ప్రేమ ఎప్పటికీ ఉంటుంది | Arjun Rampal, wife Mehr Jesia announce separation after 20 years of marrage | Sakshi
Sakshi News home page

ప్రేమ ఎప్పటికీ ఉంటుంది

Published Tue, May 29 2018 4:53 AM | Last Updated on Tue, May 29 2018 6:03 AM

Arjun Rampal, wife Mehr Jesia announce separation after 20 years of marrage - Sakshi

..అంటున్నారు బాలీవుడ్‌ కపుల్‌ అర్జున్‌ రామ్‌పాల్, మెహర్‌. 20 ఏళ్ల వైవాహిక జీవితానికి విడాకుల ద్వారా ఫుల్‌స్టాప్‌ పెట్టదలిచారీ జంట. పరస్పర అంగీకారం మీద వీళ్లిద్దరు విడిపోయారు. ఈ జంటకు మహికా, మైరా అనే ఇద్దరు కుమార్తెలున్నారు. విడాకుల గురించి ఈ కపుల్‌ మాట్లాడుతూ – ‘‘ప్రేమా, సంతోషం.. ఇలా అందమైన జ్ఞాపకాలతో నిండిన ఈ 20 ఏళ్ల పయాణం తర్వాత అన్ని జర్నీలు ఒకటే పాత్‌లో సాగవు అని తెలుసుకున్నాం. ఇది విడిపోయే సమయమని మేం అర్థం చేసుకున్నాం. విడిపోయినా ఒకరికొకరం ఎప్పుడూ తోడుగానే ఉంటాం. ముఖ్యంగా మా పిల్లల కోసం. రిలేషన్‌షిప్‌ ఎండ్‌ అవ్వొచ్చు కాని ప్రేమ ఎప్పటికీ ఉంటుంది’’ అని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement