love Couple
-
ప్రేమకూ భాషలున్నాయి!
రాధ, రవికి పెళ్లయి ఏడాదవుతోంది. రవికి రాధ అంటే చాలా ప్రేమ. తన ప్రేమను వ్యక్తం చేసేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాచీలు, ఆభరణాలు, దుస్తులు ఇచ్చి ఆశ్చర్యపరచేందుకు ప్రయత్నిస్తుంటాడు. కొత్త ఐఫోన్ మార్కెట్లోకి రాగానే తెచ్చి ఇచ్చాడు. ఆమె పుట్టినరోజునాడు డైమండ్ రింగ్ బహుమతిగా ఇచ్చాడు. అయినా రాధకు అసంతృప్తిగానే ఉంది. కారణం రవికి అర్థం కావడంలేదు. ఒకరోజు రాధనే అడిగాడు. ‘నువ్వు నాకు టైమ్ ఇవ్వడం లేదు’ అని సమాధానం వచ్చింది. ఏం చెయ్యాలో అర్థంకాక రవి తల పట్టుకున్నాడు. అభి, స్వాతిది మరో రకమైన సమస్య. ఆఫీస్ పనితో ఎంత బిజీగా ఉన్నా సరే అభికి ఇష్టమైంది చేసి పెట్టేందుకు స్వాతి ప్రయత్నిస్తుంది. వీలైనంత వరకు అతనితో గడిపేందుకే ప్రాధాన్యమిస్తుంది. అయినా అభికి సంతృప్తి లేదు. ఎందుకని అడిగితే.. ‘ఎప్పుడూ నేను హగ్ చేసుకోవడమే తప్ప, ఒక్కరోజైనా నీకు నువ్వుగా హగ్ ఇచ్చావా?’ అని అడిగాడు. ‘అదేంటీ.. మనం బానే ఉన్నాం కదా?’ అని అడిగింది. ‘సంసారమంటే అదొక్కటే కాదు, మామూలప్పుడు కూడా హగ్ చేసుకోవచ్చు’ అని చెప్పాడు. ఇలాంటి సమస్య మీకూ ఎదురైందా? ఏం చేస్తే భాగస్వామి సంతోషపడతారో తెలియక తలపట్టుకుంటున్నారా? డోంట్ వర్రీ. మీకోసమే ఈ వ్యాసం. ప్రేమభాషను గుర్తించండి..మీరు ప్రేమిస్తే సరిపోదు, మీ ప్రేమను వ్యక్తపరచే విధానం మీ భాగస్వామి అర్థం చేసుకునే విధంగా ఉండాలి. అంటే మీ భాగస్వామి ప్రేమభాష మీకు తెలిసి ఉండాలి. ప్రేమభాషలను నేర్చుకోవడం వల్ల.. 1 జంటలు ఒకరి భావాలను ఒకరు మరింతగా అర్థం చేసుకుంటారు. భావోద్వేగాలను అందంగా వ్యక్తపరచడం ద్వారా అనుబంధం బలపడుతుంది. 2. వైవాహిక జీవితంలో అనేక సందర్భాలలో అపార్థాలు తలెత్తవచ్చు. ప్రేమభాషలను అవగాహన చేసుకుంటే, మీ భాగస్వామి అవసరాలను అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. అపార్థాలు దూరమవుతాయి. 3. ప్రేమభాషలను పట్టించుకోవడం, పాటించడం జంటల మధ్య సాన్నిహిత్యాన్ని, సంతృప్తిని పెంచుతుంది. ఐదు ప్రేమభాషలుగ్యారీ చాప్మన్ ప్రేమ భాషల సిద్ధాంతం ప్రకారం ప్రతి మనిషి ప్రేమను అనుభవించే, వ్యక్తపరచే విధానం భిన్నంగా ఉంటుంది. అందులో ప్రధానంగా ఐదు రకాలున్నాయి. అవి మాటలు, సేవలు, బహుమతులు, సమయం, స్పర్శ. జంటలు ఒకరి ప్రేమ భాషను ఒకరు అర్థం చేసుకోకపోతే అది అపార్థాలకు, విభేదాలకు దారితీస్తుంది. అందుకే ప్రేమభాషల గురించి తెలుసుకుందాం, ప్రేమను సరైన రీతిలో పంచుకుందాం, భాగస్వామి ప్రేమను గెలుచుకుందాం.ప్రశంసలుకొందరికి ప్రేమంటే ప్రశంసలే. లక్ష రూపాయల డైమండ్ రింగ్ కంటే కూడా ‘ఐ లవ్ యూ’ అనే మూడు పదాలే వారికి ముఖ్యం. ‘నువ్వు చాలా అందంగా ఉన్నావు’, ‘నీతో ఉంటే నాకు టైమ్ తెలియదబ్బా’, ‘నీకంటే ముఖ్యమైనది మరేదీ లేదు’ అనే మాటలు వారి మనసును కట్టిపడేస్తాయి.సేవ ద్వారా ప్రేమమరికొందరికి మాటల కన్నా చేతలు, సేవలు ముఖ్యం. ‘ఐ లవ్ యూ’ అని కబుర్లు చెప్తే సంతోషించరు. ఇంటిపనిలో సహాయం చేయడం, తలనొప్పి వచ్చినప్పుడు మర్దన చేయడం, తన పనులు చేసిపెట్టడం లాంటివి చేస్తేనే ప్రేమ ఉన్నట్లు భావిస్తారు.బహుమతులు అందించడంకొన్ని జంటలు ప్రేమను బహుమతుల ద్వారా వ్యక్తీకరిస్తారు. ఇక్కడ మాటలు, చేతల కన్నా కూడా బహుమతులే ముఖ్యం. రెండ్రూపాయల గులాబీ పువ్వు కావచ్చు, ఒక మంచి డ్రెస్ కావచ్చు, బంగారపు ఉంగరం కావచ్చు.. ఏదో ఒక బహుమతి ఇవ్వడమే ప్రేమకు నిదర్శనంగా భావిస్తారు.సమయం గడపడంమరికొందరికి ప్రేమంటే ఇద్దరూ కలిసి కూర్చుని సమయం గడపడమే. రాధా రవిల సమస్య ఇదే. ఖరీదైన బహుమతులివ్వడమే ప్రేమను ప్రదర్శించడమని రవి అనుకుంటుంటే, తనతో సమయాన్ని గడపాలని రాధ కోరుకుంటోంది. స్పర్శఈ భాషలో ఉన్నవారు ప్రేమను ముద్దు, కౌగిలి, అందమైన స్పర్శల ద్వారా వ్యక్తం చేస్తారు. అలా చేయడమే ప్రేమకు నిదర్శనంగా భావిస్తారు. భాగస్వామి అలా చేయనప్పుడు తనపై ప్రేమ లేదని బాధపడుతుంటారు. అభి సమస్య ఇదే. -
వీడియో: కాసేపట్లో పెళ్లి.. సినిమా రేంజ్లో పెళ్లి కూతురు జంప్
సాక్షి, కర్నూలు: కాసేపట్లో జరగబోయే వివాహ తంతుకు సినిమా రేంజ్ సీన్ తోడైంది. మరికొన్ని గంటల్లో పెళ్లి అనగా.. పెళ్లి కూతురు ప్రియుడితో కలిసి జంప్ అయింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం లక్కసాగరానికి చెందిన అబ్బాయితో.. అనంతపురానికి చెందిన వైష్ణవికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. పత్తికొండలోని గోపాల్ ప్లాజా కళ్యాణ మండపంలో పెళ్లికి భారీగా ఏర్పాట్లు చేశారు. వధువు, వరుడు.. వారి కుటుంబ సభ్యులు మండపానికి చేరుకున్నారు.. తెల్లవారితే పెళ్లి కాగా.. ఇంతలోనే ఊహించని పరిస్థితి ఎదురైంది.పెళ్లి ఇష్టం లేని పెళ్లికూతురు తన ప్రియుడికి ఫోన్ చేయడంతో అతను స్నేహితుడితో కలిసి మండపానికి వచ్చారు. ఈ క్రమంలో కల్యాణ మండపం నుంచి తెల్లవారుజామున ప్రియుడితో కలిసి బైక్‌పై పారిపోయారు. ఈ ఘటనతో పెళ్లి ఆగిపోయింది. కూతురు పెళ్లి నిలిచిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. అయితే కల్యాణ మండపం నుంచి పెళ్లి కూతురు వెళ్లి పోతున్న దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
హస్తినలో ‘అమర’ ప్రేమికుడు!
ఏడాది కింద మొదలైన ఆన్లైన్ పరిచయం ప్రేమకు దారితీసింది. కానీ చిన్న వివాదం ఈ ప్రేమ కథలో అంతులేని విషాదం మిగిలి్చంది. రోమియో, జూలియట్ తరహా ఉదంతానికి ఢిల్లీ వేదికగా నిలిచింది. పట్టరాని ఆగ్రహంతో ప్రాణాలు తీసుకోబోయిన ప్రేమికురాలిని కాపాడబోయి ప్రేమికుడు ప్రాణాలు కోల్పోయాడు. తూర్పు ఢిల్లీలోని జగత్పురీలో 23 ఏళ్ల అరుణ్ నందాకు ఏడాది క్రితం ఆన్లైన్లో ఒకమ్మాయి పరిచయమైంది. లా స్టూడెంటైన ఆ అమ్మాయికి చదువంటే ప్రాణం. నిత్యం పారీ్టలు, స్నేహితులంటూ తిరిగే అరుణ్‌కు, ఆమెకు ఇటీవల చిన్నపాటి మనస్పర్థలొచ్చాయి. శుక్రవారం రాత్రి అరుణ్ బంధువుల్లో ఒకరు ఆ అమ్మాయితో గొడవకు దిగారు. దీన్ని అవమానంగా భావించి ఆమె ఇంటికెళ్లి కత్తితో మణికట్టు కోసేసుకుంది. అందులోంచి చిమ్ముతున్న రక్త ధారలను వీడియో తీసి వాట్సాప్‌లో అరుణ్‌కు షేర్ చేసింది. అది చూసి అరుణ్ హుతాశుడయ్యాడు. ప్రేమికురాలు రక్తపుమడుగులో పడుంటంతో ఆమె తల్లికి ఫోన్ చేసి అప్రమత్తంచేశాడు. వెంటనే వాళ్ల ఇంటికెళ్లి ఆమెను హుటాహుటిన ఆస్పత్రిలో చేర్చాడు. వైద్యులు, నర్సులకు విషయం చెప్పి ఆమెనెలాగైనా బతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. ఈ క్రమంలో నర్సుతో మాట్లాడుతూనే ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. వైద్యులు స్పృహలోకి తెచ్చే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. దాంతో పోలీసులకు సమాచారమిచ్చారు. వాళ్లు వచ్చేలోపే అరుణ్ చనిపోయాడని వైద్యులు ప్రకటించారు. మధ్యలో స్పృహలోకి వచ్చి కూడా, ‘ఆమెను కాపాడండి. లేదంటే చనిపోతుంది’ అంటూ ప్రాధేయపడ్డట్టు సిబ్బంది చెప్పారు! గుండెపోటుతోనే అతను మరణించి ఉంటారని భావిస్తున్నారు. ప్రేమికురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటోంది. – న్యూఢిల్లీ -
ప్రియుడి మోసానికి యువతి బలి
ఒంగోలు టౌన్: ప్రేమ పేరుతో ఓ యువకుడి చేతిలో వంచనకు గురైన యువతి చివరకు ప్రాణాలొదిలింది. పెళ్లి చేసుకుంటానని మాయమాటలతో నమ్మించడంతో పాటు శారీరకంగా దగ్గరై యువతిని గర్భిణిని చేశాడు. ఆ యువతి ఆరోగ్యం క్షీణించడంతో ఒంగోలు జీజీహెచ్‌లో అడ్మిట్ చేసి పరారయ్యాడు. చికిత్స పొందుతూ యువతి మృతిచెందింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు రాజీవ్‌కాలనీకి చెందిన చప్పిడి రాజేంద్రప్రసాద్, అరుణకుమారి దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులిద్దరూ పనిచేస్తున్నారు. తండ్రి ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుండగా, తల్లి కూలి పనులకు వెళ్లి పిల్లలను చదివించుకుంటోంది. పెద్ద కూతురు ప్రియ తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. మిగతా ఇద్దరు కూతుళ్లు చీమకుర్తిలో పదో తరగతి చదువుకుంటున్నారు. ప్రియ కూడా 3వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు చీమకుర్తి గురుకుల పాఠశాలలో చదివింది. తన క్లాస్మేట్, దూరపు బంధువైన శివకళ్యాణ్తో ఏడాది క్రితం ఆమెకు పరిచయమైంది. సంతనూతలపాడు మండలంలోని తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన శివకళ్యాణ్ పెయింటర్‌గా పనిచేస్తుంటాడు. వారి పరిచయం ప్రేమగా మారింది. ఎస్వీ యూనివర్శిటీలో బీటెక్ చదువుకుంటున్న ప్రియ.. తన తల్లిదండ్రులకు తెలియకుండా తక్కెళ్లపాడు వచ్చి తరచూ ప్రియుడితో కలుస్తుండేది. ఈ క్రమంలో శారీరకంగా కూడా దగ్గరైంది. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ప్రియుడు శివకళ్యాణ్కు చెప్పింది. జూలై చివరి వారంలో యూనివర్శిటీ నుంచి వచ్చేసి తక్కెళ్లపాడులో ప్రియుడితో కలిసి జీవిస్తోంది. శుక్రవారం రాత్రి ప్రియ ఆరోగ్యం దెబ్బతింది. ఎగశ్వాస వస్తుండటంతో ఆమెను ఒంగోలులోని జీజీహెచ్‌కి శివకళ్యాణ్ తీసుకొచ్చాడు. హాస్పిటల్లో చేర్పించి ప్రియ తండ్రి రాజేంద్ర ప్రసాద్‌కు గుర్తు తెలియని వ్యక్తిలా ఫోన్ చేశాడు. తిరుపతి నుంచి రైలులో వస్తుండగా మీ అమ్మాయికి ఫిట్స్ వచ్చాయని, ఆమెను ఒంగోలు జీజీహెచ్‌లో జాయిన్ చేశానని చెప్పాడు. ఆందోళనకు గురైన రాజేంద్ర ప్రసాద్ హడావిడిగా జీజీహెచ్‌కి వచ్చాడు. ఆస్పత్రిలో వాకబు చేయగా, మీ కూతురు ఆరో నెల గర్భిణి అని, ఆమె చనిపోయిందని వైద్యులు చెప్పారు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంతనూతలపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో ప్రియ ప్రియుడు శివకళ్యాణ్ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.నా బిడ్డను చంపిన హంతకులను శిక్షించండి సారూ...నా బిడ్డతో రెండు రోజుల క్రితమే మాట్లాడాను. బాగానే మాట్లాడింది. కాస్త దగ్గు వస్తుందని చెప్పింది. ఇంతలో ఇలా చనిపోతుందని అనుకోలేదంటూ ప్రియ తల్లి అరుణకుమారి గుండెలవిసేలా రోదిస్తోంది. తన బిడ్డను మోసం చేసి ఆమె చావుకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని, తన బిడ్డలాగా మరొకరి బిడ్డ బలికాకూడదని కన్నీరు పెట్టింది. ప్రియ కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు కోరుతున్నారు. ప్రియ నోటి నుంచి నురగ వస్తుండటంతో ఆమె మరణం సహజ మరణం కాదన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమైపె హత్యా ప్రయత్నం జరిగి ఉండవచ్చని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు పూర్తిగా విచారణ జరిపి నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. -
ఇరు కుటుంబ సభ్యుల విమర్శలతో.. యువజంట విషాదం!
మహబూబ్‌నగర్: ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ దంపతులు ఇరు కుటుంబాలకు చెందిన వారి విమర్శలను తట్టుకోలేక మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలోని జిన్‌కుంటలో చోటుచేసుకుంది.అచ్చంపేట సీఐ రవీందర్, గ్రామస్తుల కథనం ప్రకారం.. జిన్‌కుంట గ్రామానికి చెందిన మహేష్(21), భానుమతి(19) కొంతకాలంగా ప్రేమించుకొని పెళ్లికి సిద్ధపడగా ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు నిరాకరించారు. దీంతో వారు పెద్దలను ఎదిరించి ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పట్లో భానుమతి మైనర్ కావడంతో ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మహేష్‌పై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.భానుమతి మేజర్ అయిన తర్వాత మహేష్ జైలు నుంచి తిరిగి వచ్చి.. ఇద్దరు భార్యాభర్తలుగా గ్రామంలోనే జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి మహేష్, భానుమతి గ్రామ సమీపంలోని మహేష్‌కు చెందిన వ్యవసాయ పొలం వద్ద వేప చెట్టుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.దీంతో సీఐ రవీందర్, ఏఎస్ఐ రేణయ్య ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. భానుమతి తల్లి పోలే ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. మృతదేహాలను అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి సాయంత్రం స్వగ్రామానికి తెచ్చారు.ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ప్రేమికులను నిత్యం ఇరు కుటుంబాలకు చెందిన వారు వివక్ష పూరితంగా దూషించడం, విమర్శలు చేయడంతోనే వారు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమజంట మృతదేహాలను గ్రామానికి తరలించి అంత్యక్రియలు జరుపుతుంటడంతో ముందు జాగ్రత్త చర్యగా గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. -
Valentines Day: వ్యాపార దిగ్గజాలు.. ఈ ప్రేమ పక్షులు
