![Marriage Postpone At Kurnool Because Of Bride Escape With Lover](/styles/webp/s3/article_images/2024/10/26/Kurnool%3B.jpg.webp?itok=3mDBoScr)
సాక్షి, కర్నూలు: కాసేపట్లో జరగబోయే వివాహ తంతుకు సినిమా రేంజ్ సీన్ తోడైంది. మరికొన్ని గంటల్లో పెళ్లి అనగా.. పెళ్లి కూతురు ప్రియుడితో కలిసి జంప్ అయింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం లక్కసాగరానికి చెందిన అబ్బాయితో.. అనంతపురానికి చెందిన వైష్ణవికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. పత్తికొండలోని గోపాల్ ప్లాజా కళ్యాణ మండపంలో పెళ్లికి భారీగా ఏర్పాట్లు చేశారు. వధువు, వరుడు.. వారి కుటుంబ సభ్యులు మండపానికి చేరుకున్నారు.. తెల్లవారితే పెళ్లి కాగా.. ఇంతలోనే ఊహించని పరిస్థితి ఎదురైంది.
పెళ్లి ఇష్టం లేని పెళ్లికూతురు తన ప్రియుడికి ఫోన్ చేయడంతో అతను స్నేహితుడితో కలిసి మండపానికి వచ్చారు. ఈ క్రమంలో కల్యాణ మండపం నుంచి తెల్లవారుజామున ప్రియుడితో కలిసి బైక్‌పై పారిపోయారు. ఈ ఘటనతో పెళ్లి ఆగిపోయింది. కూతురు పెళ్లి నిలిచిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. అయితే కల్యాణ మండపం నుంచి పెళ్లి కూతురు వెళ్లి పోతున్న దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/31_13.png)
Comments
Please login to add a commentAdd a comment