
సాక్షి, స్పోర్ట్స్/సినిమా : టీమిండియా డ్యాషింగ్ బ్యాట్స్‌మన్ కమ్ కెప్టెన్, బాలీవుడ్ నటి అనుష్క శర్మ... వివాహం తర్వాత తమ బంధాన్ని మరింత ధృడంగా మార్చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో టైమింగ్ ఫోటోలతో ఈ ఇద్దరూ చెలరేగిపోతున్నారు. అయితే అభిమానులు పెట్టింది చాలూ.. ఇక ఆపమంటున్నారు.
తమ తమ వృత్తుల్లో నిత్యం బిజీగా ఉండే వీరిద్దరూ.. టైం దొరికితే చాలూ ఇలా అల్లుకుపోతున్నారు. ట్రై సిరీస్‌కు విరామం లభించటంతో కోహ్లి.. జీరో, సుయి ధాగా చిత్రాలకు బ్రేక్ తీసుకున్న అనుష్క... కొత్త ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతూ మధుర క్షణాలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా అనుష్క కొహ్లీని ముద్దాడుతున్న ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
ఫోటో పెట్టిన గంటలోనే 7 లక్షల లైకులు. వేలల్లో కామెంట్లు... ఫ్యాన్స్ ఖుష్. అంతా హ్యాపీనే. కానీ.. వీళ్లను చూసి అసూయ పడేవాళ్లు కూడా లేకపోలేదు. అందుకే ఇకపై అలాంటి ఫోటోలు పెట్టడం ఆపితేనే మంచిందన్నది విరుష్కల హార్డ్ కోర్ ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్స్.
Comments
Please login to add a commentAdd a comment