిలో ప్రారంభించిన ఒకటిన్నర సంవత్సరం వరకు.. కేవలం ఇద్దరు ఉద్యోగులతో మాత్రమే నడిచిన మా సంస్థ నేడు దాదాపు 200 మంది పార్టీ ప్లానర్స్‌కు ఉపాధి కల్పిస్తుంది. ఈవెంట్ మేనేజర్లకు, డెకరేటర్స్, ఫోటోగ్రాఫర్‌లకు వేదికగా మారింది. ఇప్పటివరకు దాదాపు 400 ప్రదేశాలలో 150 రకాల ప్యాకేజీలతో లక్షకు పైగా ఈవెంట్లు నిర్వహించాం. ఈ వాలంటైన్స్ డేకి మరిన్ని ప్లాన్స్‌తో ముందుకొచ్చాం.
– ఫౌండర్స్, స్వాతి భావనక,ఆంజనేయులురెడ్డి
Comments
Please login to add a commentAdd a comment