కులం, మతం, ప్రాంతం.. ఇలాంటి భేదాలు లేకుండా జరుపుకొనే వేడుక ఏదైనా ఉందంటే అది ఒక్క ‘వేలంటైన్స్ డే’నే అని చెప్పాలి. ప్రేమకు ఎలాంటి హద్దులు ఉండవు. ప్రేమ ధనిక, పేద తేడాను చూడదు. ఆపినా ఆగదు. అందుకే ఈ పదానికి ఎంతో విశిష్టత ఉంది. ఇక ప్రేమలో ఉన్న వారికి ప్రతిరోజూ ఓ పండగే అయినా ఏటా ఫిబ్రవరి 14న మాత్రం ‘ప్రేమికుల దినోత్సవాన్ని’ ప్రత్యేకంగా జరుపుకొంటారు. ప్రస్తుత రోజుల్లో చాలామంది ప్రేమికుల రోజును వ్యాపారంగా మలుచుకుంటున్నారు. కానీ నిత్యం వ్యాపారం చేస్తూ ప్రేమికులుగానే ఉండనున్నట్లు కొన్ని ప్రేమవివాహం చేసుకున్న జంటలు తెలుపుతున్నాయి. ఆ ప్రేమజంటలు చేస్తున్న వ్యాపారం విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. వినీతా సింగ్, కౌశిక్ ముఖర్జీ - షుగర్ కాస్మోటిక్స్ వినీతా సింగ్, కౌశిక్ ముఖర్జీ 2015లో షుగర్ కాస్మొటిక్స్‌ను స్థాపించారు. వీరు అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)లో కలిసి చదువుకున్నారు. బిపిన్ ప్రీత్ సింగ్, ఉపాసన టకు - మొబిక్విక్ ఉపాసన టకు, బిపిన్ ప్రీత్ సింగ్ 2009లో మొబిక్విక్ కంపెనీని ప్రారంభించారు. ఇది మొబైల్ ఫోన్ ఆధారిత చెల్లింపు వ్యవస్థలు, డిజిటల్ వాలెట్లతో సహా అనేక రకాల సేవలను అందించే కంపెనీ. ఆనంద్ సహానీ, మెహక్ సాగర్ - వెడ్మి గుడ్ ఆనంద్ సహానీ, మెహక్ సాగర్ హెల్త్ న్యూట్రిషన్ కంపెనీ అయిన గ్లాక్సో స్మిత్క్లైన్లో ఇంటర్న్‌షిప్ సమయంలో కలుసుకున్నారు. ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారు. తరువాత 2012లో వివాహం చేసుకున్నారు. అయితే వారి వివాహాన్ని ప్లాన్ చేస్తున్నప్పుడు ఈ జంటకు చాలా సమస్యలు ఎదురయ్యాయి. దాంతో బ్యాండ్-బాజా, క్యాటరింగ్ సేవలు, డెకరేషన్స్ వంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. దాంతో వారి పెళ్లి అనంతరం వారు ఎదుర్కొన్న సమస్యకు పరిష్కారం అందిస్తూ దాన్ని బిజినెస్‌గా మలుచుకున్నారు. తర్వాత 2014లో వెడ్మి గుడ్ కంపెనీను స్థాపించారు. శుభ్ర చద్దా, వివేక్ ప్రభాకర్-చుంబక్ శుభ్ర, వివేక్ 2005లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ముదురు రంగుల్లో ఉండే ‘కిట్చీ-చిక్’ ఉత్పత్తులను విక్రయించే వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. కాని అందుకు సరిపడా డబ్బు లేకపోవడంతో ఏకంగా తమ ఇంటిని అమ్మేందుకు సిద్ధపడ్డారు. 2009లో చుంబక్ కంపెనీను స్థాపించారు. ప్రత్యేకమైన గృహాలంకరణ వస్తువులు, ఫ్యాషన్ ఉపకరణాలను తయారుచేసి విక్రయిస్తున్నారు. గజల్ అలఘ్, వరుణ్ అలఘ్-మామా ఎర్త్ గజల్ అలఘ్ టాక్సిన్ ఫ్రీ బేబీ కేర్ ఉత్పత్తులను తయారుచేయాలని భావించి హోనాసా కన్స్యూమర్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మామాఎర్త్ను ఆగష్టు 2016లో తన భర్త వరుణ్ అలఘ్‌తో కలిసి స్థాపించారు. తల్లిదండ్రులు, పిల్లల కోసం సహజమైన ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు మామాఎర్త్ తెలిపింది. రోహన్, స్వాతి భార్గవ - క్యాష్‌కరో ఇదీ చదవండి: దేశంలోనే టాప్ కంపెనీలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇవి.. స్వాతి, రోహన్ భార్గవ క్యాష్‌కరో, క్యాష్‌బ్యాక్, కూపన్ వెబ్‌సైట్‌ను స్థాపించారు. ఏప్రిల్ 2011లో వీరు యూకేలో పోరింగ్ పౌండ్స్ పేరుతో క్యాష్‌బ్యాక్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. 2013లో లండన్ నుంచి గుర్గావ్కు తిరిగి వచ్చిన తర్వాత అదే బిజినెస్ మోడల్‌ను క్యాష్‌కరో పేరుతో భారత్‌లో ప్రారంభించారు. క్యాష్కరోలో టాటా, కలారీ క్యాపిటల్ పెట్టుబడులు పెట్టాయి. -
నేను ఎక్కడున్నా ఆమె నా గుండెల్లోనే ఉంటుంది: సుడిగాలి సుధీర్
బుల్లితెరపై సుడిగాలి సుధీర్-యాంకర్ రష్మీ జోడికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కెమిస్ట్రీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. రీల్ కపుల్‌గానే కాకుండా సుధీర్-రష్మి రియల్ కపుల్ అయితే బావుండు అని అనుకోని ప్రేక్షకులు ఉండరు. అంతలా స్క్రీన్‌మీద మెస్మరైజ్ చేస్తారు ఈ జంట. కానీ కొద్దిరోజులుగా ఈ జోడి మాత్రం స్క్రీన్‌పై ఒకటిగా కనిపించలేదు. సుధీర్ సినిమాలతో బిజీ అయితే.. రష్మీ మాత్రం పలు టీవీ షోలతో రానిస్తుంది. (ఇదీ చదవండి; నా దగ్గర ఇలాంటి మాటలే వద్దు: తమన్నా) తాజాగా వీరిద్దరూ ప్రముఖ టీవీ షోలో ఒకే స్క్రీన్‌పై మళ్లీ జంటగా కనిపించారు. దీంతో వారిద్దరీ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఆ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ప్రోమోలో సుధీర్ వేసిన డైలాగ్‌లు మళ్లీ వైరల్ అవుతున్నాయి. మేడం గారు ఎందుకో కొంచెం కోపంగా ఉన్నారంటూ రష్మీని ఉద్దేశించి సుధీర్ కామెంట్ చేస్తాడు. అందుకు బదులుగా రష్మీ కూడా 'నువ్వు వస్తావని ఇన్నాళ్లు ఎదురు చూశాను' అంటూనే ఓర చూపులతో చిన్న స్మైల్ ఇస్తూ 'ఇన్నిరోజులు ఎక్కడున్నావ్..?' అని సుధీర్‌ను ఆమె ప్రశ్నింస్తుంది. ఇంతలో వెంటనే సుధీర్ తన స్టైల్లో 'నేను ఎక్కడున్నా నువ్వు మాత్రం నా గుండెల్లోనే ఉంటావ్' అంటూ డైలాగ్ పేలుస్తాడు. ఇంకేముంది ఫ్యాన్స్ కేకలతో రెచ్చిపోయారు. ఇలా సుమారు రెండేళ్ల తర్వాత మళ్లీ జోడిగా ఆ షోలో కనిపించారు. పెళ్లిపై రూమర్స్ ఈ క్రమంలో వీరిద్దరు లవ్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారనే రూమర్స్ ఇప్పటికీ వినిపిస్తున్నాయి. గతంలో ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై రష్మి గౌతమ్ స్పందించింది. సుధీర్‌కి, నాకు మధ్య ఏం ఉందన్నది నా పర్సనల్ విషయం. ప్రతి విషయాన్ని బయటకు చెప్పుకుంటూ పోతే ఇంక పర్సనల్ ఏమీ ఉండదన్నది నా అభిప్రాయం అని ఆమె తెలిపింది. -
ప్రేమలో గెలిచి.. బతుకులో ఓడారు
హైదరాబాద్: వారిద్దరూ ప్రేమించుకున్నారు. కానీ వారి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. చేసేదేమీలేక ఇద్దరూ కలిసి వివాహం చేసుకున్నారు. ఆర్నెల్లుగా వేరే కాపురం పెట్టారు. ఈ క్రమంలో మనోవేదనతో పాటు ఆర్థిక ఇబ్బందులతో ఆ నవ దంపతులిద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. దహన సంస్కారం కోసం ఇరు కుటుంబాలు వేర్వేరుగా ఆ యువతీ యువకుల మృతదేహాలను తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ప్రేమించి.. పెళ్లి చేసుకుని.. జీవితంలో ఒక్కటైన ఆ జంట..చివరకు మృత్యువులోనూ నీతోనే నేనంటూ కన్నుమూశారు.మృతదేహాలను వేర్వేరుగా ఎవరి కుటుంబం వాళ్లు తీసుకెళ్లి దహన సంస్కారాలు జరిపించారు. ప్రేమలో గెలిచి.. పెళ్లితో ఒక్కటై జీవితం పంచుకున్న ఈ జంట.. చివరకు విడిపోయి చితికి చేరిన ఘటన మంగళవారం కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలోని అహ్మద్‌గూడ ఆర్జీకే కాలనీలో చోటుచేసుకుంది. కీసర సీఐ రఘువీర్‌రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం.. మూడుచింతలపల్లి మండలం కేశవపురం గ్రామానికి చెందిన దాసరి ఆంజనేయులు (25) నగరంలోని కాప్రా జమ్మిగడ్డకు చెందినవైష్ణవి (22) ప్రేమించుకుని ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాల వాళ్లకు దూరంగా నాలుగు నెలల నుంచి అహ్మద్‌గూడలోని ఆర్జీకే కాలనీలో ఓ గదిని అద్దెకు తీసుకొని నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఆంజనేయులు, వైష్ణవి వేర్వేరుగా బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. ఆమె ఉరి వేసుకుని.. అతను పురుగుల మందు తాగి మొదట వైష్ణవి గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు చేసుకుంది. ఆ తర్వాత ఆంజనేయులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే తాము బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు యువ జంట రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు లభించింది. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా..పోస్టుమార్టమ్ అనంతరం మృతదేహాలను ఎవరి కుటుంబ సభ్యులు వారు తీసుకెళ్లారు. ఆంజనేయులు మృతదేహాన్ని కేశవపురానికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేయగా.. వైష్ణవి మృతదేహాన్ని జమ్మిగడ్డకు తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ప్రేమలో గెలిచి.. పెళ్లి ఒక్కటై.. మృతిలో తోడుగా ఉండి.. ఆఖరికి చితిలో మాత్రం వేరయ్యారు. -
మూడేళ్లుగా ప్రేమ.. మనస్సు మార్చుకున్న ప్రియుడు
కరీంనగర్: ప్రేమించిన యువకుడి కుటుంబసభ్యులు పెళ్లికి నిరాకరించడంతో మనోవేదనకు గురైన యువతి పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయింది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని పోలంపల్లికి చెందిన రెడ్డి రజిత(19), మల్లాపూర్ గ్రామానికి చెందిన పల్లె వెంకటేశ్ మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. విషయ ం తెలిసిన రజిత కుటుంబసభ్యులు వెంకటేశ్‌ను పెళ్లిచేసుకోవాలని కోరారు. మొదట నిరాకరించగా.. రూ.10లక్షల కట్నం ఇస్తామని హామీ ఇవ్వడంతో ఒప్పుకున్నాడు. ఈ మాసంలోనే పెళ్లి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఏప్రిల్ 24న వెంకటేశ్, రజితలు పెళ్లిబట్టలు కొనుగోలు చేసేందుకు కరీంనగర్ వెళ్లారు. తిరిగి వచ్చిన తరువాత వెంకటేశ్ కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. దీంతో మనోవేదనకు గురైన రజిత ఏప్రిల్ 25న ఇంటివద్ద పురుగుల మందు తాగింది. కుటుంబసభ్యులు కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి చనిపోయింది. తన కూతురు ఆత్మహత్యకు పల్లె వెంకటేశ్, పల్లె రాములు, పల్లె సరవ్వ, గుండె కల్యాణి అలియాస్ రమ్య, గుండె రాజు కారణమని రజిత తల్లి అహల్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ద్వారకాతిరుమలలో దారుణం.. కూతురుపై ప్రేమ ఎంతకు దారితీసింది
ద్వారకాతిరుమల: తన కుమార్తె మృతికి ప్రియుడే కారణమని భావించిన ఆమె తండ్రి ఆ యువకుడిని పథకం ప్రకారం హతమార్చాడు. తన కుమార్తె సమాధికి కూతవేటు దూరంలో ఆ యువకుడి మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. ఈ దారుణ ఘటన ద్వారకాతిరుమల మండలం, గొడుగుపేట శివార్లలో సోమవారం వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఐఎస్ రాఘవాపురం పంచాయతీ తూర్ల లక్ష్మీపురానికి చెందిన తానిగడప పవన్‌కల్యాణ్ (24), రామసింగవరం పంచాయతీ గొడుగుపేటకు చెందిన మరీదు శ్యామల (18) జంగారెడ్డిగూడెంలో చదువుకునే సమయంలో ప్రేమించుకున్నారు. వారు తమ ప్రేమ విషయాన్ని కొద్ది నెలల క్రితం ఇంట్లో చెప్పగా, కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించ లేదు. దాంతో మనస్థాపానికి గురైన శ్యామల ఈ ఏడాది జూన్ 5న పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కుమార్తె మృతితో కలత చెందిన ఆమె తండ్రి నాగేశ్వరరావు.. పవన్ కల్యాణ్‌ను కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 15న జంగారెడ్డిగూడెం మండలం నిమ్మలగూడెంలోని ఓ కాలువ గట్టుపై తన స్నేహితుడు నాగరాజుతో కలిసి పవన్ కల్యాణ్ పార్టీ చేసుకున్నాడు. అప్పటి నుంచీ అతడు కనిపించడం లేదు. విచారణ చేపట్టిన పోలీసులు అదే రోజు రోజు రాత్రి పవన్ కల్యాణ్‌ను శ్యామల తండ్రి నాగేశ్వరరావు తీసుకెళ్లినట్టు గుర్తించారు. దీంతో, పోలీసులు.. అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్టు నాగేశ్వరరావు అంగీకరించాడు. మృతదేహాన్ని శ్యామల సమాధికి సమీపంలో పూడ్చిపెట్టినట్టు తెలిపాడు. జంగారెడ్డిగూడెం సీఐ బాలసురేష్‌బాబు, లక్కవరం ఎస్సై దుర్గామహేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు పవన్ కల్యాణ్ కుటుంబాన్ని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు సోమవారం పరామర్శించారు. -
ప్రేమ వివాహం చేసుకున్నాం.. రక్షణ కల్పించండి
కాకినాడ సిటీ: కుటుంబ పెద్దల నుంచి రక్షణ కల్పించాలని ఓ ప్రేమజంట జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబును కోరింది. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వీరు ఎస్పీని కలసి తాము ప్రేమ వివాహం చేసుకున్నామని, పెద్దలు తమ వివాహాన్ని నిరాకరిస్తున్నారని, వీరి వల్ల ప్రాణభయం ఉందంటూ ఫిర్యాదు చేశారు. పిఠాపురం మండలం సీతారామపురం గ్రామానికి చెందిన ఆళ్ల శశాంకలక్ష్మి, కాశీవారిపాకలకు చెందిన వాసంశెట్టి శివమణికంఠ ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను ఇరు కుటుంబ పెద్దలు నిరాకరించారు. దీంతో ఇంటి నుంచి వెళ్లి పోయి రామచంద్రపురంలోని ఓ దేవాలయంలో వివాహం చేసుకున్నట్లు తెలిపారు. శశాంకలక్ష్మి విలేకర్లతో మాట్లాడుతూ తమ గురించి ఇంట్లోవారికి చెప్పినా ఒప్పుకోకుండా మరో వివాహం చేసేందుకు ప్రయత్నించడంతో ఇంట్లోంచి బయటకు వచ్చి ఇద్దరం కలిసి వారం రోజుల క్రితం ఊరు నుంచి వెళ్లి పోయినట్లు తెలిపారు. తమ సామాజిక వర్గాలు వేర్వేరు కావడంతో తమ కుటుంబం ఈ పెళ్లికి అంగీకరించదని, తమకు రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని కోరినట్లు తెలిపింది. ఈ పెళ్లి ఇద్దరి ఇష్ట్రపకారమే జరిగిందని దీనిలో ఎవరి ప్రమేయం లేదని తెలిపింది. చదవండి: (తిరుపతి–పీలేరు రహదారికి మహర్దశ.. వెయ్యి కోట్లతో..) -
లేటు వయసులో ఘాటు ప్రేమ.. ఏకంగా రొటేటింగ్ హౌస్ కట్టించాడు!!
ప్రేమకు చిహ్నం చూపమంటే.. షాజహాన్ తన భార్య కోసం కట్టిన తాజ్‌మహల్ వెంటనే మదిలో మెదులుతుంది. ఐతే తరాలుగా ఎందరో తమకు ఇష్టమైన వారికోసం ఎన్నో కట్టారు. కానీ అంతగా గుర్తింపుకు నోచుకోలేదు. తాజాగా ఉత్తర బోస్నియాకు చెందిన 72 యేళ్ల వ్యక్తి భార్య కోసం రొటేటింగ్ హౌస్‌ను కట్టించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఆకు పచ్చ ముఖభాగం, రెడ్ మెటల్ రూఫ్‌తో 360 యాంగిల్లో తిరిగే ఈ రొటేటింగ్ హౌస్‌ను వోజిన్ కుసిక్ అనే వ్యక్తి, తన భార్య లుబికా కోసం నిర్మించాడు. కాలేజీ చదువుకూడా లేని కుసిక్ ఈ రొటేట్ హౌస్‌ను స్వయంగా డిజైన్ చేశాడట. కేవలం ఎలక్ట్రిక్ మోటార్లు, పాత మిలిటరీ రవాణా వాహన చక్రాలను ఉపయోగించి కట్టాడని అక్కడి స్థానిక మీడియాకు వెల్లడించాడు. జీవిత చరమాంకానికి చేరుకున్న తర్వాత, పిల్లలు కుటుంబ బాధ్యతలు తీసుకున్న ఇన్నేళ్లకి నా భార్య కోరిక తీర్చడానికి సమయం దొరికిందని చెప్పుకొచ్చాడు. కుసిక్ వివాహం చేసుకున్నాక భార్య, బిడ్డల కోసం అప్పట్లో ఒక ఇంటిని నిర్మించాడట. ఐతే ఆ టైంలో బెడ్ రూం సూర్యునికి ముఖాముఖిగా ఉండాలని భార్య కోరడంతో, భార్య అభీష్టానికి తగినట్లుగా గదుల నిర్మాణాన్ని మార్చాడు. రోడ్డుకి ఎదురుగా ముఖ ద్వారం వచ్చింది. దీంతో రోడ్డు మీద వెళ్లేవారందరినీ చూడాలనుకోవడం లేదని భర్తకు పిర్యాదు చేసింది భార్య. చాలా కష్టమైన పనైనప్పటికీ భార్య కోరుకున్నట్లు ప్రతిదీ మార్చవలసి వచ్చేదట. ‘ఇప్పుడైతే, మా ముందు తలుపు కూడా తిరుగుతుంది. రోడ్డు మీద వ్యక్తులెవరైనా కనిపిస్తే, ఆమె ఇంటిని తనకిష్టం వచ్చిన వైప్పుకు తిప్పుకోవచ్చు’అని సరదాగా మీడియాతో తన అనుభవాలను పంచుకున్నాడు. దీంతో ఈ వీడియోను నెటిజన్లు ఆసక్తిగా వీక్షిస్తున్నారు. చదవండి: అలాంటప్పుడు.. తాళం ఎందుకేసుకున్నావయ్యా!! -
ప్రే‘ముంచాడు’.. వీడు మామూలోడు కాదు!
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): యువతిని ప్రేమించానని నమ్మబలికాడు.. ఆమె నుంచి లక్షలకు లక్షలు డబ్బులు తీసుకున్నాడు.. తీరా ఆమెతో ఓ కారు కొనుగోలు చేయించి.. ఆ కారుతో ఉడాయించాడు. చివరికి యువతి ఫిర్యాదు మేరకు యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ సుప్రజ, అరండల్‌పేట పోలీస్‌స్టేషన్ సీఐ డి.నరేష్‌కుమార్‌లు సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. గుంటూరు నల్లచెరువుకు చెందిన ఓ యువతి విప్రోలో ఉద్యోగం చేస్తోంది. గతేడాది ఓ చాటింగ్ యాప్ ద్వారా నల్లపాడు రోడ్డు ఏపీహెచ్‌బీ కాలనీకి చెందిన చిల్లంపూడి విజయభాస్కర్‌రెడ్డితో ఆమెకు పరిచయమేర్పడింది. ఈ క్రమంలో ఆమెను ప్రేమిస్తున్నానంటూ విజయభాస్కర్‌రెడ్డి నమ్మబలికాడు. ఇంటీరియర్ పనులు చేసుకుంటున్న అతను.. తాను ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నానని చెప్పాడు. యువతి నుంచి లక్షలాది రూపాయలు డబ్బులు తీసుకున్నాడు. పెళ్లయ్యాక మనకు ఇబ్బందులుండవ్ ఇద్దరం కలిసి స్మార్ట్ సర్వీసెస్ అనే కంపెనీ ఏర్పాటు చేద్దామని, పెళ్లయ్యాక ఇక ఎలాంటి ఇబ్బందులుండవంటూ ఆ యువతిని విజయభాస్కర్‌రెడ్డి నమ్మించాడు. ఈ క్రమంలో యువతికి సంబంధించిన పలు బ్యాంకు, క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు తీసుకునేలా చేసి, దాదాపు రూ.25 లక్షల వరకూ ఆమె వద్ద నుంచి తీసుకున్నాడు. అలాగే ఆమెతో ఓ కారును కొనుగోలు చేయించి 2021 మే 25న గుంటూరు అరండల్‌పేటలోని ఓ హోటల్‌కు భోజనానికి తీసుకెళ్లాడు. యువతిని ఏమార్చి ఆమె హ్యాండ్ బ్యాగులోని కారు తాళాలు తీసుకుని బయటకు వచ్చి కారుతో పరారయ్యాడు. పోలీసులు సోమవారం నిందితుడిని అరెస్ట్ చేసి.. విచారించగా.. నేరాన్ని అంగీకరించాడు. అలాగే మరికొంత మంది యువతులనూ మోసం చేసినట్టు గుర్తించినట్టు పోలీసులు చెప్పారు. -
ప్రియుడు హ్యాండ్ ఇవ్వడంతో వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి, చివరకు
సాక్షి, పాలకొల్లు: ఏడేళ్లుగా ప్రేమిస్తున్నా పెళ్లికి నిరాకరిస్తుండటంతో ఓ యువతి వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేసింది. పోలీసుల కౌన్సెలింగ్‌తో ఎట్టకేలకు ప్రియుడు పెళ్లికి అంగీకరించడంతో కిందికి దిగి రాగా, వారిద్దరికి దండలు మార్పించి ఒక్కటి చేశారు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని 18వ వార్డు బెత్లహంపేటకు చెందిన పెట్టెల కేశవాణి, గాంధీనగర్ కాలనీకి చెందిన యడ్ల భాస్కరరావు ఏడేళ్లుగా ప్రేమికులు. తనను పెళ్లి చేసుకోవాలని వాణి కోరగా, భాస్కరరావు ముఖం చాటేస్తున్నాడు. రెండు రోజుల క్రితం యువతి బంధువులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా భాస్కరరావు రెండు రోజులు గడువు కోరాడు. శనివారం కూడా ఏ విషయం చెప్పకపోవడంతో కేశవాణి తనకు న్యాయం చేయాలంటూ అదే ప్రాంతంలో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంక్ ఎక్కింది. దీంతో బంధువులు భయాందోళనలకు గురై ఫిర్యాదు చేశారు. సీఐ సీహెచ్ ఆంజనేయులు చొరవతో యువతి కిందికి దిగి రాగా, భాస్కరరావు, అతని తల్లిదండ్రులకు సీఐ కౌన్సెలింగ్ ఇవ్వడంతో పెళ్లికి అంగీకరించారు. స్టేషన్ పక్కనే ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో ప్రేమజంటకు దండలు మార్పించారు. ఏడాదిలోపు పెళ్లి చేసుకునేలా ఒప్పందం చేసుకున్నట్లు కేశవాణి బంధువులు, స్థానిక పెద్దలు తెలిపారు. ఎస్సై రెహమాన్, స్థానిక పెద్దలు సనమండ ఎబినేజర్, రేణుబాబు, ఖండవల్లి వాసు, రామాంజుల మధు, రాజేష్ కన్నా సమస్య పరిష్కరించడానికి కృషి చేశారు. చదవండి: Paralympics 2021: వినోద్ కూమార్‌కు కాంస్యం.. భారత్ ఖాతాలో మూడో పతకం -
ప్రియుడి మోజులో పడి యువతి దారుణం.. తండ్రిని హతమార్చి ఆపై..
లక్నో: కూతురును అల్లారు ముద్దుగా పెంచాడో తండ్రి. బిడ్డకు ఎటువంటి కష్టం కలగకుండా చూసుకోనేవాడు. ఆమెనే సర్వస్వం అనకుని బ్రతికేవాడు. చివరకు ఆమె తను ప్రేమించిన అబ్బాయిని తీసుకొచ్చి అతడిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీనికి తన తండ్రి ఒప్పుకోలేదు. ప్రియుడి మోజులో పడి కన్నతండ్రినే అత్యంత కిరాతకంగా హత్య చేసింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని సంభల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు..సంభల్ కు చెందిన హర్పాల్ సింగ్‌కు ఒక్కగా నొక్క కుమార్తె..ప్రీతి. ఆమె గత కొద్ది కాలంగా ఓ యువకుడుని ప్రేమిస్తోంది. అయితే ప్రియుడిని వివాహం చేసుకుంటాని తన తండ్రికి చెప్పింది. బాయ్‌ఫ్రెండ్‌తో వివాహం జరిపించేందుకు హర్పాల్ సింగ్ నిరాకరించాడు. దీంతో కన్న తండ్రినే కడతేర్చింది. ముతైన్ గ్రామంలో బాధితుడు జులై 19న పొలానికి వెళ్లి సమయంలో ఈ ఘటన జరిగింది. తరువాత అతని మృతదేహం పొలంలో ఓచెట్టుకు వేలాడుతూ కనిపించింది. ఆయనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే బాధితుడి తలపై ఇనుపరాడ్‌తో కొట్టడంతోనే ఆయన మరణించాడని పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఈ ఘాతుకానికి పాల్పడిన బాలిక ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను బదౌన్ జిల్లా ఇస్లాంనగర్‌లో అరెస్ట్ చేశామని సంభాల్ ఎస్పీ చక్రేష్ మిశ్రా వెల్లడించారు. నిందితులు హర్పాల్ సింగ్‌ను హత్య చేసి మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీశారని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
నా కుమార్తెనే ప్రేమిస్తావా అంటూ..
హోసూరు(కర్ణాటక): తమ కుమార్తెనే ప్రేమిస్తావా అంటూ యువతి తల్లిదండ్రులు యువకుడి ఇంటిని ధ్వంసం చేశారు. అవమానంగా భావించిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మనో వేదనకు గురై యువతి పురుగుల మందు తాగి ఆస్పత్రిపాలైంది. వివరాలు.. హోసూరు జయశక్తినగర్‌కు చెందిన యువకుడు హోసూరులోని ప్రైవేట్ కళాశాలలో డిప్లమో చదువుతున్నాడు. మత్తిగిరి కూడలిరోడ్డుకు చెందిన 18 ఏళ్ల యువతి కర్ణాటకలోని కోలారు జిల్లా, మాలూరులోని కళాశాలలో బీకాం చదువుతోంది. వీరిద్దరూ హోసూరులో చదివేటప్పటినుంచి ప్రేమించుకుంటున్నారు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు ఈనెల 11న యువకుడి ఇంటిని ధ్వంసం చేశారు. అవమానం భరించలేక యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. మనోవేదనకు గురైన యువతి ఈనెల 13న పురుగుల మందు తాగడంతో హోసూరులోని ప్రైవేట్‌ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రేమ జంట బలవన్మరణం
జగద్గిరిగుట్ట: ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు.. పెద్దలకు చెప్పారు.. కులాలు వేరు కావడంతో వాళ్లు ససేమిరా అన్నారు. ఇంతలో ప్రేమికుడికి ఇంట్లో పెళ్లి చూపులు చూడటం మొదలుపెట్టారు. దీంతో ఇద్దరూ ఇళ్ల నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుని.. క్వారీ గుంతలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఎన్టీఆర్ నగర్ ఎల్లమ్మ బండ ప్రాంతానికి చెందిన సురేష్, విజయలక్ష్మి దంపతుల రెండవ కుమార్తె(16) కేపీహెచ్‌బీలోని ఎన్ ఆర్ఐ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవ త్సరం చదువుతోంది. వీరి ఇంటికి 100 మీటర్ల దూరంలో ఉండే కృష్ణ, అండాలు దంపతుల కుమారుడు విశాల్(21) అలియాస్ సురేష్.. బాలిక కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. విశాల్ మొదటి సంతానం కాగా, మరో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. విశాల్ రెండేళ్ల క్రితం ఓ ప్రింట్‌ప్రెస్‌లో పనిచేసి మానేశాడు. వీరి ప్రేమ విషయంలో ఇరు కుటుంబాల మధ్య 2 సార్లు గొడవలయ్యాయి. ఇద్దరు కులాలు వేరు కావడంతో అమ్మాయి తరుఫు వారు అభ్యంతరం చెప్పారు. అలాగే ఇటీవల జనగాం ప్రాంతంలో విశాల్‌కు సంబంధం చూసి.. ఆ అమ్మాయితో పెళ్లి చేయాలనే నిర్ణయానికి అతని తల్లిదండ్రులు వచ్చారు. విశాల్ మాత్రం తాను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని తేల్చిచెప్పాడు. అందుకు అతడి తల్లిదం డ్రులు ససేమిరా అనడంతో.. ఈ నెల 14 తెల్లవారు జామున 4 గంటలకు ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపో యారు. అదేరోజు జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరు మిస్సింగ్ అయినట్లు కేసు నమోదు అయింది. పోలీసులు వెతుకుతుండగానే.. వీరి ఆచూకీ కోసం గాలిస్తుండగానే బాలయ్యనగర్ క్వారీ గుంతలో దూకి ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం అందింది. పారిపోయిన ఇద్దరు మృతిచెందినట్లు గుర్తించిన పోలీసులు వారి తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. మృతదేహాలను బయటకు తీసిన తర్వాత అమ్మాయి మెడలో పసుపు తాడు గుర్తించారు. ఏదైనా దేవాలయంలో పెళ్లి చేసుకున్న తర్వాతే.. పెద్దలు ఒప్పుకోరన్న కారణంతో ఇద్దరు క్వారీ గుంతలో పడి మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. పక్కపక్క ఇళ్లలోనే ఉంటున్న వీరు రెండేళ్లుగా ప్రేమించుకున్నట్లు స్థానికులు తెలిపారు. కులాల పంతాలకు పోయి తల్లిదండ్రులే ఇద్దరి మృతికి కారకులయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సైదులు తెలిపారు. -
ఇలా ప్రపోజ్ చేస్తే...వెంటనే పడిపోతారంట!
ప్రేమలో తేలుతున్నప్పుడు ఆ ఫీలింగే వేరు. అయితే ఆ బంధం సజావుగా సాగాలన్నా...మరింత ధృడపడాలన్నా కొన్ని టిప్స్ పాటించాలి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రేమను వ్యక్తపరుస్తారు. కొందరు గొఫ్ట్లు ఇచ్చి ప్రేయసిని ఇంప్రెస్ చేస్తే..మరికొందరు పొగడ్తలతో ముంచెత్తుతూ ఆకాశినికెత్తేస్తారు. ఇవన్నీ చేస్తేనే ప్రేముందా అంటే...ప్రేమ బంధాన్ని మరింత ధృడపరచడంలో ఇవి ఎంతో సహాయపడతాయి అని చెప్పొచ్చు. ప్రేమికులు ఏ విషయాలను ఇష్టపడతారు? ప్రేమించే వ్యక్తిని ఇంప్రెస్ చేయడానికి ఏ విషయాలపై శ్రద్ద పెట్టాలి? ప్రేమిస్తున్నాను అని ఎంత ప్రేమగా వ్యక్తపరచవచ్చు ? లాంటి అంశాలపై సైకాలజీ నిపుణులు ఏం చెప్తున్నారో తెలియాలంటే కింది వీడియోని తెలుసుకోండి -
అనుష్కను మొదటిసారి ఎలా కలిశానో తెలుసా ?
న్యూఢిల్లీ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి-అనుష్కశర్మ జోడిది ఒక చక్కని ప్రేమకథ అన్న సంగతి అందరికి తెలిసిందే . 2013లో మొదలైన వీరిద్దరి ప్రేమాయణం చివరికి 2017లో ఇటలీలో జరిగిన వివాహంతో ఒక్కటయ్యారు. ఇదే విషయమై అమెరికాకు చెందిన స్పోర్ట్స్ రిపోర్టర్ గ్రాహమ్బెరసింజర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుష్క శర్మ తొలిసారి తనకు పరిచయం ఎలా అయిందో విరాట్ చెప్పుకొచ్చాడు. 'తొలిసారి తామిద్దరం ఒక షాంపు ప్రకటన కోసం కలుసుకున్నామని తెలిపాడు. తొలిసారి తనను చూసినప్పుడే ఎలాగైనా ఆమెతో మాట్లాడటానికి మంచి జోక్ వేస్తే బాగుంటుందని అనుకున్నాను. వెంటనే అనుష్క వేసుకున్న హీల్స్ గురించి కామెంట్ చేస్తూ.. ఇంతకన్నా ఎత్తైనా హీల్స్ నీకు దొరకలేదా అంటూ తన పొడవునుద్దేశించి జోక్ వేశాను. దానికి అనుష్క నుంచి సరైన రీతిలో సమాధానం రాలేదు. అప్పటికే ఆమె మేనేజర్ కోహ్లి 6 అడుగుల ఎత్తు ఉండడు కాబట్టి హీల్స్ వేసుకోవద్దని ముందుగానే చెప్పడంతో నాకు తెలియక అదే జోక్ వేయడంతో అది కాస్తా ఫేయిలయ్యిందని' చెప్పుకొచ్చాడు. అలా తొలిసారి తాను అనుష్కతో మాట్లాడడానికి ప్రయత్నించానని పేర్కొన్నాడు. ఆ తర్వాత చాలాసార్లు పలు ఈవెంట్లలో కలుసుకోవడంతో మా స్నేహం ప్రేమగా మారి మా ఇద్దరిని ఒకటి చేసిందని కోహ్లి తెలిపాడు. -
విడిపోయి ఉండలేక.. కలిసి చచ్చిపోదామని..
వారిద్దరూ ఇంటర్ చదువుకున్న సమయంలోనే ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకున్నారు. విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు ప్రేమించిన వ్యక్తిని కాదని వేరొక వ్యక్తితో ఆమెకు ఏడాది కిందట వివాహం చేశారు. అనంతరం వివాహం చేసుకున్న భర్తతో ఆమె హైదరాబాద్‌కు వెళ్లింది. అక్కడే ఏడాదిగా ఉంటున్నారు. కానీ ఆమె తొలుత ప్రేమించిన వ్యక్తిని మరవలేకపోయింది. ఈ క్రమంలో ఐదు రోజుల కిందట పనుల నిమిత్తం సొంత ఊరుకు వచ్చిన భార్యాభర్తలు ఇద్దరూ పని పూర్తి చేయించుకున్నారు. పని పూర్తయిందని భర్త హైదరాబాద్ వెళ్లిపోగా... ఆమె మాత్రం వెళ్లలేదు. ఇంతలోనే తొలుత ప్రేమించిన వ్యక్తితో బుధవారం రైలు నుంచి దూకేసి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. దీంతో ఇరు కుటుంబాల సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.... విజయనగరం క్రైం/బలిజిపేట: రైలు నుంచి దూకి ప్రేమ జంట ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి శ్రీకాకుళం రైల్వే జీఆర్పీ ఎస్ఐ చెల్లూరి శ్రీనివాసరావు అందించిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని బలిజిపేట మండలం బర్లి గ్రామానికి చెందిన యేగోటి నాగరాజు, అదే మండలం అరసాడ గ్రామానికి చెందిన యువతి ఇంటర్మీడియెట్ చదువుతున్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు. నాగరాజు ప్రస్తుతం డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఏడాది కిందటే వేరే వ్యక్తితో యువతికి వివాహం చేసేశారు. హైదరాబాద్‌లో ఉంటున్న వీరిద్దరూ పుట్టింటికి గత నెల 29న వచ్చారు. బొబ్బిలిలో ఓ కళాశాలలో సర్టిఫికెట్లు తీసుకుంటానని మంగళవారం ఉదయం ఇంట్లోంచి వెళ్లిన వివాహిత మరలా ఇంటికి చేరలేదు. విజయనగరం చేరుకుని రాత్రి సమయంలో స్థానిక థియేటర్లో ఇద్దరూ కలిసి సినిమాకు వెళ్లి, అనంతరం రైల్వేస్టేషన్‌కి వెళ్లి గూడ్స్ రైలు ఎక్కినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయం చేసుకున్నారని, ఈ క్రమంలో నెల్లిమర్ల డైట్ కళాశాల వద్దకు వచ్చేసరికి బుధవారం రైలు నుంచి దూకేసినట్టు వారు చెబుతున్నారన్నారు. అయితే రైలు నుంచి దూకితే ప్రాణాలు పోయే ప్రమాదముందని, ఇంకా వారిద్దరూ పూర్తి స్థాయిలో వివరాలు చెప్పడానికి అంగీకరించడం లేదని వెల్ల డించారు. ట్రాక్ పక్కన పడి ఉన్న వారిని ఎయిమ్ జిల్లా కన్వీనర్ బివి.రమణ చూసి సమాచారమందించారు. వెంటనే 108 సాయంతో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ఇద్దరికీ తలకు, చేతులకు గాయాలయ్యాయి. వివాహిత తలకు కొంచెం బలంగా గాయం తగలడంతో విశాఖ కేజీహెచ్‌కి తరలించారు. నాగరాజు కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నాగరాజు తండ్రి విశాఖలోని ప్రైవేటు కళాశాలలో వాటర్ ప్లాంట్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. వివాహితకు తల్లిదండ్రులతో పాటు తోబుట్టువు ఉంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చెల్లూరి శ్రీనివాసరావు తెలిపారు. ఏడాది కిందటే... బలిజిపేట: నాగరాజు, ఆ యువతి బలిజిపేటలో 2017–19 విద్యా సంవత్సరాల్లో ఇంటర్ ఓ ప్రైవేటు కళాశాలలో చదివారు. యువతి సీఈసీ, నాగరాజు ఎంపీసీ గ్రూపు చదివారు. వీరి ప్రేమ వ్యవహారం యువతి ఇంట్లో తెలియడంతో ఆమెకు తల్లిదండ్రులు అరసాడకు చెందిన ఓ వ్యక్తితో ఏడాది కిందటే వివాహం చేశారు. అతను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. దంపతులిద్దరూ వారి సొంత పనుల నిమిత్తం హైదరాబాద్ నుంచి ఇటీవల రాగా పని పూర్తయిన తరువాత భర్త తిరిగి హైదరాబాద్ వెళ్లిపోగా ఆమె మాత్రం అరసాడలోనే ఉంది. హైదరాబాద్ వెళ్లేందుకు రిజర్వేషన్ చేయించుకుంటానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన వివాహిత బుధవారం ఉదయం ఇలా తన ప్రేమికుడితో రైలు నుంచి దూకే యత్నం చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. చదవండి : సినిమాను తలపించే రియల్ క్రైమ్ స్టోరీ -
72 సంవత్సరాల ప్రేమ
స్వాతంత్య్ర సంగ్రామం సమయంలో విడిపోయిన ఓ యువజంట, 72 ఏళ్ల తర్వాత అనూహ్యంగా కలుసుకుంది. ఒకరికోసం మరొకరు చాలా ఏళ్లు ఎదురు చూసి, ఇక జీవితంలో కలవలేమని నిరాశ చెంది, పరిస్థితులతో రాజీ పడిపోయి బతికిన ఆ జంట.. జీవిత చరమాంకంలో కలుసుకోవడం ఒక సినిమా కథనే తలపింపజేస్తోంది. అసలు ఏం జరిగిందంటే.. అది 1946వ సంవత్సరం. కేరళలోని కవుంబాయి గ్రామం. స్వాతంత్య్ర పోరాటం ఉధృతంగా జరుగుతున్న రోజులు. ఏక్నారాయణన్ నంబియార్ వయసు 17 ఏళ్లు. శారదకి 13 ఏళ్లు.. వారిద్దరికీ కొత్తగా పెళ్లయింది. పట్టుమని పదినెలలు కలిసి ఉన్నారో లేదో రైతు ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. భూస్వాములకి వ్యతిరేకంగా రైతన్నలు కదం తొక్కారు. ఆ ఉద్యమంలో నారాయణన్ నంబియార్ తన తండ్రి రామన్ నంబియార్‌తో కలిసి చురుగ్గా పాల్గొన్నారు. ఆ ఉద్యమం హింసాత్మకంగా మారింది. బ్రిటిష్ జవాన్ల కాల్పుల్లో చాలా మంది మరణించారు. నారాయణన్ నంబియార్ అందులో తప్పించుకున్నారు. తండ్రితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వాళ్లిద్దరూ ఇంట్లోనే దాక్కున్నారని బ్రిటిష్ పాలకులు భావించారు. వారి ఆదేశాల మేరకు మలబార్ స్పెషల్ పోలీసులు నంబియార్ ఇంటిపైన దాడి చేశారు. నంబియార్ ఆచూకీ చెప్పకపోతే అందరినీ కాల్చి పారేస్తామని హెచ్చరించారు. ప్రాణభయంతో గజగజలాడుతున్న శారదను చుట్టుపక్కల వారు కాపాడి వాళ్ల పుట్టింటికి పంపేశారు. ఆ తర్వాత నంబియార్ ఆచూకీని కనుక్కున్న పోలీసులు తండ్రీ కొడుకుల్ని జైల్లో పెట్టారు. తరచూ జైళ్లు కూడా మార్చారు. దీంతో భార్యాభర్తలిద్దరికి ఒకరి గురించి మరొకరికి వివరాలు తెలియలేదు. భర్త ఎప్పటికైనా వస్తాడేమోనని శారద ఒళ్లంతా కళ్లు చేసుకొని ఎదురు చూసేది. కానీ పుట్టింటివాళ్లు బ్రిటిష్ సైన్యం నంబియార్‌ను చంపేసి ఉంటుందని నిర్ధారించుకొని ఆమెకి బలవంతంగా మళ్లీ పెళ్లి చేశారు. మరోవైపు జైల్లో రామన్ నంబియార్‌ను కాల్చి చంపేశారు. నారాయణన్ శరీరంలో కూడా తూటాలు దిగినా, ప్రాణగండం తప్పింది. పదేళ్ల తరువాత జైలు నుంచి బయటకు వచ్చిన నారాయణన్ నంబియార్‌కి భార్య జాడ తెలియలేదు. దీంతో జీవితంతో రాజీపడి అతనూ మరో పెళ్లి చేసుకున్నారు. అలా ఒకరి పట్ల మరొకరికి అనంతమైన ప్రేమానురాగాలు ఉన్న ఆ జంటని విధి విడదీసింది. అలా ఏళ్లకి ఏళ్లు గడిచిపోయాయి. శారద కుమారుడు భార్గవన్ పెరిగి పెద్దయి వ్యవసాయం చేసేవాడు. ఒకసారి వ్యవసాయ పనుల కోసం కన్నూర్‌కి వచ్చి అనుకోకుండా నారాయణన్ మేనల్లుడు మధుకుమార్‌ను కలుసుకున్నాడు. ఇద్దరూ ఒకరితో ఒకరు తమ కుటుంబ వివరాలు పంచుకున్నారు. అప్పుడే తెలిసింది మధుకుమార్ మేనమామ నారాయణన్ నంబియారే తన తల్లి శారద మొదటి భర్త అని. 30 ఏళ్ల క్రితమే శారద రెండో భర్త మరణించారు. నంబియార్ భార్య కూడా చాలా ఏళ్ల క్రితమే కన్నుమూసింది. అందుకే వాళ్లిద్దరూ ఆ మాజీ జంటని ఒక్కటి చెయ్యాలని అనుకున్నారు. విషయం విన్న నంబియార్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అక్కడ శారద పరిస్థితి కూడా అదే. నంబియార్ రెక్కలు కట్టుకొని భార్గవన్ ఇంట్లో వాలిపోయారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 72 ఏళ్ల తర్వాత, తొంబై ఏళ్ల వయసులో ఒకరినొకరు చూసుకోగానే వారిద్దరికీ నోటి వెంట మాట కూడా రాలేదు. కళ్లల్లో సుడులు తిరుగుతున్న నీళ్లని అదిమిపెట్టుకుంటూ నంబియార్ శారద తలపై చేయి వేసి ఆర్తితో నిమిరాడు. ఆ చర్య ఒక్కటి చాలు. వారిద్దరి గుండెల్లో ప్రేమ ఎంతలా గూడు కట్టుకొని ఉందో చెప్పడానికి. ఇదంతా చూసిన బంధువులు కూడా వారిద్దరిదీ ఆత్మబంధం అని కీర్తించారు. ఇక తరచూ ఆ రెండు కుటుంబాలు కలవాలని నిర్ణయించుకున్నాయి. ఆనాటి రైతు పోరాటంతోపాటు వీరిద్దరి జీవిత కథని నారాయణన్ మనవరాలు శాంత ‘డిసెంబర్ 30’ అన్న పేరుతో ఒక నవలగా తీసుకువస్తుండడం విశేషం. -
ప్రేమలో పడితే...
సాక్షి, హైదరాబాద్: ప్రేమలో పడటం, ప్రేమలో ఉండటం ఓ అందమైన అనుభూతి. ప్రేమను ఇవ్వడంలో, ప్రేమను పొందడంలో ఉండే ఆనందం ప్రేమికులకు మాత్రమే తెలుస్తుంది. అతడు లేదా ఆమె ప్రేమలో పడితే వారి జీవితంలో పలు మార్పులు చోటు చేసుకుంటాయని తాజాగా చేసిన ఓ సర్వేలో వెల్లడయింది. ఆనందంగా ఉంటారు... కిన్సే ఇన్స్టిట్యూట్ వారు జరిపిన ఓ అధ్యయనం ప్రకారం, ప్రేమలో ఉన్న వారి స్థితి కొకైన్ తీసుకున్నవారిలాగే ఉంటుందని తేలింది. అధిక శాతంలో డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ కావడమే దీనికి కారణమని వారు అభిప్రాయపడ్డారు. డోపమైన్ విడుదలతో ప్రేమలో ఉన్నవారు, ప్రేమలో లేని వారికంటే అధిక ఆనందంగా ఉంటారు. పార్టనర్నీ ఆనందంగా ఉంచుతారు... షేరింగ్ ఈజ్ కేరింగ్ అనే సామెతను అనుసరించి తమ పార్ట్నర్ని కూడా ఆనందంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. తాము ఆనందంగా ఉన్నామన్న విషయాన్ని భాగస్వామితో పంచుకోవడానికి ప్రయత్నిస్తారు. వారిని ఆనందంగా ఉంచాలన్న ఆలోచన వల్ల ఎక్కువగా వారి గురించే ఆలోచిస్తూ మరింత సంతోషాన్ని పొందుతారు. ఒత్తిడి తగ్గుతుంది... స్టాన్ఫోర్డ్ మెడికల్ యూనివర్సిటీ వారు చేసిన అధ్యయనం ప్రకారం ప్రేమలో ఉన్నవారు ఎక్కువ నొప్పిని, ఒత్తిడిని భరించగలరు. అంటే ప్రేమలో లేనప్పటికంటే, ప్రేమలో పడ్డాక తమ విషయాలను షేర్ చేసుకునే వారు దొరకడంతో కష్టాలను పంచుకోవడం ద్వారా నొప్పిని తగ్గించుకోగలరు. గుండె వేగం మారుతుంది... కాలిఫోర్నియా యూనివర్సిటీ వారు చేసిన అధ్యయనం ప్రేమలో పడ్డాక ఇద్దరి గుండె వేగాలు ఒకేలా మారతాయని తెలిపింది. ఇది కేవలం వేగానికే పరిమితం కాకుండా, కొంత కాలం గడిచేసరికి ఇద్దరి అభిరుచులు సైతం ఒకేలా మారతాయి. ప్రయోగాత్మకంగా మారతారు.. ప్రేమలో పడ్డాక తమను తాము మార్చుకోవడానికి ప్రేరణ పొందుతారు. గతంలో లేని అలవాట్లను కొత్తగా ప్రారంభిస్తారు. కొత్త హెయిర్ స్టైల్స్‌ను, కొత్త ఆహార్యాన్ని అలవర్చుకుంటారు. తమ శరీర సౌష్ఠవం మీదా, మెదిలే తీరు మీదా కసరత్తులు చేసి హుందాగా తయారవుతారు. మీరు ప్రేమలో పడ్డారా ? పడ్డాక మీలో ఏమైనా మార్పులు కనిపించాయా ? బాగా పరిశీలించుకోండి మరి. -
ప్రేమ కేసులు.. పోలీసుశాఖ కీలకాదేశాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ప్రేమ, పెళ్లి వ్యవహారపు కేసుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని అన్ని జిల్లాల పోలీసు అధికారులను పోలీసు శాఖ ఆదేశించింది. పరిస్థితులు చెయి దాటిపోయాక పోలీసు శాఖపై ఆరోపణలు వచ్చేలా వ్యవహరించొద్దని సూచించింది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఘటనలతో ఆందోళనకరమైన పరిస్థితి ఉండటంతో పోలీసు శాఖ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లకు మార్గదర్శకాలు పంపినట్లు తెలిసింది. ఫిర్యాదులు తీసుకోండి.. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట మేజర్లయితే వారి ఫిర్యాదును స్వీకరించాలని, ఫిర్యాదులో ఆరోపించిన అంశాలపై దర్యాప్తు చేయాలని పోలీసు శాఖ సూచించింది. అలాగే ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట విషయంలో ఇరువురి తల్లిదండ్రులు, పెద్దలను స్టేషన్‌కు పిలిపించి తప్పనిసరిగా కౌన్సెలింగ్ ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. గతంలో లాగా సాదాసీదాగా వ్యవహరించొద్దని, అవసరమైతే కేసుల నమోదుకు కూడా వెనుకాడొద్దని ఆదేశాలు జారీ అయినట్లు పోలీసు శాఖ వర్గాలు తెలిపాయి. ఘాతుకాలకు పాల్పడటానికి ముందే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సమజాంలో హింసాత్మక ఘటనలు జరగకుండా ఉంటాయని భావిస్తోంది. నిజంగా ప్రాణహాని ఉందనుకున్న సమయంలో ప్రేమజంటపై, వారి కుటుంబీకులపై నిఘా పెట్టాలని ఆదేశించినట్లు తెలిసింది. రోజుకు పది ఫిర్యాదులు అవే.. గడిచిన నెల రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రేమ వ్యవహారాల్లో ఫిర్యాదులు పెరిగినట్లు పోలీసు శాఖ తెలిపింది. జిల్లాలతో పాటు రాజధాని కమిషనరేట్ల పరిధిలో రోజుకు కనీసం 10 నుంచి 15 ప్రేమ పెళ్లి ఫిర్యాదులు వచ్చినట్లు గుర్తించింది. ఈ ఫిర్యాదులపై ప్రాథమిక విచారణ జరిపి వధూవరుల అభిప్రాయం తర్వాతే కేసుల నమోదుకు వెళ్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. కొన్నిసార్లు కేసులు నమోదుచేయడం వల్ల సమస్య మరింత జఠిలమై దాడుల వరకు వెళ్లేలా ఉంటున్నాయని, అందువల్ల ఇరువర్గా లు సంయమనం పాటించేలా చేసి పెళ్లికి ఒప్పించే స్థితికి కౌన్సెలింగ్ చేస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. -
హైదరాబాద్‌లో మిర్యాలగూడ తరహా ఘటన
సాక్షి, హైదరాబాద్: మిర్యాలగూడలో ప్రణయ్ హత్య కేసు మరువకముందే మరో ఘోర ఘటన రాష్ట్ర రాజధానిలో కలకలం సృష్టించింది. తన కూతురు ప్రేమ వివాహం చేసుకుందని కోపం పెంచుకున్న తండ్రి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. బోరబండకు చెందిన మాధవి, ఎర్రగడ్డకు చెందిన సందీప్‌లు నాలుగు రోజుల క్రితం ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో తన కూతురు కులాంతర వివాహం చేసుకుందని కోపం పెంచుకున్న తండ్రి మనోహర చారి, సెటిల్మెంట్ కోసమని పిలిచి వారిపై దాడికి పాల్పడ్డాడు. బైక్‌పై వచ్చి మనోహర చారి బ్యాగులో తనతో తెచ్చుకున్న వేట కొడవలితో దాడి చేశాడు. ముందుగా సందీప్‌పై దాడి చేశాడు. మాధవి అడ్డుకోవడంతో ఆమెను విచక్షణారహితంగా నరికాడు. కత్తి వేటుకు సంఘటనా స్థలంలోనే ఆమె చేయి తెగిపడిపోయింది. ఆమె దడవ చీలిపోయింది. స్థానికులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా వారిని కూడా మనోహరచారి బెదిరించాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి ప్రేమజంటను సనత్‌నగర్‌లోని నీలిమ ఆసుపత్రికి తరలించారు. మాధవి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసి యశోద ఆస్పత్రికి తీసుకెళ్లారు. గత ఐదేళ్లుగా ప్రేమించికుంటున్న సందీప్, మాధవి ఈ నెల 12న ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. మేనమామతో మాధవికి పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు భావించారు. ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో మాధవి పారిపోయి పెళ్లిచేసుకుంది. ఈ నేపథ్యంలో దాడి జరగడం సంచలనం రేపింది. షెడ్యూల్డ్ కులానికి చెందిన సందీప్‌ను కూతురు కులాంతర వివాహం చేసుకోవడం జీర్ణించుకోలేని తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నవ జంటను పిలిచి దారుణాతి దారుణంగా దాడికి పాల్పడ్డాడు. బట్టలు పెడతామని పిలిచి యువ జంటపై కత్తితో దాడికి దిగాడు. పోలీసుల అదుపులో నిందితుడు? మాధవి తండ్రి మనోహర చారి పోలీసులకు లొంగిపోయాడు. అతడిని పంజాగుట్ట పోలీసులు విచారిస్తున్నారు. అయితే నిందితుడిని కఠినంగా శిక్షించాలని పలు సంఘాల నేతలు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు. మాధవి పరిస్థితి విషమం: వైద్యులు ‘మాధవి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మెడపై బలంగా కత్తితో దాడి చేయడంతో మెదడుకు దారి తీసే నరాలు దెబ్బతిన్నాయి. ఎడమ చెయ్యిపై కత్తితో దాడి చేయడంతో సగభాగం కట్ అయి తీవ్రంగా రక్త స్రావం అయింది. ప్రసుతం మూడు గంటల పాటు వైద్యం అందించాల్సి ఉంటుంది. ఎనిమిది గంటలు గడిస్తేగాని ఏమి చెప్పలేమ’ని యశోద ఆస్పత్రి వైద్యులు దేవేందర్ సింగ్ తెలిపారు. -
ఒకరితో ప్రేమ మరొకరితో సహజీవనం
బంజారాహిల్స్: ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి సహజీవనం చేస్తున్నాడు. అదే సమయంలో తన స్నేహితురాలిని చూడటానికి వచ్చిన యువతిపై కన్నేసి ఆమెను కూడా లోబర్చుకున్నాడు. గుట్టు రట్టయ్యేసరికి పోలీసులకు చిక్కాడు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన వివరాలు.. బంజారాహిల్స్ రోడ్ నంబర్12లోని శ్రీరాంనగర్‌లో నివసించే ప్రేమ్‌కుమార్(26) నిరుద్యోగి. నాలుగు నెలల క్రితం టి.స్రవంతి (26) అనే స్థానికురాలితో పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆయనతో సహజీవనం చేయసాగింది.ఇదే సమయంలో ఆమె స్నేహితురాలు ప్రియాచౌదరితో కూడా సన్నిహితంగా మెలగసాగాడు. ఇదేమిటని ప్రశ్నించినందుకు చంపేస్తానంటూ హెచ్చరించడమే కాకుండా రెండు రోజులక్రితం తీవ్రంగా కొట్టాడు. బాధితురాలి పిర్యాదు మేరకు ప్రేమ్‌కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.