పూజా హెగ్డే
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ కోసం నా పేరు ‘వైభ’ అని పరిచయం చేసుకుంటున్నారు పూజా హెగ్డే. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. ఇందులో వైభ అనే పాత్రలో నటిస్తున్నారు హీరోయిన్ పూజా హెగ్డే. శుక్రవారం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వైభ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ నేటి నుంచి ప్రారంభం కానుంది. దీంతో మేజర్ టాకీపార్టు పూర్తవుతుంది. అల్లు అరవింద్ సమర్పణలో వాసువర్మతో కలిసి ‘బన్నీ’వాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏప్రిల్‌లో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment