ప్రతి హృదయం ఈరోజు వాలెంటైన్‌ని ఫీల్ అవుతుంది. ఒక్క పువ్వుల్లోంచే కాదు.. విరిసే నవ్వుల్లోంచి, వినిపించే పాటల్లోంచి.. గాలిలోంచి, గగనంలోంచి, కృతుల్లోంచి, స్మృతుల్లోంచి.. ప్రేమ వచ్చి టచ్ చేస్తుంది.
పూలకు పరిమళం కానీ, ప్రేమక్కూడానా? ప్రేమవల్లే కదా పూలకు పరిమళం! నిన్నా మీరు ఊగే పూలను చూసి ఉంటారు. ఇవాళా చూస్తూ ఉంటారు. ఆ పూలకు నిన్న లేని పరిమళమేదో ఇవాళ ఆ పూల నుంచి వీచి మిమ్మల్ని తాకే ఉంటుంది. వాలెంటైన్స్‌డే కదా. ప్రతి హృదయం ఈరోజు వాలెంటైన్‌ని ఫీల్ అవుతుంది. ఒక్క పువ్వుల్లోంచే కాదు.. విరిసే నవ్వుల్లోంచి, వినిపించే పాటల్లోంచి.. గాలి లోంచి, గగనంలోంచి, కృతుల్లోంచి, స్మృతుల్లోంచి.. ప్రేమ వచ్చి టచ్ చేస్తుంది. ఇదంతా.. లోలోపలి ప్రేమ. మరి చెట్టాపట్టాలేసుకుని తిరిగే ప్రేమ సంగతేంటి? ఒక అమ్మాయి, అబ్బాయి కలిసి మాట్లాడుకునే ప్రేమ! అది ఎలాగూ ఉంటుంది.
అసలు వాళ్లిద్దరూ నవ్వుతూ, తుళ్లుతూ కనిపిస్తేనే కదా.. ప్రేమకు, ఈ సృష్టికీ అందం. అయితే ఈసారి అలాంటి ప్రేమపక్షులు.. వేరే జతను వెతుక్కుంటున్నాయి! బాయ్‌ఫ్రెండ్‌తోనో, గర్ల్‌ఫ్రెండ్‌తోనో బయటికి వచ్చి, ప్రేమద్వేషుల కళ్లలో పడి, అనవసరమైన చికాకులు తెచ్చుకోవడం ఎందుకని.. ఇవాళంతా తమ పెంపుడు జంతువులతోనే టైమ్ స్పెండ్ చేయాలని అమ్మాయిలు, అబ్బాయిలు అనుకుంటున్నారట! సురభీ రావత్‌నే చూడండి. ఢిల్లీలో ఉంటున్న ఈ ఫ్రీలాన్స్ రైటర్ ఇవాళ తన లాబ్రడార్ డాగ్ కు ‘స్పా’లో దాదాపు మూడు వేల రూపాయల ఖరీదైన స్నానాన్ని చేయించడానికి వాలెంటైన్స్‌డేకి వారం ముందే స్లాట్ బుక్ చేసుకున్నారు.
అందుకోసం ఇవాళ ఢిల్లీకి సమీపంలోని ఛతార్‌పూర్‌కి తన లాబ్రడార్‌ని తీసుకెళుతున్నారు. స్పా స్నానానికి ముందు, దానికి గ్రూమింగ్ ఉంటుంది. అంటే.. గోళ్లు కట్ చేయడం, చెవులు శుభ్రం చేయడం, ఒంటికి మసాజ్ ఇవ్వడం.. ఇలాగన్నమాట! ఇక బెంగళూరు అమ్మాయి రిషీ సింఘాల్ అయితే.. ‘‘ఇవాళ మేమెంత కలిసి తిరిగినా మమ్మల్నీ ఏ ‘సేనా’ వేధించదు అని నవ్వులు చిందిస్తున్నారు. ఆమెకీ ఓ పెట్ ఉంది. రెండేళ్ల వయసుగల బీగిల్ జాతి పెట్ అది.
ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై వంటి పెద్ద నగరాల్లో కూడా ఇదే ట్రెండ్ నడుస్తోంది. లవర్స్ తమ ప్రేమనంతా తమ పెంపుడు కుక్కల కోసమే రిజర్వ్ చేసిపెట్టారు. వాటికి గిఫ్టులు కొంటున్నారు. వాటికే ఐ లవ్యూ చెబుతున్నారు. ఇలా చేస్తున్నది ఎక్కువమంది అమ్మాయిలేనట! ఎందుకూ అంటే.. ‘‘ఇవి ప్రేమిస్తాయి తప్ప, ప్రతిఫలం కోరుకోవు. బాయ్స్ అలా కాదు కదా’’ అని వాళ్ల సమాధానం.
Comments
Please login to add a commentAdd a comment