Bride Rejected Marriage
-
వీడియో: కాసేపట్లో పెళ్లి.. సినిమా రేంజ్లో పెళ్లి కూతురు జంప్
సాక్షి, కర్నూలు: కాసేపట్లో జరగబోయే వివాహ తంతుకు సినిమా రేంజ్ సీన్ తోడైంది. మరికొన్ని గంటల్లో పెళ్లి అనగా.. పెళ్లి కూతురు ప్రియుడితో కలిసి జంప్ అయింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం లక్కసాగరానికి చెందిన అబ్బాయితో.. అనంతపురానికి చెందిన వైష్ణవికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. పత్తికొండలోని గోపాల్ ప్లాజా కళ్యాణ మండపంలో పెళ్లికి భారీగా ఏర్పాట్లు చేశారు. వధువు, వరుడు.. వారి కుటుంబ సభ్యులు మండపానికి చేరుకున్నారు.. తెల్లవారితే పెళ్లి కాగా.. ఇంతలోనే ఊహించని పరిస్థితి ఎదురైంది.పెళ్లి ఇష్టం లేని పెళ్లికూతురు తన ప్రియుడికి ఫోన్ చేయడంతో అతను స్నేహితుడితో కలిసి మండపానికి వచ్చారు. ఈ క్రమంలో కల్యాణ మండపం నుంచి తెల్లవారుజామున ప్రియుడితో కలిసి బైక్‌పై పారిపోయారు. ఈ ఘటనతో పెళ్లి ఆగిపోయింది. కూతురు పెళ్లి నిలిచిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. అయితే కల్యాణ మండపం నుంచి పెళ్లి కూతురు వెళ్లి పోతున్న దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎమ్మెల్యే గారూ.. పెళ్లికి అమ్మాయిని వెతకండి..
ఔరంగాబాద్: దాదాపు పది ఎకరాల భూమి ఉన్నా పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని తెగ వాపోయాడు ఓ పెళ్లికాని ప్రసాద్. తెలిసిన వారందరినీ వధువు కోసం ఆరాతీసి విసిగిపోయిన ఆ అవివాహితుడు చివరకు ఏకంగా తమ నియోజకవర్గం ఎమ్మెల్యేకే ఫోన్ చేసి బాధపడిపోయాడు. మీరైనా పెళ్లికి సరిజోడీని వెతికిపెట్టండి సారూ అంటూ ఫోన్లోనే విన్నపాలు వినిపించాడు. అతని బాధను అర్థ్ధంచేసుకున్న ఆ ఎమ్మెల్యే పెళ్లిళ్ల పేరయ్యగా మారేందుకూ సిద్ధమయ్యాడు. వెంటనే బయోడేటా పంపించు.. పెళ్లికి అమ్మాయిని వెతికిపెట్టే పూచీ నాదీ అంటూ హామీ ఇచ్చాడు. ఎమ్మెల్యే, నియోజకవర్గ ఓటరుకు మధ్య జరిగిన ఈ ఆసక్తికర సంభాషణ తాలూకు ఆడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేస్తోంది. మహారాష్ట్రలోని కన్నాడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉదయ్‌సింగ్ రాజ్‌పుత్‌కు అక్కడి ఖుల్తాబాద్ వాస్తవ్యుడికి మధ్య ఈ సంభాషణ జరిగింది. ఉదయ్‌సింగ్.. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన చీలికవర్గానికి మద్దతు ఇస్తున్నారు. పెళ్లికాని ఓటరు ఫోన్‌కాల్‌పై మీడియా ప్రశ్నించగా ఎమ్మెల్యే సమాధాన మిచ్చారు. ‘ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాస్తవిక సమస్య ఇది. ఓ 2,000 మంది జనాభా ఉన్న గ్రామాన్ని తీసుకుంటే అందులో ఖచ్చితంగా 150 మంది యుక్తవయసు అబ్బాయిలు పెళ్లిళ్లుకాక ఇబ్బందులు పడుతున్నారు. 100 ఎకరాల భూస్వామి అయినా సరే వధువు కోసం తిప్పలు పడాల్సిందే. పట్టణప్రాంతాల్లో స్ధిరపడిన అబ్బాయిలవైపు అమ్మాయిల తల్లిదండ్రులు మొగ్గుచూపడమే ఇక్కడ అసలు సమస్య. పెళ్లి కావట్లేదు బాబోయ్ అంటూ నాకు ఇలాగే చాలా మంది ఫోన్లు చేశారు’ అని ఎమ్మెల్యే చెప్పారు. -
తాళి కట్టే సమయానికి కుప్పుకూలిన వధువు.. ఆ తర్వాత భలే ట్విస్ట్
మైసూరు: రెండు నిమిషాల్లో వరుడు తాళి కట్టాల్సి ఉంది. ఇంతలో పెళ్లికూతురు కళ్లు తిరిగి పడిపోయింది. వెంటనే కొందరు నీళ్లు చల్లి కూర్చోబెట్టారు. వరుడు తాళి కట్టేందుకు సిద్ధం కాగా, వధువు వీల్లేదని మొండికేసింది. ఈ విడ్డూరం మైసూరు నగరంలోని విద్యాభారతి కళ్యాణ మండపంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. హెచ్డీ కోటెకు చెందిన యువకునితో మైసూరుకు చెందిన సించన అనే యువతికి పెద్దలు ఇటీవలే నిశ్చితార్థం చేశారు. కాగా, పెళ్లి వేడుకలో వధువు అడ్డం తిరిగింది. ఈ పెళ్లి ఎంతమాత్రం ఇష్టం లేదని, తాను ఇంటి పక్కన ఉన్న యువకున్ని ప్రేమించానని, అతనితోనే మూడుముళ్లు వేసుకుంటానని చెప్పడంతో వధూవరుల తల్లిదండ్రులు ఒక్కసారిగా షాకయ్యారు. ఇప్పుడు పెళ్లి వద్దంటే ఎలా?, తాము ఈ పెళ్లి కోసం రూ. 5 లక్షలకు పైగా ఖర్చు చేశామని, తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని పెళ్లకొడుకు తల్లిదండ్రులు పట్టుబట్టారు. దీంతో, స్థానిక పోలీసులు వచ్చి వధువుకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినలేదు. దీంతో వధూవరులను పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఎవరు చెప్పినా వినేది లేదని, ప్రేమించినవాడినే పెళ్లి చేసుకుంటానని పెళ్లికూతురు భీష్మించడంతో ఖాకీలు సైతం ఏమీ చేయలేకపోయారు. Bride refuses to marry at the last minute- says 'No' to the groom on the wedding day, and leaves the marriage hall with police protection. The incident happened at #Mysuru #Karnataka.@KeypadGuerilla Video pic.twitter.com/wlwc0bZ2qO — Siraj Noorani (@sirajnoorani) May 22, 2022 ఇది కూడా చదవండి: బాలికను కాళ్లతో తన్నుతూ ఆనందం పొందాడు.. వీడియో వైరల్ కావడంతో.. -
పెళ్లి సమయంలో పెళ్లికి నిరాకరించిన వధువు.. కుప్పకూలిన వరుడు
-
బారాత్‌లో తప్పతాగి పెళ్లికొడుకు డ్యాన్సులు.. మరొకరిని పెళ్లాడిన వధువు
జైపూర్: రాజస్థాన్‌లోని ఒక వరుడు అర్ధరాత్రి వరకు బారాత్‌లో పార్టీ చేసుకుంటూ తప్పతాగి తూలుతూ డ్యాన్సులు చేయడంతో ఆ వధువు గట్టి షాకిచ్చింది. అతన్ని కాదని వేరే వ్యక్తితో తాళి కట్టించుకుంది. రాజస్థాన్‌లోని చురు జిల్లా చెలానా గ్రామంలో ఈ ఘటన జరిగింది. వరుడు సునీల్ తన బంధుమిత్ర గణంతో వధువు ఊరుకి వచ్చాడు. రాత్రి తొమ్మిదికల్లా వధువు ఇంటికి వరుడు కుటుంబం చేరుకోవాలి. కానీ స్నేహితులతో కలిసి తాగుతూ డ్యాన్సులు చేస్తూ అర్ధరాత్రి 1:15కి ముహూర్తం సమీపిస్తున్నప్పటికీ రాలేదు. దీంతో సహనంలో కోల్పోయిన ఆ వధువు అతనిని పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు అప్పటికప్పుడు వేరే వ్యక్తితో ఆమె వివాహం జరిపించారు. చదవండి: (మీరొస్తానంటే.. నేనొద్దంటా!) -
కొద్ది క్షణాల్లో పెళ్లి.. నిర్ణయం మార్చుకున్న వధువు
పట్నా : బీహార్‌లోని చంపారన్ జిల్లాలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. వాట్సాప్ చూసినట్లు వరుడి ముఖం లేదని చెప్పి చివరి నిమిషంలో పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది. బెట్టియాలోని షాంకియా మై ప్రాంతానికి చెందిన వరుడు అనిల్ కుమార్ అనే వ్యక్తితో చంపారన్ జిల్లాకు చెందిన యువతితో పెళ్లి కుదిరింది. బైరియాలోని తదీవానందపుర్‌కు చెందిన ఓ యువతికి మరో గ్రామానికి చెందిన అనిల్‌కుమార్ అనే యువకుడితో వివాహం చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. వాట్సాప్‌లో పంపిన యువకుడి ఫొటో చూసిన యువతి పెళ్లికి అంగీకరిచింది. దీంతో రెండు కుటుంబాలు పెళ్లికి ఏర్పాట్లు చేసుకొని ఓ సుముహూర్తాన పెళ్లి తేదీ నిశ్చయించారు. తాళి కట్టే సమయంలో ఎవరూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అప్పటిదాకా నేరుగా వరుడిని చూడలేకపోయిన వధువు..పెళ్లి మండపంలో ఒక్కసారిగా అతడ్ని చూసి షాక్ అయ్యింది. వాట్సాప్ ఫోటోల్లో ఉన్నట్లుగా పెళ్లికొడుకు లేడని,తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోయింది. బంధువులు, కుటుంబసభ్యులు ఎంత నచ్చజెప్పినా వరుడు తనకి నచ్చలేదని, ఫోటోలో చూసిన విధంగా అబ్బాయి లేడని కారణం చెప్పి పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది. దీంతో ఇరు కుటుంబాల మధ్య స్వల్ఫ ఘర్షణ వాతావరణం నెలకొంది. పెళ్లికి అన్ని ఏర్పట్లు చేసుకొని, బంధువులను పిలిచి అవమానం ఏయడం ఏంటని వరుడి తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు వధువు తీసుకున్న నిర్ణయంతో పెళ్లికొడుకు వెనుదిరగక తప్పలేదు. చదవండి : (ఒక అమ్మాయి కోసం నలుగురు ఫైట్.. లక్కీ డ్రా!) (అప్పగింతలే ఆమెకు ఆఖరి క్షణాలయ్యాయి!) -
పెళ్లి పీటలపై వరుడుకి షాక్ ఇచ్చిన వధువు
సాక్షి, చెన్నై : కొద్దిసేపట్లో పెళ్లికూతురి మెడలో తాళికట్టే సమయం. పెళ్లి కొడుకు తాళిబొట్టు పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు. కాసేపట్లో తాను ఓ ఇంటివాడినవుతానని సంబరపడిపోతున్నాడు వరుడు. ఇంతలో అతగాడికి ఆగమంటూ పెళ్లికూతురు అభ్యర్థన. చివరి నిమిషంలో ఇదేమి ట్విస్ట్ అనుకుంటూ పెళ్లికొడుకు అయోమయంగా చూస్తున్నాడు. రీల్ సీన్‌ను తలపించేలా రియల్ సీన్ చోటు చేసుకుంది అక్కడ. సినిమా సీన్లనే తలదన్నేలా పెళ్లి కొడుకు ఆనంద్‌కు షాక్ ఇచ్చింది పెళ్లి కూతురు ప్రియదర్శిని. పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేకపోతే హీరోయిన్ మొండికేసి చివరి నిమిషంలో ప్రేమించినవాడితో వెళ్లిపోవడం మనం సినిమాల్లో చూస్తుంటాం..! అయితే ఇది తమిళనాడులో నిజంగానే జరిగింది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, ప్రేమించిన వ్యక్తినే పెళ్లాడతానంటూ పెళ్లికూతురు తెగేసి చెప్పింది. దీంతో ఒక్కసారిగా వధూవరుల ఇరు కుటుంబాలతో పాటు పెళ్లికి వచ్చిన అతిథులంతా అనుకోని ఈ పరిణామంతో అవాక్కు అయ్యారు. తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని ఉదగ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. తనను ప్రేమించినవాడు అరగంటలో వస్తాడని అతడినే పెళ్లాడతానంటూ ప్రియదర్శిని ఖరాఖండిగా చెప్పేసింది. కుటుంబ సభ్యులు ఆమెకు ఎంత నచ్చచెప్పినా ఫలితం లేకపోయింది. దీంతో ఆగ్రహంతో ఆమెపై చేయి చేసుకునేవరకూ వెళ్లింది పరిస్థితి. ఇష్టం లేని పెళ్లి ఎందుకు చేస్తున్నారంటూ నిలదీసింది. అయితే ఈ విషయాన్ని ముందే ఎందుకు చెప్పలేదని పెళ్లికూతుర్ని బంధువులు ప్రశ్నించారు. మరోవైపు పెళ్లి మండపంలో జరిగిన అవమానం తట్టుకోలేని పెళ్లి కొడుకు ఆనంద్ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. దీంతో పెళ్లి ఆగిపోయింది. అక్కడవరకూ బాగానే ఉంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ప్రేమికుడి పార్తీపన్ కోసం పెళ్లి కూతురు అరగంట, గంట వేచి చూసినా చివరకు అతగాడు మాత్రం రాలేదు. దీంతో పెళ్లికూతురుని కూడా ఆమె పెద్దలు మండపంలోనే వదిలేసి బాధను దిగమింగకుంటూ వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. -
వరుడికి భారీ షాకిచ్చిన పెళ్లి కూతురు!
కొత్తకోట రూరల్: జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో తనకు పెళ్లి ఇష్టం లేదని వధువు పెళ్లికి నిరాకరించింది. ఈ ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలం చర్లపల్లిలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని పామాపురం గ్రామానికి చెందిన నందిని అదే మండలం చర్లపల్లికి చెందిన వెంకటేశ్‌ల పెళ్లి శుక్రవారం చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. ఉదయం 8.10 గంలకు ముహూర్తం ఉండటంతో అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. తీరా జీలకర్ర బెల్లం పెట్టే సమయానికి నందిని తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. దీంతో పెళ్లికి వచ్చినవారందరూ అవాక్కయ్యారు. నందినిని ఆమె మేనబావ పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఈ వివాహానికి నిరాకరించిందని నిర్ధారణకు వచ్చిన వరుడి బంధువులు వధువు మేనబావపై దాడికి దిగారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు వచ్చి, జరిగిన విషయం తెలుసుకుని అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేయొద్దని ఇరు కుటుంబాలకు సర్ది చెప్పారు. -
పీకలదాకా తాగి పెళ్లిపీటలెక్కాడు..
పట్నా : వివాహ వేదికపైకి పెళ్లికొడుకు మద్యం సేవించి రావడంతో వధువు పెళ్లికి నిరాకరించిన ఘటన బిహార్‌లోని దుమారిలో చోటుచేసుకుంది. పీకలదాకా మద్యం సేవించి పెళ్లి కుమారుడు మంటపానికి రావడంతో అతడితో వివాహానికి నిరాకరించిన యువతి తన తల్లితండ్రులతో ఆ విషయం తెలిపింది. వూటుగా మద్యం తాగిన పెళ్లికుమారుడు పరిసరాలను మర్చిపోయి వేదికపై అమర్యాదకరంగా వ్యవహరించడంతో అతడిని పెళ్లి చేసుకునేందుకు తమ కుమార్తె నిరాకరించిందని పెళ్లికుమార్తె తండ్రి త్రిభువన్ షా చెప్పారు. దుమ్రి చాప్రియా గ్రామంలో జరిగిన వివాహ తంతులో పెళ్లి కుమారుడు బబ్లూ కుమార్ విపరీతంగా మద్యం సేవించడంతో తూలుతూ ఉన్నాడని, ఆయన వివాహ కార్యక్రమాలను చేపట్టే స్థితిలో లేడని బంధువులు చెప్పుకొచ్చారు. వరుడు తీరును గమనించిన పెళ్లి కుమార్తె వేదిక నుంచి దిగివెళ్లిపోయారు. ఇరు కుటుంబాల పెద్దలు వధువు రింకీ కుమారికి నచ్చచెప్పినా ఆమె వివాహానికి సుముఖత చూపలేదు. రింకీ తల్లితండ్రుల నుంచి పెళ్లికుమారుడి కుటుంబం తీసుకున్న కట్నం సొమ్మును తిరిగి ఇవ్వాలంటూ గ్రామస్తులు పట్టుబట్టారు. -
ఆగిన పెళ్లి
తిరువొత్తియూరు: తాళి కట్టే సమయానికి వధువు వివాహానికి తిరస్కరించడంతో పెళ్లి ఆగిపోయింది. ఈ సంఘటన తిరుపోరూరులో చోటుచేసుకుంది. కేళంబాక్కం, మాంబాకంకు చెందిన వనిత. ఈమెకు నావలూర్ సమీపంలో ఉన్న తాళంపూరుకు చెందిన ప్రభుత్వ బస్సు కండక్టర్‌తో ఆదివారం వివాహం జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం సాయంత్రం తిరుపోరూరు నార్త్ మాడ వీధిలో ఉన్న వివాహ మండపంలో వధువు ఆహ్వాన కార్యక్రమం జరిగింది. ఆ సమయంలో వనిత తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని తెలిపింది. ఈ మాటలను ఆమె తల్లిదండ్రులు పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ముహూర్త సమయం దగ్గరపడుతున్న సమయంలో పెళ్లి పీఠలపై వరుడు కూర్చొని ఉన్నాడు. వధువును తీసుకుని రావడానికి బంధువులు, స్నేహితులు పెళ్లి కుమార్తె గదికి వెళ్లారు. కాని అక్కడ నుంచి పెండ్లి పీఠలపైకి వచ్చి కూర్చోవడానికి వనిత తిరస్కరించింది. తనకు వివాహం వద్దని ఏడ్చింది. ఈ సంగతి తెలుసుకున్న పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు, బంధువులు వనితతో రెండు గంటలు సమయం మాట్లాడి సమాధానం చేసినప్పటికీ ఆమె ఒప్పుకోలేదు. ఈ క్రమంలో వివాహానికి చేసిన ఖర్చు మొత్తం ఇవ్వడానికి వధువు పెద్దలు అంగీకరించారు.