ప్రేమజంట భద్రతకు హైకోర్టు నిరాకరణ | Madras High Court love Couple Security Repulsive | Sakshi
Sakshi News home page

ప్రేమజంట భద్రతకు హైకోర్టు నిరాకరణ

Published Wed, Apr 6 2016 3:11 AM | Last Updated on Mon, Oct 8 2018 3:56 PM

ప్రేమజంట భద్రతకు హైకోర్టు నిరాకరణ - Sakshi

ప్రేమజంట భద్రతకు హైకోర్టు నిరాకరణ

తిరువొత్తియూరు: కులాంతర ప్రేమజంటకు భద్రత కల్పించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. మద్రాసు హైకోర్టులో సోమవారం ఉదయం తందై పెరియార్ ద్రావిడర్ విడుదలై కళగ నాయకుడు కొళత్తూరు మణి ఒక పిటిషన్ దాఖలు చేశాడు. అందులో రాష్ట్రంలో కులాంతర వివాహం చేసుకునే దంపతులకు భద్రత లేదు, కులాంతర వివాహాలు చేసుకునే కళాశాల విద్యార్థి, విద్యార్థులపై కిరాయి ముఠా రౌడీలు హత్య చేస్తున్నారని తెలిపారు.
 
 ఈ సంఘటనలు వరుసగా జరుగుతున్నాయని, దీనివలన కులాంతర వివాహం చేసుకునే ప్రేమజంటకు పోలీసు భద్రత కల్పించేందుకు కోర్టు ఆదేశాలు జారీ చేయాలని ఫిర్యాదులో పేర్కొనానరు. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి ఎస్.కె.కౌల్, న్యాయమూర్తులు సుందరేష్‌లతో కూడిన బెంచ్ విచారణ చేసి ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో కోర్టు ఎటువంటి ఆదేశాలు జారీ చేసేందుకు వీలు కాదని పిటిషన్ తోసిపుచ్చుతున్నట్టు ప్రకటించారు. దీంతో కొళత్తూరు మణి దరఖాస్తును ఉపసంహరించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement