బోడికొండపై ప్రేమజంట
నెల్లిమర్ల రూరల్ విజయనగరం : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీరామస్వామివారి క్షేత్రానికి సమీపంలోని బోడికొండపై ప్రేమజంటల సందడి పెరగడంతో భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ సీతారామ చంద్ర ప్రభువులు వారు కొండపై సంచరించారని భక్తులు విశ్వసిస్తారు. పాండవులు నడయాడిన నేలగా, బౌద్ధుల ఆవాసమైన ప్రాంతమైన బోడికొండపై ఇటీవలి కాలం నుంచి ప్రేమజంటల తాకిడి పెరిగింది.
సీతమ్మవారి పురిటి మంచం, భీముని గుహ, మెట్ల మార్గం, కోదండరామస్వామి ఆలయం సమీపంలో పదుల సంఖ్యలో రోజూ జంటలు వస్తూ తమ చేష్టలతో ఇబ్బంది పెడుతున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చొరవ చూపి ప్రేమ జంటల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment