కులం, మతం, ప్రాంతం.. ఇలాంటి భేదాలు లేకుండా జరుపుకొనే వేడుక ఏదైనా ఉందంటే అది ఒక్క ‘వేలంటైన్స్ డే’నే అని చెప్పాలి. ప్రేమకు ఎలాంటి హద్దులు ఉండవు. ప్రేమ ధనిక, పేద తేడాను చూడదు. ఆపినా ఆగదు. అందుకే ఈ పదానికి ఎంతో విశిష్టత ఉంది. ఇక ప్రేమలో ఉన్న వారికి ప్రతిరోజూ ఓ పండగే అయినా ఏటా ఫిబ్రవరి 14న మాత్రం ‘ప్రేమికుల దినోత్సవాన్ని’ ప్రత్యేకంగా జరుపుకొంటారు.
ప్రస్తుత రోజుల్లో చాలామంది ప్రేమికుల రోజును వ్యాపారంగా మలుచుకుంటున్నారు. కానీ నిత్యం వ్యాపారం చేస్తూ ప్రేమికులుగానే ఉండనున్నట్లు కొన్ని ప్రేమవివాహం చేసుకున్న జంటలు తెలుపుతున్నాయి. ఆ ప్రేమజంటలు చేస్తున్న వ్యాపారం విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
వినీతా సింగ్, కౌశిక్ ముఖర్జీ - షుగర్ కాస్మోటిక్స్
వినీతా సింగ్, కౌశిక్ ముఖర్జీ 2015లో షుగర్ కాస్మొటిక్స్‌ను స్థాపించారు. వీరు అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)లో కలిసి చదువుకున్నారు.
బిపిన్ ప్రీత్ సింగ్, ఉపాసన టకు - మొబిక్విక్
ఉపాసన టకు, బిపిన్ ప్రీత్ సింగ్ 2009లో మొబిక్విక్ కంపెనీని ప్రారంభించారు. ఇది మొబైల్ ఫోన్ ఆధారిత చెల్లింపు వ్యవస్థలు, డిజిటల్ వాలెట్‌లతో సహా అనేక రకాల సేవలను అందించే కంపెనీ.
ఆనంద్ సహానీ, మెహక్ సాగర్ - వెడ్‌మి గుడ్
ఆనంద్ సహానీ, మెహక్ సాగర్ హెల్త్ న్యూట్రిషన్ కంపెనీ అయిన గ్లాక్సో స్మిత్‌క్లైన్‌లో ఇంటర్న్‌షిప్ సమయంలో కలుసుకున్నారు. ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారు. తరువాత 2012లో వివాహం చేసుకున్నారు. అయితే వారి వివాహాన్ని ప్లాన్ చేస్తున్నప్పుడు ఈ జంటకు చాలా సమస్యలు ఎదురయ్యాయి. దాంతో బ్యాండ్-బాజా, క్యాటరింగ్ సేవలు, డెకరేషన్స్ వంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. దాంతో వారి పెళ్లి అనంతరం వారు ఎదుర్కొన్న సమస్యకు పరిష్కారం అందిస్తూ దాన్ని బిజినెస్‌గా మలుచుకున్నారు. తర్వాత 2014లో వెడ్‌మి గుడ్ కంపెనీను స్థాపించారు.
శుభ్ర చద్దా, వివేక్ ప్రభాకర్-చుంబక్
శుభ్ర, వివేక్ 2005లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ముదురు రంగుల్లో ఉండే ‘కిట్చీ-చిక్’ ఉత్పత్తులను విక్రయించే వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. కాని అందుకు సరిపడా డబ్బు లేకపోవడంతో ఏకంగా తమ ఇంటిని అమ్మేందుకు సిద్ధపడ్డారు. 2009లో చుంబక్ కంపెనీను స్థాపించారు. ప్రత్యేకమైన గృహాలంకరణ వస్తువులు, ఫ్యాషన్ ఉపకరణాలను తయారుచేసి విక్రయిస్తున్నారు.
గజల్ అలఘ్, వరుణ్ అలఘ్-మామా ఎర్త్
గజల్ అలఘ్ టాక్సిన్ ఫ్రీ బేబీ కేర్ ఉత్పత్తులను తయారుచేయాలని భావించి హోనాసా కన్స్యూమర్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మామాఎర్త్‌ను ఆగష్టు 2016లో తన భర్త వరుణ్ అలఘ్‌తో కలిసి స్థాపించారు. తల్లిదండ్రులు, పిల్లల కోసం సహజమైన ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు మామాఎర్త్ తెలిపింది.
రోహన్, స్వాతి భార్గవ - క్యాష్‌కరో
ఇదీ చదవండి: దేశంలోనే టాప్ కంపెనీలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇవి..
స్వాతి, రోహన్ భార్గవ క్యాష్‌కరో, క్యాష్‌బ్యాక్, కూపన్ వెబ్‌సైట్‌ను స్థాపించారు. ఏప్రిల్ 2011లో వీరు యూకేలో పోరింగ్ పౌండ్స్ పేరుతో క్యాష్‌బ్యాక్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. 2013లో లండన్ నుంచి గుర్గావ్‌కు తిరిగి వచ్చిన తర్వాత అదే బిజినెస్ మోడల్‌ను క్యాష్‌కరో పేరుతో భారత్‌లో ప్రారంభించారు. క్యాష్‌కరోలో టాటా, కలారీ క్యాపిటల్ పెట్టుబడులు పెట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment