
హోసూరు(కర్ణాటక): తమ కుమార్తెనే ప్రేమిస్తావా అంటూ యువతి తల్లిదండ్రులు యువకుడి ఇంటిని ధ్వంసం చేశారు. అవమానంగా భావించిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మనో వేదనకు గురై యువతి పురుగుల మందు తాగి ఆస్పత్రిపాలైంది. వివరాలు.. హోసూరు జయశక్తినగర్‌కు చెందిన యువకుడు హోసూరులోని ప్రైవేట్ కళాశాలలో డిప్లమో చదువుతున్నాడు.
మత్తిగిరి కూడలిరోడ్డుకు చెందిన 18 ఏళ్ల యువతి కర్ణాటకలోని కోలారు జిల్లా, మాలూరులోని కళాశాలలో బీకాం చదువుతోంది. వీరిద్దరూ హోసూరులో చదివేటప్పటినుంచి ప్రేమించుకుంటున్నారు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు ఈనెల 11న యువకుడి ఇంటిని ధ్వంసం చేశారు. అవమానం భరించలేక యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. మనోవేదనకు గురైన యువతి ఈనెల 13న పురుగుల మందు తాగడంతో హోసూరులోని ప్రైవేట్‌ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment